Shruti Haasan Tested Covid Positive: బ్యాడ్ న్యూస్‌ చెప్పిన శ్రుతి, త్వరలోనే కలుస్తానంటూ ట్వీట్‌ - Sakshi
Sakshi News home page

Shruthi Hassan: బ్యాడ్ న్యూస్‌ చెప్పిన శ్రుతి, త్వరలోనే కలుస్తానంటూ ట్వీట్‌

Feb 28 2022 8:26 AM | Updated on Feb 28 2022 9:20 AM

Shruti Haasan Tested Positive For Coronavirus Positive - Sakshi

హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు శ్రుతి ట్వీట్‌ చేస్తూ.. ‘హాయ్‌.. నేను ఇస్తోన్న ఈ అప్‌డేట్ స‌ర‌దా కోసం కాదు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది.

చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ

తిరిగి ఎప్ప‌టిలాగే నా ప‌నుల్లో పాల్గొనాల‌ని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీ అంద‌రినీ త్వ‌ర‌లోనే క‌లుస్తాను థ్యాంక్యూ’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. అలాగే ఇటీవల ఆమె కలిసివారంతా పరీక్షలు చేసుకోవాలని ఆమె సూచిందింది. కాగా శ్రుతి హాస‌న్ ప్ర‌స్తుతం సలార్‌, బాలకృష్ణ-గోపిచంద్‌ మలినేని కాంబినేషన్‌ల తెరకెక్కుతోన్న ఎన్‌బీకే107లో(#NBK107) హీరోయిన్‌గా నటిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement