కురచ దుస్తులతో వస్తే సెల్ఫీలివ్వను: బీజేపీ మంత్రి | Dress Properly for Selfies Kailash Vijayvargiya | Sakshi
Sakshi News home page

కురచ దుస్తులతో వస్తే సెల్ఫీలివ్వను: బీజేపీ మంత్రి

Jun 6 2025 4:56 PM | Updated on Jun 6 2025 5:30 PM

Dress Properly for Selfies Kailash Vijayvargiya

ఇండోర్‌: ‘భారతదేశంలోని మహిళలు చక్కని వస్త్రధారణతో ఉంటారు. తగిన మేకప్‌తో చూడచక్కని నగలు ధరిస్తారు. చూసేందుకు వారు ఎంతో అందంగా ఉంటారు. అయితే విదేశీ మహిళల విషయానికొస్తే వారు కురచ దుస్తులు ధరిస్తారు. ఆయా దేశాలలో వారిని అందగత్తెలని అంటారు.. ఇది అక్కడి వారి ఆలోచన.. మనది కాదు’ అంటూ మధ్యప్రదేశ్‌ మంత్రి, సీనియన్‌ బీజేపీ నేత కైలాశ్‌ విజయ వర్గీయ వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహిళలు కురచ దుస్తులు ధరించడమనేది విదేశీ సంప్రదాయమని, ఇది భారతదేశానికి వ్యతిరేకమైనదని అన్నారు. చక్కని దుస్తులు ధరించినప్పుడే మహిళను దేవతగా అభివర్ణిస్తారని పేర్కొన్నారు. తన దగ్గరకు కొందరు మహిళలు వచ్చి సెల్ఫీలు అడుగుతుంటారని, అటువంటి సమయంలో వారితో తాను సెల్ఫీల కోసం ‘మంచి దుస్తులు’ వేసుకోవాలని చెబుతుంటానని అన్నారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
 

గతంలోనూ మంత్రి విజయవర్గీయ మహిళల దుస్తుల ఎంపికపై కామెంట్‌ చేశారు. చెత్త దుస్తులు ధరించిన మహిళలు రామాయణంలో శూర్పణఖ లాంటివారని వ్యాఖ్యానించారు. శూర్ఫణఖ రాక్షసరాజు రావణుని సోదరి. గతంలో హనుమాన్‌ జయంతి రోజు విజయవర్గీయ ఈ వ్యాఖ్యలు చేశారు. దేముడు అందమైన శరీరాన్ని  ఇచ్చాడని, దీనికి కాపాడుకునేందుకు చక్కని వస్త్రధారణ అవసరమని విజయవర్గీయ ఇంకో సందర్భంలో వ్యాఖ్యానించారు.  

ఇది కూడా చదవండి: బెంగళూరు తొక్కిసలాట.. విరాట్‌ కోహ్లిని అరెస్ట్‌ చేయండి..!

Advertisement
 
Advertisement
Advertisement