'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే చాలనుకున్నా! | Muzammil Ibrahim: Deepika Padukone in Relationship with Me for 2 Years, Pooja Bhatt Mistreated me | Sakshi
Sakshi News home page

దీపికాతో రెండేళ్ల డేటింగ్‌.. పెళ్లయ్యాక మాట్లాడటం మానేశా!: హీరో

Jun 5 2025 5:24 PM | Updated on Jun 5 2025 7:27 PM

Muzammil Ibrahim: Deepika Padukone in Relationship with Me for 2 Years, Pooja Bhatt Mistreated me

కెరీర్‌ ప్రారంభంలో అవమానాలు, చీవాట్లు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎందరో! తొలి సినిమాకు తను కూడా అలాంటి బాధే అనుభవించానంటున్నాడు నటుడు ముజమ్మిల్‌ ఇబ్రహీం (Muzammil Ibrahim). ఈ సూపర్‌ మోడల్‌ ఢోకా సినిమాతో హీరోగా మారాడు. ఆ సమయంలో డైరెక్టర్‌ పూజా భట్‌ తనను చులకనగా చూసేదని, తల కొట్టేసినట్లుగా ఉండేదని చెప్తున్నాడు.

తొలి సినిమా.. దారుణ అనుభవాలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముజమ్మిల్‌ ఇబ్రహీం మాట్లాడుతూ.. పూజా భట్‌ (Pooja Bhatt) నన్ను అన్‌ప్రొఫెషనల్‌ అని పిలిచేది. తనకు కోపమెక్కువ. అందుకుతోడు యాటిట్యూడ్‌.. నటులను చులకనగా చూసేది. నిర్మాత మహేశ్‌ భట్‌కు మాత్రం నేనంటే చాలా ఇష్టం. మంచి నటుడినని అంటుండేవారు. ఢోకా సినిమా సమయానికి నా వయసు దాదాపు 20 ఉంటుందనుకుంటా.. అంతే! సెట్‌లో నన్ను దారుణంగా చూసేవారు. నేను అందరితోనూ గౌరవంగా నడుచుకునేవాడిని.. నాకంటూ కొన్ని అంచనాలుండేవి. కానీ అవన్నీ తలకిందులు చేశారు. 

నటులంటే శునకాలు!
నాతో దుర్భాషలాడిన తీరు చూశాక మరెలాంటి అంచనాలు పెట్టుకోలేదు. ఆ రేంజ్‌లో ఆమె నన్ను తిట్టేది. ఈ వాతావరణం చూశాక నాకు చాలా భయమేసింది. సూపర్‌ మోడల్‌గా ఇండియాలో నాకంటూ గుర్తింపు, గౌరవం ఉండేది. నేను పడుతున్న అవమానాలు చూసి మహేశ్‌ భట్‌ సర్‌.. నాతో అలా ప్రవర్తించవద్దని పూజా భట్‌ను కోరేవాడు. కానీ ఆయన సెట్‌లో లేనప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేది. అంతేకాదు.. నటులు కుక్కల్లాంటివారని.. తాము కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలని ఆమె అంటూ ఉండేదట. 

(చదవండి: ‘థగ్‌ లైఫ్‌’ మూవీ రివ్యూ)

పీడకలలు వెంటాడేవి
చిన్న కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవన్నీ విని భరించలేకపోయాను. నాపై వచ్చిన వార్తలు చూసి మరింత కలత చెందాను. నిద్రలో కూడా పీడకలలు వచ్చేవి. ఎలాగోలా ఆ రోజు బతికితే చాలని ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తుండేవాడిని. అలా కష్టాలు అనుభవించాను. అందుకే తర్వాత రాజ్‌ 2 ఆఫర్‌ వచ్చినా చేయలేదు అని చెప్పుకొచ్చాడు. 

దీపికాతో రిలేషన్‌
దీపికా పదుకొణె (Deepika Padukone)తో రిలేషన్‌ గురించి మాట్లాడుతూ.. ముంబైకి వచ్చిన కొత్తలో దీపిక పదుకొణె మోడల్‌గా పని చేసింది. అప్పుడు మా పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లపాటు ప్రేమించుకున్నాం. మా దగ్గర డబ్బు లేక రిక్షాలోనే తిరిగేవాళ్లం. తర్వాత కొన్ని కారణాలతో బ్రేకప్‌ చెప్పుకున్నాం. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఆమెకు పెళ్లయ్యాక మాట్లాడుకోవడమే మానేశాం అని తెలిపాడు. దీపికా.. హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను 2019లో పెళ్లాడింది. వీరికి గతేడాది దువా అనే కూతురు జన్మించింది.

సినిమా
ఢోకా మూవీ (Dhokha Movie) విషయానికి వస్తే.. 2007లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ముజమ్మిల్‌ నటనకు ప్రశంసలు దక్కాయి. తులిప్‌ జోషి హీరోయిన్‌గా నటించగా అనుపమ్‌ ఖేర్‌, గుల్షన్‌ గ్రోవర్‌ కీలక పాత్రలు పోషించారు.

చదవండి: అమితాబ్‌ వల్లే చిరంజీవి, రజనీకాంత్‌లకు స్టార్‌డమ్‌: ఆర్జీవీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement