అమితాబ్‌ వల్లే చిరంజీవి, రజనీకాంత్‌లకు స్టార్‌డమ్‌: ఆర్జీవీ | Ram Gopal Varma: Rajinikanth, Chiranjeevi did remakes of Amitabh Bachchan Films | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: బిగ్‌బీ వల్లే సౌత్‌ హీరోలు ఇక్కడ దేవుళ్లయ్యారు.. ఆయన సినిమాలే..

Jun 5 2025 3:57 PM | Updated on Jun 5 2025 4:31 PM

Ram Gopal Varma: Rajinikanth, Chiranjeevi did remakes of Amitabh Bachchan Films

గత కొన్నేళ్లుగా సౌత్‌ సినిమాలు దేశవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దక్షిణాది చిత్రాలను రీమేక్‌ చేయడానికి బాలీవుడ్‌ తహతహలాడటమే కాక ఆయా సినిమాల కథలను కాపీ కొడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ ఇప్పుడు మనల్ని కాపీ కొడుతుంది కానీ ఒకప్పుడు సౌత్‌ సినిమాకు హిందీ ఇండస్ట్రీయే ఆధారం అంటున్నాడు టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. హిందీ సినిమాలను రీమేక్‌ చేసే సౌత్‌ హీరోలు స్టార్‌ స్టేటస్‌ అందుకున్నారంటున్నాడు.

సౌత్‌లో హిందీ సినిమాల రీమేక్స్‌
తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ (Ram Gopal Varma) మాట్లాడుతూ.. మొదట్లో దక్షిణాదిన ఉన్న నాలుగు భాషల్లోనూ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) సినిమాలు రీమేక్‌ అయ్యేవి. 70's, 80's కాలంలో రజనీకాంత్‌ (Rajinikanth), చిరంజీవి (Chiranjeevi), ఎన్టీ రామారావు, రాజ్‌కుమార్‌.. వీళ్లంతా కూడా బిగ్‌బీ సినిమాల రీమేక్స్‌లో నటించేవారు. అయితే 1990 తర్వాత బచ్చన్‌ ఐదేళ్లు బ్రేక్‌ తీసుకున్నాడు.

మసాలా సినిమాలు
సరిగ్గా అప్పుడే మ్యూజిక్‌ కంపెనీలు రంగంలోకి దిగాయి. కేవలం వారి పాటల్ని, సంగీతాన్ని అమ్ముకోవడం కోసం సినిమాలు తీసేవి. మైనే ప్యార్‌ కియా వంటి సినిమాలు అలా వచ్చినవే.. కానీ సౌత్‌లో మసాలా సినిమాలు తీయడం మాత్రం ఆగలేదు. వాటిక్కూడా బిగ్‌బీ చిత్రాలే మూలం. దానివల్లే ఇక్కడున్న హీరోలు అభిమానులకు దేవుడిలా మారిపోయారు. అలా ఆ హీరోల స్టార్‌డమ్‌ ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది అని వర్మ చెప్పుకొచ్చాడు.

చదవండి: కమల్‌ హాసన్‌ అంటే ఎంత ప్రేమో.. 42 కి.మీ ప్రయాణించి మరీ..

Advertisement
 
Advertisement
Advertisement