దురంధర్ ఓటీటీ డేట్‌ ఫిక్స్.. అదొక్కటే నిరాశ | Ranveer singh dhurandhar Movie ott release announced | Sakshi
Sakshi News home page

Dhurandher Movie Ott: ఓటీటీకి దురంధర్.. అఫీషియల్ ప్రకటన

Jan 29 2026 6:26 PM | Updated on Jan 29 2026 6:55 PM

Ranveer singh dhurandhar Movie ott release announced


రణ్‌వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ రిలీజ్‌ కోసం ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈనెల 30 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ థియేట్రికల్‌ వెర్షన్‌ రన్‌టైమ్‌ 3 గంటలా 34 నిమిషాలు కాగా.. ఓటీటీలో దాదాపు 9 నిమిషాలు తగ్గించారు. ఓటీటీలో అన్‌కట్‌ వెర్షన్‌ రిలీజ్‌ చేస్తారని ప్రచారం జరిగినా రన్‌టైమ్‌ తగ్గడం ఆడియన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది.

కాగా.. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఛావా, కాంతార-2 చిత్రాలను దాటేసింది. అంతేకాకుండా తాజాగా దేశీయంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement