
మలిహాబాద్: ‘రాజ్‌నాథ్ మామిడి’... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరుతో కొత్త మామిడి రకం ఉత్పత్తి అయ్యింది. ఉద్యానవనాలు, పండ్ల తోటల పెంపకంలో ప్రత్యేక కృషి చేసి, అందుకు ప్రతిగా ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న కలిముల్లా ఖాన్ ఇప్పుడు మరో మామిడి రకాన్ని ఉత్పత్తి చేశారు. దానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మామిడి అని పేరు పెట్టారు
‘మ్యాంగో మ్యాన్’గా పేరొందిన కలిముల్లా ఖాన్, తాజాగా తన తన మలిహాబాద్(ఉత్తరప్రదేశ్) తోటలో సిగ్నేచర్ గ్రాఫ్టింగ్ టెక్నిక్‌ని ఉపయోగించి, పండించిన కొత్త రకపు మామిడికి ‘రాజ్‌నాథ్ ఆమ్’ అని పేరు పెట్టారు. గతంలో ఈయన తాను ఉత్పత్తి చేసిన మామిడి రకాలను సచిన్ టెండుల్కర్, ఐశ్వర్య రాయ్, అఖిలేష్ యాదవ్, సోనియా గాంధీ, నరేంద్ర మోదీ, అమిత్ షా తదితర ప్రముఖ భారతీయుల పేర్లు పెట్టారు. ఖాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘దేశానికి అర్థవంతమైన సేవ చేసినవారి పేర్లను తాను తన మామిడి రకాలుకు పెట్టుకుంటానని, ఈ రకాలు తరతరాలుగా నిలిచి ఉండాలని కోరుకుంటానని అన్నారు.
ప్రజలు కొంతకాలానికి ప్రముఖులను మరిచిపోతుంటారు. అయితే తాను ఉత్పత్తి చేసిన ఈ మామిడి రకాలు ప్రముఖులను గుర్తుచేస్తాయని ఖాన్ అన్నారు. పాకిస్తాన్‌తో ఇటీవల జరిగిన పోరులో రక్షణమంత్రి రాజ్‌నాథ్ యుద్ధం కాకుండా, శాంతిని కోరుకున్నారని కలిముల్లా ఖాన్ పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ దురాక్రమణకు నిదర్శనమన్నారు. ప్రపంచవ్యాప్తంగా మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన లక్నోలోని మలిహాబాద్ గురించి ఆయన మాట్లాడుతూ 1919లో ఈ ప్రాంతంలో 1,300 మామిడి రకాలు ఉండేవని, అయితే కాలక్రమేణా అవి మార్కెట్ నుండి అదృశ్యమయ్యాయన్నారు. అయితే తాను మామిడి రకాలను పునరుద్ధరించడానికి కృషి చేశానని ఇప్పుటి వరకూ 300కుపైగా మామిడి రకాలను అభివృద్ధి చేశానని అన్నారు. తన జీవిత లక్ష్యం గురించి ఖాన్ మాట్లాడుతూ తాను ఈ భూమి మీద నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా జనం తాను రూపొందించిన మామిడి రకాలను రుచి చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఇది కూడా చదవండి: కురచ దుస్తులతో వస్తే సెల్ఫీలివ్వను: బీజేపీ మంత్రి