రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా వచ్చిన మూవీ రామాయణ. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. రిలీజైన మొదటి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, హీరో మహేశ్ బాబు తమ రివ్యూలు ప్రకటించారు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ కొనియాడారు.
తాజాగా మరో టాలీవుడ్ హీరో రామాయణపై రివ్యూ ప్రకటించారు. హీరో ఆది సాయి కుమార్ రామాయణపై ప్రశంసలు కురిపించారు. రామాయణ మూవీ ఎంత అద్భుతమైన సినిమా అని కొనియాడారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ అందరూ తమ పాత్రలను ఎంతో అందంగా పోషించారని అన్నారు. చిన్నప్పుడు మనం వింటూ పెరిగిన ఇతిహాసాన్ని, నేటి తరానికి తగినట్లుగా ఒక గొప్ప, ప్రపంచ స్థాయి రూపంలో మళ్లీ చూస్తున్నట్లు అనిపించిందని రాసుకొచ్చారు.
అద్భుతమైన దృశ్యాల నుంచి నేపథ్య సంగీతం వరకు.. ప్రతీదీ అత్యున్నత స్థాయిలో ఉందన్నారు. ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చిందన్నారు. వెండితెరపై తప్పక చూడవలసిన చిత్రం. మీ కుటుంబం, పిల్లలతో కలిసి ఈ ఇతిహాసాన్ని అస్సలు మిస్ అవ్వకండని సూచించారు. ఈ అనుభవాన్ని వారు చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటారని.. భారతీయ సినిమా తన అత్యున్నత స్థాయిలో రామాయణ మూవీని తెరకెక్కించారని ఆది సాయికుమార్ అభినందించారు.
RAMAYANA 🙏 What a film! Ranbir Kapoor garu , Sai Pallavi garu , Yash garu everyone played their part so beautifully! It felt like reliving the epic we grew up listening to in our childhood, but this time on a grand, world class scale for today’s generation! From the stunning visuals to the background score, everything was top notch! Absolutely loved it! A must watch on the big screen. Don’t miss this epic with your families and kids. They will cherish this experience! Indian cinema at its grandest! #Ramayana
— Aadi Saikumar (@iamaadisaikumar) November 7, 2026


