కరీంనగర్లో నవవధువు కిడ్నాప్ | New bride kidnapped in karimnagar medipally | Sakshi
Sakshi News home page

కరీంనగర్లో నవవధువు కిడ్నాప్

Jul 3 2016 11:07 AM | Updated on Sep 4 2017 4:03 AM

బైక్పై వెళ్తున్న నవవధువును గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

మేడిపల్లి: బైక్పై వెళ్తున్న నవవధువును గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని దేశాయిపేటకు చెందిన మౌనిక(19)కు మొత్కురావుపేటకు చెందిన యువకుడితో మూడు నెలల క్రితం వివాహం అయింది.

ఈ క్రమంలో శనివారం రాత్రి మౌనిక తండ్రి ఆమెను బైక్‌పై తమ ఇంటికి తీసుకొస్తుండగా.. గోవిందారం గ్రామ శివారులోకి రాగానే బైక్‌ను అడ్డుకున్న ఇద్దరు దుండగులు ఆమె తండ్రిని కొట్టి మౌనికను ఎత్తుకెళ్లారు. దీంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement