IPL 2025
-
ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏప్రిల్ 19న జైపూర్ వేదికగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయినట్లు రాజస్తాన్ క్రికెట్ సంఘం అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో రాజస్తాన్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిందంటూ బిహానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం స్పందించింది. తమపై చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తమని రాయల్స్ ఫ్రాంచైజీ సీనియర్ అధికారి దీప్ రాయ్ ఖండించారు."అడ్ హాక్ కమిటీ కన్వీనర్ చేసిన అన్ని ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహిరంగంగా చేసే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు తప్పుదారి పట్టించడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్, రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (RMPL), రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, బీసీసీఐ ఖ్యాతి, విశ్వసనీయతకు తీవ్ర నష్టం కలిగించాయి. అవి క్రికెట్ సమగ్రతను కూడా దెబ్బతీశాయి" అని రాయల్స్ ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రాయల్స్ యాజమాన్యం.. బిహానీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి, క్రీడా కార్యదర్శికి లేఖ రాశారు.అసలేమి జరిగిందంటే?లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ అనుహ్యంగా రెండు పరుగులతో తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 180 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగల్గింది. ఆఖరి ఓవర్లో తమ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా రాజస్తాన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.చదవండి: ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఆరోపణలు -
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఆరోపణలు
ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం కలకలం రేపుతుంది. ఏప్రిల్ 19న రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) తాత్కాలిక కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించాడు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైందని ఆయన అన్నాడు.ఈ మ్యాచ్‌పై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు నుంచి రాయల్స్ కదలికలపై అనుమానాలు ఉన్నాయని తెలిపాడు. అంతకుముందు రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్‌పై కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా రాయల్స్ గెలిచి ఉండాల్సిందని అన్నాడు. రాయల్స్ యాజమాన్యం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను పూర్తి పక్కకు పెట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని తెలిపాడు.2013 సీజన్లో రాయల్స్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడటంతో 2016, 2017 సీజన్లలో రాయల్స్‌పై నిషేధం విధించారన్న విషయాన్ని గుర్తు చేశాడు. అప్పట్లో రాయల్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండు సీజన్ల నిషేధం విధించారు.జైదీప్ ఆరోపణలు ఎలా ఉన్నా, ఏప్రిల్ 19న జరిగిన రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌పై సగటు క్రికెట్ అభిమానికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సులువగా గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో రాయల్స్ ఓడిపోవడాన్ని చాలా మంది ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. ఆ మ్యాచ్‌లో రాయల్స్ గెలుపుకు చివరి ఓవర్లో కేవలం 9 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో వికెట్లు కూడా ఉన్నాయి. క్రీజ్‌లో విధ్వంసకర ఆటగాళ్లు ధృవ్ జురెల్, హెట్‌మైర్ ఉన్నారు. అయినా రాయల్స్ చివరి ఓవర్లో 6 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ చివరి ఓవర్‌ను ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడో బంతికి డేంజరెస్ హెట్మైర్ను ఔట్ చేసి లక్నోకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఇక్కడ ఆవేశ్ ప్రతిభను ముమ్మాటికి ప్రశంసించాల్సిందే. 18వ ఓవర్లోనూ అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్‌ను ఔట్ చేశాడు. జనాలు ఆవేశ్ టాలెంట్‌ను ప్రశంశిస్తూనే, ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనుకుంటున్నారు. -
LSG VS DC: భారీ రికార్డులపై కన్నేసిన రాహుల్, కుల్దీప్
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 22) ఓ రసవత్తర మ్యాచ్ జరుగనుంది. టేబుల్ సెకెండ్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐదో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నో సొంత మైదానమైన అటల్ బిహారి వాజ్‌పేయ్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ రెండు భారీ రికార్డులపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 51 పరుగులు చేస్తే ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకిన ఎనిమిదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రాహుల్ ఖాతాలో 4949 పరుగులు (138 మ్యాచ్‌లు) ఉన్నాయి. ఇందులో 4 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.రాహుల్‌కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకారు.కుల్దీప్ విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్ లక్నోతో నేడు జరుగబోయే మ్యాచ్‌లో ఓ వికెట్ తీస్తే.. ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 27వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ ఇప్పటివరకు 214 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో చహల్ మినహా మరే బౌలర్ 200 వికెట్ల మార్కును తాకలేదు. టాప్-5లో పియూశ్ చావ్లా (192), భువనేశ్వర్ కుమార్ (189), సునీల్ నరైన్(187), రవిచంద్రన్ అశ్విన్ (185) ఉన్నారు.ప్రస్తుత సీజన్లో రాహుల్, కుల్దీప్ల ఫామ్‌ను చూస్తే నేడు లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో ఈ రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో రాహుల్ 6 మ్యాచ్‌ల్లో 266 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో 11 స్థానంలో ఉండగా.. 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసిన కుల్దీప్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.లక్నోపై సంచలన విజయం సాధించిన ఢిల్లీఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో లక్నోను ఢిల్లీ చివరి నిమిషంలో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అశుతోష్ శర్మ (66 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (39) వీరోచితమైన ప్రదర్శన కనబర్చి (లక్నో నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో) ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీని గెలిపించాడు. చివరి 7 ఓవర్లలో 94 పరుగులు చేయాల్సిన తరుణంలో (6 వికెట్లు కోల్పోయాక) ఈ జోడీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. అశుతోష్ చివరి నిమిషం వరకు క్రీజ్‌లో ఉండి ఢిల్లీని గెలిపించాడు.ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగిన నేపథ్యంలో నేటి మ్యాచ్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరే క్రమంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. నేటి మ్యాచ్‌తో లక్నో ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో లక్నో రాజస్థాన్ రాయల్స్‌ను ఊహించని విధంగా చివరి ఓవర్లో మట్టికరిపించి మాంచి ఊపు మీద ఉంది. ఢిల్లీ గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో భంగపడి కాస్త ఢీలాగా కనిపిస్తుంది.నేటి మ్యాచ్‌ను తుది జట్లు (అంచనా)లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (c & wk), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ / మయాంక్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, అవేష్ ఖాన్, ఆయుష్ బడోనిఢిల్లీ: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్ (wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, డోనోవన్ ఫెరీరా -
KKR VS GT: చరిత్ర సృష్టించిన గిల్, సాయి సుదర్శన్ జోడీ
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ జోడీ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ రికార్డు నెలకొల్పింది. నిన్న (ఏప్రిల్ 21) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ భాగస్వామ్యం (114 పరుగులు) నమోదు చేసిన ఈ జోడీ.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు (6) నెలకొల్పిన భారత జోడీగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు గిల్-సాయి సుదర్శన్.. కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్.. గౌతమ్ గంభీర్-రాబిన్ ఉతప్ప జోడీల పేరిట సంయుక్తంగా ఉండేది. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా విరాట్ కోహ్లి-ఏబీ డివిలియర్స్ ద్వయం ఉంది. ఈ జోడీ ఐపీఎల్లో 10 సెంచరీ పార్ట్నర్షిప్స్ నమోదు చేసింది. విరాట్-ఏబీడీ జోడీ తర్వాత అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా క్రిస్ గేల్-విరాట్ ద్వయం ఉంది. ఈ జోడీ 9 సెంచరీ పార్ట్నర్షిప్స్ నమోదు చేసింది. వీరి తర్వాత గిల్-సాయి సుదర్శన్, శిఖర్ ధవన్-డేవిడ్ వార్నర్, డుప్లెసిస్-విరాట్ ద్వయాలు తలో 6 ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసి ఈ జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే గిల్-సాయి సుదర్శన్ జోడీ రెండు శతక భాగస్వామ్యాలు నమోదు చేయడం విశేషం.ఐపీఎల్లో తొలి వికెట్‌కు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన భారత జోడీలుసాయి సుదర్శన్-శుభ్‌మన్ గిల్ (గుజరాత్)- 6కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్ (పంజాబ్)-5గౌతమ్ గంభీర్-రాబిన్ ఉతప్ప (కేకేఆర్)-5ఓవరాల్‌గా ఐపీఎల్లో తొలి వికెట్‌కు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీలువిరాట్ కోహ్లి-ఏబీ డివిలియర్స్ (ఆర్సీబీ)- 10విరాట్ కోహ్లి-క్రిస్ గేల్ (ఆర్సీబీ)- 9విరాట్ కోహ్లి- ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ)-6శుభ్‌మన్ గిల్- సాయి సుదర్శన్ (గుజరాత్)- 6శిఖర్ ధవన్- డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్)- 6మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కేకేఆర్‌ను 39 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గిల్ (90), సాయి సుదర్శన్ (52), బట్లర్ (41 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్‌ను 158 పరుగులకే పరిమితం చేశారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ చెరో 2, సిరాజ్, ఇషాంత్, సుందర్, సాయికిషోర్ తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే ఒక్కడే హాఫ్ సెంచరీతో (50) రాణించాడు. గుజరాత్ ఏప్రిల్ 28న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. -
IPL 2025: అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతున్న గుజరాత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ అంచనాలకు తలకిందులు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. మరో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.ప్రస్తుతం ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు కూడా గుజరాత్ ఆటగాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. సాయి సుదర్శన్ 8 మ్యాచ్‌ల్లో 417 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. బ్యాటింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల టాప్-10 జాబితాలో సాయి సుదర్శన్‌తో పాటు జోస్ బట్లర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఉన్నారు. ఈ ముగ్గురు గుజరాత్ టాపార్డర్‌లో అంచనాలకు మించి రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌లో ఈ ముగ్గురిలో ఒకరిద్దరు సత్తా చాటుతున్నారు. బౌలింగ్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్ల జాబితాలో ప్రసిద్ద్ సహా ముగ్గురు గుజరాత్ బౌలర్లు ఉన్నారు. ఈ సీజన్లో రవిశ్రీనివాస్ సాయికిషోర్ ఊహలకందని విధంగా సత్తా చాటుతూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాదే కొత్తగా గుజరాత్లో చేరిన సిరాజ్ సైతం ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. గుజరాత్ విజయాల్లో మిడిలార్డర్ బ్యాటర్లు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఫామ్ ఒక్కటే ఈ సీజన్లో గుజరాత్‌ను కలవరపెడుతుంది. అతను కూడా నిన్న (ఏప్రిల్ 21) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. నిన్నటి మ్యాచ్‌లో రషీద్ 4 ఓవర్లలో కేవలం 25 పరుగులకే ఇచ్చి 2 కీలక వికెట్లు (నరైన్, రసెల్) తీశాడు. ఈ సీజన్లో గుజరాత్‌కు ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు సత్తా చాటుతూ విజయాన్నందిస్తున్నారు. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ నిలకడకు మారు పేరు అన్నట్లుగా మారిపోయాడు. గిల్ సామర్థ్యం మేరకు రాణిస్తుండగా.. బట్లర్ అంచనాలకు మించి సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు పేస్ త్రయం ప్రసిద్ద్, సిరాజ్, ఇషాంత్‌పై ఎవరికీ అంచనాలు లేవు. సాయికిషోర్ నుంచి అయితే ఈ స్థాయి అత్యుత్తమ ప్రదర్శన అస్సలు ఊహించలేదు. సాయికిషోర్ ఎప్పుడు బంతిని పట్టుకున్నా వికెట్లు తీయడమే కాకుండా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇతను ప్రత్యర్థి బ్యాటర్ల పాలిట కొరకరాని కొయ్యగా మారాడు. ఈ సీజన్లో గుజరాత్ ఇదే జోరును కొనసాగిస్తే రెండో టైటిల్ ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ. అందరూ ఈ సీజన్లో ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్, లక్నో జట్లలో ఏదో ఒకటి టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నారు. అయితే గుజరాత్ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతుంది.కాగా, కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఎప్పటిలాగే టీమ్ ఎఫర్ట్‌ను చూపించి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గిల్ (90), సాయి సుదర్శన్ (52), బట్లర్ (41 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్‌ను 158 పరుగులకే పరిమితం చేశారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ చెరో 2, సిరాజ్, ఇషాంత్, సుందర్, సాయికిషోర్ తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే ఒక్కడే హాఫ్ సెంచరీతో (50) రాణించాడు. గుజరాత్ ఏప్రిల్ 28న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. -
GT Vs KKR: గుజరాత్ గర్జన
కోల్‌కతా: గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతులెత్తేసింది. దీంతో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో టైటాన్స్ 39 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (55 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. బట్లర్ (23 బంతుల్లో 41 నాటౌట్; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో రసెల్, వైభవ్, హర్షిత్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ అజింక్య రహానే (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. ఆ ఇద్దరు బాదేశారిలా... గుజరాత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ముందుగా సాయి సుదర్శన్ బౌండరీతో బాదుడు మొదలు పెట్టాడు. మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. కాస్త ఆలస్యమైనా... గిల్ ఐదో ఓవర్లో రెండు వరుస బౌండరీలతో దూకుడు షురూ చేశాడు. టైటాన్స్ పవర్‌ప్లే స్కోరు 45/0. అలీ వేసిన ఏడో ఓవర్లో గిల్ 6, 4, 4లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. క్రమం తప్పకుండా ఫోర్లు బాదేయడంతో సగం ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 89/0 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లోనే గిల్ 34 బంతుల్లో, సుదర్శన్ 33 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 100 దాటింది. ఎట్టకేలకు సుదర్శన్‌ను అవుట్ చేసిన రసెల్ కోల్‌కతాకు ఊరటనిచ్చాడు. అయితే బట్లర్ రాకతో దంచుడులో ఏ మార్పులేకపోయింది. ఆఖర్లో గిల్, రాహుల్ తెవాటియా (0) వికెట్లు పడినా కూడా భారీస్కోరు సాధ్యమైంది. కెప్టెన్ ఒంటరి పోరాటం పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నైట్‌రైడర్స్ పవర్‌ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. సిరాజ్ తొలి ఓవర్లోనే రహా్మనుల్లా గుర్బాజ్ (1) పెవిలియన్ చేరగా, కెప్టెన్ రహానేతో అడపాదడపా షాట్లతో స్కోరును నడిపిస్తున్న సునీల్ నరైన్ (17)ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. వెంకటేశ్ అయ్యర్ (14) మెప్పించలేకపోయాడు. బాధ్యతగా ఆడిన రహానే 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, అదేస్కోరు వద్ద వాషింగ్టన్ సుందర్ అతన్ని అవుట్ చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రసెల్ (15 బంతుత్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) స్టంపౌట్ కావడంతో కోల్‌కతా లక్ష్యానికి దూరమైంది. రఘువంశీ (13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు అలరించాడు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 52; శుబ్‌మన్ గిల్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ 90; బట్లర్ (నాటౌట్) 41; తెవాటియా (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ రాణా 0; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–114, 2–172, 3–177. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–44–1, మొయిన్ అలీ 3–0–27–0, హర్షిత్ రాణా 4–0–45–1, వరుణ్ చక్రవర్తి 4–0–33–0, నరైన్ 4–0–36–0, రసెల్ 1–0–13–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 1; నరైన్ (సి) తెవాటియా (బి) రషీద్ 17; రహానే (స్టంప్డ్) బట్లర్ (బి) సుందర్ 50; వెంకటేశ్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 14; రింకూ సింగ్ (సి) గిల్ (బి) ఇషాంత్ 17; రసెల్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 21; రమణ్‌దీప్ (సి అండ్ బి) ప్రసిధ్ కృష్ణ 1; మొయిన్ అలీ (సి) షారుఖ్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; రఘువంశీ (నాటౌట్) 27; హర్షిత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–2, 2–43, 3–84, 4–91, 5–118, 6–119, 7–119, 8–151. బౌలింగ్: సిరాజ్ 4–0–32–1, ఇషాంత్ 2–0–18–1, ప్రసిధ్ కృష్ణ 4–0–25–2, రషీద్ ఖాన్ 4–0–25–2, సుందర్ 3–0–36–1, సాయి కిషోర్ 3–0–19–1. -
చితక్కొట్టిన శుబ్‌మన్.. కేకేఆర్‌పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగల్గింది.కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే(50)టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో రఘువన్షి(27) పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ట తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, సుందర్, ఇషాంత్ శర్మ సాయికిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.చితక్కొట్టిన శుబ్‌మన్..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ బ్యాటింగ్‌తో ఈడెన్‌లో బౌండరీలు వర్షం కురిపించాడు. 55 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. గిల్‌తో పాటు సాయిసుదర్శన్(52), బట్లర్(41) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలా వికెట్ సాధించారు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. -
సీఎస్కే స్టార్ ఓపెనర్ ఇంట తీవ్ర విషాదం..
న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి డెంటాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సీఎస్కే అధికారికంగా ధ్రువీకరించింది. "ఈ క్లిష్ట సమయంలో కాన్వే కుటుంబానికి మద్దతుగా ఉంటాము. డెంటాన్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని సీఎస్కే యాజమాన్యం ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా కాన్వే తండ్రి మృతికి సంతాపంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ధరించి మైదానంలో దిగారు. కాగా కాన్వే ఇప్పటికే న్యూజిలాండ్‌కు చేరుకున్నాడు. అతడు ఈ ఏడాది ఐపీఎల్లో చివరగా ఏప్రిల్ 11న సీఎస్కే తరపున ఆడాడు.దక్షిణాఫ్రికాకు చెందిన డెంటాన్ కాన్వే కుటంబం.. డెవాన్ కాన్వే చిన్నతనంలో న్యూజిలాండ్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలోనే కాన్వే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా ప్రదర్శన చేసి కివీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతి తక్కువ కాలంలోనే బ్లాక్‌క్యాప్స్ జట్టులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్-2025లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన డెవాన్.. 27.03 స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు చేశాడు. కాన్వే తిరిగి రావడంపై మాత్రం సీఎస్కే ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ ఏడాది సీజన్లో సీఎస్కే దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. చెన్నై జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది. -
ఏంటి గిల్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?
ఐపీఎల్-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్బంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ సమయంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత డానీ మోరిసన్ నవ్వులు పూయించాడు.ఏ సాధారణంగా వ్యాఖ్యాత అయినా టాస్ సందర్భంగా కెప్టెన్లను జట్టు మార్పులు, మ్యాచ్ ప్లాన్స్ గురుంచి అడుగుతారు. కానీ మోరిసన్ మాత్రం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను తన వివాహ ప్రణాళికల గురించి అడిగాడు. ఈ కివీస్ మాజీ క్రికెటర్ గిల్‌ను త్వరలో పెళ్లి చేసుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో ఆశ్చర్యపోయిన గిల్.. అటువంటి ప్లాన్స్ ఏమీ లేవంటూ నవ్వుతూ సమధానమిచ్చాడు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కోల్‌కతా రెండు మార్పులతో బరిలోకి దిగింది. వరుస మ్యాచ్‌ల్లో విఫలమవతున్న స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను కేకేఆర్ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో అఫ్గాన్ స్టార్ ప్లేయర్ గుర్బాజ్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లుగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
IPL 2025 KKR vs GT: కేకేఆర్‌పై గుజరాత్ ఘన విజయం
IPL 2025 KKR vs GT Live Updates: కేకేఆర్‌పై గుజరాత్ ఘన విజయంఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగల్గింది.కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే(50)టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో రఘువన్షి(27) పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ట తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, సుందర్, ఇషాంత్ శర్మ సాయికిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.ఓటమి దిశగా కేకేఆర్..గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి దిశగా సాగుతోంది. వరుస క్రమంలో కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రస్సెల్(24) ఔట్ కాగా.. ప్రసిద్ద్ బౌలింగ్‌లో రమణ్‌దీప్ సింగ్(1) మోయిన్ అలీ(0) పెవిలియన్‌కు చేరారు. కేకేఆర్ విజయానికి 18 బంతుల్లో 75 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్(6), రఘువన్షి(5) ఉన్నారు.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన అయ్యర్.. సాయికిషోర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్..90 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన కెప్టెన్ అజింక్య రహానే.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో రింకూ సింగ్(2), రస్సెల్(10) ఉన్నారు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..సునీల్ నరైన్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన నరైన్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తెవాటియాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(3), అజింక్య రహానే(24) ఉన్నారు.గుజరాత్‌కు భారీ షాక్..199 పరుగులతో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో గుర్భాజ్(1) ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్ అజింక్య రహానే వచ్చాడు.శుబ్‌మన్ గిల్ విధ్వంసం.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.55 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. గిల్‌తో పాటు సాయిసుదర్శన్(52), బట్లర్(41) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న గిల్..17 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(26), శుబ్‌మన్ గిల్(80) ఉన్నారు.గుజరాత్ తొలి వికెట్ డౌన్..సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(13), శుబ్‌మన్ గిల్(60) ఉన్నారు.హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, సుదర్శన్..కేకేఆర్‌తో మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(52), సాయి సుదర్శన్(52) హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది.గిల్ ఆన్ ఫైర్..7 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్(39), సాయిసుదర్శన్(21) దూకుడుగా ఆడుతున్నారు.నిలకడగా ఆడుతున్న గిల్, సుదర్శన్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(6), సాయిసుదర్శన్(19) ఉన్నారు.ఐపీఎల్-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక పోరులో కేకేఆర్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేకేఆర్ తుది జట్టులోకి గుర్బాజ్, మోయిన్ అలీ వచ్చారు. గుజరాత్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిచదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా -
IPL 2025: రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్.. ఇక కష్టమే మరి?
ఐపీఎల్-2025లో వరుస ఓటుములతో సతమతమవుతున్న రాజస్తాన్ రాయల్స్ ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్ 24న చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్తాన్ తాడోపేడో తెల్చుకోనుంది.ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే రాజస్తాన్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్‌కు రాయల్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆర్సీబీతో మ్యాచ్‌కు కెప్టెన్ సంజూ శాంసన్ గాయం దూరమయ్యాడు. సంజూ ప్రస్తుతం పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరో వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్‌కు శాంసన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాయల్స్ ఫ్రాంచైజీ ధ్రువీకరించింది. శాంసన్ కోలుకుంటున్నాడని, జట్టుతో పాటు బెంగళూరుకు వెళ్లకుండా జైపూర్‌లోనే ఉండిపోయినట్లు రాజస్తాన్ మెనెజ్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో అతడి స్ధానంలో రియాన్ పరాగ్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అనూహ్య ఓటములను చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సూపర్ ఓవర్లో పరాజయం పాలైన రాజస్తాన్.. ఆఖరి మ్యాచ్‌లో లక్నోపై 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాజస్తాన్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదివ స్ధానంలో ఉంది.చదవండి: IPL 2025: 'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్ -
IPL 2025: తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్న స్టార్లు వీరే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలా మంది క్రికెటర్లు తాము తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారు. వీరిలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ సీజన్ వేలంలో లక్నో పంత్‌ను రూ. 27 కోట్ల రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర. ఇంత భారీ మొత్తం పెట్టినా ఈ సీజన్లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. 8 మ్యాచ్‌ల్లో నామమాత్రపు స్ట్రయిక్‌రేట్‌తో (98.15) కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు.ఈ సీజన్లో లభించిన మొత్తానికి న్యాయం చేయలేకపోతున్న రెండో ఆటగాడు వెంకటేశ్ అయ్యర్. వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే వెంకటేశ్ జట్టు తనపై పెట్టుకున్న అంచనాలకు కనీస న్యాయం చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో నామమాత్రపు ప్ట్రయిక్రేట్తో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి 121 పరుగులు చేశాడు.ఈ సీజన్లో తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేని మూడో ఆటగాడు మహ్మద్ షమీ. షమీని ఈ సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంతో నమ్మకంతో రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను 7 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు మాత్రమే తీశాడు.ఈ సీజన్లో చెత్త ప్రదర్శనలతో ఉసూరుమనిపిస్తున్న మరో క్రికెటర్ రషీద్ ఖాన్. రషీద్‌ను గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకుంది. అయితే రషీద్ ఎన్నడూ లేనట్లుగా ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రషీద్ ఈ సీజన్లో 7 మ్యాచ్‌ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ (9.73) కూడా చాలా దారుణంగా ఉంది.ఈ సీజన్లో అంచనాలు తగ్గట్టుగా రాణించలేని మరో క్రికెటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్. ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ భారీ అంచనాలు పెట్టుకుని మెగా వేలంలో రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇతగాడు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 105.77 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు గుండు సున్నాలు ఉన్నాయి.పైన పేర్కొన్న ఆటగాళ్లతో పాటు మరికొందరు కూడా తీసుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నారు. వారిలో లివింగ్‌స్టోన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, క్లాసెన్, ట్రవిస్ హెడ్, ఆండ్రీ రసెల్, హెట్‌మైర్, రబాడ, జన్సెన్ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. టి నటరాజన్ (10.75 కోట్లు, ఢిల్లీ) లాంటి ఆటగాళ్లు భారీ మొత్తం లభించినా అవకాశాలు లేక బెంచ్‌కే పరిమితమవుతున్నారు. ఇదిలా ఉంటే, కొందరు దేశీయ ఆటగాళ్లు మాత్రం ఈ సీజన్లో అంచనాలకు మించి తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తున్నారు. వీరిలో ప్రియాంశ్ ఆర్య (3.8 కోట్లు), అశుతోష్ శర్మ (3.8 కోట్లు), దిగ్వేశ్ రాఠీ (30 లక్షలు), విప్రాజ్ నిగమ్ (50 లక్షలు), అనికేత్ వర్మ (30 లక్షలు), వైభవ్ సూర్యవంశీ (1.1 కోట్లు), ఆయుశ్ మాత్రే లాంటి ఆటగాళ్లు ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. సీఎస్కే నిర్ధేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ముంబై స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(76), సూర్యకుమార్ యాదవ్(68) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగలు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(53), శివమ్ దూబే(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. చాహర్, శాంటర్న్ తలా వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన ముంబై..ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కేను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడు సార్లు తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.ముంబై కంటే ముందు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయింది. 2008 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేను తొలిసారిగా ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత 2020 సీజన్లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై 10 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చెన్నైను 9 వికెట్ల తేడాతో హార్దిక్ సేన ఓడించింది. కాగా ఈ ఓటమితో సీఎస్కే తమ ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల ఆడిన చెన్నై కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2025: 'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్ -
'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్లు గ్లెన్ మాక్స్వెల్, లియామ్ లివింగ్‌స్టోన్ దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఏ మ్యాచ్‌లోనూ ఈ స్టార్ క్రికెటర్లు తమ మార్క్‌ను చూపించలేకపోయారు.దీంతో వారిద్దరిపై ఇరు జట్ల మెన్జెమెంట్లు వేటు వేశాయి. ఇప్పటికే మాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ గత రెండు మ్యాచ్‌లకు దూరం పెట్టగా.. ఆర్సీబీ కూడా లివింగ్ స్టోన్‌ను తమ ఆఖరి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం చేసింది. ఆదివారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లివింగ్ స్టోన్‌కు ఆర్సీబీ తుది జట్టులో చోటు దక్కలేదు. అతడి స్దానంలో కరేబియన్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో మాక్స్వెల్, లివింగ్ స్టోన్పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. వారి ఆట తీరును చూస్తుంటే ఏదో హాలిడేకి వచ్చినట్లు ఉందని సెహ్వాగ్ మండిపడ్డాడు."మాక్స్వెల్, లివింగ్ స్టోన్లో తమ జట్ల కోసం పోరాడాలనే కసి కనిపించడం లేదు. వారు ఏదో హాలిడే కోసం భారత్‌కు వచ్చినట్లు అన్పిస్తోంది. ఇక్కడకు వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్లిపోవడమే వాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు కోసం ఏదైనా చేయాలనే తపన వారిలో లేదు. గతంలో చాలా మంది విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడాను. వారిలో ఒకరిద్దరూ మాత్రమే జట్టు కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు అప్పటిలో నాకు అన్పించిందని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా మాక్స్వెల్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి కేవలం 41 పరుగులతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు లివింగ్‌స్టోన్ 7 మ్యాచ్‌లు ఆడి 87 పరుగులు చేశాడు.చదవండి: PBKS vs RCB: నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి -
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్‌పై విమర్శలు
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు శుభసూచకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. గత మ్యాచ్‌ల మాదిరి ఆదిలోనే వికెట్ పారేసుకోకుండా తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన తీరును ప్రశంసించాడు. అయితే, ఓ ఓపెనింగ్ బ్యాటర్‌గా అతడి ప్రదర్శన ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదని విమర్శించాడు.రూ. 16.30 కోట్లకుకాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ రోహిత్ శర్మను రూ. 16.30 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే, ఈ సీజన్ ఆరంభం నుంచి అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో మొత్తం కలిపి 82 పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో మాత్రం బ్యాట్ ఝులిపించాడు.వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు,. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొని.. 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా హిట్‌మ్యాన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడి స్థాయికి ఇది అతి సాధారణ ప్రదర్శన‘‘అందరి ముఖాల్లో సంతోషం. కానీ అదే సమయంలో ఎన్నో ప్రశ్నలు. ఒకవేళ రోహిత్ శర్మ కనీసం 20 పరుగుల మార్కు దాటేందుకు ఇంకొన్ని ఇన్నింగ్స్ తీసుకుని ఉంటే.. విమర్శలు మరింత ఎక్కువయ్యేవి.అయితే, ప్రతి ఇన్నింగ్స్‌లోనూ అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే, ఆఖర్లో 26 అతడి అత్యధిక స్కోరుగా ఉండేది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు.ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చినా.. అతడి స్థాయికి ఇది అతి సాధారణ ప్రదర్శన మాత్రమే. జట్టు ఓపెనర్‌గా ఇలాంటి ఆట తీరు ఎంతమాత్రం సరికాదు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ పరుగులు చేయడం జట్టుకు సానుకూల పరిణామం.మెరుగ్గా ఇన్నింగ్స్ ఆరంభించి.. ట్రేడ్‌మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. అయితే, అతడు ఈరోజు వికెట్ పారేసుకోకుండా ఉండటమే నాకు నచ్చిన అత్యంత గొప్ప విషయం’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. ఏదేమైనా సూపర్‌స్టార్ రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే ముచ్చటగా అనిపించిందని.. ఇక ముందు కూడా ఇదే ఫామ్‌ను కొనసాగించాలని ఆకాంక్షించాడు.చెన్నైని ఓడించిన ముంబైకాగా వాంఖడేలో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 176 పరుగులు సాదించింది. ఇక ముంబై ఈ నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే ఊదేసింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు-76 రన్స్), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు- 68 రన్స్) కలిసి ముంబైని గెలుపు తీరాలకు చేర్చారు.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోA perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
MI VS CSK: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 20) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హిట్‌మ్యాన్.. ఐపీఎల్లో 20 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్, విరాట్ కోహ్లి తలో 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచి భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాళ్లుగా ఉన్నారు.విరాట్ నిన్ననే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచి రోహిత్ రికార్డును సమం చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే రోహిత్ విరాట్‌ను వెనక్కు నెట్టి హోల్ అండ్ సోల్‌గా భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (ఐపీఎల్) గెలుచుకున్న ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ (20) వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్‌లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్‌లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్‌లు)ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు (టాప్-5)25- ఏబీ డివిలియర్స్ (184 మ్యాచ్‌లు)22- క్రిస్ గేల్ (142 మ్యాచ్‌లు)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్‌లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శిఖర్ ధవన్‌కు వెనక్కు నెట్టాడు. ఈ జాబితాలో విరాట్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు (టాప్-5)8326 - విరాట్ కోహ్లీ6786 - రోహిత్ శర్మ*6769 - శిఖర్ ధావన్6565 - డేవిడ్ వార్నర్5528 - సురేష్ రైనామ్యాచ్ విషయానికొస్తే.. నిన్న రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.సీఎస్కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. -
హార్దిక్‌తో ఇలాగే ఉంటది!.. పాపం ఆకాశ్ అంబానీ.. భయపడిపోయాడు!
తొలుత అంపైర్ క్యామ్.. తర్వాత స్పైడర్ క్యామ్.. ఇప్పుడు ‘చంపక్’.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో చేరిన కొత్త మెంబర్ పేరిది. ఐపీఎల్-2025 సీజన్ సందర్భంగా ఓ రోబో కుక్కను నిర్వాహకులు ప్రవేశపెట్టారు.ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏప్రిల్ 13న ఈ రోబో కుక్కను.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ డానీ మోరిసన్ పరిచయం చేశాడు. తమ జట్టులోని కొత్త మెంబర్ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.𝗛𝗼𝗹𝗱 𝗼𝗻! 𝗪𝗲'𝘃𝗲 𝗮 𝗻𝗲𝘄 𝗜𝗣𝗟 𝗳𝗮𝗺𝗶𝗹𝘆 𝗺𝗲𝗺𝗯𝗲𝗿 𝗶𝗻 𝘁𝗼𝘄𝗻 👀It can walk, run, jump, and bring you a 'heart(y)' smile 🐩❤️And...A whole new vision 🎥Meet the newest member of the #TATAIPL Broadcast family 👏 - By @jigsactin P.S: Can you help us in… pic.twitter.com/jlPS928MwV— IndianPremierLeague (@IPL) April 13, 2025 ఇక వాంఖడేలో ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్మధ్య ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా దీనికి ‘చంపక్’గా నామకరణం చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ రోబో కుక్కను రిమోట్‌తో ఆపరేట్ చేస్తారు. ఈ నేపథ్యంలో చెన్నైపై విజయానంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ‘చంపక్’ను కలిశాడు.ఆ సమయంలో ముంబై జట్టు యజమాని ఆకాశ్ అంబానీ హార్దిక్ పక్కనే ఉన్నాడు. ఈ క్రమంలో ఆకాశ్‌ను ఆటపట్టించేందుకు రోబో కుక్కను అతడి మీదకు ఉరికించాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయి ఆకాశ్ అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం చేయగా.. హార్దిక్ గట్టిగా నవ్వేశాడు.pic.twitter.com/InWH5eY2hC— Epic Comments Telugu (@epicmntstelugu) April 21, 2025 అనంతరం చంపక్‌తో ఆకాశ్‌కు షేక్‌హ్యాండ్ ఇప్పించిన హార్దిక్.. ఆ తర్వాత అతడి ముందు రోబో డాగ్ సాగిలాపడేలా రిమోట్‌తో ఆపరేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటికే ‘చంపక్’ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్ కలిశారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్ గెలిచిన ముంబై చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ధోని సేన ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32) అరంగేట్రంలోనే మెరుపులు మెరిపించగా.. రవీంద్ర జడేజా (53 నాటౌట్), శివం దూబే (50) అర్ధ శతకాలు సాధించారు.ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు కూల్చగా.. అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 15.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి పని పూర్తి చేసింది.ఓపెనర్లలో రియాన్ రికెల్టన్ (24) ఓ మోస్తరుగా ఆడగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దంచికొట్టారు. రోహిత్ 45 బంతుల్లో 76.. సూర్య 30 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచి ముంబై విజయాన్ని ఖరారు చేశారు. ఈ సీజన్లో ముంబై ఇప్పటికి ఎనిమిదింట నాలుగు గెలిచి పట్టికలో ఆరో స్థానంలో ఉండగా.. చెన్నై ఎనిమిది మ్యాచ్‌లకు గానూ రెండే గెలిచి ఆఖరున పదో స్థానంలో కొనసాగుతోంది. -
నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (PBKS vs RCB) స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) అదరగొట్టాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ దూకుడు శైలికి భిన్నంగా సంయమనంతో ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అద్భుత అర్ధ శతకంతో మెరిసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.పంజాబ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 54 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 73 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లి 135 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) మాత్రం వేగంగా ఆడాడు.ఈ కేరళ బ్యాటర్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 61 పరుగులు సాధించాడు. ఇక ఆఖర్లో జితేశ్ శర్మ సిక్స్‌తో ఆర్సీబీ గెలుపును ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.నాకెందుకు?.. ఈ అవార్డుకు అతడే అర్హుడు‘‘మాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. రెండు పాయింట్లు కూడా ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించే క్రమంలో ఎంతో ఉపయోగపడతాయి. సొంత మైదానం వెలుపలా మేము అద్భుతంగా ఆడుతున్నాం.ఈ విషయం ఇక్కడ మరోసారి నిరూపితమైంది. అయితే, ఈరోజు దేవ్ ఇన్నింగ్స్ వల్లే ఇది సాధ్యమైంది. అతడు భిన్న రీతిలో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. నాకు అభిప్రాయం ప్రకారం ఈ అవార్డుకు అతడే అర్హుడు.కానీ నాకెందుకు ఇచ్చారో తెలియడం లేదు’’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘నేను క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నా పర్లేదు.. ఆ తర్వాత వేగం పెంచి.. ఆఖరిదాకా క్రీజులో ఉండాలనేదే మా వ్యూహం.మాకు మంచి జట్టు లభించిందిఈ సీజన్లో మాకు మంచి జట్టు లభించింది. వేలంలో మా వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. డేవిడ్, టిమ్, పాటిదార్.. అందరూ తమ పాత్రలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇక రొమారియో షెఫర్డ్, లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఉండటం మాకు సానుకూలాంశం’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా మూడు రోజుల క్రితం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీని ఓడించింది. అందుకు బదులుగా పంజాబ్ సొంత మైదానం ముల్లన్‌పూర్‌లో ఆర్సీబీ ఆదివారం నాటి మ్యాచ్‌లో శ్రేయస్ సేనపై ప్రతీకారం తీర్చుకుంది. ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ఎనిమిదింట ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. పంజాబ్ కూడా ఎనిమిదింట ఐదు విజయాలు సాధించినా రన్‌రేటు పరంగా వెనుకబడి నాలుగో స్థానంలో ఉంది.ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ👉టాస్: ఆర్సీబీ.. మొదట బౌలింగ్👉పంజాబ్ స్కోరు: 157/6 (20)👉ఆర్సీబీ స్కోరు: 159/3 (18.5)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించిన ఆర్సీబీ.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోSmacking them with ease 🤌Virat Kohli is in the mood to finish this early 🔥Updates ▶ https://t.co/6htVhCbTiX#TATAIPL | #PBKSvRCB | @imVkohli pic.twitter.com/iuT58bJY2A— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్’కే ఇది సాధ్యం!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత అద్బుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభం నుంచి పేలవ ఫామ్‌తో సతమతమైన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్ సందర్భంగా ‘వింటేజ్ హిట్‌మ్యాన్’ను గుర్తు చేస్తూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు.రోహిత్ ధనాధన్చెన్నై విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ 33 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 45 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచి.. సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్)తో కలిసి ముంబైని విజయతీరాలకు చేర్చాడు.ఇక చెన్నైతో మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ అంటూ అభిమానులు ఇచ్చిన బిరుదును రోహిత్ శర్మ మరోసారి సార్థకం చేసుకున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం ఇందుకు నిదర్శనం.This man & his pull shots >>>>#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvCSKpic.twitter.com/hwnlKRNvO0— Mumbai Indians (@mipaltan) April 20, 2025 ఈ క్రమంలో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది.ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు (అంతర్జాతీయ, లీగ్ క్రికెట్లో కలిపి) బాదిన క్రికెటర్లు👉రోహిత్ శర్మ- ఇండియాలో- 361 సిక్సర్లు👉క్రిస్ గేల్- వెస్టిండీస్‌లో- 357 సిక్సర్లు👉విరాట్ కోహ్లి- ఇండియాలో- 325 సిక్సర్లు👉మహేంద్ర సింగ్ ధోని- ఇండియాలో- 286 సిక్సర్లు👉కీరన్ పొలార్డ్- వెస్టిండీస్‌లో- 276 సిక్సర్లు👉సంజూ శాంసన్- ఇండియాలో- 274 సిక్సర్లు👉నికోలస్ పూరన్- వెస్టిండీస్‌లో- 271 సిక్సర్లు.ఇక ఓవరాల్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున టెస్టుల్లో 88, వన్డేల్లో 344, టీ20లలో 205 సిక్స్‌లు కొట్టాడు. ఐపీఎల్లో 264 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 292 సిక్సర్లు బాదాడు.సీఎస్కే 176.. ఆలౌట్ముంబై- చెన్నై మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో ఆదివారం జరిగిన చిరకాల ప్రత్యర్థుల పోరులో ఆతిథ్య ముంబై పైచేయి సాధించింది. టాస్ గెలిచి చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన హార్దిక్ సేన.. ధోని బృందాన్ని 176 పరుగులకు కట్టడి చేసింది.అనంతరం కేవలం ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై.. తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఈ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టిన హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానాని (8 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి)కి దూసుకువచ్చింది. మరోవైపు.. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది ఆరో పరాజయం. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోA #SKY special in Wankhede!#SuryaKumarYadav hits the winning runs for #MI & the Revenge is completed!Next up on #IPLRevengeWeek 👉 #KKRvGT | MON, 21 APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/8rw3ZDwA5w— Star Sports (@StarSportsIndia) April 20, 2025 -
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదో గెలుపు నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ (PBKS vs RCB) చేతిలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఎదురైన పరాభవానికి ఆదివారం బదులు తీర్చుకుంది. పంజాబ్‌ను వారి హోం గ్రౌండ్ ముల్లన్‌పూర్‌లో ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగాఈ క్రమంలో పంజాబ్‌పై ప్రతీకార విజయం నేపథ్యంలో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. అయితే, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్న తీరు విమర్శలకు తావిచ్చింది.కోహ్లి చర్య.. శ్రేయస్ ఫైర్ఇక కోహ్లి చర్య పట్ల శ్రేయస్ కూడా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపించింది. మ్యాచ్ ముగియగానే ఇరుజట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలో.. అయ్యర్ కోహ్లితో కోపంగా ఏదో మాట్లాడాడు. అయితే, కోహ్లి మాత్రం నవ్వుతూ వాతావరణాన్ని చల్లబరచాలని ప్రయత్నించాడు.కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం గంభీరంగా అతడికి బదులిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదేమైనా సహచర టీమిండియా ఆటగాడిని కించపరిచేలా ఇలాంటి సెలబ్రేషన్స్ దిగ్గజ బ్యాటర్ అయిన కోహ్లి స్థాయికి తగవంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడా?అయితే, ఆర్సీబీ అభిమానులు మాత్రం శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్‌లో కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడని.. అందుకే కింగ్ ఇలా బదులిచ్చాడని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. శ్రేయస్ ఆర్సీబీ మ్యాచ్ సమయంలో ఎలాంటి మూర్ఖపు చర్యలకు దిగలేదని.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో అతడు ఇచ్చిన రియాక్షన్‌ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.బ్యాటర్‌గా శ్రేయస్ విఫలంకాగా ముల్లన్‌పూర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31) రాణించగా.. ఆఖర్లో మార్కో యాన్సెన్ (20 బంతుల్లో 25 నాటౌట్) ఆకట్టుకున్నాడు.ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. పేసర్ రొమారియో షెఫర్డ్ శ్రేయస్ అయ్యర్ (6) రూపంలో కీలక వికెట్ దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.దంచికొట్టిన పడిక్కల్, కోహ్లిఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ విరాట్ కోహ్లి, వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. పడిక్కల్ కేవలం 35 బంతుల్లోనే 61 పరుగులతో దుమ్ములేపాడు.అయితే, కెప్టెన్ రజత్ పాటిదార్ (12) ఈసారి విఫలం కాగా.. కోహ్లి- జితేశ్ శర్మతో కలిసి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశాడు. కోహ్లి 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 73 పరుగులతో అజేయంగా నిలవగా.. జితేశ్ (8 బంతుల్లో 11) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. కాగా ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ ఐదింట గెలిచి.. పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది.చదవండి: Rohit Sharma: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. నాకు దక్కిన అరుదైన గౌరవంCSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి ఇలా..Jitesh Sharma dials 6⃣ to seal it in style 🙌Virat Kohli remains unbeaten on 73*(54) in yet another chase 👏@RCBTweets secure round 2⃣ of the battle of reds ❤Scorecard ▶ https://t.co/6htVhCbltp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/6dqDTEPoEA— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
CSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి..
ఐపీఎల్-2025 ఆరంభంలో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్.. గేర్ మార్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో గెలుపు బాట పట్టిన హార్దిక్ సేన.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుని.. ధోని సేనను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐపీఎల్-2025 (IPL 2025)లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసి.. ఓవరాల్‌గా నాలుగో విజయం అందుకుంది.ఈ క్రమంలో ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఆరో స్థానానికి దూసుకువచ్చింది ముంబై ఇండియన్స్. ఇక ఆదివారం నాటి సీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌లోకి రావడం జట్టుకు మరో శుభసూచకం.రోహిత్- సూర్య ధనాధన్చెన్నై విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 19 బంతుల్లో 24 పరుగులు చేసి నిష్క్రమించగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 33 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్.. మొత్తంగా 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.రోహిత్‌కు తోడుగా సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగా ముంబై 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెపాక్‌లో చెన్నై చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆకాశ్ అంబానీల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం.. సూర్య ధనాధన్ ఇన్నింగ్స్ చూసి వారు ఖుషీ అయ్యారు.రెండు జెడల సీతలాఇక నీతా- ఆకాశ్‌లకు తోడు ఈసారి అంబానీల కొత్త కోడలు రాధికా మర్చంట్ (Radhika Merchant) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భర్త అనంత్ అంబానీతో కలిసి మ్యాచ్‌ను వీక్షించిన రాధికా.. రెండు జెడల సీతలా ముంబై జెర్సీలో తళుక్కుమన్నారు. రోహిత్ శర్మ ఫిఫ్టీ పూర్తి చేసుకోగానే కరతాళ ధ్వనులతో అనంత్- రాధికా తమ మాజీ కెప్టెన్‌ను అభినందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ధోని విఫలంకాగా వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు ఆయుశ్ మాత్రే 32 పరుగులతో ఆకట్టుకున్నాడు.మరోవైపు.. రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్), శివం దూబే (32 బంతుల్లో 50) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్ ధోని 4 పరుగులకే పరిమితమయ్యాడు.ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు, అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్ ఒక్కో వికెట్ తీశారు. ముంబై సీఎస్కే విధించిన లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.చదవండి: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. నాకు దక్కిన అరుదైన గౌరవం: రోహిత్ శర్మA perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025 "Anant Ambani and Radhika Merchant" cheering for his captain Rohit Sharma ✊🔥.#CSKvsMI #RohitSharma pic.twitter.com/09vXEKgmxR— Aniket 𝕏 (@ImAniket264) April 20, 2025 -
CSK Vs MI: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్ సందర్భంగా.. చాలా కాలం తర్వాత హిట్‌మ్యాన్ బ్యాట్ ఝులిపించాడు. సొంత మైదానం వాంఖడేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 45 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.చాలా కాలం తర్వాత ఇలానాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో అజేయ అర్ద శతకంతో జట్టును గెలిపించిన రోహిత్ శర్మను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం తర్వాత నేను ఇక్కడ నిలుచోగలిగాను. ఫామ్‌లేమి కారణంగా ఒక్కోసారి మనపై మనకే సందేహం కలుగుతుంది. మన పంథాను మార్చుకునేలా చేస్తుంది. కానీ అలాంటపుడే సంయమనంతో ఉండాలి. లేదంటే ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. నా వరకు ఈరోజు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆడాలని ముందే నిర్ణయించుకున్నా. మా ప్రణాళికల ప్రకారమే నా ఇన్నింగ్స్ కొనసాగించాను.బంతి నా ఆధీనంలోకి వచ్చినప్పుడు బౌండరీకి తరలించాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. ఫీల్డింగ్ వేళ చివరి 2-3 ఓవర్లలో వచ్చినా.. నేరుగా బ్యాటింగ్‌కే దిగినా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నాడు.నాకు దక్కిన అరుదైన గౌరవంఅదే విధంగా.. వాంఖడేలో కొత్తగా తన పేరిట ఏర్పాటు చేసిన స్టాండ్ గురించి కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘రోహిత్ శర్మ స్టాండ్‌లోకి బంతిని తరలించడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. నాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. ఆ పేరును పలికినప్పుడల్లా ఎలా స్పందించాలో కూడా నాకు తెలియడం లేదు.ఏదేమైనా ఈరోజు చివరి వరకు నిలిచి మ్యాచ్‌ను విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. నా బాధ్యత కూడా అది. సరైన సమయంలో మేము గెలుపు బాట పట్టాము. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచాం’’ అని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెపాక్‌లో చెన్నై చేతిలో ఓడిన తాజా గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ముంబై ఎనిమిదింట నాలుగు మ్యాచ్‌లలో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు రోహిత్ శర్మ.. ఏడు ఇన్నింగ్స్ ఆడి 158 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ చెన్నై స్కోర్లుటాస్: ముంబై.. తొలుత బౌలింగ్చెన్నై స్కోరు: 176/5 (20)ముంబై స్కోరు: 177/1 (15.4)ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసిన ముంబై.చదవండి: IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి A perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
IPL 2025 GT Vs KKR: టైటాన్స్ జోరు సాగేనా!
కోల్‌కతా: ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో పోరుకు సిద్ధమైంది. కేకేఆర్ జట్టు లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు 259 మ్యాచ్‌లాడగా... అందులో మూడుసార్లు మాత్రమే గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. షెడ్యూల్ కారణంగా ఇరు జట్ల మధ్య తక్కువ మ్యాచ్‌లు జరగగా... సోమవారం పోరులో అటు కేకేఆర్, ఇటు గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్లే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగనున్నాయి. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు కోల్‌కతాకు అందుబాటులో ఉండగా... గుజరాత్ తరఫున రషీద్ ఖాన్, సాయికిషోర్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత సీజన్లో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 2 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గతంలో కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించిన గిల్... తన పాత జట్టుపై విజృంభించాలని చూస్తుంటే... విండీస్ ద్వయం రసెల్, నరైన్ సమష్టిగా కదంతొక్కి జట్టును గెలుపు బాట పట్టించాలని కోల్‌కతా మేనేజ్మెంట్ భావిస్తోంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పించిన అనంతరం తిరిగి కేకేఆర్ గూటికి చేరిన అభిషేక్ నాయర్ ఈ మ్యాచ్‌లో డగౌట్ నుంచి కోల్‌కతా ప్లేయర్లకు సలహాలు ఇవ్వనున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో విజయంతో గుజరాత్ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందా... లేక సొంతగడ్డపై కోల్‌కతా విజయ దరహాసం చేస్తుందా చూడాలి! నిలకడ లేమి సమస్య... డిఫెండింగ్ చాంపియన్‌గా సీజన్ ఆరంభించిన కోల్‌కతా... స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతోంది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కేకేఆర్... 95 పరుగులకే కుప్పకూలింది. బ్యాటర్లు ముకుమ్మడిగా విఫలమవడంతో కోల్‌కతా మూల్యం చెల్లించుకుంది. అయితే అభిõÙక్ నాయర్ రాకతో జట్టులో జవసత్వం నిండుతుందని యాజమాన్యం ఆశిస్తోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకపై ఆడనున్న అన్నీ మ్యాచ్‌లు కీలకమైన నేపథ్యంలో... ప్లేయర్లంతా సమష్టిగా సత్తా చాటాలని చూస్తున్నారు. ముఖ్యంగా వేలంలో రూ. 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ కనీస ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. ఈ సీజన్లో వెంకటేశ్ 24.20 సగటుతో 121 పరుగులు చేయగా... రమణ్‌దీప్ కేవలం 29 పరుగులే చేశాడు. హిట్టర్లుగా పేరున్న రసెల్ 5 మ్యాచ్‌ల్లో 34 పరుగులకే పరిమితం కాగా... రింకూ సింగ్ 38.66 సగటుతో 116 పరుగులు చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే 2 అర్ధశతకాల సాయంతో 221 పరుగులు చేయగా... 20 ఏళ్ల రఘువంశీ 170 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు సునీల్ నరైన్, డికాక్ కొన్ని మెరుపులు మెరిపిస్తున్నా... నిలకడగా జట్టుకు శుభారంభం అందించలేకపోతున్నారు. ఈ లోపాలన్నీ సరిద్దిద్దుకుంటేనే కేకేఆర్ తిరిగి గెలుపు పట్టాలెక్కనుంది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్‌లో ఉన్నారు. అన్నీ రంగాల్లో పటిష్టంగా... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. టాప్–3 ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ చక్కటి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి రానుంది. రూథర్‌ఫార్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా రూపంలో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో శతకానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయిన బట్లర్ ఈ సీజన్లో 63.00 సగటుతో 315 పరుగులు చేయగా... సాయి సుదర్శన్ 365 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. బౌలింగ్‌లోనూ గుజరాత్‌కు ఇబ్బందులు లేవు. సీనియర్ పేసర్ ప్రసిధ్ కృష్ణ తాజా సీజన్లో 14 వికెట్లు పడగొట్టి దూకుడు మీద ఉండగా... హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ అతడికి చక్కటి సహకారం అందిస్తున్నారు. తమిళనాడు స్పిన్నర్ సాయి కిషోర్ తనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుండగా... రషీద్ ఖాన్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తుది జట్లు (అంచనా) కోల్‌కతా నైట్ రైడర్స్: రహానే (కెప్టెన్), నరైన్, డికాక్, వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ, రింకూ సింగ్, రసెల్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, నోర్జే, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. గుజరాత్ టైటాన్స్: గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, రూథర్‌ఫర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ. -
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. పంజాబ్ కింగ్స్‌తో పోరులో కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఊర మాస్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్‌పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్... తనను ‘హిట్‌మ్యాన్’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్... ఫోర్... ముంబై ఇన్నింగ్స్ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ, టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్‌ల ఆట మ్యాచ్‌లో హైలైట్స్‌ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్‌గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (20 బంతుల్లో 19; 1 ఫోర్)కు ఓపెనింగ్‌లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్‌ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్ బాయ్’ ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సిక్స్‌లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేసిన రికెల్టన్ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్ నుంచి రోహిత్ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్ ఓవర్‌న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. సూర్యకుమార్ రావడం... రోహిత్‌తో కలిసి ధనాధన్ షోను డబుల్ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్‌మ్యాన్’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్‌ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: షేక్ రషీద్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 19; రచిన్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 5; ఆయుశ్ (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 32; జడేజా (నాటౌట్) 53; దూబే (సి) జాక్స్ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్: చహర్ 4–0–32–1, బౌల్ట్ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్ జాక్స్ 1–0–4–0, హార్దిక్ 2–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) ఆయుశ్ (బి) జడేజా 24; రోహిత్ (నాటౌట్) 76; సూర్యకుమార్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్: ఖలీల్ 2–0–24–0, ఓవర్టన్ 2–0– 29–0, అశ్విన్ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్‌పూర్: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్‌కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్ ఇన్‌గ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) వికెట్‌ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్‌కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్ కోహ్లి, పడిక్కల్ నడిపించారు. వన్‌డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్ షాట్లతో ముల్లాన్‌పూర్ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 22; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 33; అయ్యర్ (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 6; ఇన్‌గ్లిస్ (బి) సుయశ్ 29; నేహల్ (రనౌట్) 5; శశాంక్ (నాటౌట్) 31; స్టొయినిస్ (బి) సుయశ్ 1; యాన్సెన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–0, యశ్ దయాళ్ 2–0–22–0, హాజల్‌వుడ్ 4–0–39–0, కృనాల్ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్ 2–0–18–1, సుయశ్ 4–0–26–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్) 73; పడిక్కల్ (సి) నేహల్ (బి) హర్‌ప్రీత్ 61; పాటీదార్ (సి) యాన్సెన్ (బి) చహల్ 12; జితేశ్ శర్మ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్ 3–0–28–1, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–27–1, యాన్సెన్ 3–0–20–0, చహల్ 4–0–36–1, స్టొయినిస్ 1–0–13–0, నేహల్ 0.5–0–9–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X గుజరాత్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs MI: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ఆది నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ సీజన్లో తొలిసారి సామర్థ్యం మేరకు సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్) కూడా పర్వాలేదనిపించాడు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. -
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్ ఛేదనలో అద్భుతమైన హాఫ్ సెంచరీతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అదరగొట్టి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో విరాట్‌కు ఇది మూడో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఓవరాల్‌గా 19వది.ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో విరాట్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. రోహిత్ కూడా ఐపీఎల్లో ఇప్పటివరకు 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. విరాట్, రోహిత్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు క్రిస్ గేల్ (22) పేరిట ఉంది. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, రోహిత్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)19 - రోహిత్ శర్మ (263 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్‌లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్‌లు)ఈ మ్యాచ్‌లో విరాట్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)ఐపీఎల్లో విరాట్ పేరిట ఉన్న రికార్డు..అత్యధిక పరుగులుఅత్యధిక శతకాలుఅత్యధిక 50 ప్లస్ స్కోర్లుఅత్యధిక బౌండరీలుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశారు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్‌దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ చేసి ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్‌ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆయుశ్ మాత్రే సీఎస్కే తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. మాత్రే ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మాత్రే 17 ఏళ్ల 278 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు. మాత్రేకు ముందు ఈ రికార్డు అభినవ్ ముకుంద్ పేరిట ఉండేది. ముకుంద్ 18 ఏళ్ల 139 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు.ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కులైన ఆటగాళ్ళు17y 278d - ఆయుశ్ మాత్రే vs MI, వాంఖడే, 2025*18y 139d - అభినవ్ ముకుంద్ vs RR, చెన్నై, 200819y 123d - అంకిత్ రాజ్‌పూత్ vs MI, చెన్నై, 201319y 148d - మతీష పతిరన vs GT, వాంఖడే, 202220y 79d - నూర్ అహ్మద్ vs MI, చెన్నై, 2025మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే 16 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి రచిన్ రవీంద్ర (5) ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్‌లోనే ఇరగదీశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. #RRvLSG: 14-year-old Vaibhav Suryavanshi's first three balls vs LSG on IPL debut: 𝐒𝐈𝐗, 1 RUN, 𝐒𝐈𝐗,#MIvCSK: 17-year-old Ayush Mhatre's first four balls vs MI on IPL debut: 1 RUN, 𝗙𝗢𝗨𝗥, 𝐒𝐈𝐗, 𝐒𝐈𝐗,WHAT A WAY TO ANNOUNCE YOUR ARRIVAL! | 📸: JioStar pic.twitter.com/WRVTwqEt2f— CricTracker (@Cricketracker) April 20, 20256.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్‌కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) ఎలా రెచ్చిపోయాడో, ఈ మ్యాచ్‌లో ఆయుశ్ మాత్రే కూడా అలాగే ఇరగదీశాడు. సూర్యవంశీ తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. -
పడిక్కల్ విధ్వంసం, సత్తా చాటిన విరాట్.. పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పంజాబ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ వికెట్లు తీయకపోయినా.. పొదుపుగా బౌలింగ్ చేశారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్‌దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్‌ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2025: సీఎస్కేపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
సీఎస్కేపై ముంబై ఇండియన్స్ ఘన విజయంచెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ముంబై 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ముంబైని విజయతీరాలకు చేర్చారు. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.సూర్యకుమార్ హాఫ్ సెంచరీస్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/1గా ఉంది.టార్గెట్ 177.. 13 ఓవర్లలో ముంబై స్కోర్ 127/1రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మరోహిత్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్ 32 పరుగులతో (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా ఉన్నాడు. 12 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 112/1గా ఉంది. టార్గెట్ 177.. 9 ఓవర్లలో ముంబై స్కోర్ 88/1రోహిత్ శర్మ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 14; ఫోర్, సిక్స్)తొలి వికెట్ కోల్పోయిన ముంబై6.4వ ఓవర్- 63 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఆయుశ్ మాత్రేకు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ (24) ఔటయ్యాడు.టార్గెట్ 177.. 6 ఓవర్లలో ముంబై స్కోర్ 62/0రోహిత్ శర్మ (18 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రికెల్టన్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్)టార్గెట్ 177.. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ177 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. 3 ఓవర్లలో ముంబై స్కోర్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులుగా ఉంది. రోహిత్ 10 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేశాడు. రికెల్టన్ 8 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 11 పరుగులు చేశాడు. రాణించిన దూబే, జడేజా.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన సీఎస్కేటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే గౌరవప్రమదై స్కోర్ చేసింది. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. ధోని ఔట్18.4వ ఓవర్- 156 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ధోని (4) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. దూబే ఔట్16.2వ ఓవర్- 142 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న దూబేఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శివమ్ దూబే అదరగొడుతున్నాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. దూబేకు జతగా రవీంద్ర జడేజా (19) క్రీజ్‌లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 118/3గా ఉంది.మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే7.6వ ఓవర్- 63 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో షేక్ రషీద్ (19) స్టంపౌటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 66/3గా ఉంది. రవీంద్ర జడేజా (6), శివమ్ దూబే (1) క్రీజ్‌లో ఉన్నారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔటైన ఆయుశ్ మాత్రేఅరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్‌లోనే అదరగొట్టాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్‌కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే3.1వ ఓవర్- 16 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ తన స్పెల్ తొలి బంతికే రచిన్ రవీంద్ర (9 బంతుల్లో 5) వికెట్ తీశాడు. ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో 11 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. రషీద్‌కు జతగా అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే క్రీజ్‌లోకి వచ్చాడు.ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మ్హత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, MS ధోని(కెప్టెన్/వికెట్‌కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణఇంపాక్ట్ సబ్‌లు: అన్షుల్ కాంబోజ్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, సామ్ కర్రాన్, రవిచంద్రన్ అశ్విన్ -
PBKS VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో భారీ రికార్డు సొంతం
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (73) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. జితేశ్ శర్మ (11) సిక్సర్ బాది మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (61) మెరుపు అర్ద సెంచరీ చేయగా.. సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్‌ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పంజాబ్‌ను కిందికి దించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి. -
PBKS VS RCB: యువరాజ్ సింగ్‌ను అధిగమించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. పంజాబ్ హోం గ్రౌండ్ ముల్లాన్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. పంజాబ్, ఆర్సీబీ రెండు రోజుల కిందటే బెంగళూరులో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది.ఇవాళ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంది. కృనాల్ పాండ్యా (4-0-25-2), సుయాశ్ శర్మ (4-0-26-2), రొమారియో షెపర్డ్ (2-0-18-1) చెలరేగడంతో పంజాబ్ 18 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 22, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 33, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1 పరుగు చేసి ఔట్ కాగా.. శశాంక్ సింగ్ 25, జన్సెన్ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆ ఫ్రాంచైజీ దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ రికార్డును అధిగమించాడు. యువరాజ్ పంజాబ్ కింగ్స్ తరఫున 959 పరుగులు (51 మ్యాచ్‌ల్లో) చేయగా.. ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ యువీ పరుగుల సంఖ్యను దాటేశాడు. ప్రభ్‌సిమ్రన్ పంజాబ్ తరఫున 42 మ్యాచ్‌ల్లోనే 965 పరుగులు చేశాడు. సగటు, స్ట్రయిక్రేట్లోనూ ప్రభ్‌సిమ్రన్ యువరాజ్ కంటే మెరుగ్గా ఉన్నాడు. పంజాబ్ తరఫున యువీ యావరేజ్ 22.30గా ఉండగా.. ప్రభ్‌సిమ్రన్ యావరేజ్ 22.97గా ఉంది. యువీ స్ట్రయిక్‌రేట్ 127.86గా ఉండగా.. ప్రభ్‌సిమ్రన్ స్ట్రయిక్‌రేట్ 150.55గా ఉంది.టాప్‌లో కేఎల్ రాహుల్.. 12వ స్థానంలో ప్రభ్సిమ్రన్ఐపీఎల్లో పంజాబ్ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ (2548) ఉన్నాడు. అతడి తర్వాత షాన్ మార్ష్ (2477), డేవిడ్ మిల్లర్ (1974), మయాంక్ అగర్వాల్ (1513), మ్యాక్స్‌వెల్ (1424), క్రిస్ గేల్ (1339), వృద్దిమాన్ సాహా (1190), మనన్ వోహ్రా (1106), మన్దీప్ సింగ్ (1073), కుమార సంగక్కర (1009), శిఖర్ ధవన్ (985) ఉన్నారు. ప్రభ్‌సిమ్రన్ ప్రస్తుతం పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 12వ స్థానంలో ఉన్నాడు.ప్రభ్‌సిమ్రన్ ప్రస్తానం ఇలా..2019 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ప్రభ్‌సిమ్రన్ 2023, 2024 సీజన్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 358 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్.. 2024 సీజన్లోనూ 14 మ్యాచ్‌ల్లో 334 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ 2023 సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు పంజాబ్ ప్రభ్‌సిమ్రన్‌ను రూ. 4 కోట్లకు రీటైన్ చేసుకుంది. ప్రస్తుత సీజన్లో ప్రభ్‌సిమ్రన్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేస్తూ పంజాబ్‌కు శుభారంభాలు అందిస్తున్నాడు.ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్, ఢిల్లీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఊహించని పేరు!.. జట్టులో చోటే లేదే!
ఐపీఎల్-2025 (IPL 2025) సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో తొలిసారి కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు రజత్ పాటిదార్ (Rajat Patidar). విశేష ఆదరణ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు సారథిగా ఎంపికైన అతడు.. తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు.రజత్ పాటిదార్ సారథ్యంలో సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. అనంతరం.. చెన్నై సూపర్ కింగ్స్‌ను 2008 తర్వాత తొలిసారి చెపాక్‌లో ఓడించింది.సొంత మైదానంలో ఇంత వరకు గెలవలేదుఅయితే, ఇతర వేదికలపై సత్తా చాటిన ఆర్సీబీ సొంత మైదానంలో మాత్రం తేలిపోతోంది. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన పాటిదార్ సేన.. తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్‌ను ఓడించి తిరిగి గెలుపు బాట పట్టింది.తర్వాత మళ్లీ పాత కథే. చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. అనంతరం జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఆఖరిగా.. మరలా చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.ఈ క్రమంలో ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచి.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగింట గెలిచింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప రజత్ పాటిదార్ గురించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా రాణిస్తున్న పాటిదార్ పేరు.. టీమిండియా కెప్టెన్సీ రేసులోనూ వినిపిస్తుందని అంచనా వేశాడు.టీమిండియా కెప్టెన్సీ రేసులో‘‘ఆర్సీబీ బ్యాటింగ్ విషయంలో రజత్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ముచ్చటేస్తోంది. నాయకుడిగా గొప్ప పరిణతి కనబరుస్తున్నాడు. సొంతగడ్డపై ఎలా గెలవాలన్న అంశంపై అతడు మరింత దృష్టి సారించాల్సి ఉంది.ఒకవేళ పాటిదార్ ఇలాగే తన విజయపరంపరను కొనసాగిస్తే.. త్వరలోనే టీమిండియా క్రికెట్ కెప్టెన్ గురించి జరిగే చర్చల్లో ముందుగా అతడి పేరే వినిపిస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.జట్టులో చోటే లేదే!కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల రజత్ పాటిదార్ 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. గతేడాది టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. కానీ టీ20లలో మాత్రం అతడికి ఇంత వరకు భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇక మూడు టెస్టుల్లో 63, ఒక వన్డేలో 22 పరుగులు చేశాడు పాటిదార్.అయితే, ఐపీఎల్లో కూడా ఇప్పటికి 34 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏకంగా 1008 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టీమిండియాలో చోటుకే నోచుకోవడం లేని పాటిదార్ పేరు కెప్టెన్సీ రేసులో ఊహించడమే కష్టం. అలాంటిది రాబిన్ ఊతప్ప మాత్రం ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.చదవండి: Vaibhav Suryavanshi: యువీ- లారా కలిస్తే అతడు.. చిన్న పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు -
IPL 2025: పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయం
పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయం18.5వ ఓవర్- నేహల్ వధేరా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన జితేశ్ శర్మ (11) మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ16.4వ ఓవర్- 143 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి పాటిదార్ (12) ఔటయ్యాడు.హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లివిరాట్ 43 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 15 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 122/2గా ఉంది. విరాట్ (50), పాటిదార్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలంటే 30 బంతుల్లో 36 పరుగులు చేయాలి. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ12.3వ ఓవర్- 109 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ (61) ఔటయ్యాడు. లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న ఆర్సీబీ158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. 9 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టానికి 75 పరుగులుగా ఉంది. విరాట్ (35), పడిక్కల్ (38) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలంటే 66 బంతుల్లో మరో 83 పరుగులు చేయాలి. ధాటిగా ఆడుతున్న కోహ్లి, పడిక్కల్ఛేదనలో ఆర్సీబీ ఆదిలోనే సాల్ట్ వికెట్ కోల్పోయినప్పటికీ ధాటిగానే ఆడుతుంది. విరాట్ (31), పడిక్కల్ (22) బ్యాట్ ఝులిపిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 54/1గా ఉంది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీ158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ చివరి బంతికి అర్షదీప్‌సింగ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జోస్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (1) ఔటయ్యాడు. విజృంభించిన ఆర్సీబీ బౌలర్లు.. పంజాబ్ స్కోరెంతంటే?ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (31 నాటౌట్), మార్కో యాన్సెన్ (25 నాటౌట్) ఓ మోస్తరుగా పరుగులు రాబట్టారు.మిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6), నేహాల్ వధేరా (5 రనౌట్), మార్కస్ స్టొయినిస్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. పేసర్ రొమారియో షెఫర్డ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.పదహారు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 129-6యాన్సెన్ 11, శశాంక్ 19 పరుగులతో ఉన్నారు. మరోవైపు.. ఆర్సీబీ స్పిన్నర్ సూయశ్ శర్మ స్థానంలో బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ సబ్‌గా వచ్చాడు.ఆరో వికెట్ డౌన్13.5: సూయశ్ శర్మ బౌలింగ్‌లో స్టొయినిస్ (1) బౌల్డ్. మార్కో యాన్సెన్ క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 114-6(14). శశాంక్ సింగ్ 15 పరుగులతో ఉన్నాడు.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్13.2: సూయశ్ శర్మ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ (29) బౌల్డ్ అయ్యాడు. మార్కస్ స్టొయినిస్ క్రీజులోకి వచ్చాడు. శశాంక్ 14 పరుగులతో ఉన్నాడు. పంజాబ్ స్కోరు: 112/5 (13.2) .సెంచరీ కొట్టిన పంజాబ్12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసింది. ఇంగ్లిష్ 22, శశాంక్ సింగ్ 9 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్8.6: సూయశ్ శర్మ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్- నేహాల్ వధేరా (5)తో కలిసి సింగిల్ తీశాడు. అయితే, రెండో పరుగు తీసే క్రమంలో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో నేహాల్ వధేరా రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పంజాబ్ స్కోరు: 76/4 (9). శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు.శ్రేయస్ అయ్యర్ అవుట్7.4: రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (6)కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. నేహాల్ వధేరా క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 69/3 (7.5) . జోష ఇంగ్లిస్ ఐదు పరుగులతో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్6.1: ప్రభ్‌సిమ్రన్ (33) రూపంలో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు.పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు: 62-1(6)ప్రభ్‌సిమ్రన్ 33, శ్రేయస్ అయ్యర్ ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్4.2: కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన ప్రియాన్ష్ ఆర్య (22). క్రీజులోకి శ్రేయస్ అయ్యర్.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లుప్రభ్సిమ్రన్ 10 బంతుల్లో 19, ప్రియాన్ష్ ఆర్య 14 బంతుల్లో 22 పరుగులతో ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో పంజాబ్ స్కోరు: 41-0 తొలి ఓవర్లో పంజాబ్ స్కోరు: 2-0కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్. ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్ ఒక్కో పరుగుతో ఉన్నారు.🚨 Toss 🚨@RCBTweets won the toss and elected to bowl against @PunjabKingsIPL in Match 37.Updates ▶️ https://t.co/6htVhCbltp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/gg5M40bjrg— IndianPremierLeague (@IPL) April 20, 2025ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ (PBKS vs RCB) మధ్య ఆదివారం మ్యాచ్ జరుగనుంది. చండీగడ్‌లోని ముల్లన్‌పూర్‌లో గల మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య పంజాబ్ బ్యాటింగ్ చేసింది.తుదిజట్లుపంజాబ్ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: హర్‌ప్రీత్ బ్రార్, విజయ్‌కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్గే, గ్లెన్ మాక్స్వెల్, ప్రవీణ్ దూబేఆర్సీబీఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సూయశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భండాగే, జేకబ్ బెతెల్, స్వప్నిల్ సింగ్.ప్రతీకారం తీర్చుకోవాలనికాగా ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో తలపడ్డ పంజాబ్ సొంతమైదానంలోనే వారిని ఓడించింది. వర్షం వల్ల పద్నాలుగు ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ను వారి సొంత గడ్డపై ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. -
మటన్, పిజ్జా అంటే ఇష్టం.. చిన్న పిల్లాడు.. కానీ పాపం..
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించే చర్చ. దేశవాళీ క్రికెట్లో అద్భుతాలు చేసిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)నూ తాజాగా అడుగుపెట్టాడు. ఐపీఎల్-2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (RR vs LSG)తో శనివారం (ఏప్రిల్ 19) నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు.తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడుతద్వారా అత్యంత పిన్న వయసులో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. అంతేకాదు.. రాయల్స్ ఓపెనర్‌గా తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు ఈ చిచ్చరపిడుగు. లక్నో పేసర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బంతిని బలంగా బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటిచెప్పాడు.ఈ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 34 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఎదుర్కొన్న తీరు అమోఘమంటూ మాజీ క్రికెటర్లు వైభవ్ నైపుణ్యాలను కొనియాడుతున్నారు.మటన్, పిజ్జా అంటే ఇష్టం.. చిన్న పిల్లాడు.. కానీ పాపం.. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ వ్యక్తిగత కోచ్ మనీశ్ ఓజా ఈ టీనేజర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘తనకి చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లాడు కదా.. సహజంగానే పిజ్జా అంటే కూడా మక్కువ ఎక్కువే. కానీ ఇకపై అతడు వాటిని తినబోడు.ఇక్కడికి రాగానే మటన్‌తో పాటు పిజ్జా అతడి డైట్ చార్ట్ నుంచి ఎగిరిపోయింది. మేమైతే అతడికి తరచుగా మటన్ పెట్టేవాళ్లం. ఎంత పెట్టినా సరే అంతా తినేసేవాడు. అందుకే తను కాస్త బొద్దుగా కనిపిస్తాడు. అయితే, ఇప్పుడు తనకు ఇష్టమైన ఆహారాన్ని అతడు సంతోషంగానే వదులుకున్నాడు.యువీ- యువీ కలిస్తే అతడువైభవ్కు సుదీర్ఘమైన కెరీర్ ఉంది. అతడు ఈరోజు ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు చూశారు కదా!.. భవిష్యత్ కాలంలో అతడు ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు. తను ఫియర్లెస్ బ్యాటర్.అతడికి బ్రియన్ లారా ఆరాధ్య క్రికెటర్. అయితే, లారా- యువరాజ్ సింగ్ కలిస్తే ఎలా ఉంటుందో.. వైభవ్ అలాంటి ఆటగాడు. యువీలా దూకుడుగా ఆడటం తన శైలి.‘బంతి సిక్సర్ కొట్టేందుకు ఆస్కారం ఇస్తే నేనెందుకు సింగిల్ తీయాలి?.. సిక్సే కొడతా’ అని వైభవ్ చెబుతూ ఉంటాడు. ప్రాక్టీస్ సెషన్లో మేము 4 ఓవర్లలో 40 పరుగులు.. ఆరు ఓవర్లలో 60 పరుగులు చేయాలని ఆటగాళ్ల మధ్య పోటీలు పెట్టేవాళ్లం.వైభవ్ అయితే.. ఇంకొన్ని బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసేవాడు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో మనీశ్ ఓజా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. లక్నోతో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాజస్తాన్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. కాగా మెగా వేలం-2025లో రాజస్తాన్ 1.1 కోట్లకు బిహార్ కుర్రాడు వైభవ్‌ను కొనుగోలు చేసింది.చదవండి: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్ 𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025 -
నరాలు తెగే ఉత్కంఠ: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ మరోసారి దురదృష్టకర రీతిలో ఓటమి పాలైంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సరిసమానంగా స్కోరు చేసినా సంజూ సేన సూపర్ ఓవర్లో బోల్తా పడిన విషయం తెలిసిందే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది.ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ (Avesh Khan) తన అద్భుత బౌలింగ్ నైపుణ్యాలతో లక్నోకు విజయం అందించాడు. ఫలితంగా రాజస్తాన్ మరోసారి ఓటమి భారంతో తలదించుకోవాల్సి వచ్చింది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్- లక్నో (RR vs LSG) జట్ల మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరిగింది.180 పరుగులుసొంత మైదానంలో టాస్ ఓడిన రాజస్తాన్ తొలుత బౌలింగ్‌కు దిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (45 బంతుల్లో 66)తో పాటు ఆయుశ్ బదోని (34 బంతుల్లో 50), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్) రాణించారు.రాజస్తాన్ బౌలర్లలో వనిందు హసరంగ రెండు, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్నో విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ తమ ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది.దంచికొట్టిన ఓపెనర్లుఓపెనర్ యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74) బ్యాట్ ఝులిపించగా.. అతడికి జోడీగా వచ్చిన అరంగేట్ర ఆటగాడు, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా దుమ్ములేపాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, ఓపెనర్లు శుభారంభం అందించినా రాజస్తాన్ అదే జోరునుకొనసాగించలేకపోయింది. నితీశ్ రాణా (8) విఫలం కాగా.. కెప్టెన్ రియాన్ పరాగ్ (26 బంతుల్లో 39) ఫర్వాలేదనిపించాడు. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి కేవలం తొమ్మిది పరుగులే అవసరమయ్యాయి.ఆఖరి ఓవర్లో హైడ్రామాఈ క్రమంలో బంతితో రంగంలోకి దిగిన లక్నో పేసర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో తొలి బంతికి ధ్రువ్ జురెల్ సింగిల్ తీశాడు. అనంతరం షిమ్రన్ హెట్మెయిర్ జురెల్‌తో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. ఫలితంగా రాజస్తాన్ విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 6 గా మారింది.సరిగ్గా అప్పుడే ఆవేశ్ ఖాన్ తన నైపుణ్యాలకు మెరుగుపెట్టి మూడో బంతికి హెట్మెయిర్ (12)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ మరుసటి బంతికి పరుగులేమీ ఇవ్వకుండా డాట్ చేశాడు. అనంతరం శుభమ్ దూబే రెండు పరుగులు తీయగా.. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ దూబే ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు.ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా సంబరాలుఫలితంగా రాజస్తాన్ విజయానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నపిల్లాడిలా గంతులేస్తూ ఆయన స్టేడియంలో సందడి చేశారు. మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ శిబిరంలో ప్రతి ఒక్కరి ముఖాలు నిరాశతో వెలవెలబోయాయి.రాజస్తాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే ఎలాంటి స్పందనా లేకుండా.. అలాగే చూస్తూ ఉండిపోయాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం నెత్తికి చేతులు పెట్టుకుని నిరాశను వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్ కూడా బేలగా చూస్తూ అలా ఉండిపోయాడు.Heart-racing, nerve-wracking, and simply unforgettable! 🤯#LSG defy the odds and seal a 2-run victory over #RR after the most dramatic final moments 💪Scorecard ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/l0XsCGGuPg— IndianPremierLeague (@IPL) April 19, 2025ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. ‘‘ద్రవిడ్ హృదయాన్ని ఆవేశ్ ముక్కలు చేశాడు.. గోయెంకానేమో తొలిసారి చిన్నపిల్లాడిలా గంతులేస్తున్నారు.. ఇలాంటి దృశ్యాలు అరుదు’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నాయి.చదవండి: IPL 2025: శుబ్‌మన్ గిల్‌కు భారీ షాక్! -
అశుతోష్‌పై మండిపడ్డ ఇషాంత్ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్
గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) సహనం కోల్పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ (Ashuthosh Sharma)కు వేలు చూపిస్తూ మైదానంలోనే వార్నింగ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్‌తో పాటు.. టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే..ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (GT vs DC) మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన టైటాన్స్.. ఢిల్లీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అశుతోష్ శర్మ ధనాధన్‌ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (9 బంతుల్లో 18), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31) వేగంగా ఆడగా.. కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 28) కాసేపు మెరుపులు మెరిపించాడు.ఇక అక్షర్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (21 బంతుల్లో 31)తో మెరవగా.. ఢిల్లీ నయా ఫినిషర్ అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37) ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు. అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పందొమ్మిదో ఓవర్లో గుజరాత్ పేసర్ ఇషాంత్ శర్మ బంతితో బరిలోకి దిగాడు.అప్పటికి డొనొవన్ ఫెరీరా, అశుతోష్ క్రీజులో ఉన్నారు. ఇషాంత్ బౌలింగ్‌లో తొలి బంతిని ఎదుర్కొన్న అశుతోష్ సింగిల్ తీయగా.. మరుసటి బంతికి ఫెరీరా రన్ పూర్తి చేశాడు. మూడో బంతికి మళ్లీ అశుతోష్ సింగిల్ తీయగా.. నాలుగో బంతికి ఫెరీరా సాయి కిషోర్‌కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.వేలు చూపిస్తూ వార్నింగ్ఫెరీరా స్థానంలో వచ్చిన మిచెల్ స్టార్క్ సింగిల్ తీయగా.. అశుతోష్ మళ్లీ స్ట్రైక్‌లోకి వచ్చాడు. అయితే, ఆఖరి బంతిని ఇషాంత్ వైడ్‌గా వేయగా.. అశుతోష్‌కు మరో బంతి ఆడే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో ఇషాంత్ సంధించిన బౌన్సర్‌ను అశుతోష్ ఎదుర్కోలేకపోయాడు.ఇక బంతి వెళ్లి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లో పడింది. ఈ క్రమంలో బంతి అశుతోష్ గ్లోవ్స్‌ను తాకిందని భావించిన గుజరాత్ ఆటగాళ్లు బిగ్గరగా అవుట్‌కి అప్పీలు చేశారు. అయితే, అంపైర్ నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. ఇంతలో అశుతోష్ బంతి భుజాన్ని రాసుకుని వెళ్లిందన్నట్లుగా సైగ చేశాడు. అశుతోష్ శర్మ చర్యను సహించలేకపోయిన ఇషాంత్ శర్మ అతడి దగ్గరికి వెళ్లి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపించింది. తర్వాత అశుతోష్ తన షర్టును పైకెత్తి బంతి భుజానికి తాకిందని అంపైర్‌కు చెప్పే ప్రయత్నం చేశాడు.Battle b/w ishant sharma vs ashutosh Sharma 🤣 pic.twitter.com/EMd12Z2o7V— Daigo18 (@daigo2637391027) April 19, 2025ఇరగదీసిన బట్లర్ఇంతలో అంపైర్‌తో పాటు గిల్ జోక్యం చేసుకుని ఇషాంత్‌ను పక్కకు తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.2 ఓవర్లలో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జోస్ బట్లర్ (54 బంతుల్లో 97 నాటౌట్), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (34 బంతుల్లో 43), రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 11 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: IPL 2025: శుబ్‌మన్ గిల్‌కు భారీ షాక్! Right off the middle! 💥#AshutoshSharma hits the accelerator and launches a stunning SIX over the square boundary!Watch the LIVE action ➡ https://t.co/6YcPaJPTHV#IPLonJioStar 👉 #GTvDC | LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar! pic.twitter.com/TpSfdehCwX— Star Sports (@StarSportsIndia) April 19, 2025 -
శుబ్‌మన్ గిల్‌కు భారీ షాక్!
గెలుపు సంబరంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా.. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు శిక్ష విధించింది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ పాలక మండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ గిల్‌కు జరిమానా విధించినట్లు తెలిపింది. ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్లో అతడు మొదటిసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు రూ. 12 లక్షలతో సరిపెట్టినట్లు పేర్కొంది.ఢిల్లీ భారీ స్కోరుకాగా ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ వేదికగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (32 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. జోస్ ది బాస్.. దంచేశాడులక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ దంచికొట్టాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కేవలం 54 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.మరోవైపు.. బట్లర్‌కు తోడుగా షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (34 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. ఆఖర్లో తెవాటియా మూడు బంతుల్లో 11 పరుగులతో అజేయంగా నిలిచి బట్లర్‌తో కలిసి గుజరాత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. THE CELEBRATION FROM JOS BUTTLER. - Buttler was on 97*, but the happiness after Tewatia finished the match. 👏❤️ pic.twitter.com/31z4tWPJmL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2025 ఢిల్లీ విధించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ఈ సీజన్లో ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది.ఐపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ ఢిల్లీ👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: గుజరాత్.. మొదట బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 203/8 (20)👉గుజరాత్ స్కోరు: 204/3 (19.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై గుజరాత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్ (గుజరాత్- 54 బంతుల్లో 97 నాటౌట్).చదవండి: IPL 2025: గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్ -
లక్నో ‘సూపర్’ విక్టరీ
జైపూర్: ఆఖరి ఓవర్... ఆఖరి బంతిదాకా ఇరు జట్లతోనూ దోబూచులాడిన విజయం చివరకు లక్నో సూపర్‌జెయింట్స్‌ను వరించింది. రాజస్తాన్ రాయల్స్ 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుతం చేశాడు. 6 పరుగులే ఇచ్చి ప్రమాదకర హిట్టర్ హెట్మైర్ను అవుట్ చేశాడు. దీంతో ఉత్కంఠ రేపిన పోరులో సూపర్‌జెయింట్స్ 2 పరుగులతో అనూహ్యంగా రాయల్స్‌పై గెలిచింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మార్క్రమ్ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుశ్ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, ఆఖరి ఓవర్లో సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్స్‌లు) చెలరేగాడు. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి ఓడింది. యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. మార్క్రమ్, బదోని ఫిఫ్టీ–ఫిఫ్టీ పవర్‌ప్లే ముగియక ముందే హిట్టర్లు మార్ష్ (4), పూరన్ (11), పవర్ ప్లే తర్వాత కెపె్టన్ రిషభ్ పంత్ (3) అవుటవడంతో లక్నో 54 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్ మార్క్రమ్, ఆయుశ్ బదోని సూపర్‌జెయింట్స్ స్కోరు భారాన్ని మోశారు. ఇద్దరు వేగంగా ఆడటంతో జట్టు పరుగుల జోరందుకుంది. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న మార్క్రమ్ నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించాక అవుటయ్యాడు. కాసేపటికి బదోని 33 బంతుల్లో బదోని అర్ధ సెంచరీ చేసిన వెంటనే నిష్క్రమించాడు. సమద్ 4 సిక్సర్లతో... 19 ఓవర్లలో 153/5 వద్ద ఓ మోస్తరు స్కోరు చేసిన లక్నో శిబిరంలో ఆఖరి ఓవర్ ఆనందం నింపింది. సందీప్ వేసిన 20వ ఓవర్లో మిల్లర్ (7 నాటౌట్) సింగిల్ తీసివ్వగా తర్వాత సమద్ 6, 6, 2, 6, 6లతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో సూపర్‌జెయింట్స్ స్కోరు 180కి చేరింది. జైస్వాల్ శ్రమించినా... యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కొత్త కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఇద్దరి ఓపెనర్ల వేగం రాజస్తాన్‌ను లక్ష్యం వైపు నడిపించింది. తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించాక వైభవ్ ఆటను మార్క్రమ్ ముగించగా, నితీశ్ రాణా (8)ను శార్దుల్ పెవిలియన్ చేర్చాడు.తర్వాత జైస్వాల్‌కు జతయిన కెపె్టన్ రియాన్ పరాగ్ రన్‌రేట్ తగ్గకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన జైస్వాల్ దూకుడు పెంచాడు. లక్ష్యానికి చేరువైన దశలో 18వ ఓవర్లో జైస్వాల్, పరాగ్‌లను అవుట్ చేసిన అవేశ్...ఆఖరి ఓవర్లో హెట్‌మైర్ (12)కు చెక్ పెట్టాడు.స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) హెట్‌మైర్ (బి) ఆర్చర్ 4; మార్క్రమ్ (సి) పరాగ్ (బి) హసరంగ 66; నికోలస్ పూరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 11; రిషభ్ పంత్ (సి) జురేల్ (బి) హసరంగ 3; ఆయుశ్ బదోని (సి) దూబే (బి) తుషార్ 50; మిల్లర్ నాటౌట్ 7; సమద్ నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–16, 2–46, 3–54, 4–130, 5–143. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–32–1, తీక్షణ 4–0–32–0, సందీప్ శర్మ 4–0–55–1, తుషార్ దేశ్‌పాండే 4–0–26–1,హసరంగ 4–0–31–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) అవేశ్ 74; వైభవ్ (స్టంప్డ్) పంత్ (బి) మార్క్రమ్ 34; నితీశ్ రాణా (సి) అవేశ్ (బి) శార్దుల్ 8; రియాన్ పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 39; జురేల్ నాటౌట్ 6; హెట్‌మైర్ (సి) శార్దుల్ (బి) అవేశ్ 12; శుభమ్ నాటౌట్ 3 ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–85, 2–94, 3–156, 4–161, 5–175. బౌలింగ్: శార్దుల్ 3–0–34–1, అవేశ్ ఖాన్ 4–0–37–3, దిగ్వేశ్ రాఠి 4–0–30–0, మార్క్రమ్ 2–0–18–1, ప్రిన్స్ 4–0–39–0, రవి బిష్ణోయ్ 3–0–19–0. 14 ఏళ్ల 23 రోజుల వయసులో... ఐపీఎల్ వేలం సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. లీగ్ బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ తన తొలి బంతికే సిక్స్ బాది సంచలన రీతిలో మొదలు పెట్టాడు. ఎక్స్ట్రా కవర్ దిశగా ఆ షాట్‌ను అద్భుతంగా ఆడిన అతని సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చెలరేగిపోతున్న దశలో అనూహ్యంగా స్టంపౌట్ కావడంతో వైభవ్ తట్టుకోలేకపోయినట్లున్నాడు. కన్నీళ్లతో అతను నిష్క్రమించాడు! బిహార్‌కు చెందిన ఈ ప్రతిభాశాలి ఇప్పటికే భారత అండర్–19 జట్టు తరఫున ఆడటంతో పాటు 5 రంజీ మ్యాచ్‌లలో కూడా బరిలోకి దిగాడు. వేలంలో వైభవ్‌ను రాజస్తాన్ రూ.1.10 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్లో నేడుపంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్ ,మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ముంబై X చెన్నై వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో రాయల్స్ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో యశస్వి జైస్వాల్ (74), వైభవ్ సూర్యవంశీ (34), రియాన్ పరాగ్ (39) అద్భుతంగా ఆడినప్పటికీ.. రాయల్స్ ఒత్తిడికి చిత్తై గెలుపు వాకిట బోర్లా పడింది. రాయల్స్ ఈ సీజన్లో ఇలా ఓడటం ఇది రెండో సారి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ రాయల్స్ గెలుస్తుందనుకుంటే సూపర్ వరకు వెళ్లి ఓటమిపాలైంది. ఆవేశ్ ఖాన్ (4-0-37-3) ఒంటిచేత్తో రాయల్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. -
కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి లీగ్‌లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ కెరీర్లో తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి మరో రికార్డు నెలకొల్పాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో తొలి బంతికే (కెరీర్లో) సిక్సర్ బాదిన 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్ కెరీర్లో తొలి బంతికే సిక్సర్ బాదిన ఆటగాళ్లు..రాబ్ క్వినీ (RR)కెవోన్ కూపర్ (RR)ఆండ్రీ రస్సెల్ (KKR)కార్లోస్ బ్రాత్‌వైట్ (DD)అనికేత్ చౌదరి (RCB)జావోన్ సియర్ల్స్ (KKR)సిద్దేష్ లాడ్ (MI)మహేష్ తీక్షణ (CSK)సమీర్ రిజ్వీ (CSK)వైభవ్ సూర్యవంశీ (RR)A VIDEO TO REMEMBER IN IPL HISTORY 👑- ITS VAIBHAV SURYAVANSHI..!!!! pic.twitter.com/ZuKskRWyI7— Johns. (@CricCrazyJohns) April 19, 2025ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ (RR) vs LSG, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్ (RCB) vs SRH, 201917y 11d - ముజీబ్ ఉర్ రెహ్మాన్ (PBKS) vs DC, 201817y 152d - రియాన్ పరాగ్ (RR) vs CSK, 201917y 179d - ప్రదీప్ సాంగ్వాన్ (DC) vs CSK, 2008మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్ ఆది నుంచే దూకుడుగా ఆడుతుంది. తొలి బంతికే సిక్సర్ కొట్టిన సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్ (52), రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు. -
ఢిల్లీపై గుజరాత్ విజయం.. అవకాశం ఉన్నా సెంచరీ పూర్తి చేయలేకపోయిన బట్లర్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 19) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ఆదిలోనే శుభ్‌మన్ గిల్ (7) వికెట్ కోల్పోయినప్పటికీ.. జోస్ బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ (97 నాటౌట్) కారణంగా 19.2 ఓవర్లలో (3 వికెట్ల నష్టానికి) లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 36, రూథర్‌ఫోర్డ్ 43, తెవాతియా 11 పరుగులు (నాటౌట్) చేశారు.ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఢిల్లీని వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.పాపం బట్లర్ఈ మ్యాచ్‌లో బట్లర్‌కు సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా 97 పరుగుల వద్ద అజేయంగా నిలిచిపోయాడు. చివరి రెండు ఓవర్లలో గుజరాత్ గెలుపుకు 15 పరుగులు అవసరమైన తరుణంలో బట్లర్ 96 పరుగుల వద్ద ఉన్నాడు. ఎంత పని చేశావయ్యా తెవాతియా..?అయితే 19వ ఓవర్‌ను ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌల్ చేయడంతో ఆ ఓవర్లో బట్లర్ సెంచరీ కోసం రిస్క్ చేయలేకపోయాడు. చివరి ఓవర్లో అయినా మూడంకెల స్కోర్‌ను అందుకుందామా అంటే తెవాతియా అతనికి అడ్డుపడ్డాడు. జట్టు గెలుపుకు 10 పరుగులు అవసరమైన తరుణంలో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో బట్లర్ చేసేదేమీ లేక జట్టు గెలుపును ఆస్వాదించాడు.విరాట్ రికార్డు సమమయ్యేదిఈ మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ పూర్తి చేసి ఉంటే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేసేవాడు. విరాట్ ఐపీఎల్లో 8 సెంచరీలు చేయగా.. బట్లర్ ఖాతాలో 7 సెంచరీలు ఉన్నాయి. విరాట్ రికార్డును సమం చేసేందుకు బట్లర్‌కు ఇంతకంటే మంచి అవకాశం రాదు. తెవాతియా కారణంగా బట్లర్ చరిత్రలోనే నిలిచిపోయే అవకాశాన్ని కోల్పోయాడు. ఏదిఏమైనా ఈ మ్యాచ్‌లో బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగానే గుజరాత్ గెలిచింది. సెంచరీ పూర్తి చేసుంటే అతని టాలెంట్‌కు తగ్గ గుర్తింపు దక్కేది. -
RR VS LSG: ఐపీఎల్లో సంచలనం
ఐపీఎల్లో సంచలనం నమోదైంది. ఓ కుర్రాడు కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అరంగేట్రం చేయనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సూర్యవంశీకి ముందు ఈ రికార్డు ప్రయాస్ రే బర్మన్ పేరిట ఉండేది. బర్మన్ 2019 సీజన్లో ఆర్సీబీ తరఫున 16 ఏళ్ల 157 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. బర్మన్ తర్వాత ఐపీఎల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడి రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ పేరిట ఉంది. ముజీబ్ 2018 సీజన్లో 17 ఏళ్ల 11 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.అత్యంత పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్, 2019 17వ 11వ తేదీ - ముజీబ్ ఉర్ రెహమాన్, 2018 17y 152d - రియాన్ పరాగ్, 2019 17y 179d - ప్రదీప్ సాంగ్వాన్, 2008లక్నో, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా రాయల్స్ కెప్టెన్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ మ్యాచ్‌లో లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆకాశ్‌దీప్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. రాయల్స్ తరఫున సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు.తుది జట్లు..రాజస్థాన్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికెట్‌కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్ -
IPL 2025: రాయల్స్‌పై లక్నో విజయం
రాయల్స్‌పై లక్నో విజయంఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో రాయల్స్ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్స్17.6వ ఓవర్- ఆవేశ్ ఖాన్ ఒకే ఓవర్లో జైస్వాల్, రియాన్ పరాగ్‌ను (39) ఔట్ చేశాడు. రాయల్స్ గెలవాలంటే 12 బంతుల్లో మరో 20 పరుగులు చేయాలి.మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్17.1వ ఓవర్- 52 బంతుల్లో 74 పరుగులు చేసిన జైస్వాల్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్9.6వ ఓవర్- 94 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్ (52), రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్8.4వ ఓవర్- మార్క్రమ్ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) స్టంపౌటయ్యాడు.ధాటిగా ఆడుతున్న రాయల్స్ ఓపెనర్లు181 పరుగుల ఛేదనలో రాయల్స్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. యశస్వి జైస్వాల్ 24 బంతుల్లో 40.. వైభవ్ సూర్యవంశీ 12 బంతుల్లో 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 6 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 61/0గా ఉంది. తొలి మ్యాచ్‌లోనే దంచికొడుతున్న వైభవ్ సూర్యవంశీరాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే దంచి కొడుతున్నాడు. 7 బంతుల్లోనే ఫోర్, 2 సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. సూర్యవంశీకి జతగా వచ్చిన యశస్వి జైస్వాల్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) కూడా ధాటిగా ఆడుతున్నాడు. ఫలితంగా రాయల్స్ 3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో సమద్ విధ్వంసం.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన లక్నోసందీప్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో అబ్దుల్ సమద్ పేట్రేగిపోయాడు. నాలుగు సిక్సర్లు సహా 27 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ దక్కించుకున్నారు. హాఫ్ సెంచరీ పూర్తి అయిన వెంటనే ఔటైన బదోని17.3వ ఓవర్- తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆయుశ్ బదోని ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. బదోని 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 18 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 146/5గా ఉంది. మిల్లర్ (4), సమద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో15.5వ ఓవర్- 130 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్‌లో రియన్ పరాగ్ సూపర్ క్యాచ్ పట్టడంతో మార్క్రమ్ (66) ఔటయ్యాడు. బదోనికి (46) జతగా మిల్లర్ (3) క్రీజ్‌లోకి వచ్చాడు. 17 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 139/4గా ఉంది.మార్క్రమ్ ఫిఫ్టి.. 100 దాటిన లక్నో స్కోర్10.3వ ఓవర్- సందీప్ శర్మ బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి మార్క్రమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 12 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 105/3గా ఉంది. మార్క్రమ్ 60, బదోని 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పంత్ మరోసారి..!7.4వ ఓవర్- ప్రస్తుత సీజన్లో పంత్ (9 బంతుల్లో 3) మరోసారి విఫలమయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం లక్నో స్కోర్ 54/3గా ఉంది. మార్క్రమ్ (34), బదోని క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. డేంజరస్ పూరన్ ఔట్5.2వ ఓవర్- 46 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో ఇన్ ఫామ్ బ్యాటర్ నికోలస్ పూరన్ (11) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. మార్ష్ ఔట్2.2వ ఓవర్- టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (4) ఔటయ్యాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా రాయల్స్ కెప్టెన్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆకాశ్‌దీప్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. రాయల్స్ తరఫున సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అతడి వయసు 14 ఏళ్ల 23 రోజులు.తుది జట్లు..రాజస్థాన్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికెట్‌కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్ -
IPL 2025: కేకేఆర్‌తో జతకట్టిన అభిషేక్ నాయర్
టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో జతకట్టాడు. నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక కాకముందు (గత సీజన్లో) కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా పదవి ఊడటం ఖాయమని తెలిసాక నాయర్ మళ్లీ కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌ను తిరిగి తమ సహాయక బృందంలోకి ఆహ్వానిస్తున్నామని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.నాయర్ గతేడాది జులైలో టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అతని పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. బీసీసీఐ నాయర్ కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. దీంతో నాయర్ తన పదవీకాలం మరో మూడు నెలలు ఉండగానే టీమిండియా పదవికి గుడ్‌బై చెప్పి తన పాత జట్టు కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్‌లను కూడా పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.కాగా, గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో అభిషేక్ నాయర్ కీలకపాత్ర పోషించాడు. అయితే కేకేఆర్ పరిస్థితి ఈ సీజన్లో భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నాయర్ చేరికతో కేకేఆర్ ఆటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ టేబుల్ టాపర్లుగా కొనసాగుతున్నాయి. -
కేఎల్ రాహుల్ కామెంట్స్.. షాకైన పీటర్సన్!.. నా దోస్తులంతా ఇంతే..
ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ప్రయాణం విజయవంతగా సాగుతోంది. అతడి మార్గదర్శనంలో.. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ సరికొత్త ఉత్సాహంతో విజయపరంపర కొనసాగిస్తోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.ఇక తమ ఏడో మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పోటీకి దిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండగా.. ఒకరోజు ముందే అక్కడికి చేరుకున్న అక్షర్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.సోదరా.. నీకు మెంటార్‌కు అర్థం తెలుసా?!.ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. ఢిల్లీ మెంటార్ పీటర్సన్ దగ్గరకు వచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.పరస్పరం క్షేమ, సమాచారాలు అడిగితెలుసుకున్న తర్వాత.. పీటర్సన్.. ‘‘సోదరా.. నీకు మెంటార్‌కు అర్థం తెలుసా?!.. ఇక్కడ ఉన్న వాళ్లలో ఒక్కరికి మెంటార్ అంటే తెలియనే తెలియదు’’ అని గిల్‌తో అన్నాడు.రెండు వారాల పాటు మాల్దీవుల పర్యటనవీరిద్దరి సంభాషణ మధ్యలో జోక్యం చేసుకున్న ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. పీటర్సన్‌కు ఊహించని షాకిచ్చాడు. ‘‘ఎవరైతే సీజన్ మధ్యలోనే రెండు వారాల పాటు మాల్దీవుల పర్యటనకు వెళ్తారో.. వారే మెంటార్’’ అంటూ రాహుల్ పీటర్సన్‌ను టీజ్ చేశాడు. దీంతో పీటర్సన్ బిక్కముఖం వేసుకుని చూసాడు.నా దోస్తులంతా ఇంతేఇందుకు.. ‘‘నా స్నేహితులంతా ఇంతే.. విషపూరితమైన వాళ్లు.. లక్ష్యం లేని వాళ్లు. ఎప్పుడూ ప్రతికూలంగానే మాట్లాడతారు.. పరుషంగా ఉంటారు.. నాకు కొత్త స్నేహితులు కావాలి.. కానీ అంత త్వరగా, సులువుగా దొరకరే..’’ అన్న పంక్తులతో సాగే BoyWithUke పాటను ఢిల్లీ అడ్మిన్ పీటర్సన్ ఇన్నర్ వాయిస్‌లా జతచేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘థాంక్యూ కేఎల్.. మెంటార్ అంటే సరైన అర్థం ఏమిటో ఇప్పుడే చెప్పావు’’ అన్నట్లు క్యాప్షన్ ఇచ్చారు. కాగా కెవిన్ పీటర్సన్ 2009లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు.వ్యక్తిగత సెలవు మీదఆరంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన కెవిన్ పీటర్సన్.. సారథిగానూ వ్యవహరించాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ప్రాతినిథ్యం వహించిన పీటర్సన్.. 17 మ్యాచ్‌లలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అదే విధంగా రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్‌కు కూడా ఆడాడు.2016లో చివరగా ఐపీఎల్ ఆడిన 44 ఏళ్ల పీటర్సన్ మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్‌లో 36 మ్యాచ్‌లు ఆడి 1001 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 2025లో మెంటార్ అవతారంలో తిరిగి ఢిల్లీ ఫ్రాంఛైజీతో జట్టు కట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదాని, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మాట్లతో కలిసి పీటర్సన్ పనిచేస్తున్నాడు.ఇక ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ గెలుపొందిన తర్వాత.. వ్యక్తిగత సెలవు మీద పీటర్సన్ మాల్దీవుల పర్యటనకు వెళ్లాడు. ఫలితంగా ఏప్రిల్ 10న ఆర్సీబీతో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండలేకపోయాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేఎల్ రాహుల్ పీటర్సన్‌ను ట్రోల్ చేయడం విశేషం.చదవండి: ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్ Thanks KL, now we know what a mentor does 😂 pic.twitter.com/JXWSVJBfQS— Delhi Capitals (@DelhiCapitals) April 19, 2025 -
GT VS DC: డబుల్ సెంచరీ పూర్తి చేసిన కేఎల్ రాహుల్
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో సిక్సర్ల డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 19) జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. రాహుల్ ఐపీఎల్లో ఇప్పటిదాకా 129 ఇన్నింగ్స్‌లు ఆడి 200 సిక్సర్లు కొట్టాడు. రాహుల్‌కు ముందు భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (286), విరాట్ కోహ్లి (282), ఎంఎస్ ధోని (260), సంజూ శాంసన్ (216), సురేశ్ రైనా (203) సిక్సర్ల డబుల్ సెంచరీ పూర్తి చేశారు. ఓవరాల్‌గా రాహుల్‌కు ముందు క్రిస్ గేల్ (357), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, ఏబీ డివిలియర్స్ (251), డేవిడ్ వార్నర్ (236), కీరన్ పోలార్డ్ (223), సంజూ శాంసన్, ఆండ్రీ రసెల్ (212), సురేశ్ రైనా ఈ ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్ 14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అభిషేక్ పోరెల్ (9 బంతుల్లో 18; 3 ఫోర్లు, సిక్స్), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగానే ఆడినప్పటికీ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. 10 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 1052గా ఉంది. అక్షర్ పటేల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (8) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) కొనసాగుతుండగా.. గుజరాత్ మూడో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఉంది. పంజాబ్ రెండు (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), ఆర్సీబీ నాలుగు (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) స్థానాల్లో ఉండగా.. లక్నో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కేకేఆర్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ముంబై ఇండియన్స్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), రాజస్థాన్ రాయల్స్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సన్‌రైజర్స్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సీఎస్కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
IPL 2025: ఢిల్లీపై గుజరాత్ విజయం
ఢిల్లీపై గుజరాత్ విజయంఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 19) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ఆదిలోనే శుభ్‌మన్ గిల్ (7) వికెట్ కోల్పోయినప్పటికీ.. జోస్ బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ (97 నాటౌట్) కారణంగా 19.2 ఓవర్లలో (3 వికెట్ల నష్టానికి) లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 36, రూథర్‌ఫోర్డ్ 43, తెవాతియా 11 పరుగులు (నాటౌట్) చేశారు. ఆఖర్లో బట్లర్‌కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా తెవాతియా చివరి ఓవర్లో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఢిల్లీని వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బట్లర్12.5వ ఓవర్- మోహిత్ శర్మ బౌలింగ్‌లో బౌండరీ బాది బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బట్లర్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బట్లర్‌కు జతగా రూథర్‌ఫోర్డ్ క్రీజ్‌లో ఉన్నాడు. ఇదే ఓవర్లో రూథర్‌ఫోర్డ్ తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదాడు. 13 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 129/2గా ఉంది. బట్లర్ 52, రూథర్‌ఫోర్డ్ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్7.3వ ఓవర్- 74 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (36) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 85/2గా ఉంది. బట్లర్ (38), రూథర్‌ఫోర్డ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్1.4వ ఓవర్- 204 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కరుణ్ నాయర్ అద్బుతమైన త్రోతో శుభ్‌మన్ గిల్‌ను (7) రనౌట్ చేశాడు. 3 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 29/1గా ఉంది. సాయి సుదర్శన్ (16), బట్లర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. భారీ స్కోర్ చేసిన ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. 18 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 188/6 (18) అశుతోష్ 12 బంతుల్లో 32 పరుగులతో క్రీజులో ఉండగా.. ఫెరీరా ఇంకా ఖాతా తెరవలేదు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు17.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అక్షఱ్ పటేల్ (38). ఆ వెంటనే విప్రాజ్ నిగమ్‌ను అవుట్ చేసిన ప్రసిద్. 18వ ఓవర్లో వరుస బంతుల్లో గుజరాత్‌కు రెండు వికెట్లు. ఢిల్లీ స్కోరు: 173/6 (17.2)అక్షర్ పటేల్‌కు గాయం?15.3: అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని తరలించిన అక్షర్.. సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు.15 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 150/4అక్షర్ 33, అశుతోష్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ14.2: సిరాజ్ బౌలింగ్‌లో స్టబ్స్ (31) అవుట్. అక్షర్ 32 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 146/4 (14.2). అశుతోష్ శర్మ క్రీజులోకి వచ్చాడు.ఢిల్లీ ధనాధన్14 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు: 146/3స్టబ్స్ 19 బంతుల్లో 31, అక్షర్ పటేల్ 24 బంతుల్లో 32 పరుగులతో జోరుమీదున్నారు.పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 105-3స్టబ్స్ 8, అక్షర్ పటేల్ 15 పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్8.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్ మూడో వికెట్‌గా వెనుదిరిగిన కరుణ్ నాయర్ (31). స్కోరు: 93/3 (8.2). అక్షర్ పటేల్ 12 పరుగులతో ఆడుతుండగా.. ట్రిస్టన్ స్టబ్స్క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు: 73/2 (6)కరుణ్ నాయర్ 19, అక్షర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ అవుట్4.4: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్ (28). దీంతో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 58/2 (4.4)నాలుగు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 52/1రాహుల్ 22, కరుణ్ నాయర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ1.4: అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో అభిషేక్ పోరెల్ సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23/1 (1.4)తొలి ఓవర్లోనే 16 పరుగులుగుజరాత్ బౌలింగ్ ఎటాక్‌ను సిరాజ్ పేలవంగా ఆరంభించాడు. తొలి రెండు బంతులను వైడ్‌గా వేసిన ఈ రైటార్మ్ పేసర్ బౌలింగ్‌లో.. తర్వాతి రెండు బంతుల్లో అభిషేక్ పోరెల్ వరుసగా 4, 6 బాదాడు. ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించాడు. అభిషేక్ పోరెల్ 14, కరుణ్ నాయర్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరు... వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తోంది.తుదిజట్లుగుజరాత్ టైటాన్స్సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: షెర్ఫానే రూథర్‌ఫర్డ్, మహిపాల్ లామ్రోర్, అనూజ్ రావత్, వాషింగ్టన్ సుందర్, కరీం జనత్.ఢిల్లీ క్యాపిటల్స్అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: జేక్ ఫ్రేజర్-మెగర్క్, దర్శన్ నల్కాండే, సమీర్ రిజ్వీ, డొనొవన్ ఫెరీరా, దుష్మంత చమీర.కాగా ఢిల్లీ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ ఆరింట నాలుగు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్ -
ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారని.. ఒక్కరు కూడా బుద్ధిని ఉపయోగించలేకపోయారంటూ ఘాటుగా విమర్శించాడు.హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు కాగా సొంత మైదానంలో ఇతర జట్లు ఇరగదీస్తుంటే ఆర్సీబీ మాత్రం.. హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు నమోదు చేస్తోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాటిదార్ సేన ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఈ పోరును 14 ఓవర్లకు కుదించారు.పెవిలియన్‌కు క్యూ ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే వరుసగా షాకులు తగిలాయి. పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (Virat Kohli- 1) వెనువెంటనే వెనుదిరిగారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ (23) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా చహల్ అతడిని పెవిలియన్‌కు చేర్చాడు.2️⃣ sharp catches 🫡2️⃣ early strikes ✌Arshdeep Singh and #PBKS with a solid start ⚡Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/jCt2NiuYEH— IndianPremierLeague (@IPL) April 18, 2025 డేవిడ్ మెరుపుల వల్లమిగిలిన వాళ్లలో లియామ్ లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ 14 ఓవర్లలో 95 పరుగులు చేయగలిగింది.𝘽𝙊𝙊𝙈 💥Nehal Wadhera is in a hurry to finish it for #PBKS 🏃Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/upMlSvOJi9— IndianPremierLeague (@IPL) April 18, 2025ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా నేహాల్ వధేరా ధనాధన్ ఇన్నింగ్స్ (19 బంతుల్లో 33 నాటౌట్) కారణంగా.. పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ల తీరుపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?‘‘ఆర్సీబీ బ్యాటింగ్ మరీ తీసికట్టుగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యపు షాట్లు ఆడారు. ఒక్కరంటే ఒక్కరు కూడా.. మంచి బంతికి అవుట్ కాలేదు. అంతా సాధారణ బంతులే ఆడలేక పెవిలియన్ చేరారు.ఆర్సీబీ బ్యాటర్లలో ఒక్కరైనా కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటే బాగుండేది. వాళ్ల చేతిలో గనుక వికెట్లు ఉండి ఉంటే స్కోరు 14 ఓవర్లలో కనీసం 110- 120గా ఉండేది. తద్వారా విజయం కోసం పోరాడే పరిస్థితి ఉండేది. కానీ వీళ్లు మాత్రం చేతులెత్తేశారు.సొంత మైదానంలో ఆర్సీబీ గెలవలేకపోతోంది. పాటిదార్ ఇందుకు పరిష్కారాన్ని కనుగొనాలి. నిజానికి ఆర్సీబీ బౌలర్లు బాగానే ఆడుతున్నారు. కానీ బ్యాటర్లే చిత్రంగా ఉన్నారు. సొంత మైదానంలో అందరూ వరుసగా విఫలమవుతున్నారు’’ అని క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇటు కోహ్లి.. అటు భువీకాగా ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగు గెలిచి పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లోనూ ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు 249 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి ఓపెనింగ్ జోడీ అయిన ఫిల్ సాల్ట్ 212 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. కెప్టెన్ పాటిదార్ ఇప్పటికి 209 పరుగులు సాధించాడు. బౌలర్లలో ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ టాప్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో భువీ ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు.చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్ -
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడో ఓటమిని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాటిదార్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌కు అంతరాయం కలుగగా.. పద్నాలుగు ఓవర్లకు కుదించారు.ఈ క్రమంలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 14 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ సాధించాడు.ఇక పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి.. 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లు దక్కించుకోగా.. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు కూల్చాడు.అతిపెద్ద గుణపాఠంఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar).. బ్యాటింగ్ వైఫల్యం వల్లే తాము ఓడిపోయామని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మా బ్యాటింగ్ విభాగం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.ఇలాంటి మ్యాచ్‌లలో భాగస్వామ్యాలు నమోదు చేయడం అత్యంత ముఖ్యం. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ మ్యాచ్‌లో మాకు ఇదే అతిపెద్ద గుణపాఠం.పరిస్థితులకు తగ్గట్లుగా మేము మా బ్యాటింగ్ శైలిని మార్చుకోవాల్సి ఉంది. అందుకే ఈరోజు పడిక్కల్‌ను ఆడించలేదు. ఇక వికెట్ కూడా అంత చెత్తగా ఏమీ లేదు. చాలా కాలంగా కవర్లు కప్పి ఉంచిన కారణంగా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు మేలు చేకూరింది.క్రెడిట్ వారికే.. మా బౌలర్లు కూడా సూపర్ఈ విజయంలో క్రెడిట్ పంజాబ్ బౌలర్లకే దక్కుతుంది. వికెట్ ఎలా ఉన్నా.. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. మా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. అదే మాకు అతిపెద్ద సానుకూలాంశం. బ్యాటర్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఆడారు. కానీ కొన్నిసార్లు నిరాశ తప్పదు. బ్యాటింగ్ విభాగంలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాం’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.కాగా సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది 46వ ఓటమి. ఐపీఎల్ చరిత్రలో హోం గ్రౌండ్లో అత్యధిక మ్యాచ్‌లలో పరాజయం పాలైన జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్👉టాస్: పంజాబ్ కింగ్స్.. మొదట బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 95/9 (14)👉పంజాబ్ కింగ్స్ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఆర్సీబీపై ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (ఆర్సీబీ- 26 బంతుల్లో 50 నాటౌట్). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా -
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)తో విభేదాలంటూ వచ్చిన వార్తలపై.. ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని.. సంజూ, తానూ జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తామని స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇద్దరికీ గాయాల బెడదఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో రాయల్స్ కేవలం రెండు మాత్రమే గెలిచింది. మరోవైపు.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజూ శాంసన్ గాయాల బారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ సీజన్ ఆరంభానికి ముందు ద్రవిడ్ లీగ్ మ్యాచ్ ఆడి కాలికి దెబ్బ తాకించుకోగా.. వీల్‌చైర్‌లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.ఇంపాక్ట్ ప్లేయర్గానేఇక సంజూ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. ఆ తర్వాత సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ కేరళ బ్యాటర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పితో అతడు తదుపరి లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితి.ద్రవిడ్- సంజూ మధ్య విభేదాలు?ఇదిలా ఉంటే.. ఢిల్లీపై గెలవాల్సిన మ్యాచ్‌ను రాయల్స్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులే చేయడంతో మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్లో ఢిల్లీ రాయల్స్‌పై జయభేరి మోగించింది. అయితే, సూపర్ ఓవర్‌కు ముందు ద్రవిడ్ ఆటగాళ్లతో డగౌట్లో చర్చలు జరుపగా.. సంజూ మాత్రం అందులో పాలుపంచుకోలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. ద్రవిడ్- సంజూ మధ్య విభేదాలనే వదంతులు వచ్చాయి.అతడు జట్టులో అంతర్భాగంఅయితే, ఈ వార్తలను ద్రవిడ్ ఖండించాడు. లక్నోతో శనివారం నాటి మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు. నేను, సంజూ ఒకే విధంగా ఆలోచిస్తాం. మా ప్రణాళికలు ఒక్కటే.అతడు జట్టులో అంతర్భాగం. ప్రతి చర్చ, నిర్ణయంలోనూ అతడు భాగమై ఉంటాడు. అయితే, కొన్నిసార్లు మనం అనుకున్న ఫలితాలు రాకపోతే ప్రతి ఒక్కరు నిరాశ చెందుతారు. ఆటలో ఇవన్నీ సహజం.మన ప్రదర్శన బాగా లేకపోతే విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఆధారాల్లేకుండా వస్తున్న వార్తలను మేమైతే అరికట్టలేము. మా జట్టులోనూ ఎలాంటి విభేదాలు లేవు.మా వాళ్లు కఠినంగా శ్రమిస్తున్నారు. గెలుపు కోసం కృషి చేస్తున్నారు. తమ ప్రదర్శన బాగాలేకపోతే ఆటగాళ్ల మనసు ఎంతగా గాయపడుతుందో మీకు తెలియదు. ఎవరో పనిగట్టుకుని వారిని విమర్శించాల్సిన పనిలేదు. పొరపాట్లను సమీక్షించుకుని సరిచేసుకోగల సత్తా వారికి ఉంది’’ అని ద్రవిడ్ విమర్శకులకు, వదంతులు వ్యాప్తి చేసే వారికి చురకలు అంటించాడు.చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటుతో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న భారత తొలి క్రికెటర్‌గా నిలిచాడు. వర్షం వల్ల 14 ఓవర్ల ఆటఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా పాటిదార్ ఈ ఘనత సాధించాడు. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో పద్నాలుగు ఓవర్లకు మ్యాచ్‌ను కుదించగా.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (1) పూర్తిగా విఫలం కాగా.. రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించాడు.95 పరుగులుఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 50 నాటౌట్) ఆడటంతో ఆర్సీబీ తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్‌బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.పంజాబ్ ఫటాఫట్‌ఇక పంజాబ్ 12.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. నేహాల్ వధేరా (19 బంతుల్లో 33) ధనాధన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 30 ఇన్నింగ్స్‌లోనే పాటిదార్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.సచిన్ రికార్డు బ్రేక్ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న రికార్డును పాటిదార్ బద్దలు కొట్టాడు. వీరిద్దరు 31 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నారు. ఇక.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకుని.. ఐపీఎల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా రికార్డుఅయితే, రజత్ ఇన్నింగ్స్ పరంగా సుదర్శన్ కంటే వెనుకబడి ఉన్నా... సగటు, స్ట్రైక్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్నాడు. తద్వారా ఐపీఎల్లో 35కు పైగా సగటుతో 150కి పైగా స్ట్రైక్‌రేటుతో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా పాటిదార్ చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్లో అతడి నిలకడైన ఆటకు ఇది నిదర్శనం.ఐపీఎల్-2025: బెంగళూరు వర్సెస్ పంజాబ్👉వర్షం వల్ల మ్యాచ్ 14 ఓవర్లకు కుదింపు👉వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్👉బెంగళూరు స్కోరు: 95/9 (14)👉పంజాబ్ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో బెంగళూరుపై పంజాబ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్ -
చాలెంజర్స్‌పై పంజా...
ముందు వాన... తర్వాత హైరానా! శుక్రవారం రాత్రి బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) పరిస్థితి ఇది. ఆలస్యమైన ఆటలో వికెట్ల వేటను చకచకా మొదలుపెట్టిన పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థిథని వారి సొంతగడ్డపై కుదేల్ చేసింది. కుదించిన ఓవర్లలో విదిల్చిన పంజాతో ఎదురైన స్వల్ప లక్ష్యాన్ని ఎంచక్కా ఛేదించిన కింగ్స్ ఈ ఐపీఎల్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో మూడోసారి బెంగళూరు ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడో మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బోణీ కొట్టలేకపోయింది. బెంగళూరు: పంజాబ్ కింగ్స్ బౌలింగ్ గర్జించింది. బెంగళూరును వణికించింది. కింగ్స్‌ను విజేతగా నిలబెట్టింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ , మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్ బ్రార్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి గెలిచింది. నేహల్ వధేరా (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. హాజల్‌వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. బెంగళూరు తమ తుదిజట్టును మార్చలేదు. పంజాబ్ మాత్రం రెండు మార్పులు చేసింది. మ్యాక్స్‌వెల్, సుర్యాంశ్ షెడ్గే స్థానాల్లో స్టొయినిస్, హర్‌ప్రీత్ బ్రార్ బరిలోకి దిగారు. అందరూ తొందరగానే... వర్షం వల్ల మ్యాచ్ చాలా ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. కోహ్లి, సాల్ట్, లివింగ్‌స్టోన్‌లాంటి హిట్టర్లున్న జట్టులో ఏ నలుగురో, ఐదుగురో ఆడాల్సిన 14 ఓవర్లను ఏకంగా 11 మంది ఆడేశారు. టాపార్డర్, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ అందరూ తొందర, తొందరగా వికెట్లను పారేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సాల్ట్ (4), కోహ్లి (1), రజత్ పాటీదార్ (23), లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) చేతులెత్తేశారు. డేవిడ్ ఒక్కడి మెరుపులతోనే... జట్టు స్కోరు 95/9. అంటే 11 మంది క్రీజులోకి వచ్చారన్నమాటే! అందరూ బ్యాటింగ్‌కు దిగినా... స్కోరులో సగంకంటే ఎక్కువ స్కోరు ఒక్కడే టిమ్ డేవిడ్ చేశాడు. ఏడో వరుసలో, ఏడో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ అండగా నిలిచేవారే కరువైనా... ఆఖరి రెండు ఓవర్లలోనే అంతా మార్చాడు. 12 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లకు 63 పరుగులు చేసింది. డేవిడ్ స్కోరు 19 కాగా... జేవియర్ 13వ ఓవర్లో 2 బౌండరీలు సహా 11 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ బ్రేక్‌కు ముందు... చివరి 14వ ఓవర్లో తొలి మూడు బంతులు వరుసగా... 0, 0, 0 పరుగే రాలేదు. తర్వాత మూడు బంతుల్ని డేవిడ్ భారీ సిక్సర్లు బాదడంతో 18 పరుగులొచ్చాయి. 48 పరుగులు చేసిన డేవిడ్ సహా అంతా ఇన్నింగ్స్ బ్రేక్ కావడంతో మైదానం వీడుతున్నారు. కానీ అంపైర్ చాలా ఆలస్యంగా నోబాల్ సిగ్నలిచ్చాడు. సహచరులతో కబుర్లాడుతూ డగౌట్ చేరుతున్న ఆటగాళ్లను వెనక్కి పిలిచి ఫ్రీ హిట్ ఆడించడంతో 2 పరుగులు తీసిన డేవిడ్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. నేహల్ మెరిపించాడు... సులువైన లక్ష్యం కావడంతో పంజాబ్‌కు ఛేదనలో పెద్దగా కష్టం ఎదురవలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (16), ప్రభ్సిమ్రాన్ (13), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7) ఇలా టాపార్డర్ వికెట్లు రాలినా... మిడిలార్డర్లో నేహల్ భారీ షాట్లతో విరుచుకు పడి జట్టును గెలిపించాడు. దీంతో ఒకే ఓవర్లో హాజల్‌వుడ్ అయ్యర్, ఇన్‌గ్లిస్ (14) వికెట్లను పడగొట్టినా... నేహల్ బ్యాటింగ్ బెంగళూరును మ్యాచ్‌లో పట్టుబిగించకుండా చేసింది. 11 బంతులు మిగిలుండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలురాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 4; కోహ్లి (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ 1; పాటీదార్ (సి) జేవియర్ (బి) చహల్ 23; లివింగ్‌స్టోన్ (సి) ప్రియాన్‡్ష (బి) జేవియర్ 4; జితేశ్ (సి) నేహల్ (బి) చహల్ 2; కృనాల్ (సి అండ్ బి) యాన్సెన్ 1; టిమ్ డేవిడ్ (నాటౌట్) 50; మనోజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) యాన్సెన్ 1; భువనేశ్వర్ (సి) జేవియర్ (బి) హర్‌ప్రీత్ 8; యశ్ దయాళ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్ 0; హజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 9 వికెట్లకు) 95. వికెట్ల పతనం: 1–4, 2–21, 3–26, 4–32, 5–33, 6–41, 7–42, 8–63, 9–63. బౌలింగ్: అర్శ్‌దీప్ 3–0–23–2, జేవియర్ 3–0–26–1, యాన్సెన్ 3–0–10–2, చహల్ 3–0–11–2, హర్‌ప్రీత్ బ్రార్ 2–0–25–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) హాజల్‌వుడ్ 16; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) భువనేశ్వర్ 13; అయ్యర్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 7; ఇన్‌గ్లిస్ (సి) సుయశ్ (బి) హాజల్‌వుడ్ 14; నేహల్ (నాటౌట్) 33; శశాంక్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 1; స్టొయినిస్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (12.1 ఓవర్లలో 5 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–22, 2–32, 3–52, 4–53, 5–81. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–26–2, యశ్ దయాళ్ 2.1–0–18–0, హాజల్‌వుడ్ 3–0–14–3, కృనాల్ 1–0–10–0, సుయశ్ 3–0–25–0. ఐపీఎల్లో నేడుగుజరాత్ X ఢిల్లీ వేదిక: అహ్మదాబాద్ , మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్ X లక్నో వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జన్సెన్, చహల్, హర్‌ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నేహల్ వధేరా (33 నాటౌట్) ఏమాత్రం జంక కుండా బ్యాటింగ్ చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. యశ్ దయాల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది స్టోయినిస్ (7 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లిస్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. -
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 18) జరుగుతున్న మ్యాచ్‌లో అర్షదీప్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి వికెట్లు తీశాడు. 2019 సీజన్లో పంజాబ్‌లో చేరిన అర్షదీప్ ఇప్పటివరకు 86 వికెట్లు తీశాడు. అర్షదీప్‌కు ముందు పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు పియూశ్ చావ్లా పేరిట ఉండేది. చావ్లా పంజాబ్ తరఫున (2000-2013) 84 వికెట్లు తీశాడు. అర్షదీప్‌ను పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు వదిలేసింది. అయినా అతన్ని వేలంలో తిరిగి రూ. 18 కోట్లు పెట్టి దక్కించుకుంది.ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..86* - అర్ష్‌దీప్ సింగ్84 - పియూష్ చావ్లా73 - సందీప్ శర్మ61 - అక్షర్ పటేల్58 - మహ్మద్ షమీమ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఆర్సీబీ 8.2 ఓవర్లలో 42 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సహా జన్సెన్, చహల్ తలో రెండు వికెట్లు తీశారు. బార్ట్లెట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, రజత్ పాటిదార్ 23, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1 పరుగు చేసి ఔటయ్యారు. టిమ్ డేవిడ్ (8), భువనేశ్వర్ కుమార్ (3) క్రీజ్‌లో ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 47/7గా ఉంది. -
IPL 2025: బ్యాటింగ్‌లో పూరన్.. బౌలింగ్‌లో నూర్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యేలా కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 9 గంటలకు వరకు టాస్ కూడా పడలేదు. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన బెంగళూరులో ఇంకా వర్షం కురుస్తున్నట్లు సమాచారం. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరగాలన్నా రాత్రి 10:41 గంటల్లోపు టాస్ పడాలి.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) అగ్రస్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), ఆర్సీబీ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), పంజాబ్ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), లక్నో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కేకేఆర్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ముంబై (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), రాజస్థాన్ రాయల్స్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), ఎస్ఆర్హెచ్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సీఎస్కే (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.పరుగుల్లో టాప్ పూరన్ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్ కొనసాగుతున్నాడు. పూరన్ ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడి 208.77 స్ట్రయిక్‌రేట్‌తో 357 పరుగులు చేశాడు. పూరన్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుపూరన్- 357సాయి సుదర్శన్- 329మిచెల్ మార్ష్- 295సూర్యకుమార్ యాదవ్- 265శ్రేయస్ అయ్యర్- 250విరాట్ కోహ్లి- 248అత్యధిక వికెట్ల వీరుడు నూర్ప్రస్తుతం పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) హోల్డర్‌గా సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ కొనసాగుతున్నాడు. నూర్ 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. నూర్ తర్వాత కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో 11 వికెట్లు తీశారు.అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లునూర్ అహ్మద్-12కుల్దీప్ యాదవ్- 11ఖలీల్ అహ్మద్- 11 హార్దిక్ పాండ్యా- 11 శార్దూల్ ఠాకూర్- 11సెంచరీల వీరులుఅభిషేక్ శర్మ-1ప్రియాన్ష్ ఆర్య-1ఇషాన్ కిషన్-1అత్యధిక హాఫ్ సెంచరీలుపూరన్-4సాయి సుదర్శన్-4మిచెల్ మార్ష్-4అత్యధిక ఫోర్లుట్రవిస్ హెడ్- 33సాయి సుదర్శన్-31అభిషేక్ శర్మ-31అత్యధిక సిక్సర్లుపూరన్-31శ్రేయస్ అయ్యర్-20మిచెల్ మార్ష్-17ఐదు వికెట్ల ఘనతలుహార్దిక్ పాండ్యామిచెల్ స్టార్క్ -
IPL 2025: ఆర్సీబీపై పంజాబ్ విజయం
ఆర్సీబీపై పంజాబ్ విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జన్సెన్, చహల్, హర్‌ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నేహల్ వధేరా (33 నాటౌట్) ఏమాత్రం జంక కుండా బ్యాటింగ్ చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. యశ్ దయాల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది స్టోయినిస్ (7 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లిస్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్2.4వ ఓవర్- 22 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ప్రభ్‌సిమ్రన్ (13) ఔటయ్యాడు. పంజాబ్ బౌలర్ల విజృంభణ.. 95 పరుగులకే పరిమితమైన ఆర్సీబీవర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అర్షదీప్, జన్సెన్, చహల్, హర్‌ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ సింగ్ 2, బార్ట్లెట్, జన్సెన్, చహల్ తలో వికెట్ తీశారు. పాటిదార్ (21), టిమ్ డేవిడ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. 6.3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 38/5గా ఉంది. కోహ్లి ఔట్.. 21 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ2.4వ ఓవర్- 21 పరుగులకే ఆర్సీబీ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి (1) ఔటయ్యాడు. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో తొలి బంతికే బౌండరీ బాదిన సాల్ట్ నాలుగో బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ రెండు మార్పులు చేసింది. మ్యాక్స్‌వెల్ స్థానంలో స్టోయినిస్ జట్టులోకి వచ్చాడు. హర్‌ప్రీత్ బ్రార్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్ ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, నేహాల్ వధేరా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్జ్, గ్లెన్ మాక్స్వెల్, ప్రవీణ్ దూబే9:30 గంటలకు టాస్.. 14 ఓవర్ల మ్యాచ్టాస్ 9:30 గంటలకు పడనుంది. 9:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ ప్లే 4 ఓవర్లుగా తేల్చారు. ముగ్గురు బౌలర్లు నాలుగు ఓవర్లు, ఓ బౌలర్ మిగతా రెండు ఓవర్లు బౌల్ చేయవచ్చు. తగ్గిన వర్షం.. తొలిగిన కవర్లు9:05 గంటలు- ఎట్టకేలకు వర్షం తగ్గుముఖం పట్టడంతో మైదాన సిబ్బంది కవర్లను తొలగించారు. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి వార్మప్ మొదలుపెట్టారు. ఎంతకీ తగ్గని వర్షం.. ఓవర్ల కోత మొదలైంది8:30 గంటలు-సాయంత్రం ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గడం లేదు. ఇకపై మ్యాచ్ ప్రారంభమైనా ఓవర్ల కోత తప్పదని తెలుస్తుంది.ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ హెం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. టాస్ ఆలస్యమయ్యే అవకాశముంది. గత రెండు, మూడు గంటల నుంచి వర్షం పడుతుండటంతో స్టేడియం మొత్తం కవర్లు కప్పి ఉంచారు. మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదమేమీ లేనప్పటి.. ఓవర్ల కోత ఉండవచ్చని తెలుస్తుంది. -
IPL 2025: సన్‌రైజర్స్‌పై విజయం.. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్‌తో రాణించిన విల్ జాక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలుపుతో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఓ వేదికపై ఛేజింగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. వాంఖడే మైదానంలో ముంబై 29 సార్లు (47 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది. ఈ రికార్డు సాధించే క్రమంలో ముంబై కేకేఆర్‌ను అధిగమించింది. కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్‌లో 28 సార్లు (40 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది.ఐపీఎల్లో ఓ వేదికపై ఛేజింగ్ చేస్తూ అత్యధిక విజయాలు సాధించిన జట్లు..ముంబై ఇండియన్స్- వాంఖడే స్టేడియం- 29 విజయాలు (47 మ్యాచ్‌లు)కేకేఆర్- ఈడెన్ గార్డెన్స్- 28 (40)రాజస్థాన్ రాయల్స్- సువాయ్ మాన్ సింగ్ స్టేడియం- 24 (31)ఆర్సీబీ- చిన్నస్వామి స్టేడియం- 21 (41)సన్‌రైజర్స్ హైదరాబాద్- ఉప్పల్ స్టేడియం- 21 (32)సీఎస్కే- చెపాక్ స్టేడియం- 20 (31) -
IPL 2025: నేటి (ఏప్రిల్ 18) మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ హెం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కవర్లతో కప్పి ఉంది. వర్షం పడే సూచనలు ఉన్నప్పుడే ఇలా చేస్తారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. మ్యాచ్ జరిగే సమయానికి 22 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదమేమీ లేనప్పటికీ పాక్షికంగా బ్రేకులు పడే ఛాన్స్ ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ఆర్సీబీకి హోం గ్రౌండ్లో ఇది మూడో మ్యాచ్. ఇక్కడ ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఓడింది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రత్యర్థి ఇలాకాల్లో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలిచింది. ఈ సీజన్లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో గుజరాత్, ఢిల్లీ చేతుల్లో ఓడింది. ఆర్సీబీ ఈ సీజన్లో కేకేఆర్, సీఎస్కే, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ను వారి సొంత ఇలాకాల్లో ఓడించింది. ప్రస్తుతం ఆర్సీబీ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (+0.672) ఉంది. పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి నాలుగో స్థానంలో (+0.172) ఉంది. పంజాబ్ ఈ సీజన్లో గుజరాత్, లక్నో, సీఎస్కే, కేకేఆర్‌పై విజయాలు సాధించి, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ చేతుల్లో పరాజయంపాలైంది. పంజాబ్.. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 111 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని రికార్డుల్లోకెక్కింది. అంతుకుముందు పంజాబ్ సన్‌రైజర్స్‌పై 245 పరుగులు చేసినప్పటికీ ఓటమిపాలైంది.పంజాబ్‌దే స్వల్ప పైచేయిపంజాబ్, ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే పంజాబ్‌దే స్వల్ప పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడగా.. పంజాబ్ 17, ఆర్సీబీ 16 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిగా తలపడిన మూడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధించింది.తుది జట్లు (అంచనా)..ఆర్సీబీ: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మపంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాఖ్ -
IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ, పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తమ బ్యాటింగ్ విభాగాన్ని పటిష్ట పరచుకునే పనిలో పడింది. ఇప్పటికే గాయపడిన కెప్టెన్ రుతురాజ్ స్థానాన్ని ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రేతో భర్తీ చేసిన సీఎస్కే యాజమాన్యం తాజాగా మరో గాయపడిన ఆటగాడికి రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించింది. లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన గుర్జప్నీత్ సింగ్ ఈ సీజన్ ఆరంభ దశలో గాయపడగా.. తాజాగా అతని స్థానాన్ని సౌతాఫ్రికా చిచ్చరపిడుగు, బేబీ ఏబీడీగా పిలువబడే డెవాల్డ్ బ్రెవిస్‌తో భర్తీ చేసింది. బ్రెవిస్ ఈ సీజన్ మెగా వేలంలో 75 లక్షల బేస్ ధర విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ.. సీఎస్కే మేనేజ్మెంట్ అతనికి బంపరాఫర్ ఇచ్చి ఏకంగా రూ. 2.2 కోట్లకు డీల్ సైన్ చేసుకుంది. వాస్తవానికి ఈ సీజన్లో సీఎస్కేకు ఓ ఓవర్సీస్ బెర్త్ ఖాళీగా ఉంది. ఎవరికీ రీప్లేస్‌మెంట్‌గా కాకుండానే బ్రెవిస్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఆ జట్టుకు ఉండింది. అయినా ఎందుకో వేచి చూసే ధోరణిని అవళంభించి గుర్జప్నీత్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంది. విధ్వంసకర వీరుడిగా పేరు తెచ్చుకున్న బ్రెవిస్‌ను ఈ సీజన్ మెగా వేలంలో ఎందుకో ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. బ్రెవిస్ గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీల్లోనూ అతను ముంబై సిస్టర్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 21 ఏళ్ల బ్రెవిస్ సౌతాఫ్రికా తరఫున కేవలం రెండు మ్యాచ్‌లే ఆడినప్పటికీ.. అతన్ని ఆ దేశ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో పోలుస్తారు. బ్రెవిస్ ఓవరాల్‌గా 81 టీ20లు ఆడి 145 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. బ్రెవిస్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా దేశవాలీ సీజన్లో ఫార్మాట్లకతీతంగా అదరగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ బ్రెవిస్ మంచి ప్రదర్శనలు చేశాడు. బ్రెవిస్ ఫామ్ కష్టాల్లో ఉన్న సీఎస్కేను గట్టెక్కిస్తుందేమో చూడాలి. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్ వాంఖడే వేదికగా ఏప్రిల్ 20న జరుగనుంది. ఈ సీజన్లో సీఎస్కే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఆతర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. తాజా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే మళ్లీ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ సీజన్లో సీఎస్కే ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించి, నాలుగు పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ సీజన్లో సీఎస్కే బ్యాటింగ్ విభాగంలో చాలా బలహీనంగా కనిపిస్తుంది. రుతురాజ్ వైదొలగడంతో ఆ జట్టు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ చేరికతో సీఎస్కే బ్యాటింగ్ కష్టాలు తీరుతాయేమో చూడాలి. ఈ సీజన్లో సీఎస్కే బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తుంది. రుతరాజ్ గైర్హాజరీలో సీఎస్కే కెప్టెన్‌గా ధోని వ్యవహరిస్తున్నాడు. లక్నోపై గెలుపులో ధోని కీలకపాత్ర పోషించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, ఖలీల్ అహ్మద్, పతిరణ అద్భుతంగా రాణిస్తున్నారు. -
‘ద్రవిడ్‌కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్ క్యాంపులో విభేదాలు?
‘రాజస్తాన్ రాయల్స్ నాయకత్వ బృందంలో విభేదాలు తలెత్తాయా?.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)- కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) మధ్య సఖ్యత కొరవడిందా?.. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయా?’.. అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అవుననేందుకు ఆస్కారం ఇస్తున్నాయి.ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. సీజన్ ఆరంభానికి ముందే హెడ్‌కోచ్ ద్రవిడ్ గాయపడ్డాడు. అయినప్పటికీ వీల్‌చైర్‌లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.మరోవైపు.. ఐపీఎల్ ఆరంభానికి ముందు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు అతడు కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాడు. సారథిగా, వికెట్ కీపర్‌గా జట్టు అతడి సేవలను కోల్పోయింది.ఇక సంజూ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ వచ్చిన రియాన్ పరాగ్ (Riyan Parag) సారథ్యంలో.. మూడు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయితే, సంజూ వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ క్రమంలో చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్స్ తలపడింది.అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఢిల్లీ రాయల్స్‌ను ఓడించి గెలుపు జెండా ఎగురవేసింది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సంజూ పక్కటెముకల నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.ఇదిలా ఉంటే.. సూపర్ ఓవర్ సమయంలో రాజస్తాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. రియాన్ పరాగ్‌తో పాటు షిమ్రన్ హెట్‌మెయిర్‌ను రాయల్స్ బ్యాటింగ్‌కు పంపింది. వీరిద్దరు రనౌట్ అయి ఐదు బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి జట్టు ఓటమికి పరోక్ష కారణమయ్యారు.𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 PC: BCCIనిజానికి ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా అద్భుత అర్ధ శతకం (28 బంతుల్లో 51)తో రాణించాడు. కానీ మేనేజ్మెంట్ మాత్రం అతడిని సూపర్ ఓవర్లో పంపలేదు. ఇక సూపర్ ఓవర్‌కు ముందు ద్రవిడ్ డగౌట్లో తన సహాయక సిబ్బంది, ఆటగాళ్లతో ప్రణాళికల గురించి చర్చించాడు.ఆ సమయంలో కెప్టెన్ సంజూ మాత్రం తనకు ఈ విషయం పట్టనట్లుగా ఆటగాళ్ల వెనుక అటూ ఇటూ తిరిగాడు. మధ్యలో సహచర ఆటగాడు రమ్మని పిలిచినా తనకు ఇష్టం లేదన్నట్లుగా వద్దంటూ చేతితో సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాయల్స్ క్యాంపులో విభేదాలు అన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఇది చూసిన సంజూ అభిమానులు ద్రవిడ్‌కు సంజూ నచ్చడని.. అందుకే ఇక్కడా తనకు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్-2025లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్ కేవలలం రెండే గెలిచింది.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! I knew there was definitely a rift within the setup when there were absolutely no discussions or chat in the dugout before the super over.Everyone was standing quite in a circle in the dugout.Look at Sanju's hand signal in the first video,he is deliberately ignoring everyone. https://t.co/DfxmlwGgBG pic.twitter.com/688ji3MXrS— Delhi Capitals Fan (@pantiyerfc) April 17, 2025 -
MI vs SRH: వాళ్లిద్దరి తప్పేమీ లేదు!.. క్లాసెన్ కొంపముంచాడు!
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen) ఓ పొరపాటు చేశాడు. అతడి తప్పిదం కారణంగా ముంబై ఓపెనర్ రియాన్ రికెల్టన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. క్లాసెన్ తప్పు వల్ల లైఫ్ పొందిన అతడు తన స్కోరుకు మరో పది పరుగులు జతచేసి.. ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.162 పరుగులుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గురువారం ముంబై- హైదరాబాద్ (MI vs SRH) జట్లు తలపడ్డాయి. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ముంబై ఇండియన్స్.. రైజర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కమిన్స్ బృందం 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది.సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ (28 బంతుల్లో 37) కూడా రాణించాడు. ఇక రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ(16 బంతుల్లో 26) కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చిఇక మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అతడు అవుటయ్యాడని భావించి మైదానం వీడే సమయానికి.. హై డ్రామా చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన ఫోర్త్ అంపైర్.. రికెల్టన్ పెవిలియన్‌కు వెళ్లకుండా ఆపేశాడు. జీషన్ వేసిన బంతిని నో బాల్‌గా ప్రకటించాడు.క్లాసెన్ చేసిన తప్పు వల్లనిజానికి రికెల్టన్ను అవుట్ చేసే విషయంలో బౌలర్‌గా జీషన్ అన్సారీ.. ఫీల్డర్‌గా క్యాచ్ అందుకోవడంలో కమిన్స్ ఎలాంటి పొరపాటు చేయలేదు. కానీ వికెట్ కీపర్ క్లాసెన్ చేసిన తప్పు వల్ల రికెల్టన్కు లైఫ్ వచ్చింది.కారణం ఇదేవిషయం ఏమిటంటే.. క్యాచ్‌ను అందుకునే లేదా స్టంపింగ్ ప్రయత్నంలో వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్ ఆడి కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.అయితే దీనిని ‘నోబాల్’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. రికెల్టన్ షాట్ ఆడక ముందే క్లాసెన్ గ్లవ్స్ ముందుకు రావడం ఇందుకు కారణం. ఇది ఐసీసీ నిబంధన 27.3.1కు విరుద్ధం. అందుకే అంపైర్లు నోబాల్ ఇచ్చారు. క్లాసెన్ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం. వాంఖడేలో జయభేరిఇక ముంబై బ్యాటర్లలో రికెల్టన్ 31 పరుగులు చేయగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (21 నాటౌట్) రాణించారు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ముంబై మరో పదకొండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసి.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లుహైదరాబాద్: 162/5 (20)ముంబై: 166/6 (18.1)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై విజయం.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! -
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ (MI vs SRH) మ్యాచ్ సందర్భంగా గురువారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ముంబై జట్టు యజమాని నీతా అంబానీ (Nita Ambani)ని కలిశాడు. ముంబై చేతిలో ఓటమి అనంతరం తన మాజీ ఓనర్ దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించాడు.ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్బదులుగా ఇషాన్ కిషన్ చేతిని పట్టుకుని.. తల్లి మాదిరి ప్రేమపూర్వకంగా నీతా అంబానీ అతడి చెంప నిమిరారు. ఓటమికి కుంగిపోవాల్సిన పనిలేదన్నట్లుగా ఇషాన్‌ను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాపై మీమ్స్ పేలుతున్నాయి. ‘‘తమ జట్టుతో ప్రయాణించిన మాజీ ఆటగాడి పట్ల నీతా తల్లిలా ప్రేమను కురిపిస్తుంటే.. గోయెంకా మాత్రం ఒక్క మ్యాచ్‌లో ఓడినా తమ కెప్టెన్లను అందరి ముందే ఉతికి ఆరేస్తాడు.. ఇదే ఈ ఇద్దరికి ఉన్న తేడా’’ అంటూ ముంబై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా 2016లో ఇషాన్ కిషన్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. గుజరాత్ లయన్స్ అతడిని రూ. 35 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అదే జట్టుకు ఆడి 319 పరుగులు చేశాడు.ముంబైతో సుదీర్ఘ అనుబంధంఅయితే, గుజరాత్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ నుంచి కనుమరుగైన తర్వాత ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది. 2018 వేలంలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సొంత చేసుకోగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ ఏడాది 500కు పైగా పరుగులు సాధించాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2022 వేలంలో అత్యధికంగా రూ. 15.25 కోట్ల ధర పలికాడు.రూ. 11.25 కోట్లకు రైజర్స్‌కు సొంతంఅయితే, మెగా వేలం-2025కి ముందు ముంబై ఇషాన్ కిషన్‌ను వదిలేసింది. ఈ క్రమంలో వేలంపాటలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు ఇషాన్‌ను కొనుక్కుంది. ఇప్పటి వరకు ఐపీఎల్-2025లో విధ్వంసకర శతకం (106 నాటౌట్) బాదడం మినహా ఇషాన్ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు సాధించిన పరుగులు 138. నాలుగు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఓటమిఇక ముంబై- సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన కమిన్స్ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు నష్టపోయి 18.1 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. బంతితో, బ్యాట్‌తో రాణించిన ముంబై ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన జాక్స్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ (28), ఇషాన్ కిషన్ (2) రూపంలో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ 26 బంతుల్లో 36 పరుగులు సాధించాడు.చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్ బృందం నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యం కారణంగా ఈ సీజన్లో ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది.అంతేకాదు.. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు సొంత మైదానం వెలుపల ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins)తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.ఇలాంటి వికెట్ మీద కష్టమే..‘‘వాంఖడే వికెట్‌పై పరుగులు రాబట్టడానికి కష్టపడాల్సి వచ్చింది. బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సులువుగానే రన్స్ చేయొచ్చనే అనిపించింది. కానీ అనూహ్యంగా పిచ్ పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఎక్కడిక్కడ మమ్మల్ని కట్టడి చేశారు. మేము కూడా బాగానే బ్యాటింగ్ చేశాం. ఇలాంటి వికెట్ మీద 160 అనేది మెరుగైన స్కోరే. కానీ మేము ఇంకాస్త బెటర్‌గా బ్యాటింగ్ చేయాల్సింది. ఈరోజు మా వాళ్లు పవర్‌ప్లేలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పోలేదు.మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీనిర్లక్ష్య రీతిలో హిట్టింగ్ కూడా ఆడలేదు. కానీ ఇలా జరిగిపోయింది. మేము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. ఇక మా బౌలింగ్ విషయానికొస్తే డెత్ ఓవర్లలో మా ప్రదర్శన పర్వాలేదనిపించింది.ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన బౌలర్‌తో 1-2 ఓవర్లు మాత్రమే వేయించగలము అనిపించింది. అందుకే రాహుల్ చహర్‌ను తీసుకువచ్చాం. ఫైనల్‌కు చేరుకోవాలంటే హోం గ్రౌండ్ వెలుపల ఎక్కువగా మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.కానీ దురదృష్టవశాత్తూ ఈ సీజన్లో మేము ఇంత వరకు ఇతర వేదికలపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాం. పొరపాట్లను సమీక్షించుకుని సానుకూలంగా ముందుకు వెళ్తాం. తదుపరి మా సొంత మైదానంలో మ్యాచ్ ఆడబోతున్నాం. మాకు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. అనుకున్న ఫలితం రాబట్టగలమని నమ్ముతున్నాం’’ అని ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.శైలికి భిన్నంగాకాగా వాంఖడే వేదికగా టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. దూకుడైన తమ శైలికి భిన్నంగా రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40), ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28) నెమ్మదిగా ఆడారు. ఇషాన్ కిషన్ (2), నితీశ్ రెడ్డి (21 బంతుల్లో 19) పూర్తిగా విఫలం కాగా.. క్లాసెన్ (28 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించాడు.ఆఖర్లో అనికేత్ వర్మ (8 బంతుల్లో 18 నాటౌట్), కమిన్స్ (4 బంతుల్లో 8 నాటౌట్) కాస్త వేగంగా ఆడగా.. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి రైజర్స్ ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీయగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ విల్ జాక్స్ రెండు వికెట్లు కూల్చాడు.పాండ్యా మెరుపులుఇక లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (31), రోహిత్ శర్మ (26) ఫర్వాలేదనిపించగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్) రాణించారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్ (9 బంతుల్లో 21)తొ మెరిసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైజర్స్ కెప్టెన్ కమిన్స్‌కు మూడు, ఇషాన్ మలింగకు రెండు, హర్షల్ పటేల్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్‌కు జాక్ పాట్..?Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
సమఉజ్జీల సమరం!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆరేసి మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు నాలుగింట గెలిచి 8 పాయింట్లతో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. తాజా సీజన్లో ప్రత్యర్థి జట్ల మైదానాల్లో వరుస విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మాత్రం గెలుపు రుచి చూడలేకపోయింది. మాజీ చాంపియన్లు కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్‌ను వారి వారి సొంత మైదానాల్లో ఓడించిన ఆర్సీబీ... బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. మరోవైపు గత మ్యాచ్‌లో 111 పరుగులే చేసినా... బౌలింగ్ బలంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను నిలువరించిన పంజాబ్ కింగ్స్ మంచి ఊపు మీద ఉంది. పంజాబ్ స్పిన్నర్లను బెంగళూరు బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. చహల్ మ్యాజిక్ కీలకం... శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య రూపంలో ప్రతిభావంతులైన ఓపెనర్లు అందుబాటులో ఉండగా... అయ్యర్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్‌తో మిడిలార్డర్ మెరుగ్గా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ ఫామ్‌ను ఐపీఎల్లో సైతం కొనసాగిస్తున్న అయ్యర్... తనకు అనువైన రోజు భారీ స్కోర్లతో చెలరేగుతున్నాడు. అదే సమయంలో నిలకడ కొనసాగించలేకపోతున్నాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అదనపు స్పిన్నర్‌గా సేవలందిస్తున్నా... బ్యాటర్‌గా మాత్రం అతడి స్థాయి ప్రదర్శన ఇంకా రాలేదు. బౌలింగ్‌లోనూ పంజాబ్‌కు విభిన్న ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మార్కో యాన్సెన్, అర్ష్ దీప్ సింగ్, జేవియర్ బార్ట్లెట్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. గత మ్యాచ్‌లో కోల్‌కతాపై 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన పంజాబ్ ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కీలకం కానున్నాడు. బెంగళూరు పిచ్‌పై అతడికి మంచి అవగాహన ఉండటం పంజాబ్‌కు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది.చిన్నస్వామిలో బోణీ కొట్టేనా... ఈ సీజన్ ఆరంభం నుంచి మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రధానంగా బ్యాటర్లపైనే ఆధారపడుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ రూపంలో ఆ జట్టుకు ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్‌తో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే పవర్‌ప్లేతో పాటు స్లాగ్ ఓవర్లలో ధాటిగా ఆడుతున్న ఆర్సీబీ... మధ్య ఓవర్లలో మాత్రం సులువుగా పరుగులు రాబట్టలేకపోతోంది. ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బెంగళూరు బ్యాటర్లు తడబడుతున్నారు. గుజరాత్ స్పిన్నర్ సాయికిషోర్, ఢిల్లీ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ బౌలింగ్ ఆడలేక ఇబ్బంది పడ్డారు. బౌలింగ్‌లో హాజల్‌వుడ్, యశ్ దయాళ్, భువనేశ్వర్ కుమార్ పేస్ బారం మోయనుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. 33 ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖిగా 33 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచ్‌ల్లో బెంగళూరు, 17 మ్యాచ్‌ల్లో పంజాబ్ విజయం సాధించాయి. 2023లో పంజాబ్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లోనూ, గత ఏడాది పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు జట్టే గెలిచింది. పంజాబ్‌పై బెంగళూరు అత్యధిక స్కోరు 241 కాగా... అత్యల్ప స్కోరు 84. బెంగళూరుపై పంజాబ్ అత్యధిక స్కోరు 232 కాగా, అత్యల్ప స్కోరు 88. తుది జట్లు (అంచనా) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ. పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, యాన్సెన్, జేవియర్, అర్ష్ దీప్ , స్టొయినిస్, చాహల్. -
రైజర్స్ ఓటమి బాట
ఐదు రోజుల క్రితం అద్భుత ఆటతో 245 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు సమష్టి వైఫల్యంతో మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మళ్లీ ఓటమి చేరింది. బ్యాటింగ్‌లో మెరుపులు కనిపించక టీమ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్ కొంత తడబడినా... మరో 11 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకోవడంలో సఫలమైంది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో ముంబై 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్’ విల్ జాక్స్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర్యాన్ రికెల్టన్ (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. కనిపించని దూకుడు... ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్‌కు అదృష్టం కలిసొచ్చింది. దీపక్ చహర్ వేసిన బంతి అభిక్ బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకొని స్లిప్ వైపు దూసుకెళ్లగా విల్ జాక్స్ దానిని అందుకోలేకపోయాడు. అనంతరం అతను కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. మరోవైపు ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) బ్యాటింగ్‌లో సహజమైన ధాటి కనిపించలేదు. చహర్ ఓవర్లో అభిషేక్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఒక్కసారిగా ముంబై బౌలర్ల ఆధిపత్యం మొదలైంది. కట్టుదిట్టమైన బంతులతో వారు రైజర్స్‌ను నిలువరించారు. తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం (45 బంతుల్లో) తర్వాత అభిషేక్‌ను పాండ్యా వెనక్కి పంపాడు. 24 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చినా... నోబాల్‌తో బతికిపోయిన హెడ్ దానిని వాడుకోలేకపోయాడు. ఇషాన్ కిషన్ (2) మళ్లీ విఫలం కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 19; 1 ఫోర్) మరోసారి ప్రభావం చూపలేకపోయాడు. పవర్‌ప్లే ముగిసిన తర్వాత 7–17 ఓవర్ల మధ్యలో రైజర్స్ 5 ఫోర్లు మాత్రమే కొట్టగా... ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్ వరకు ఒక్క సిక్స్ కూడా రాలేదు. చివర్లో 2 ఓవర్ల కారణంగా (మొత్తం 43 పరుగులు) రైజర్స్ స్కోరు 160 దాటింది. చహర్ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4, 4, 6 బాదగా... పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో అనికేత్ 2 సిక్స్‌లు, కమిన్స్ ఒక సిక్స్ కొట్టారు. కీలక భాగస్వామ్యం.. ఎప్పటిలాగే ఫటాఫట్ షాట్లతో ఛేదనను మొదలు పెట్టిన రోహిత్ శర్మ (16 బంతుల్లో 26; 3 సిక్స్‌లు) మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు సిక్సర్లు బాదాడు. మలింగ ఓవర్లో రికెల్టన్ మూడు ఫోర్లు కొట్టగా, 4 పరుగుల వద్ద జాక్స్ ఇచ్చిన క్యాచ్‌ను హెడ్ వదిలేశాడు. రికెల్టెన్ అవుటైన తర్వాత జాక్స్, సూర్యకుమార్ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 29 బంతుల్లో 52 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరిద్దరు ఏడు పరుగుల తేడాతో వెనుదిరిగినా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి గెలుపు దిశగా నడిపించారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) (సబ్) బావా (బి) పాండ్యా 40; హెడ్ (సి) సాంట్నర్ (బి) జాక్స్ 28; ఇషాన్ కిషన్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) తిలక్ వర్మ (బి) బౌల్ట్ 19; క్లాసెన్ (బి) బుమ్రా 37; అనికేత్ వర్మ (నాటౌట్) 18; కమిన్స్ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–59, 2–68, 3–82, 4–113, 5–136. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–47–0, బౌల్ట్ 4–0–29–1, బుమ్రా 4–0–21–1, విల్ జాక్స్ 3–0–14–2, హార్దిక్ పాండ్యా 4–0–42–1, సాంట్నర్ 1–0–8–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) హెడ్ (బి) హర్షల్ పటేల్ 31; రోహిత్ (సి) హెడ్ (బి) కమిన్స్ 26; విల్ జాక్స్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 36; సూర్యకుమార్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 26; తిలక్ వర్మ (నాటౌట్) 21; పాండ్యా (సి) ఇషాన్ కిషన్ (బి) మలింగ 21; నమన్ (ఎల్బీ) (బి) మలింగ 0; సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–32, 2–69, 3–121, 4–128, 5–162, 6–162. బౌలింగ్: షమీ 3–0–28–0, కమిన్స్ 4–0–26–3, ఇషాన్ మలింగ 4–0–36–2, అన్సారీ 3.1–0–35–0, హర్షల్ 3–0–31–1, రాహుల్ చహర్ 1–0–9–0. ఐపీఎల్లో నేడుబెంగళూరు X పంజాబ్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: కలిసి కట్టుగా రాణించిన ముంబై.. చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది (6 వికెట్లు కోల్పోయి). ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. -
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ తమ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. సన్‌రైజర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన రోహిత్ వాంఖడే స్టేడియంలో (ఐపీఎల్లో) ఇప్పటివరకు 102 సిక్సర్లు కొట్టాడు. ఒకే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, డివిలియర్స్ సరసన చేరాడు. ఈ ముగ్గురు కూడా ఆర్సీబీకి ఆడుతూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 130 సిక్సర్లు బాదగా.. గేల్ 127, డివిలియర్స్ 118 సిక్సర్లు కొట్టారు. ఐపీఎల్లో ఈ ముగ్గురితో పాటు రోహిత్ మాత్రమే ఒకే వేదికలో సిక్సర్ల సెంచరీని పూర్తి చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఆదిలో విధ్వంసం సృష్టించి, ఆతర్వాత ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 16 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/2గా ఉంది. రోహిత్ ఔటయ్యాక మరో ఓపెనర్ రికెల్టన్ (31) కూడా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం విల్ జాక్స్ (14), సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి. -
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో టేబుల్ సెకెండ్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ తమ గాయపడిన ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా శ్రీలంక పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్ దసున్ షనకను ఎంపిక చేసుకుంది. షనక 2023 సీజన్లో కూడా గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్ మెగా వేలంలో షనక అన్ సోల్డ్‌గా మిగిలిపోయినప్పటికీ.. ఫిలిప్స్ గాయపడటంతో అతనికి అవకాశం వచ్చింది. షనక త్వరలోనే గుజరాత్ టైటాన్స్‌తో జతకడతాడని సమాచారం. షనక 2023 సీజన్లో గుజరాత్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 26 పరుగులే చేశాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన షనకకు ఆ సీజన్లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. 2023 సీజన్లో గుజరాత్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో రన్నరప్‌గా నిలిచింది. షనక ఈ ఏడాది ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (దుబాయ్) టైటిల్ గెలిచిన దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 33 ఏళ్ల కుడి చేతి వాటం ఆల్‌రౌండర్ అయిన షనక శ్రీలంక తరఫున 6 టెస్ట్‌లు, 71 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. షనక టెస్ట్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ 13 వికెట్లు.. వన్డేల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు, 27 వికెట్లు.. టీ20ల్లో 5 హాఫ్ సెంచరీలు, 33 వికెట్లు తీశాడు. షనక వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. షనక తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో గుజరాత్ తరఫునే మూడు మ్యాచ్‌లు ఆడాడు.ఫిలిప్స్ విషయానికొస్తే.. ఈ సీజన్లోనే సన్‌రైజర్స్ నుంచి గుజరాత్‌కు వచ్చిన ఫిలిప్స్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఏప్రిల్ 6న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిలిప్స్ గాయపడ్డాడు. గాయం తీవ్రమైంది కావడంతో ఫిలిప్స్ సీజన్ మొత్తానికే దూరమ్యాడు.గుజరాత్ ఈ సీజన్‌ను నిదానంగా ఆరంభించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి, రెండింట ఓటమిపాలైంది. గుజరాత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 19న అహ్మదాబాద్‌లో జరుగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఈ సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడి ఐదింట గెలిచింది. ఆర్సీబీ, పంజాబ్ చెరో 6 మ్యాచ్‌లు ఆడి తలో 4 విజయాలతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. లక్నో, కేకేఆర్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్, సీఎస్కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. -
MI VS SRH: రికార్డుల్లోకెక్కిన ట్రావిస్ హెడ్.. గేల్, మ్యాక్స్‌వెల్ కంటే వేగంగా..!
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 10 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 75/2గా ఉంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), ఇషాన్ కిషన్ (3 బంతుల్లో 2) ఔట్ కాగా.. ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 25; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (5 బంతుల్లో 3) క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీపక్ చాహర్ 3 ఓవర్లలో 26 పరుగులు.. బౌల్ట్ ఓ ఓవర్లో 10 పరుగులు.. బుమ్రా 2 ఓవర్లలో 10, విల్ జాక్స్ 2 ఓవర్లలో 12 (ఇషాన్ వికెట్), హార్దిక్ 2 ఓవర్లలో 17 పరుగులిచ్చారు (అభిషేక్ వికెట్). ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్, హెడ్లకు మూడు లైఫ్‌లు లభించాయి. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్, హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో హెడ్ క్యాచ్ ఔటైనప్పటికీ నో బాల్ కావడంతో బ్రతికిపోయాడు.1000 పరుగుల క్లబ్లో హెడ్ఈ మ్యాచ్‌లో హెడ్ ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. హెడ్ కేవలం 575 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో ఆండ్రీ రసెల్ మాత్రమే హెడ్ కంటే వేగంగా 1000 పరుగులు పూర్తి చేశాడు. రసెల్ 545 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. హెడ్.. విధ్వంసకర వీరులు క్రిస్ గేల్ (615), మ్యాక్స్‌వెల్ (610) కంటే వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.ఐపీఎల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు.. 545 - ఆండ్రీ రస్సెల్575 - ట్రావిస్ హెడ్*594 - హెన్రిచ్ క్లాసెన్604 - వీరేంద్ర సెహ్వాగ్610 - గ్లెన్ మాక్స్వెల్615 - క్రిస్ గేల్617 - యూసుఫ్ పఠాన్617 - సునీల్ నరైన్ -
IPL 2025: రాయల్స్‌తో మ్యాచ్.. డకౌటైనా రికార్డుల్లోకెక్కిన కరుణ్ నాయర్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 16) జరిగిన ఆసక్తికర పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు కరుణ్ నాయర్ డకౌటైనా ఓ అరుదైన రికార్డును సెట్ చేశాడు. ఐపీఎల్లో ఐదు టై అయినా మ్యాచ్‌ల్లో భాగమైన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.జస్ప్రీత్ బుమ్రా, క్రిస్ గేల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పోలార్డ్, కేఎల్ రాహుల్, నితీశ్ రాణా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో నాలుగు టై మ్యాచ్‌ల్లో భాగంగా ఉన్నారు. వీరందరితో పోలిస్తే కరుణ్ అతి తక్కువ మ్యాచ్‌లు (78) ఆడి అత్యధికంగా ఐదు టై మ్యాచ్‌ల్లో భాగమైన ఆటగాడిగా నిలిచాడు.ఐపీఎల్లో కరుణ్ భాగమైన టై మ్యాచ్‌లు..2013లో ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్2014లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ 2014లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్2015లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ2025లో ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ఢిల్లీ, రాయల్స్ తాజా మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (49), కేఎల్ రాహుల్ (38), ట్రిస్టన్ స్టబ్స్ (34 నాటౌట్), అక్షర్ పటేల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్ 2, తీక్షణ, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ చేసినన్ని పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (51), సంజూ శాంసన్ (31 రిటైర్డ్ హర్ట్), నితీశ్ రాణా (51) రాణించినా చివరి ఓవర్లో రాయల్స్ తడబడింది. స్టార్క్ 18, 20వ ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్ గెలుపును అడ్డుకున్నాడు. చివరి బంతికి రాయల్స్ గెలుపుకు 2 పరుగులు అవసరం కాగా.. జురెల్ ఒక్క పరుగు మాత్రమే తీసి రనౌటయ్యాడు. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైందిసూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. స్టార్క్ ఇక్కడ కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 11 పరుగులు మాత్రమే చేసింది. ఇద్దరు ఆటగాళ్లు ఔట్ కావడంతో రాయల్స్ కేవలం 5 బంతులు మాత్రమే ఆడగలిగింది. నాలుగు, ఐదు బంతుల్లో రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ రనౌటయ్యారు.12 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. నాలుగో బంతికే లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ బరిలోకి దిగారు. రాహుల్ తొలి బంతికి 2, రెండో బంతికి బౌండరీ, మూడో బంతికి సింగిల్ తీయగా.. స్టబ్స్ నాలుగో బంతికి సిక్సర్ బాది ఢిల్లీని గెలిపించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది 15వ టై మ్యాచ్ కాగా.. 2022 నుంచి ఇదే మొదటిది. -
IPL 2025: సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం
సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది (6 వికెట్ల నష్టానికి). ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై14.3వ ఓవర్- 128 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో అన్సారీకి క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (36) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై12.4వ ఓవర్- 121 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో జీషన్ అన్సారీకి క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (26) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/29 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/2గా ఉంది. రోహిత్ ఔటయ్యాక మరో ఓపెనర్ రికెల్టన్ (31) కూడా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం విల్ జాక్స్ (14), సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి.హ్యాట్రిక్ ఫోర్లతో రఫ్ఫాడించిన రికెల్టన్ఎషాన్ మలింగ బౌలింగ్‌లో (6వ ఓవర్) రికెల్టన్ హ్యాట్రిక్ ఫోర్లతో రఫ్ఫాడించాడు. 5.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 54/1. రికెల్టన్ 21, విల్ జాక్స్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్163 పరుగుల లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఔటయ్యాడు. రోహిత్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో హెడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 32/1గా ఉంది. రికెల్టన్ (5), జాక్స్ క్రీజ్‌లో ఉన్నారు.సత్తా చాటిన ముంబై బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన సన్రైజర్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు. 18.1 ఓవర్ల తర్వాత 136/5అనికేత్ వర్మ (1), కమిన్స్నత్తనడకన సాగుతున్న ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిదానంగా బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు ఇన్నింగ్స్ నత్తనడకను తలపిస్తుంది. అభిషేక్ (40), హెడ్ (28), ఇషాన్ (2) ఔట్ కాగా.. నితీశ్ (14), క్లాసెన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. 14 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 95/3గా ఉంది. మూడో వికెట్ డౌన్.. హెడ్ ఔట్11.1వ ఓవర్- 82 పరుగుల వద్ద సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. అప్పటికే రెండు లైఫ్‌లు లభించిన హెడ్ (28) విల్ జాక్స్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్.. ఇషాన్ కిషన్ ఔట్8.4వ ఓవర్- 68 పరుగుల వద్ద సన్‌రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. విల్ జాక్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ (2) స్టంపౌటయ్యాడు. హెడ్ (22), నితీశ్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్.. అభిషేక్ ఔట్7.3వ ఓవర్-సన్‌రైజర్స్ 59 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రాజ్ బవాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (40) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 65/1గా ఉంది. హెడ్ (20), ఇషాన్ కిషన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 53/0అభిషేక్ 36, ట్రవిస్ హెడ్ 14కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ముంబై బౌలర్లుటాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు అభిషేక్, హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తొలి నాలుగు ఓవర్లు చాహర్, బౌల్ట్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు కేవలం బాదడమే లక్ష్యంగా పెట్టుకుని సఫలం కాలేకపోతున్నారు. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/0గా ఉంది. అభిషేక్ 20, హెడ్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఏడులో, ఎస్ఆర్హెచ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.తుది జట్లు..ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్‌కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, అశ్వని కుమార్, రాజ్ బావా, రాబిన్ మింజ్సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగసన్రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్ -
ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ!
గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ (Munaf Patel)కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. అంతేకాదు.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా మునాఫ్ పటేల్ అనుచిత ప్రవర్తనకు గానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మేరకు శిక్ష విధించింది.మ్యాచ్ ‘టై’.. ఫలితం తేల్చేందుకుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ సొంత మైదానంలో బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో తలపడింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అక్షర్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.సూపర్ ఓవర్లో గెలిచిన ఢిల్లీఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ కూడా 20 ఓవర్ల పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి.. 188 పరుగులే చేసింది. ఫలితంగా మ్యాచ్ ‘టై’ కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ ఐదు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేయగా.. ఢిల్లీ (2, 4, 1, 6) నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.పట్టికలో అగ్రస్థానానికిఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందడంతో పాటు.. సీజన్లో ఐదో విజయం అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ- రాజస్తాన్ జట్ల మధ్య సూపర్ ఓవర్ సమయంలో ఢిల్లీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ ఫోర్త్ అంపైర్‌తో వాదనకు దిగాడు.అంపైర్‌తో వాగ్వాదంబౌండరీ లైన్ వద్ద ఫోర్త్ అంపైర్ నిల్చుని ఉండగా.. అక్కడే కూర్చుని ఉన్న మునాఫ్ పటేల్ అతడితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాడు. మైదానంలో ఉన్న తమ ఆటగాళ్లకు సందేశం చేరవేసేందుకు వేరే ఆటగాడిని పంపాలని భావించగా.. ఫోర్త్ అంపైర్ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడితో మునాఫ్ వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.జరిమానాతో పాటుఈ క్రమంలో ఐపీఎల్ పాలక మండలి మునాఫ్ పటేల్‌కు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా జతచేసినట్లు వెల్లడించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.20 నిబంధనను అతడు ఉల్లంఘించిన కారణంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.కాగా మునాఫ్ పటేల్ మార్గదర్శనంలో ఢిల్లీ బౌలింగ్ విభాగం రాణిస్తోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ జట్టును అగ్రస్థానంలో నిలపడంలో బౌలర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసి.. మ్యాచ్ టై కావడానికి ప్రధాన కారణమైన పేసర్ మిచెల్ స్టార్క్.. సూపర్ ఓవర్లోనూ అద్భుతం చేసి ఢిల్లీని గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: Rohit Sharma: కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
సందీప్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే
రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ సందీప్ శర్మ (Sandeep Sharma) అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఆఖరి ఓవర్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్‌గా సందీప్ నిలిచాడు. ఐపీఎల్-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శర్మ ఈ చెత్త రికార్డును నెలకొల్పాడు.ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన సందీప్ ఏకంగా 11 బంతులు విసిరాడు. ఆ ఓవర్లో సందీప్ నాలుగు వైడ్లు, ఓ నోబాల్ వేయడం గమనార్హం. ఆఖరి ఓవర్లో శర్మ మొత్తంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ చెత్త రికార్డు సాధించిన నాలుగో బౌలర్‌గా సందీప్ నిలిచాడు. సందీప్ కంటే ముందు మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్ పాండే, శార్ధూల్ ఠాకూర్ 11 బంతలు ఒకే ఓవర్లో వేశారు. అయితే ఈ ముగ్గురు ఆఖరి ఓవర్ కాకుండా వేర్వేరు ఓవర్లల్లో 11 బంతులు విసిరారు.ఐపీఎల్లో ఒకే ఓవర్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్లు..👉11 బంతులు మొహమ్మద్ సిరాజ్ vs ముంబై ఇండియన్స్ 2023 (ఓవర్ 19)👉11 బంతులు తుషార్ దేశ్‌పాండే vs లక్నో సూపర్ జెయింట్స్ 2023 (ఓవర్ 4)👉11 బంతులు శార్దూల్ ఠాకూర్ vs కేకేఆర్ 2025 (ఓవర్ 13)👉11 బంతులు సందీప్ శర్మ vs ఢిల్లీ క్యాపిటల్స్ 2025 (ఓవర్ 20)కాగా చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. సూపర్ ఓవర్లో రాజస్తాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే సూపర్ ఓవర్లో కూడా సందీప్ శర్మనే బౌలింగ్ చేయడం గమనార్హం. 12 పరుగుల టార్గెట్‌ను సందీప్ డిఫెండ్ చేసుకోలేకపోయాడు.చదవండి: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది' -
"అతడు మా జట్టుకు ఫినిషర్.. అందుకే నేను బ్యాటింగ్‌కు రాలేదు"
ఐపీఎల్-2025లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అనుహ్య ఓటమి చవిచూసింది. సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో ఢిల్లీపై రాజస్తాన్ పై చేయి సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ కూడా సరిగ్గా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. సూపర్ ఓవర్లో రాజస్తాన్ రాయల్స్ తొలుత రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మైర్లను బ్యాటింగ్ పంపింది. పరాగ్ ఔటైన తర్వాత జైశ్వాల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. రాజస్తాన్ సూపర్ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు మాత్రమే చేసింది. ఆ రెండు వికెట్లు కూడా రనౌట్ల రూపంలో వచ్చినివే కావడం గమానార్హం. అయితే 51 పరుగులతో క్విక్ ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రాణాను సూపర్ ఓవర్లో రాజస్తాన్ మెనెజ్మెట్ బ్యాటింగ్‌కు పంపించకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. హెట్‌మైర్ స్టార్క్ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మళ్లీ అతడినే ఎందుకు బ్యాటింగ్‌కు పంపించారని రాజస్తాన్ మెనెజ్మెంట్పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. తాజాగా సూపర్ ఓవర్లో తను బ్యాటింగ్‌కు రాకపోవడంపై నితీష్ స్పందించాడు."హెట్‌మైర్, పరాగ్‌లను బ్యాటింగ్ పంపించాలన్నది ఎవరో ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు. జట్టు మెనెజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం అది. కోచ్‌లతో పాటు కెప్టెన్, ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అందరూ ఆలోచించే వారిని బ్యాటింగ్‌కు పంపించారు. అదే షిమ్రాన్ హెట్‌మైర్ రెండు సిక్సర్లు కొట్టి ఉంటే, మీరు ఈ ప్రశ్న నాకు అడిగి ఉండరు. నా దగ్గర వేరే సమాధానం లేదు కూడా. మేము తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సరైనదే. హెట్‌మైర్ మా ఫినిషర్. గతంలో అతడు ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు. మేము సూపర్ ఓవర్లో గెలిచి ఉంటే మీ ప్రశ్న కాస్త భిన్నంగా ఉండేది. క్రికెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సందీప్ శర్మ గతంలో సూపర్ ఓవర్లో బాగా బౌలింగ్ చేశాడు. ఈ సారి కూడా అందుకే అతడికి బంతిని ఇచ్చాము. ఏదేమైనప్పటికి సూపర్ ఓవర్లో నాలుగు నుంచి ఆరు పరుగులు అదనంగా సాధించి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాణా పేర్కొన్నాడు.చదవండి: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది' -
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐపీఎల్-2025లో పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముంబై ఇండియన్స్ (Mumabi Indians)కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగులు కేవలం 56. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రోహిత్.. 12 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.మరోవైపు.. ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచిన హార్దిక్ సేన.. ఈసారి కూడా ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ముంబై కేవలం రెండే గెలవడం ఇందుకు నిదర్శనం.సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢీఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన హార్దిక్ సేన.. గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వైఫల్యం ముంబైపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బ్యాటింగ్ ఆర్డరే ప్రధాన సమస్య‘‘ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. బ్యాటింగ్ ఆర్డర్. అవును ఇది నిజమే. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులు సాధించలేకపోతున్నాడు. ఒకవేళ అతడి వైఫల్యం ఇలాగే కొనసాగితే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కుదేలవడం ఖాయం.రోహిత్ కుదురుకోకపోతే.. ఎవరిని ఎప్పుడు బ్యాటింగ్‌కు పంపాలో అర్థం కాని పరిస్థితి. నిజానికి ఓపెనర్‌గా రియాన్ రికెల్టన్ రాణిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ డీసెంట్‌గా బ్యాటింగ్ చేస్తున్నారు.నమన్ ధీర్ చక్కగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ఇకపోతే.. విల్ జాక్స్ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నా.. పర్లేదనిపిస్తున్నాడు. ఎటొచ్చీ రోహిత్ శర్మ ఫామ్‌లేమి వల్లే సమస్య. అతడు ఓపెనర్ కాబట్టి నమన్ ధీర్, విల్ జాక్స్ వంటి వాళ్లను బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక పంపాల్సి వస్తోంది.సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో?ఏదేమైనా రోహిత్ వైఫల్యాలు ఇలాగే కొనసాగితే ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ గొప్ప టీ20 ప్లేయర్ అని.. అయితే, ఆది నుంచే దూకుడు ప్రదర్శించకుండా కాస్త జాగ్రత్తగా ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్ -
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
ఐపీఎల్-2025లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు. సూపర్ ఓవర్లో రాజస్తాన్‌పై ఢిల్లీ థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఇక సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ స్టార్క్ దెబ్బకి 11 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఢిల్లీ ఈ లక్ష్యాన్ని 4 బంతుల్లోనే ఛేదించి విజయ భేరి మ్రోగించింది. 189 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో నితీష్ రాణా (51), యశస్వి జైస్వాల్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ సైతం 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులే చేసింది. కాగా ఢిల్లీ చేతిలో రాజస్తాన్ రాయల్స్ ఓటమికి ఆ జట్టు స్టార్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కారణమంటూ ఫ్యాన్స్ ఫైరవవుతున్నారు. అతడి "స్వార్థపూరిత నిర్ణయం వల్లే రాజస్తాన్ ఓడిపోయిందని మండిపడుతున్నారు.అసలేమి జరిగిందంటే?రాజస్తాన్ విజయానికి ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరమ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను మిచెల్ స్టార్క్‌కు కెప్టెన్ అక్షర్ పటేల్ అప్పగించాడు. తొలి బంతికి హెట్‌మైర్ సింగిల్ తీసి జురెల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. జురెల్ కూడా రెండో బంతికి సింగిల్ తీయగా.. మూడో బంతికి హెట్‌మైర్ డబుల్ తీశాడు.నాలుగో బంతికి కూడా హెట్‌మైర్ డబుల్ సాధించాడు. దీంతో ఆఖరి రెండు బంతుల్లో రాజస్తాన్ విజయానికి కేవలం మూడు పరుగులు మాత్రమే అవరసమయ్యాయి. ఐదో బంతిని హెట్‌మైర్ హాఫ్ సైడ్ ఆడాడు. తొలి పరుగు పూర్తి చేసుకుని రెండో రన్ కోసం షిమ్రాన్ ముందుకు రాగా జురెల్ మాత్రం అందు తిరష్కరించాడు. జురెల్ పరిగెత్తుంటే ఈజీగా రెండో పరుగు వచ్చి ఉండేది. కానీ జురెల్ మాత్రం ఆఖరి బంతికి స్ట్రైక్ తన వద్దే అంటి పెట్టుకోవాలని భావించాడు. ఆఖరి బంతికి సింగిల్ మాత్రమే తీసి మ్యాచ్‌ను ధ్రువ్ జురెల్ ఫినిష్ చేయలేకపోయాడు. ఆ బంతికి రెండో పరుగు తీసింటే రాజస్తాన్ విజయం సాధించి ఉండేది అని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. -
జిడ్డు బ్యాటింగ్!.. ఇలా అయితే కష్టం రాహుల్: పుజారా విమర్శలు
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ (KL Rahul) బ్యాటింగ్ తీరును భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) విమర్శించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాహుల్ జిడ్డు ఇన్నింగ్స్ ఆడాడని.. సీనియర్ ఆటగాడు ఇలా చేయడం తగదని పేర్కొన్నాడు. క్రీజులో కుదురుకున్న తర్వాతైనా ఈ కర్ణాటక క్రికెటర్ బ్యాట్ ఝులిపించాల్సిందని పుజారా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆరంభ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన రాహుల్ ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తన విలువను చాటుకుంటున్నాడు. ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 238 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఢిల్లీ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం కేఎల్ రాహుల్ స్లో ఇన్నింగ్స్ ఆడాడు. అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ (9) వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన కరుణ్ నాయర్ రనౌట్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు.స్ట్రైక్ రేటు 118.75ఈ క్రమంలో మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకోగా.. నాలుగో స్థానంలో వచ్చిన రాహుల్ అతడికి సహకరించాడు. అయితే, క్రీజులో నిలదొక్కుకునేందుకు రాహుల్ చాలా సమయమే తీసుకున్నాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 118.75.ఇక జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో షార్ట్ డెలివరీని ఆడబోయి రాహుల్ బంతిని గాల్లోకి లేపగా.. మిడ్ వికెట్ పొజిషన్లో ఉన్న హెట్మెయిర్ వేగంగా పరిగెత్తుకుని వచ్చి క్యాచ్ అందుకున్నాడు. దీంతో రాహుల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.షాట్ల ఎంపికలో జాగ్రత్త రాహుల్ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి ఛతేశ్వర్ పుజారా స్పందించాడు. ‘‘కేఎల్ సీనియర్ ఆటగాడు.. అతడు 15- 20 బంతులు ఆడాలని అనుకుని ఉంటాడు. ఆ తర్వాత బ్యాట్ ఝులిపిద్దామనుకున్నాడేమో!... కానీ నాకైతే అతడు కాస్త దూకుడుగా ఆడితే బాగుండు అనిపించింది.తను క్రీజులో కుదురుకున్నాడు.. పిచ్ పిరిస్థితులపై కూడా అవగాహన ఉంది. పరుగులు రాబట్టకపోతే కష్టమనీ తెలుసు. అయినా సరే ఎందుకో అతడు దూకుడుగా ఆడలేకపోయాడు. రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త మార్పు వచ్చింది.ఐపీఎల్లో తను ఓపెనర్‌గా వచ్చేవాడు. ఇప్పుడు మిడిలార్డర్లో వస్తున్నాడు. నిజానికి పవర్ ప్లేలో అతడి ఆట తీరు వేరేలా ఉండేది. ఏదేమైనా షాట్ల ఎంపికలో రాహుల్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే, అతి జాగ్రత్త పనికిరాదు.ఎంత సేపూ వికెట్ కాపాడుకోవడం కోసమేనా?కేవలం వికెట్ కాపాడుకునేందుకే అతడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అలా కాకుండా తనదైన సహజశైలిలో రాహుల్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది’’ అని పుజారా అభిప్రాయపడ్డాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రాహుల్ అవుటైన తర్వాత.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్), కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా ఢిల్లీ 20 ఓవర్లలో 188 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ కూడా 188 పరుగులు చేసినా.. సూపర్ ఓవర్లో చెత్త బ్యాటింగ్‌తో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్📁 TATA IPL↳ 📂 Super OverAnother day, another #TATAIPL thriller! 🤩Tristan Stubbs wins the Super Over for #DC in style! 🔥Scorecard ▶ https://t.co/clW1BIPA0l#DCvRR pic.twitter.com/AXT61QLtyg— IndianPremierLeague (@IPL) April 16, 2025𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
DC vs RR: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?
రాజస్తాన్ రాయల్స్ నాయకత్వ బృందంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ (Shane Watson) మండిపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సూపర్ ఓవర్లో రాయల్స్ తెలివి తక్కువగా వ్యవహరించి.. మ్యాచ్‌ను చేజార్చుకుందని పేర్కొన్నాడు. సూపర్ ఓవర్లో ఇన్ఫామ్ బ్యాటర్ నితీశ్ రాణాను పంపకపోవడాన్ని మతిలేని చర్యగా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశాడు.ఒకే స్కోరు.. 188 పరుగులు ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్- రాజస్తాన్ రాయల్స్ (DC vs RR) బుధవారం తలపడ్డాయి. అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 38) రాణించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్), కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఇక లక్ష్య ఛేదనలో రాయల్స్ 20 ఓవర్ల ఆటలో నాలుగు వికెట్లు నష్టపోయి సరిగ్గా 188 పరుగులే చేసింది.ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51), కెప్టెన్ సంజూ శాంసన్ (19 బంతుల్లో 31 రిటైర్ట్ హర్ట్) రాణించగా.. నితీశ్ రాణా (28 బంతుల్లో 51) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఆఖర్లో ధ్రువ్ జురెల్ (17 బంతుల్లో 26), షిమ్రన్ హెట్మెయిర్ (9 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.సూపర్ ఓవర్లో ఢిల్లీ గెలుపుఇక ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొలుత రాజస్తాన్ బ్యాటింగ్ చేయగా.. ఢిల్లీ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో రంగంలోకి దిగాడు. రాయల్స్ బ్యాటర్లలో హెట్మెయిర్ తొలికి పరుగులేమీ తీయలేదు. రెంబో బంతికి ఫోర్ బాది, మూడో బంతికి ఒక్క రన్ సాధించాడు.ఇక నాలుగో బంతికి రియాన్ ఫోర్ బాదాడు.. అది నోబాల్‌గా తేలడంతో ఫ్రీ హిట్ అవకాశం రాగా.. రియాన్ రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొనే క్రమంలో హెట్మెయిర్ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 0.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి రాయల్స్ 11 పరుగులు మాత్రమే చేసింది.అనంతరం సందీప్ శర్మ బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 2, 4, 1 పరుగులు రాబట్టగా.. నాలుగో బంతిని ట్రిస్టన్ స్టబ్స్ సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఈ ఉత్కంఠ పోరులో రాజస్తాన్‌పై ఢిల్లీ జయభేరి మోగించి.. సీజన్లో ఐదో గెలుపు నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్లో రాజస్తాన్ రాయల్స్ నితీశ్ రాణాను బ్యాటింగ్‌కు ఎందుకు పంపలేదని షేన్ వాట్సన్ ప్రశ్నించాడు. ‘‘రాయల్స్ ఇన్నింగ్స్‌లో తొందరపాటు చర్యలు కనిపించాయి. ఇద్దరు బ్యాటర్లు రనౌట్ అయ్యారు. అసలు నితీశ్ రాణా ఏం తప్పు చేశాడు? అతడిని ఎందుకు సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు పంపలేదు?అతడు మంచి రిథమ్‌లో బ్యాటింగ్ చేశాడు. పరుగులు రాబట్టాడు. అయినా సరే.. అతడిని సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు పంపలేదంటే.. మీకు బుర్ర పనిచేయడం లేదని అనుకోవాలా?’’ అంటూ షేన్ వాట్సన్ రాయల్స్ యాజమాన్యాన్ని విమర్శించాడు. చదవండి: SRH vs MI: రైజర్స్ రఫ్ఫాడించేనా! 𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
DC Vs RR: చరిత్ర సృష్టించిన ఢిల్లీ క్యాపిటల్స్..
