
కరోనా మహమ్మారి మరోసారి దేశంలో విస్తరిస్తోంది. తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 250 కి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక మరణం సంభవించింది. గత 24 గంటల్లో, మహారాష్ట్రలో 44 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో ఇది రెండవ అత్యధికం. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మహిళలకు కోవిడ్ సోకినట్ట నిర్ధారణ అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య అధికారులు అప్రమత్త మయ్యారు. ఆందోళన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. మహారాష్ట్ర ఈ సంవత్సరం రెండు COVID-సంబంధిత మరణాలను కూడా నివేదించింది
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ 18 పోటీదారు శిల్పా శిరోద్కర్ తనకు సోకిందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నటి కోవిడ్ బారిన పడినట్టు జాతీయమీడియా నివేదించింది. కబీర్ సింగ్, ది జ్యువెల్ థీఫ్ మూవీల్లో నటించిన నికితా దత్తాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆమెతో పాటు, ఆమె కుటుంబంలో తల్లి ఇద్దరూ వైరస్ బారిన పడ్డారని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆహ్వానం లేని అతిథి (COVID-19) తన ఇంటి తలుపు తట్టిందంటూ దత్తా తెలిపింది. స్వల్ప లక్షణాలతో, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపింది. ఇది తొందరగా తగ్గిపోతుందని ఆశిస్తున్నానీ, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గతంలో కూడా నికిత కోవిడ్ బారిన పడి కోలుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంది.