రెండు ఇళ్లు ఉన్నా.. బాత్‌రూంలోనే ఐసోలేషన్‌

Ts: Man Got Corona Positive Isolation Bathroom Video Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌: తన ద్వారా భార్యాపిల్లలకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో ఓ కోవిడ్‌ రోగి బాత్‌రూంలో తలదాచుకున్నాడు. అతడి సెల్ఫీ వీడియో వైరల్‌ కావడంతో స్పందించిన అధికారులు అతడిని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా ధారూరు మండల పరిధిలోని మైలారంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అశోక్‌ (30)కు ఐదు రోజులక్రితం కరోనా సోకింది.

హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన అతడు వైరస్‌ తన కుటుంబ సభ్యులకు కూడా సోకుతుందేమోనని భయాందోళనకు గురయ్యాడు. దీంతో ఇంటికి కొంత దూరంలో ఉన్న బాత్‌రూంలో ఉంటున్నాడు. గురువారం ఉదయం అతడు సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో వైరల్‌ కావడంతో జిల్లా వైద్యాధికారులు గమనించి స్థానిక డాక్టర్, ఎంపీడీఓ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం బాధితుడిని అనంతగిరిగుట్టలోని ఐసోలేషన్‌  సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అశోక్‌కు రెండు ఇళ్లు ఉన్నాయని, ఓ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటే చికిత్స అందేలా చూస్తామని చెప్పినా వినలేదని సర్పంచ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 

( చదవండి: అనగనగా సొసైటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top