భారత్‌ అవుట్‌లుక్‌.. పాజిటివ్‌ | Sakshi
Sakshi News home page

భారత్‌ అవుట్‌లుక్‌.. పాజిటివ్‌

Published Thu, May 30 2024 6:02 AM

S and P changes India outlook from stable to positive

‘స్టేబుల్‌’ నుంచి అప్‌గ్రేడ్‌ చేసిన ఎస్‌అండ్‌పీ

మరో రెండేళ్లలో రేటింగ్‌  కూడా అప్‌గ్రేడ్‌ చేసే వీలుందని సూచన

ఆర్థిక నిర్వహణ బాగుందని విశ్లేషణ

6 బ్యాంకుల బ్యాంకుల రేటింగ్‌ అవుట్‌లుక్‌ కూడా పెంపు  

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు భరోసా ఇస్తూ పది సంవత్సరాల విరామం తర్వాత అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ భారతదేశ సార్వ¿ౌమ (సావరిన్‌) రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్‌’ నుంచి ‘పాజిటివ్‌’కు మెరుగుపరిచింది. 

గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ వ్యయ నిర్వహణ బాగుందని,  ద్రవ్య విధానాల్లో సంస్కరణలు విస్తృత స్థాయిలో కొనసాగుతాయని భావిస్తున్నామని ఎస్‌అండ్‌పీ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతా బాగుంటే రెండేళ్లలో సావరిన్‌ రేటింగ్‌నూ పెంచుతామని పేర్కొంది. కాగా, ఆరు బ్యాంకులు– ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్,  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఇండియాన్‌ బ్యాంకులు సహా ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌లకు సంబంధించీ ఇదే అవుట్‌లుక్‌ పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement