కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఎర | Odisha Congress MLAs offered Rs 5 crore to cross vote in Rajya Sabha: DK Shivakumar | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఎర

Mar 16 2026 4:59 AM | Updated on Mar 16 2026 4:59 AM

Odisha Congress MLAs offered Rs 5 crore to cross vote in Rajya Sabha: DK Shivakumar

బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ కర్నాటక నేతలు ‘ఆపరేషన్‌ లోటస్‌’కు తెరతీశారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆరోపించారు. ఒడిశాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున ఇస్తామంటూ కొందరు ప్రయత్నించారని తెలిపారు.

దీనికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారన్నారు. బిడది రిసార్టులో ఉంచిన తమ ఎమ్మెల్యేల వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి నగదు ఆఫర్‌ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కూడా తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement