జెర్సీ హీరోయిన్‌కు కరోనా.. సురక్షితంగా ఉండండని పోస్ట్‌ | Mrunal Thakur Tested Positive For Covid 19 | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: జెర్సీ హీరోయిన్‌కు కరోనా.. సురక్షితంగా ఉండండని పోస్ట్‌

Jan 1 2022 4:35 PM | Updated on Jan 1 2022 4:37 PM

Mrunal Thakur Tested Positive For Covid 19 - Sakshi

Mrunal Thakur Tested Positive For Covid 19: బాలీవుడ్‌లో కరోనా కలకలం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కరోన రక్కసి తన కోరలు చాస్తూ బీటౌన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటీవలే హిందీ పాపులర్‌ స్టార్స్‌ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్‌ ఇంట్లో నలుగురికి కొవిడ్‌ రావడంతో తన నివాసానికి బీఎంసీ (బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌) అధికారులు సీల్‌ వేసి శానిటైజ్ చేశారు. హాట్‌ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కరోనాతో ఎంత ఇబ్బంది పడుతుంతో కూడా ఇటీవలే వివరించింది. తాజాగా జెర్సీ హీరోయిన్‌, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌ ఈ మహమ్మారి బారిన పడింది. 

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది మృణాల్‌. 'నేను కొవిడ్‌ 19 పరీక్ష చేయించుకున్నాను.  దానిలో పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటివరకు కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయి. కానీ నేను బాగానే ఉన్నాను. నాకు నేను ఐసోలేట్‌ అయ్యాను. వైద్యులు సూచించిన ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను సంప్రదించిన వారు దయచేసి వెంటనే పరీక్షలు చేయించుకోండి. సురక్షితంగా ఉండండి.' అని మృణాల్‌ ఠాకూర్‌ తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీ షేర్‌ చేసింది. 

బాలీవుడ్‌ హీరో షాహిద్ కపూర్‌తో కలిసి మృణాల్‌ ఠాకూర్‌ తొలిసారి జంటగా కలిసి నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో నాచురల్‌ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది ఈ మూవీ. 

ఇదీ చదవండి: అర్జున్‌ కపూర్‌కి కరోనా.. ఇల్లుకు సీల్‌ వేసిన బీఎంసీ

Advertisement
 
Advertisement
Advertisement