హైదరాబాద్‌ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌ | TGNAB And Excise Police Raids In Pubs And Bars Hyderabad, Check More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌

Aug 31 2024 10:32 AM | Updated on Aug 31 2024 12:14 PM

TGNAB And Excise police raids in pubs and bars hyderabad

హైదరాబాద్‌, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్‌లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్‌ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. 

ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో  బార్‌లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్‌గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో  ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా  పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్‌లో ఒకరికి   డ్రగ్స్‌ తీసుకున్నట్లు పాజిటివ్‌ వచ్చినట్లు అధికారుల తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement