బ్రిటన్‌ ప్రధానికి మళ్లీ కరోనా

Boris Johnson self-isolating after contact with COVID-positive - Sakshi

లండన్‌: బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి కరోనా బారిన పడ్డారు. పార్లమెంటు సభ్యుడు ఒకరు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో కొంత కాలంగా స్వీయ నిర్బంధంలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌కు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకూ వైరస్‌ సోకినట్లు తేలిందని బ్రిటన్‌ ప్రధాని అధికార నివాస వర్గాలు సోమవారం తెలిపాయి.  అధికారుల సూచనలను అనుసరించి ప్రధాని నవంబర్‌ 26 వరకూ తన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు చేపడతారని, కరోనా వైరస్‌ నిరోధానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తారని వివరించారు.

బోరిస్‌ జాన్సన్‌ కోవిడ్‌ బారిన పడినప్పటికీ లక్షణాలేవీ కనిపించడం లేదని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రిటన్‌ ప్రధాని తొలిసారి కోవిడ్‌–19 బారిన పడటమే కాకుండా.. పరిస్థితి తీవ్రం కావడంతో ఐసీయూలో చికిత్స అందించిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉండగా.. కోవిడ్‌–19 నియంత్రణకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అనుబంధ సంస్థ జాన్‌సెన్‌ తయారు చేసిన టీకా తుది పరీక్షలకు రంగం సిద్ధమైంది. యూకే మొత్తమ్మీద  6వేల మందికి ఈ టీకా ఇచ్చి 12 నెలలపాటు పరీక్షించనుంది.  దశలవారీగా ఈ టీకా పరీక్షల కోసం ఆరు దేశాల నుంచి సుమారు 30 వేల మందిని ఎంపిక చేస్తామంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top