5 నెలలు.. 36 ఇంటర్వ్యూలు.. రూ.30 లక్షల ఉద్యోగం! | Bengaluru Techie Lands Hyderabad Job After 36 Interviews | Sakshi
Sakshi News home page

5 నెలలు.. 36 ఇంటర్వ్యూలు.. రూ.30 లక్షల ఉద్యోగం!

Aug 10 2026 5:14 PM | Updated on Aug 10 2026 5:51 PM

Bengaluru Techie Lands Hyderabad Job After 36 Interviews

చదువు పూర్తయ్యాక ఉద్యోగం తెచ్చుకోవడం కొంతమందికి సులభమే అయినప్పటికీ.. ఇంకొందరికి చాలా కష్టంగా ఉంటుంది. అయినా పట్టు వదలకుండా ఉద్యోగం సాధించినవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ కథనంలో.. ఏకంగా 36 ఇంటర్వ్యూలకు హాజరైన తరువాత ఉద్యోగం తెచ్చుకున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జర్నీ తెలుసుకుందాం.

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పట్టువదలకుండా ప్రయత్నించి.. చివరకు హైదరాబాద్‌లో రూ.30 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. తన ఉద్యోగ వేట గురించి ఆయన రెడ్డిట్‌లోని వివరించారు. గతంలో ఒక కంపెనీలో పనిచేస్తున్న సమయంలో కొన్ని అనారోగ్య కారణాల వల్ల.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

కొంతకాలం ఉద్యోగానికి దూరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి పెట్టిన తర్వాత.. ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సమయంలో ఖాళీగా ఉండకుండా.. ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న GenAIపై దృష్టి పెట్టారు. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంతో పాటు, తనకు వ్యక్తిగతంగా కూడా GenAIపై ఆసక్తి ఉందని చెప్పారు.

After 36 technical interviews, I finally bagged an offer
by u/deathmachine1407 in developersIndia

దాదాపు ఐదు నెలల పాటు యాక్టివ్‌గా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తూ.. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మొత్తం 36 ఇంటర్వ్యూల తర్వాత చివరకు హైదరాబాద్‌లోని ఒక సంస్థలో ఉద్యోగం సాధించారు. కొత్త ఉద్యోగంలో భారీగా జీతం పెరగకపోయినా.. చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఎందుకంటే దాదాపు ఏడు నెలల తర్వాత.. మళ్లీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం వచ్చిందని తెలిపారు.

ఉద్యోగం అయితే వచ్చింది. కానీ.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లి పనిచేయాల్సి వస్తోంది. ఇది కొంత బాధ కలిగించే విషయమే అయినా.. కెరీర్‌లో ఇలాంటి మార్పులు తప్పవని ఆయన భావిస్తున్నారు.

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న పలువురు టెక్కీలు తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని కామెంట్లు చేశారు. కొందరు ఆయన ఇంటర్వ్యూ అనుభవాలను పంచుకోవాలని కోరగా, మరికొందరు రెజ్యూమ్‌ను షేర్ చేయగలరా అని అడిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement