
అల్లాహ్ స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యత ప్రసాదించడం వల్ల, పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చు పెడుతున్నందువల్ల పురుషులు స్త్రీలపై వ్యవహార కర్తలవుతారు. కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భర్తకు విధేయత చూపుతూ వారి కనుసన్నలలో నడుచుకుంటారు. పురుషులు ఇంటిపట్టున లేనప్పుడు దేవుని రక్షణలో వారి హక్కులు కాపాడుతుంటారు. మీ మాటలకు ఎదురు చెప్పి తిరగబడతారని భయం ఉన్న స్త్రీలకు నయానా భయానా నచ్చజెప్పండి. అంతేకాని వారిని వేధించడానికి సాకులు వెతకకండి. పైన అందరికంటే అధికుడు, అత్యున్నతుడైన అల్లాహ్ ఉన్నాడని గుర్తుంచుకోండి.
వివరణ: భార్య విననప్పుడు నచ్చజెప్పడం (2) పడకగదికి దూరంగా ఉండటం (3) విధేయత కనబరిస్తే ఆమెను మనసారా స్వీకరించడం (4) కొట్టడం అంటే కర్ర తీసుకొని బాదడం కాదు రక్తం చిందించేలా హింసించడం కాదు.
ఎలాంటి పరిస్థితుల్లోనూ భార్య ముఖం మీద కొట్టకూడదని, శరీరం కందిపోయేలా నిర్దయగా కొట్టకూడదని దైవ ప్రవక్త ముహమ్మద్ (స) అన్నారు. ఏమైనా ఆయన భార్యని కొట్టే వారిని అభిమానించేవారు కాదు.
35 వ ఆయత్ (వాక్యం)లో అల్లాహ్ ఎంతోమంచి పరిష్కారం చూపాడు. భార్యాభర్తల మధ్య పొసగనపుడు అటువైపు నుండి ఒక మధ్యవర్తి ఇటు వైపు నుండి ఒక వ్యక్తి మధ్యవర్తిత్వం వహించి వారిద్దరి మధ్య సమాధానం కుదిరిస్తే ఆ దంపతులు కూడా సమాధాన పడితే ఇద్దరి మధ్య అల్లాహ్ సానుకూలత కలిగిస్తాడు.
మనిషికి దేవుడు మంచి చెడుల విచక్షణ జ్ఞానం, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చాడు. కాబట్టి వాటిని ఆయన అడ్డుకోకుండా స్వయంగా మనిషి సంకల్పించుకుంటే అల్లాహ్ దానిని పరిపూర్ణం చేస్తాడు. ఏ విషయంలోనూ ఎవరికీ బలవంతం పెట్టడు. మనిషి విచక్షణను బట్టి అల్లాహ్ ఆ మనిషితో వ్యవహరిస్తాడు. కాబట్టి మనుషుల మైన మనం మంచిని ఆలోచిస్తూ మంచినే కాంక్షిస్తూ మంచి చేస్తుంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అంతా మంచే జరుగు తుంది అల్లాహ్ మనందరినీ మంచి చేసే భాగ్యాన్ని కలుగజేయుగాక ఆమీన్ (తథాస్తు)
– మొహమ్మద్ అబ్దుల్ రషీద్
ఇదీ చదవండి:చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!