పోలీస్‌ సైరన్‌కు భయపడి పరుగులు తీసి.. | Two Friends Ends Life In Moinabad | Sakshi
Sakshi News home page

పోలీస్‌ సైరన్‌కు భయపడి పరుగులు తీసి..

Nov 1 2026 9:03 AM | Updated on Nov 1 2026 9:29 AM

Two Friends Ends Life In Moinabad

మొయినాబాద్‌: స్నేహితుడి బర్త్‌డే సందర్భంగా చేసుకున్న పార్టీ ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని పెద్దమంగళారంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 

రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌కు చెందిన మోక్ష సాయిచరణ్‌ (19), నగరంలోని బల్కంపేటకు చెందిన యశ్వంత్‌ (20) మొయినాబాద్‌లోని కేజీరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం వీరితోపాటు చదివే స్నేహితుడి పుట్టినరోజు ఉండడంతో పది మంది కలిసి మొయినాబాద్‌లో బర్త్‌డే పార్టీ చేశారు. అనంతరం మద్యం పార్టీ చేసుకోవడానికి బాటిళ్లు తీసుకుని పెద్దమంగళారం రోడ్డులోని పద్మావతి ఫంక్షన్‌హాల్‌ వెనుకవైపునకు వెళ్లారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం సైరన్‌ వేసుకుంటూ వెళ్లడంతో విద్యార్థులు భయపడి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పరుగులు తీశారు. 

అక్కడ రైతు అడవి పందుల నుంచి కాపాడుకోవాలని వరిచేను చుట్టూ ఓ వైరుతో కంచె వేసి దానికి కరెంట్‌ షాక్‌ పెట్టాడు. ప్రమాదవశాత్తు ఆ తీగలకు తగిలి విద్యుదాఘాతంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతితో కళాశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రమాద స్థలాన్ని శనివారం ఉదయం చిలుకూరు సెక్షన్‌ విద్యుత్‌ ఏఈ శివరామకృష్ణ పరిశీలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement