సాక్షి, హైదరాబాద్: బోరబండలోని పెద్దమ్మనగర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేసి అనంతరం ఊరేసుకొని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఘటనలో కుమారుడు ప్రాణాలు కోల్పోగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఆ మహిళ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమా అనే విషయాలు తెలియాల్సి ఉంది.


