శ్రీనివాస మంగాపురం... బాక్సాఫీస్‌ వద్ద అరుదైన రికార్డ్ | Srinivasa Mangapuram Movie Creates Rare Record at Box office | Sakshi
Sakshi News home page

Srinivasa Mangapuram Movie: శ్రీనివాస మంగాపురం... బాక్సాఫీస్‌ వద్ద అరుదైన రికార్డ్

Nov 8 2026 4:50 AM | Updated on Nov 8 2026 4:50 AM

Srinivasa Mangapuram Movie Creates Rare Record at Box office

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా జూలై 30న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో రిలీజైన మూడు వారాలకే ఓటీటీకి వచ్చేసింది.

అయితే తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్‌లో ఈ సినిమా ఏకంగా వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ఇది కాస్తా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత రోజుల్లో ఏ సినిమా అయినా నాలుగు వారాలు థియేటర్లలో ఆడటమే గగనంగా మారింది. ఇలాంటి తరుణంలో ఓ డెబ్యూ హీరో సినిమా వంద రోజుల మైలురాయిని అందుకోవడం అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది.

కాగా.. నవంబర్ 6న వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘట్టమనేని అభిమానులు థియేటర్ వద్ద భారీ కటౌట్లు కట్టి, టపాసులు కాలుస్తూ శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాక్సాఫీస్ లెక్కలతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ కృష్ణపై ఉన్న అభిమానంతో, ఆయన మనవడి తొలి సినిమాకు గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించారు. బాలీవుడ్ బ్యూటీ రాషా తడానీ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై కిరణ్ నిర్మించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ వంద రోజుల వేడుకకు సంబంధించిన స్పెషల్ పోస్టర్లు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement