దుబాయ్ షేక్ ఇచ్చిన బంపర్ ఆఫర్ చూస్తే షాకవ్వుతారు. జస్ట్ పెళ్లి చేసుకుంటే రూ. 12 లక్షలు. పిల్లలు కంటే మరో రూ. 12 లక్షలు ఇస్తామని సోషల్ మీడియా ఎక్స్‌లో కళ్లుచెదిరే ఆఫర్ ప్రకటించారు దుబాయ్‌లోని బిలియనీర్ వ్యాపారవేత్త ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూ సోషల్ మీడియా పోస్ట్‌లో. వివాహం, కుటుంబాన్ని పోషించడం వ్యక్తిగత విషయాలు కాదని అవి సామాజిక బాధ్యతలని పిలుపునిస్తూ..తన అల్ హబ్తూర్ గ్రూప్‌లోని ఎమిరేట్ ఉద్యోగులకు ఈ ఆఫర్ అందిస్తూ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు.
"కుటుంబాలే బలమైన దేశానికి కీలకమని, పిల్లలు దేశ భవిష్యత్తులో పెట్టుబడి అని అన్నారు. మా ప్రభుత్వాలు యువకుల కుటుంబ జీవితాలు ప్రారంభంలో మద్దతివ్వడానికి వెనకడుగు వేయవు. అందువల్ల యుఏఈ జాతీయులు వివాహం చేసుకుని కుటుంబాన్ని పెంచుకునేలా ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరి నుంచి ఆచరణాత్మక చొరవలు కూడా అవసరంర. కుటుంబాలు నిర్మించడం అనేది ఉమ్మడి బాధ్యత అని, కుటుంబం చిన్నదైనా లేదా పెద్దదైనా సమాజం, దేశం భవిష్యత్తులో చాలా ప్రభావాన్ని చూపిస్తుంది." అని అన్నారు.
కాగా, ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్టూర్ UAE వ్యాపారవేత్త, అల్ హబ్టూర్ గ్రూప్ అండ్ దుబాయ్ నేషనల్ ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ కంపెనీకి ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో దుబాయ్ కమర్షియల్ బ్యాంక్ ఛైర్మన్‌గానూ, అల్ జలీలా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వైస్ ఛైర్మన్‌గా, అలాగే UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశారు.
గతేడాది అక్టోబర్‌లో, అల్ హబ్టూర్ యువకులను వివాహం చేసుకోవాలని కోరారు. అంతేగాదు ఆయన యువకులు 30 ఏళ్లలోపు వివాహం చేసుకునేలా ప్రోత్సహించే చట్టం కోసం ఆశిస్తుండటం గమనార్హం. వివాహం చేసుకోకుండా ఉండిపోయిన యువకులను జవాబాదారీగా ఉంచాలని కూడా అన్నారు. ఇది సమాజంలో మనుగడకు, ఐక్యతకు సంబంధించిన విషయం అని అన్నారు. కుటుంబాలే దేశానికి కీలకం అంటూ అందర్నీ ఆలోచింపచేసేలా ఆయన ఈ షేకింగ్ ఆఫర్ ఇచ్చారు.
تزوّجتُ وأنا في عمر 17 عاماً، وأسّستُ مع زوجتي عائلة جميلة، أحمدُ الله على هذه النعمة في كل لحظة. منذ تلك اللحظة، أصبحت الأسرة بالنسبة لي دائماً ملاذ راحة، ومصدر سكينة، ونعمة حقيقية أستمدّ منها القوة والسعادة.
ومن هذا الإيمان، أودّ أن أُشجّع شبابنا على تأسيس أسر متماسكة تكون… pic.twitter.com/ououH8gqkj— Khalaf Ahmad Al Habtoor (@KhalafAlHabtoor) January 24, 2026
(చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?)


