రాజమౌళి వారణాసి హీరోయిన్.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..! | varanasi actress Priyanka chopra green Signal For another Movie | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: వారణాసి హీరోయిన్.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..!

Nov 8 2026 3:40 AM | Updated on Nov 8 2026 3:40 AM

varanasi actress Priyanka chopra green Signal For another Movie

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం వారణాసిలో నటిస్తోంది. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్‌ మూవీలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ ఇండియన్ సినిమాలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్ మూవీ తర్వాత మరే భారతీయ సినిమాలోనూ నటించలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ ఇండియన్ మూవీలో కనిపించనుంది.

అయితే ప్రియాంక చోప్రా తన సొంత నిర్మాణ సంస్థ ‘పర్పుల్ పెబుల్ పిక్చర్స్’ ద్వారా చిత్ర నిర్మాతగా మారారు. 2016లో సంచలన విజయం సాధించిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’కి సీక్వెల్‌ మూవీని ఆమె అధికారికంగా ప్రకటించింది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన రాజేష్ మాపుస్కర్ ఈ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నారు. ప్రియాంక చోప్రా, ఆమె తల్లి డాక్టర్ మధు చోప్రా, రాజేష్ కలసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇది కేవలం నిర్మాణ బాధ్యత మాత్రమేనని తెలుస్తోంది. ఇందులో ప్రియాంక నటించడం లేదని స్పష్టమైంది. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement