అతని శరీరంలో కరోనా శాశ్వతంగా ఉండిపోతుందట.. ఇదే తొలికేసు!

Man Ifected 78 Time Covid-19 Has Been Quarantined 14 Months  - Sakshi

కరోనా మహమ్మారీ ప్రపంచ దేశాలను ఎలా గజగజలాడించిందో చూశాం. అంతేకాదు చాలామంది కరోనా బారిన పడినవారు ఉన్నారు. అయితే కొంతమంది త్వరితగతిన కోలుకుంటే మరీ కొంతమందికి ప్రాణాంతకంగా మారి చనిపోవడం కూడా జరిగింది. మరి కొద్దిమంది ఈ కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డప్పటికీ దుష్ప్రభావాలతో పోరాడుతున్నవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడోక వ్యక్తికి మాత్రం ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా బారిన పడ్డాడు .

అసలు విషయంలోకెళ్తే... టర్కీకి చెందిన 56 ఏళ్ల ముజఫర్ కయాసన్‌కి గతేడాది నవంబర్‌ 2020న తొలిసారిగా కరోనా సోకింది. దీంతో కయాసన్‌ ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతను నిర్భంధంలోనే ఉంటున్నాడు. నిజానికి కొన్ని రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకోవడంతో అతనికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్ట్‌లో కయాసన్‌కి కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఇలా ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది.

దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. కయాసన్‌ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా విచారించగా..అతను లూకేమియాతో బాధపడుతున్నాడని తేలింది. ఇది ఒకరకమైన బ్లడ్‌ కేన్సర్‌. ఈ వ్యాధి వల్ల ఆ వ్యక్తులకు వ్యాధులతో పోరాడటానికే సహాయపడే తెల్లరక్తకణాలు తగ్గిపోవడమే కాక వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గిపోదంతుందని వైద్యులు తెలిపారు. అందువల్లే కయాసన్‌ శరీరం నుంచి కరోనా వైరస్‌ శాస్వతంగా నిర్మూలించలేమని వైద్యులు వెల్లడించారు. కానీ కయాసన్‌ ఏడాదిగా అంటే సుమారు 14 నెలలు నుంచి నిర్భంధంలోనే ఉన్నాడు. పైగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాదు అతను కరోనా పాజిటివ్‌ కారణంగా వ్యాక్సిన్‌ వేయించుకోలేని దుర్భర స్థితిలో ఉండటంబాధకరం. ఇది ప్రపంచంలోనే తొలి కేసుగా పేర్కొన్నారు. 

(చదవండి:  విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్‌లో ఉండక్కర్లేదు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top