బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నిక్కీ తంబోలి, నటుడు అర్బాజ్ పటేల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై తాజాగా నిక్కీ తంబోలి స్పందించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తమ పెళ్లికి ఓ వింత కండీషన్ కూడా పెట్టుకున్నారట.

అదేంటే.. నిక్కీ లేదా అర్బాజ్.. ఇద్దరిలో ఒకరు ఏదో ఒక రియాల్టీ షోలో విన్నర్‌గా గెలిస్తే పెళ్లి చేసుకుంటారట. గెలుపు అనేది పాజిటివ్ ఎనర్జీ అని.. విజయం తర్వాతే వివాహ బంధంలోకి అడుగుపెడతామని నిక్కీ చెప్పుకొచ్చింది.
కాగా, ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న 'ది ఫిఫ్టీ' రియాలిటీ షోలో ఈ జంట కలిసి పాల్గొంటోంది. ఇందులో మొత్తం 50 మంది సెలబ్రిటీలు పోటీపడుతున్నారు. ఈ షోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.


