Defence Minister Rajnath Singh tests Covid-19 positive - Sakshi
Sakshi News home page

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్‌

Apr 20 2023 3:17 PM | Updated on Apr 20 2023 3:38 PM

Defence Minister Rajnath Singh Tests Corona Positive - Sakshi

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కరోనా బారినపడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో, రాజ్‌నాథ్‌ సింగ్‌.. హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. 

అయితే, రాజ్‌నాథ్‌ సింగ్‌.. గురువారం వైమానిక ద‌ళం క‌మాండ‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొనాల్సి ఉంది. కాగా, కోవిడ్‌ టెస్టులో పాజిటివ్‌గా తేల‌డంతో ఆయ‌న ఆ ఈవెంట్‌కు దూరం అయిన‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. స్వ‌ల్పంగా క‌రోనా ల‌క్ష‌ణాల‌తో రాజ్‌నాథ్ బాధ‌ప‌డుతున్నార‌ని, డాక్ట‌ర్ల బృందం ఆయ‌న్ను ప‌రీక్షించింద‌ని, వారి సూచ‌న మేర‌కు ఆయ‌న రెస్టు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌న‌ట‌లో వెల్ల‌డించారు.

ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 13వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ఇక, మరణాలు కూడా ఎక్కవ సంఖ్యలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement