పెళ్లయి వారం రోజులు.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్‌! | New Bride Kidnapping Incident In Hyderabad Manchal Village | Sakshi
Sakshi News home page

పెళ్లయి వారం రోజులు.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్‌!

Aug 10 2026 8:09 AM | Updated on Aug 10 2026 8:58 AM

New Bride Kidnapping Incident In Hyderabad Manchal Village

వారం క్రితమే ప్రేమ వివాహం

హైదరాబాద్‌: ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు కిడ్నాప్‌ అయిన ఘటన మంచాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మధు కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్‌కు చెందిన ఏర్పుల ప్రవీణ్, నగరంలోని ఐఎస్‌ సదన్‌కు చెందిన కళ్యాణి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వారం క్రితం భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అమ్మాయి తరఫున ఎవరూ రాలేదు. చిత్తాపూర్‌లో ఆ జంట నివాసం ఉంటున్న క్రమంలో శనివారంరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కళ్యాణిని కారులో ఎత్తుకెళ్లారు. తన భార్యను జ్యోతిబస్‌ అనే యువకుడితోపాటు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ఆదివారం ప్రవీణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement