breaking news
New bride kidnapped
-
మాజీ భర్తను దక్కించుకోవాలని సవతిపై అఘాయిత్యం
చండీగఢ్ : హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను మరో మహిళ చిత్రహింసలకు గురి చేసింది. అంబాలాలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత డిసెంబర్లో భర్త నుంచి విడాకులు తీసుకున్న నిందితురాలు.. అతడిపై పగ సాధించాలనుకుంది. ఇటీవల తన మాజీ భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో అతడి కాపురాన్ని కూల్చాలని తన కుంటుంబంతో కలిసి పథకం పన్నింది. కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడి ఇంటిపై దాడి చేసిన సదరు మహిళ.. భార్యభర్తలను కిడ్నాప్ చేసి.. రెండు వేర్వేరు వాహనాల్లో వారిని పానిపట్‌కు తరలించారు. తన మాజీ భర్తకు విడాకులు ఇవ్వాలని బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె అంగీకరించక పోవడంతో తీవ్రంగా కొట్టడమే కాకుండా.. ఆమెపై సామూహిక అత్యాచారానికి ఉసిగొల్పింది. దాదాపు పదకొండున్నర గంటలు చిత్రహింసలు పెట్టిన అనంతరం గురువారం ఉదయం బహదుర్‌ఘర్‌లో బాధితులను విడిచిపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అకృత్యానికి పాల్పడిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని గురుగ్రామ్‌లో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. -
కరీంనగర్లో నవవధువు కిడ్నాప్
మేడిపల్లి: బైక్‌పై వెళ్తున్న నవవధువును గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని దేశాయిపేటకు చెందిన మౌనిక(19)కు మొత్కురావుపేటకు చెందిన యువకుడితో మూడు నెలల క్రితం వివాహం అయింది. ఈ క్రమంలో శనివారం రాత్రి మౌనిక తండ్రి ఆమెను బైక్‌పై తమ ఇంటికి తీసుకొస్తుండగా.. గోవిందారం గ్రామ శివారులోకి రాగానే బైక్‌ను అడ్డుకున్న ఇద్దరు దుండగులు ఆమె తండ్రిని కొట్టి మౌనికను ఎత్తుకెళ్లారు. దీంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.