కరోనా విజృంభణ: ముఖ్యమంత్రి తనయుడికి పాజిటివ్‌ | Aditya Thackeray Tested Positive: Corona Danger Bells In Maharashtra | Sakshi
Sakshi News home page

కరోనా విజృంభణ: ముఖ్యమంత్రి తనయుడికి పాజిటివ్‌

Published Sat, Mar 20 2021 7:45 PM | Last Updated on Sat, Mar 20 2021 9:14 PM

Aditya Thackeray Tested Positive: Corona Danger Bells In Maharashtra - Sakshi

ముంబై: మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో భయాందోళన పరిస్థితి ఏర్పడింది. ప్రజలతో పాటు ఈ ప్రముఖులు కూడా ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజా శివసేన పార్టీ యువ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే తనయుడు మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది.

‘కొన్ని లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. నన్ను ఎవరైనా కలిసిన వారు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి’ అని ఆదిత్య ఠాక్రే ట్విటర్‌లో పోస్టు చేశాడు. కాగా మహారాష్ట్రలో కొన్ని రోజులుగా దాదాపు రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇప్పటికే పలు జిల్లాల్లో సంపూర్ణ, పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్న విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement