మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్‌ | Former Chief Minister Digvijay Singh Corona Positive | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్‌

Aug 20 2024 1:36 PM | Updated on Aug 20 2024 1:47 PM

Former Chief Minister Digvijay Singh Corona Positive

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్‌కు కరోనా బారినపడ్డారు. కోవిడ్‌-19 లక్షణాలు కనిపించిన దరిమిలా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.

ఈ విషయాన్ని దిగ్విజయ్‌ సింగ్‌ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు. తన కోవిడ్ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని, వైద్యులు ఐదురోజుల పాటు తనను రెస్ట్‌ తీసుకోవాలని సూచించారని తెలిపారు. కోవిడ్‌ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనను కలుసుకునేందుకు కొద్ది రోజులపాటు ఎవరూ రావద్దని దిగ్విజయ్‌ కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement