క్రికెట్‌ జట్టులోంచి తీసేస్తే.. కోపంతో సివిల్స్‌ వైపు వెళ్లా! | Telangana DGP CV Anand's Cricket To IPS Journey: Sports Message Hyderabad | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ జట్టులోంచి తీసేస్తే.. కోపంతో సివిల్స్‌ వైపు వెళ్లా!

Jul 31 2026 9:45 AM | Updated on Jul 31 2026 10:10 AM

Telangana DGP CV Anand's Cricket To IPS Journey: Sports Message Hyderabad

హైదరాబాద్‌: ‘‘నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. క్రికెట్‌లో రాష్ట్ర జట్టుకు ఆడా. అయితే, టీమ్‌ నుంచి నన్ను తొలగించారు. ఆ కోపంతో సివిల్స్‌ వైపు వెళ్లా. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి ఐపీఎస్‌ అయ్యా. ఎంతో ఆలోచించి పోలీస్‌ ఉద్యోగంలో చేరా’’ అని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు.

పని ఒత్తిడిలో ఉండే పోలీసులకు క్రీడలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. గురువారం గచి్చబౌలి ఇండోర్‌ స్టేడియంలో సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ ఆలిండియా జూడో క్లస్టర్‌ చాంపియన్‌íÙప్‌ ముగింపు కార్యక్రమానికి ఆనంద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను సీఐఎస్‌ఎఫ్‌లో ఉండగా టెన్నిస్‌లో మెడల్‌ సాధించానని అన్నారు. యువత డ్రగ్స్‌కు బందీ కాకుండా క్రీడల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు.

150 కోట్ల జనాభా ఉన్న దేశంలో అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జూడో, వుషు, తైక్వాండో, కరాటే, పినాక్‌ సిలేట్‌ క్రీడల్లో రాణించిన క్రీడాకారులను అభినందించారు. ఐబీ డైరెక్టర్‌ ఎస్‌.సంబంధన్‌ మాట్లాడుతూ పారిస్‌ ఒలింపిక్స్‌లో 11 మంది పోలీసు సిబ్బంది భారత్‌కు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. ఓవరాల్‌ చాంపియన్‌గా ఎస్‌ఎస్‌బీ, రెండో స్థానంలో సీఐఎస్‌ఎఫ్, మూడో స్థానంలో ఐటీబీపీ జట్లు నిలిచాయి. సీఐఎస్‌ఎఫ్‌ ఏడీజీ విజయ్‌ప్రకా‹Ù, ఎన్‌ఐఎస్‌ఏ హైదరాబాద్‌ డైరెక్టర్‌ హర్‌ప్రీత్‌ కౌర్, సైబరాబాద్‌ సీపీ డాక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement