హైదరాబాద్‌లో హిట్‌ అండ్‌ రన్‌.. జవాన్‌ మృతి | Hit And Run Case In Narsingh jawan Death | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో హిట్‌ అండ్‌ రన్‌.. జవాన్‌ మృతి

Aug 10 2026 7:10 AM | Updated on Aug 10 2026 7:21 AM

Hit And Run Case In Narsingh jawan Death

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులోని నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా, రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఓ జవాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జవాన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడటంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

ఆర్మీ జవాన్‌ను ఢీకొట్టిన వాహనం.. ప్రమాదం జరిగిన తర్వాత ఆగకుండా దూసుకెళ్లింది. మార్గమధ్యలో మరో నలుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం వారు కారును వదిలి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు, అందులో ఉన్న యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement