
న్యూఢిల్లీ: రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) కచ్ లో పర్యటించనున్నారు. భుజ్ వైమానిక దళ స్టేషన్ కు రాజ్ నాథ్ సింగ్ వెళ్లనున్నారు. నలియా వైమానిక స్థావరంలో భేటీకి ఆయన హాజరు కానున్నారు. దీనిలో భాగంగా అంతర్జాతీర సరిహద్దు భద్రతను సమీక్షించనున్నారు.
కాగా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ నేడు(గురువారం) జమ్ము కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ యుద్ధ వీరులను రాజ్‌నాథ్ అభినందించారు. అనంతరం, రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ..‘సైనికుల ధైర్యసాహసాలు గర్వకారణం. ఉగ్రవాదం అంతానికి ఎంత దూరమైనా, ఎక్కడికైనా వెళ్తాం. ఉగ్రవాదంపైనే కాదు.. పీవోకేపైనా మన యుద్ధం ఆగదు. పాకిస్తాన్ అణ్వయుధాల బ్లాక్‌మెయిల్‌కు భయపడం. ఎలాంటి పరిస్థితులలైనా మన సైన్యం ఎదుర్కోగలదు’ అంటూ ప్రశంసలు కురిపించారు.
ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను అంతం చేశామన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అలాగే, దేశమంతా సైనికులను చూసి గర్విస్తోందన్నారు. అమరులైన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.