ఐపీఎల్-2025 (IPL 2025) లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్ ఓవర్లో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో అక్షర్ సేన మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ-రాజస్తాన్ మధ్య జరిగిన ఈ పోరు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం చిన్న చిన్న తప్పిదాల వల్ల రాజస్తాన్ కూడా సరిగ్గా 188 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్లో కూడా రాజస్తాన్ తీరు ఏ మాత్రం మారలేదు. అనవసరంగా రెండు రనౌట్లు అయ్యి మరో రెండు బంతులు మిగిలూండగానే ఇన్నింగ్స్ ముగించింది. సూపర్ ఓవర్లో రాయల్స్ 11 పరుగులు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ 12 పరుగుల టార్గెట్‌ను నాలుగు బంతుల్లోనే ఛేదించింది. ఇక సూపర్ ఓవర్లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది.తొలి జట్టుగా..ఐపీఎల్లో సూపర్ ఓవర్లలో అత్యధిక సార్లు విజయం సాధించిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు 5 సార్లు సూపర్ ఓవర్లు ఆడిన ఢిల్లీ.. అందులో నాలుగింట విజయం సాధించింది. 2013 సీజన్లో ఆర్సీబీపై ఒక్కసారే ఓటమి పాలైంది. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్(3) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో పంజాబ్‌ను ఢిల్లీ అధిగమించింది.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సూపర్ ఓవర్ విజయాలు సాధించిన జట్లు ఇవే..ఢిల్లీ క్యాపిటల్స్-4పంజాబ్ కింగ్స్-3ముంబై ఇండియన్స్-2రాజస్తాన్ రాయల్స్-2ఆర్సీబీ-2చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్ -
మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్.. గాయంపై అప్డేట్ ఇచ్చిన శాంసన్
ఐపీఎల్-2025లో తొలి సూపర్ ఓవర్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికైంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ఇరు జట్లు సమవుజ్జీలగా పోటీ పడిన ఈ మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్లో తేల్చారు. సూపర్ ఓవర్లో రాజస్తాన్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ కూడా సరిగ్గా 188 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 11 పరుగులు చేసింది.రెండు రనౌట్లు అయ్యి నాలుగు బంతులే ఆడి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆ తర్వాత ఢిల్లీ 12 పరుగుల టార్గెట్‌ను నాలుగు బంతుల్లోనే ఫినిష్ చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ రిటైర్డ్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. 189 పరుగుల లక్ష్య చేధనలో సంజూ అద్బుతమైన టచ్‌లో కన్పించాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ అనుహ్యంగా శాంసన్ గాయపడ్డాడు. 6 ఓవర్ వేసిన విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో శాంసన్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అతను బంతిని మిస్ అయ్యాడు. వెంటనే శాంసన్ తన పక్కటెముకల నొప్పితో బాధపడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి అతడికి చికిత్స అందించాడు. ఆ తర్వాతి బంతిని ఆడిన శాంసన్.. పరిగెత్తడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వెనుదిరిగాడు. అనంతరం సూపర్ ఓవర్లో కూడా బ్యాటింగ్, ఫీల్డింగ్‌కు సంజూ రాలేదు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత శాంసన్ తన గాయంపై అప్డేట్ ఇచ్చాడు."ప్రస్తుతం బాగానే ఉన్నాను. ఇప్పుడు మరీ అంత నొప్పిగా లేదు. కానీ ఆ సమయంలో తిరిగి వచ్చి బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా లేను. మా తర్వాతి మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. అంతలో పూర్తి ఫిట్నెస్ సాధిస్తాను" అని శాంసన్ ధీమా వ్యక్తం చేశాడు.. శాంసన్ కేవలం 19 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. -
SRH vs MI: రైజర్స్ రఫ్ఫాడించేనా!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లో సంచలన బాదుడుతో ప్రకంపనలు సృష్టించిన సన్‌రైజర్స్... ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. ఎట్టకేలకు గత పోరులో పంజాబ్ కింగ్స్‌పై భారీ స్కోరును ఛేదించి తిరిగి గెలుపు బాట పట్టింది. గత సీజన్ నుంచి దూకుడే పరమావధిగా చెలరేగిపోతున్న సన్‌రైజర్స్ మరోసారి బ్యాటింగ్ బలాన్నే నమ్ముకొని బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు. 6 మ్యాచ్‌లాడిన ఆ జట్టు 2 విజయాలు, 4 పరాజయాలతో 4 పాయింట్లు మాత్రమే సాధించింది. గత మ్యాచ్‌లో దూకుడు మీదున్న ఢిల్లీని కట్టడి చేయడంతో ముంబై తిరిగి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడంతో... ముంబై బౌలింగ్ మరింత పదునెక్కగా... అతడిని రైజర్స్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. ఇన్నాళ్లు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు మారిన ఇషాన్ కిషన్‌పై అందరి దృష్టి నిలవనుంది. ముంచినా తేల్చినా వాళ్లే! సన్‌రైజర్స్ ప్రధాన బలం టాపార్డర్. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌తో పాటు వన్‌డౌన్ ఆటగాడు ఇషాన్ కిషన్ సత్తా చాటితే ఆరెంజ్ ఆర్మీని ఆపడం కష్టమే. అదే సమయంలో వీళ్లు ఎక్కువసేపు నిలువలేకపోతే ఇన్నింగ్స్ గాడితప్పడం కూడా పరిపాటే. తాజా సీజన్‌ను పరిశీలిస్తే ఇది సుస్పష్టం. ఈ నేపథ్యంలో మరోసారి టాపార్డర్ రాణించాలని రైజర్స్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 246 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించిన హైదరాబాద్... ముంబైపై కూడా కలిసి కట్టుగా కదంతొక్కాలని చూస్తోంది. నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మలతో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. ఎటొచ్చి రైజర్స్‌ను బౌలింగ్ దెబ్బతీస్తోంది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు సీనియర్ పేసర్ షమీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. గత మ్యాచ్‌లో అయితే షమీ మరీ పేలవంగా 4 ఓవర్లలో 75 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. రోహిత్ ఫామ్‌లోకి వచ్చేనా? మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ముంబై ఇండియన్స్‌ను ఆందోళన పరుస్తోంది. సీజన్ ఆరంభం నుంచి తీవ్రంగా తడబడుతున్న రోహిత్.. ఐదు మ్యాచ్‌లాడి 56 పరుగులు మాత్రమే సాధించాడు. ఒకటీ రెండు షాట్లు ఆడటం ఆ తర్వాత అనవసరంగా వికెట్ పారేసుకోవడం హిట్‌మ్యాన్‌కు అలవాటుగా మారిపోయింది. దీంతో మిడిలార్డర్‌పై అదనపు భారం పడుతోంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్‌తో లైనప్ బలంగా ఉంది. లోయర్ ఆర్డర్లో విల్ జాక్స్ పెద్దగా ప్రభావం చూపలేక పోతుండటంతో... కార్బిన్ బాష్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.గాయం కారణంగా మూడు నెలలకు పైగా ఆటకు దూరమై ఇటీవలే తిరిగి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా లయ దొరకబుచ్చుకోవడంపై దృష్టి పెట్టాడు. గత మ్యాచ్‌లో కరుణ్ నాయర్‌ను నిలవరించలేకపోయిన బుమ్రా... ఆరెంజ్ ఆర్మీ దూకుడుకు పగ్గాలు వేయాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. బౌల్ట్, దీపక్ చహర్, సాంట్నర్, కరణ్ శర్మతో బౌలింగ్‌లో మంచి వైవిధ్యం ఉంది. తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, విల్ జాక్స్/కార్బన్ బాష్, సాంట్నర్, దీపక్ చహర్, బౌల్ట్, బుమ్రా, కరణ్ శర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, షమీ, జీషన్ అన్సారి, ముల్డర్. -
ఐపీఎల్లో ఫిక్సింగ్ ప్రయత్నాలు.. ఆ వ్యాపారవేత్తతో జాగ్రత్త!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా సాగుతున్న లీగ్ 18వ సీజన్లో ఫిక్సింగ్ జరిగే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్లు, జట్ల యజమానులు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లకు బీసీసీఐ కీలక సూచనలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్లో ఫిక్సింగ్ జరిగే ఆస్కారముందని లీగ్ తో సంబంధం ఉన్న వారందరికీ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపార వేత్త దీనికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. అలాంటి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం (ఏసీఎస్‌యూ) సూచించింది. ఆటగా ళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, జట్టు యజమానులు, వ్యాఖ్యాతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతూ వారికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా వారిని ఆకర్షించుకునే ప్రయత్నాలు జరగొచ్చని ఏసీఎస్‌యూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వ్యా పారవేత్తకు బుకీలు, పంటర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని కూడా సమాచారం. అతడు గతంలోనూ ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని... ఈనేపథ్యంలో ఐపీఎల్‌తో ప్రత్య క్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ఏసీఎస్‌యూ హెచ్చరించింది. ఎవరైనా ఖరీదైన బహుమతులు, నగలు ఇవ్వజూపితే తమకు తెలియ పరచాలని స్పష్టం చేసింది. అభిమానిగా నటిస్తూ తరచూ ఆటగాళ్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం అతడికి అలవాటని... అది వీలు పడకపోతే ప్లేయర్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువుల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తాడని బీసీసీఐ హెచ్చరించింది. విదేశాల్లో ఉండే వారిని సైతం దీనికోసం సంప్రదిస్తాడని.. సామాజిక మాధ్యమాల్లోనో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
DC Vs RR: ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ
న్యూఢిల్లీ: ఉత్కంఠ ఊపేసిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆధిక్యం చేతులు మారుతూ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్... ఆఖరికి ‘సూపర్ ఓవర్’కు వెళ్లగా... అందులోనూ ఆకట్టుకున్న క్యాపిటల్స్ ఐపీఎల్ 18వ సీజన్లో ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై తొలి విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ (37 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... కేఎల్ రాహుల్ (38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు సరిగ్గా 188 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... సామ్సన్ (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఆఖర్లో తీవ్ర ఒత్తిడిలో ధ్రువ్ జురెల్ (17 బంతుల్లో 26; 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (15 నాటౌట్; 1 ఫోర్) మెరుగైన ప్రదర్శన కనబర్చారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. స్కోరు వివరాలు: ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెక్‌గుర్క్ (సి) జైస్వాల్ (బి) ఆర్చర్ 9; పొరెల్ (సి) పరాగ్ (బి) హసరంగ 49; కరుణ్ (రనౌట్) 0; రాహుల్ (సి) హెట్‌మైర్ (బి) ఆర్చర్ 38; స్టబ్స్ (నాటౌట్) 34; అక్షర్ (సి) జురెల్ (బి) తీక్షణ 34; అశుతోష్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–97, 4–105, 5–146. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2; తుషార్ 3–0–38–0; సందీప్ 4–0–33–0; తీక్షణ 4–0–40–1; హసరంగ 4–0–38–1; పరాగ్ 1–0–6–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 51; సామ్సన్ (రిటైర్డ్ హర్ట్) 31; పరాగ్ (బి) అక్షర్ 8; నితీశ్ రాణా (ఎల్బీ) స్టార్క్ 51; జురేల్ (రనౌట్) 26; హెట్‌మైర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–76, 2–112, 3–161, 4–188. బౌలింగ్: స్టార్క్ 4–0–36–1; ముకేశ్ 3–0–31–0; మోహిత్ 4–0– 38–0; విప్రాజ్ 1–0–13–0; అక్షర్ 3–0–23–1; కుల్దీప్ 4–0–33–1; స్టబ్స్ 1–0–12–0. సూపర్ ఓవర్ సాగిందిలా...సూపర్ ఓవర్లో ఢిల్లీ తరఫున బౌలింగ్ చేసిన స్టార్క్... తన యార్కర్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. తొలి బంతికి పరుగులేమీ రాకపోగా... రెండో బంతికి హెట్‌మైర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి పరాగ్ ఫోర్ కొట్టాడు. ఆ బంతి నోబాల్ అని తేలగా... మరుసటి బంతికి పరాగ్ రనౌటయ్యాడు. ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో జైస్వాల్ రనౌటవడంతో రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఛేదనలో తొలి బంతికి రెండు పరుగులు తీసిన రాహుల్... రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి స్టబ్స్ సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఐపీఎల్లో నేడుముంబై X హైదరాబాద్‌వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ 'సూపర్' విక్టరీ
ఐపీఎల్-2025లో వరుసగా రెండో మ్యాచ్ అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. ఈ ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది.మిచిల్ స్టార్క్ బౌలింగ్ చేసిన సూపర్ ఓవర్లో హెట్‌మైర్(5), రియాన్ పరాగ్(4) రాణించారు. అనంతరం 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు బంతుల్లోనే చేధించి విజయాన్ని అందుకుంది. రాజస్తాన్ తరపున సూపర్ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్లోకేఎల్ రాహుల్ 7 పరుగులు చేయగా.. స్టబ్స్ సిక్సర్ కొట్టి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్(38), స్టబ్స్(34), అక్షర్ పటేల్(34) రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో రాజస్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి సరిగ్గా 188 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్వహించనున్నారు. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీనే పై చేయి సాధించింది. -
IPL 2025: రియాన్ పరాగ్ అరుదైన ఫీట్.. తొలి రాజస్తాన్ ప్లేయర్‌గా
టీమిండియా ఆల్‌రౌండర్, రాజస్తాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్‌గా పరాగ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్ క్యాచ్‌ను అందుకున్న పరాగ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.రియాన్ పరాగ్ ఇప్పటివరకు ఐపీఎల్లో రాజస్తాన్ తరపున 41 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ అజింక్య రహానే పేరిట ఉండేది. రహానే రాయల్స్ తరపున 40 క్యాచ్‌లు అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో రహానే రికార్డును పరాగ్ బ్రేక్ చేశాడు. కాగా రియాన్ అతి తక్కువ సమయంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్యాట్‌తోనే కాకుండా బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్(38), స్టబ్స్(34), అక్షర్ పటేల్(34) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టగా.. తీక్షణ, హసరంగ తలా వికెట్ సాధించారు. -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ ఏడాది జూన్ 20 నుంచి భారత జట్టు తమ ఇంగ్లండ్ టూర్‌ను ప్రారంభించనుంది.మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ మే మూడో వారంలో ప్రకటించనుంది. ఇక ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ టూర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడని తొలుత వార్తలు వినిపించాయి.కానీ ఇప్పుడు రోహిత్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రోహిత్ శర్మ ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఇంగ్లండ్ సిరీస్ గురించి మాట్లాడాడు."ఇంగ్లండ్ పర్యటనకు స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంద శాతం ఫిట్‌గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మా ప్లేయర్లు అందరూ ఫిట్‌గా ఉంటే ఇంగ్లండ్‌లో కచ్చితంగా పై చేయి సాధిస్తాము. అయితే ఇంగ్లండ్ నుంచి కూడా మాకు గట్టి సవాలు ఎదురు కానుంది. సిరీస్ గెలిచేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాము" అని రోహిత్ పేర్కొన్నాడు. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌లో రోహిత్ ఆడనున్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు -
IPL 2025 DC vs RR: సూపర్ ఓవర్లో గెలిచిన ఢిల్లీ
Delhi capitals vs Rajasthan royals Live updates:సూపర్ ఓవర్లో గెలిచిన ఢిల్లీఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. ఈ ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. మిచిల్ స్టార్క్ బౌలింగ్ చేసిన సూపర్ ఓవర్లో హెట్‌మైర్(5), రియాన్ పరాగ్(4) రాణించారు. అనంతరం 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు బంతుల్లోనే చేధించి విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ 7 పరుగులు చేయగా.. స్టబ్స్ సిక్సర్ కొట్టి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో రాజస్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి సరిగ్గా 188 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులిచ్చాడు.సూపర్ ఓవర్లో ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 11 పరుగులు చేసింది. మిచెల్ స్టార్ బౌలింగ్‌లో రాజస్తాన్ రనౌట్ల రూపంలో రెండు వికెట్లు కోల్పోయింది.రాజస్తాన్-ఢిల్లీ మ్యాచ్ టై.. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో రాజస్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి సరిగ్గా 188 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులిచ్చాడు.దూకుడుగా ఆడుతున్న రాణా..17 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(50), జురెల్(13) ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 18 బంతుల్లో 31 పరుగులు కావాలి.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్..జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన జైశ్వాల్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(34), జురెల్(3) ఉన్నారు. రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన పరాగ్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(50), నితీష్ రాణా(11) ఉన్నారు.సంజూ శాంసన్ రిటైర్డ్ హార్ట్..రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(31) రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. పక్కటెముకల గాయం కారణంగా మైదానాన్ని శాంసన్ వీడాడు. 8 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(33), పరాగ్(8) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి రాయల్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగలు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(16), జైశ్వాల్(26) ఉన్నారు.చెలరేగిన ఢిల్లీ బ్యాటర్లు.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్(38), స్టబ్స్(34), అక్షర్ పటేల్(34) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టగా.. తీక్షణ, హసరంగ తలా వికెట్ సాధించారు.అక్షర్ పటేల్ ఔట్..17 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 34 పరుగులతో క్విక్ ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.ఢిల్లీ మూడో వికెట్ డౌన్..కేఎల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రాహుల్.. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 76/210 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(40), కేఎల్ రాహుల్(28) ఉన్నాడు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..కరుణ్ నాయర్(0) రూపంలో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ రనౌటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ..జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన మెక్‌గర్క్.. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(25), కరుణ్ నాయర్(0) ఉన్నారు.ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.తుది జట్లురాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, నితీష్ రాణా, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ -
చరిత్ర సృష్టించిన చాహల్.. తొలి బౌలర్‌గా రికార్డు
ఐపీఎల్-2025లో టీమిండియా వెటరన్, పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్ అద్భుతం చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో పంజాబ్ కింగ్స్‌కు చారిత్రత్మక విజయాన్ని చాహల్ అందించాడు.ఓటమి తప్పదనుకున్న చోట చాహల్ తన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతడు 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో అత్యల్ప స్కోరును డిఫెండ్ చేసిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన చాహల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.నరైన్ రికార్డు సమం..ఐపీఎల్లో అత్యధిక సార్లు 4 వికెట్ల హాల్ సాధించిన బౌలర్‌గా సునీల్ నరైన్ రికార్డును చాహల్ సమం చేశాడు. ఇది చాహల్‌కు ఎనిమిదివ 4 వికెట్ల హాల్. నరైన్ కూడా సరిగ్గా 8 సార్లు 4 వికెట్లు సాధించాడు. అయితే ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ బౌలర్ మాత్రం చాహలే కావడం గమనార్హం. అదే విధంగా ఐపీఎల్లో కేకేఆర్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజీ నిలిచాడు. చాహల్ ఇప్పటివరకు కేకేఆర్‌పై 23 మ్యాచ్‌ల్లో 7.96 ఎకానమీ రేటుతో 33 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్(32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీ అల్‌టైమ్ రికార్డును యుజీ బ్రేక్ చేశాడు. కాగా ఐపీఎల్లో లీడింగ్ వికెట్ టేకర్ చాహల్ (211) లీడింగ్ వికెట్ టేకర్ కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2025: మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్‌కు బీసీసీఐ అలెర్ట్? -
మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్‌కు బీసీసీఐ అలెర్ట్?
ఐపీఎల్-2025కు మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు పొంచి ఉందా? అంటే అవునానే అంటుంది భారత క్రికెట్ బోర్డు. తాజాగా ఐపీఎల్లో మొత్తం పది జట్లకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లు అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ సూచించినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది.క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలు ఉన్నట్లు బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం (ACSU) గుర్తించినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇటీవలి కాలంలో చాలా మంది ప్లేయర్లు, కోచ్‌లతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది.డబ్బే కాకుండా విలువైన వస్తువులు గిప్ట్‌లు ఎరగా వేస్తాడని క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ క్రమంలోనే అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని బీసీసీఐ సూచించింది. కాగా ఐపీఎల్-2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ వంటి జట్లు దూసుకుపోతుంటే.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి టాప్ జట్లు తడబడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IND vs ENG: టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ? -
చాహల్.. వావ్ వాట్ ఏ టాలెంట్ మ్యాన్: మహవాష్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో కేకేఆర్‌పై 16 పరుగుల తేడాతో పంజాబ్ చారిత్రత్మక విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్నిడిఫెండ్ చేసుకుని పంజాబ్ చరిత్రను తిరిగ రాసింది. పంజాబ్ విజయంలో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ది కీలక పాత్ర. చాహల్ తన స్పిన్ మ్యాజిక్‌తో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. రహానే, రింకూ సింగ్, రమణ్‌దీప్, రఘువన్షి వంటి కీలక వికెట్లను పడగొట్టి కేకేఆర్‌ను దెబ్బతీశాడు. ఫలితంగా స్వల్ప లక్ష్య చేధనలో కేకేఆర్ 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప టార్గెట్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇక చాహల్ అద్భుత ప్రదర్శనపై అతడి రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహవాష్ స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లెగ్ స్పిన్నర్‌ను ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేసింది. చాహల్‌తో కలిసి ఉన్న ఫోటోను అప్ లోడ్ చేసిన మహవాష్.. ‘వావ్ వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్. అందుకే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచావు. అసంభవ్’ అంటూ క్యాప్షన్ జత చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ధనశ్రీ వర్మతో చాహల్ విడాకులు తీసుకున్న తర్వాత మహవాష్‌తో ప్రేమయాణం కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లను చాహల్, మహ్వశ్ కలిసి వీక్షించడం, అతడు ఆడే మ్యాచ్‌లకు ఆమె హాజరవడం వంటివి ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే వారు మాత్రం తాము కేవలం స్నేహితులు మాత్రమే అని ఓ సందర్భంగా చెప్పకొచ్చారు.చదవండి: శ్రేయస్ అయ్యర్‌పై సర్వత్రా ప్రశంసలు -
Shreyas Iyer: సైలెంట్ వారియర్
సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రెవేంజ్.. అంటారు. అవమానించిన వారికి గెలుపుతో సమాధానం చెబితే వచ్చే కిక్కే వేరు. క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) విషయంలో సరిగ్గా అదే జరిగిందని అంటున్నారు ఫ్యాన్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎడిషన్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ (Punjab Kings) అనూహ్య విజయం సాధించింది. చండీగఢ్- ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను మంచి అనుభూతిని కలిగించింది. శ్రేయస్ అయ్యర్ అభిమానులకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది.కష్టసాధ్యమైన మ్యాచ్‌లో కోల్‌కతాపై ఊహించని విజయం దక్కడంతో వారు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వ పటిమను ప్రస్తుతిస్తున్నారు. పనిలో పనిగా కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యంపై విసుర్లు విసుతున్నారు. గత సీజన్లో ఐపీఎల్ కప్ సాధించి పెట్టిన అయ్యర్‌ను ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ (kolkata knight riders) వదిలేసుకుంది. జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపిన కెప్టెన్‌ను కోల్‌కతా వదిలేసుకోవడం క్రికెట్ లవర్స్‌ను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అయ్యర్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఇది అయ్యర్‌కు జరిగిన అవమానంగా వారంతా భావించారు. మెగా వేలంలో భారీ మొత్తానికి అయ్యర్‌ను పంజాబ్ దక్కించుకుని కెప్టెన్‌గా నియమించింది.బెస్ట్ ప్లేయర్, కెప్టెన్ఈ నేపథ్యంలో గత రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ భావోద్వేగాలను శిఖర స్థాయికి చేర్చింది. ఐపీఎల్లో అతి తక్కువ స్కోరును కాపాడుకుని కోల్‌కతాపై కింగ్స్ జయకేతనం ఎగరవేసింది. దీంతో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కింగ్స్ కెప్టెన్‌ను వరించడంతో అభిమానులు సోషల్ మీడియాలో అయ్యర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జనరేషన్లో బెస్ట్ ప్లేయర్, కెప్టెన్ అంటూ పొగిడేస్తున్నారు. అవమానాలను పంటి బిగువన భరిస్తూ పదునైన ఆటతోనే సమాధానం చెబుతున్నాడని మెచ్చుకుంటున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా శ్రేయస్‌ను శభాష్ అంటూ మెచ్చుకున్నారు.శిఖర్ కాదు.. శ్రేయర్ టీమ్తనను కాదన్న కోల్‌కతాపై అయ్యర్ బదులు తీర్చుకున్నాడని కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా అయ్యర్ అనవసర హడావుడి చేయకుండా చాలా హుందాగా వ్యవహరించాడని అంటున్నారు. కర్మఫలం అనుభవించక తప్పదని కొంతమంది కోల్‌కతాను కసురుకున్నారు. ఇది శిఖర్ ధవన్ టీమ్ కాదు, శ్రేయస్ అయ్యర్ టీమ్ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ప్రత్యర్ధి కోల్‌కతా అయితే పంజాబ్ జట్టుకు ఎక్కడలేని బలం వస్తుందని, అద్భుతాలు చేస్తుందని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. 2024 ఐపీఎల్లో ఈడెన్ గార్డెన్లో కోల్‌కతాపై 262 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ ఛేజ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.చాహల్ సూపర్పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (yuzvendra chahal)పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాచ్‌ను మలుపు తిప్పి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడని పొగుడుతున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత చాహల్ మరింత యాక్టివ్ అయ్యాడంటూ కొంతమంది సరదా వ్యాఖ్యలు చేశారు. Yuzvendra Chahal ~ the best bowler with most wickets in IPL showing the world that he is still a match winner & game changing player#TATAIPL2025 #IPL2025 #PBKSvKKR #PBKSvsKKR #KKRvsPBSK #KKRvPBKS #ShreyasIyer #chahal #Punjab #Russell #MIvSRH #SRHvsMI pic.twitter.com/66Fn91XIsD— Riyaaa_VK18 (@Riyaaa_VK18) April 15, 2025 Shreyas Iyer is one of the best Captain and player in this Generation! ♥️Like if you agree! 👍🏻 Stop watching cricket if you disagree.😂#PBKSvsKKR #ShreyasIyer pic.twitter.com/Xsk2FJwn1C— Celebeauty Official (@CeleBeautyHQ) April 15, 2025No camera stare.No finger on the lips.No viral celebration.No dramaJust a calm smile, a handshake, hug and respect for the game.This is how a mature player behaves. Respect to Shreyas Iyer.#PBKSvKKR || #ShreyasIyer pic.twitter.com/K3HQTVzRlz— Mini (@josbuttler99) April 15, 2025 -
RR vs DC: కెప్టెన్‌గా నేను కాదు!.. అతడే సరైనోడు..
ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభం నుంచే రాజస్తాన్ రాయల్స్‌కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే అందుబాటులో ఉన్నాడు. ఆ తర్వాత సంజూ సారథిగా పునరాగమం చేసినా రాయల్స్ రాతలో పెద్దగా మార్పులేదు.వరుస ఓటములుఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం రెండు మాత్రమే గెలిచి.. నాలుగు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. కాగా సంజూ స్థానంలో టీమిండియా యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ (Riyan parag)రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన పింక్ జట్టు.. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనూ పరాజయం పాలైంది.అనంతరం చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. అయితే, జట్టులో అనుభవజ్ఞుడైన నితీశ్ రాణాను కాదని.. యువ ఆటగాడైన రియాన్ పరాగ్‌కు పగ్గాలు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై నితీశ్ రాణా తాజాగా పెదవి విప్పాడు.‘‘నేను గతంలో కేకేఆర్ కెప్టెన్‌గా పనిచేశాను. అప్పటికి నేను ఆ జట్టుతో 6-7 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నా. కాబట్టి ఫ్రాంఛైజీ వాతావరణం, సంస్కృతి ఎలా ఉంటుందో నాకు పూర్తి అవగాహన ఉంది.కెప్టెన్‌గా నేను కాదు!.. అతడే సరైనోడు..కానీ.. రాజస్తాన్ రాయల్స్‌లోకి కొత్తగా వచ్చాను. రియాన్ మాత్రం చాలా కాలంగా ఈ జట్టుతోనే ఉన్నాడు. కాబట్టి అతడికి ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంటుంది. అందుకే మేనేజ్మెంట్ నన్ను కాదని.. రియాన్‌ను కెప్టెన్‌గా చేసి తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ సరైందే’’ అని నితీశ్ రాణా పేర్కొన్నాడు.అదే విధంగా.. ‘‘ఒకవేళ యాజమాన్యం నన్ను తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించమని అడిగితే తప్పకుండా అంగీకరించేవాడిని. అయితే, అంతిమంగా మా అందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యం. అందుకే వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను’’ అని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌కు ముందు అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.రూ. 4.20 కోట్లకుకాగా ఐపీఎల్-2023లో శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో నితీశ్ రాణా కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో కేకేఆర్ పద్నాలుగింట ఆరు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచి.. ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. ఇక ఐపీఎల్-2024లో అయ్యర్ రాకతో రాణా ఆటగాడిగానే కొనసాగగా.. మెగా వేలానికి ముందు కేకేఆర్ అతడిని విడిచిపెట్టింది.ఈ క్రమంలో రూ. 4.20 కోట్లకు రాజస్తాన్ నితీశ్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 117 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో ఓవరాల్‌గా 113 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 2753 రన్స్ చేశాడు.చదవండి: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’ -
PBKS Vs KKR: చెత్తగా బ్యాటింగ్ చేశాం.. నిజమే కదా!: శ్రేయస్‌తో రహానే చాట్ వైరల్
ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. తాజా సీజన్లోనూ ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మిగిలిన జట్లకు సాధ్యం కాని రీతిలో 286 పరుగులతో సవాల్ విసిరింది. రాజస్తాన్ రాయల్స్‌పై ఈ మేర భారీ స్కోరు సాధించి.. ఐపీఎల్-2025 (IPL 2025)లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు నమోదు చేసింది.ఇక పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడ్డ శ్రేయస్ సేన.. 245 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరైన రైజర్స్ ఆ లక్ష్యాన్ని సునాయాసంగానే ఛేదించడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.111 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీఅయితే, తాజా మ్యాచ్‌లో మాత్రం పంజాబ్ అత్యల్ప స్కోరు నమోదు చేసినా.. సంచలన విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో మ్యాచ్‌లో 111 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది. అసాధారణ రీతిలో కేకేఆర్‌ను 95 పరుగులకే ఆలౌట్ చేసి.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది.𝙏𝙃𝙄𝙎. 𝙄𝙎. 𝘾𝙄𝙉𝙀𝙈𝘼 🎬#PBKS have pulled off one of the greatest thrillers in #TATAIPL history 😮Scorecard ▶️ https://t.co/sZtJIQpcbx#PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/vYY6rX8TdG— IndianPremierLeague (@IPL) April 15, 2025 కేకేఆర్ స్వీయ తప్పిదాల కారణంగా మ్యాచ్‌ను చేజార్చుకోగా.. ఊహించని విజయం దక్కినందుకు పంజాబ్ జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. నిజానికి పంజాబ్ విధించిన 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కేకేఆర్‌కు అంత కష్టమేమీ కాదనిపించింది.రివ్యూకు వెళ్లకుండాఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువన్షీ చక్కగా ఆడుతూ మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. కానీ చహల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూకు వెళ్లకుండా రహానే వెనుదిరగగా.. ఆ తర్వాత కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.ఎంత చెత్తగా బ్యాటింగ్ చేశామో!.. నిజమే కదా!పంజాబ్ స్పిన్నర్ చహల్ అంగ్క్రిష్ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (2)లను పెవిలియన్‌కు పంపగా.. వెంకటేశ్ అయ్యర్ (7)ను మాక్స్వెల్, ఆండ్రీ రసెల్ (17)ను మార్కో యాన్సెన్ అవుట్ చేయడంతో కేకేఆర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇక పంజాబ్ చేతిలో అనూహ్య ఓటమి తర్వాత కేకేఆర్ ఆటగాళ్లు.. శ్రేయస్ సేనతో కరచాలనం చేస్తున్న వేళ.. రహానే చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్‌ను ఆలింగనం చేసుకోవడానికి ముందు.. ‘‘ఎంత చెత్తగా బ్యాటింగ్ చేశామో!.. నిజమే కదా!’’ అంటూ రహానే తమ జట్టు ప్రదర్శన తీరు పట్ల నవ్వుతూనే అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఐపీఎల్-2025: పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్👉వేదిక: ముల్లన్పూర్, చండీగడ్👉టాస్: పంజాబ్ కింగ్స్.. తొలుత బ్యాటింగ్👉పంజాబ్ కింగ్స్ సోరు: 111 (15.3)👉కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోరు: 95 (15.1)👉ఫలితం: కోల్‌కతా నైట్ రైడర్స్‌ను పదహారు పరుగుల తేడాతో ఓడించిన పంజాబ్ కింగ్స్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యజువేంద్ర చహల్ (నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు).చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’Was watching the #PBKSvKKR game and caught this funny bit as Shreyas and Rahane shook hands at the end. In a self-deprecating way Rahane appears to be saying to Shreyas in Marathi : काय फालतू बॅटिंग केली ना आम्ही (We played terrible, didn't we) 😂😂 pic.twitter.com/bNkC7TXGbU— निखिल घाणेकर (Nikhil Ghanekar) (@NGhanekar) April 15, 2025 -
మా ఆశలన్నీ అతడిపైనే.. ఈ గెలుపు మరింత ప్రత్యేకం: శ్రేయస్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో గెలుపొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో మ్యాచ్‌లో ఇలాంటి విజయం ఎంతో ప్రత్యేకమని.. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ గర్వాన్ని తలకెక్కించుకోనని చెబుతున్నాడు.111 పరుగులకే ఆలౌట్‌ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్ మంగళవారం కేకేఆర్‌తో తలపడింది. ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఆతిథ్య పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, అనూహ్య రీతిలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (30) ఫర్వాలేదనిపించగా.. ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది.కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. పేసర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లతో చెలరేగాడు. అన్రిచ్ నోర్జే, వైభవ్ అరోరా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.అంచనాలను నిజం చేస్తూ..టార్గెట్ పూర్తి చేసే దిశగా పయనిస్తున్న వేళ.. శ్రేయస్ అయ్యర్ తమ వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను రంగంలోకి దించాడు. అయ్యర్ అంచనాలను నిజం చేస్తూ.. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (17), అంగ్క్రిష్ రఘువన్షీ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0) రూపంలో చహల్ నాలుగు కీలక వికెట్లు కూల్చాడు. తద్వారా కేకేఆర్ బ్యాటింగ్ పతనాన్ని శాసించి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు.అందుకే యుజీని పిలిపించాఈ క్రమంలో విజయానంతరం పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా మనసు చెప్పిన మాట విన్నాను. బంతి కాస్త టర్న్ అవుతుందని అనిపించింది. అందుకే యుజీని పిలిచి పని అప్పగించాను.సరైన సమయంలో సరైన ఆటగాళ్లను అటాక్ చేయాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. వాటిని యుజీ చక్కగా అమలు చేశాడు. ఇలాంటి విజయాలు ఎంతో ప్రత్యేకం. అంతకంటే నేనేమీ ఎక్కువగా చెప్పలేను.నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు వికెట్ అంత బౌన్సీగా అనిపించలేదు. అయితే, ఈ వికెట్‌పై మేము మెరుగైన స్కోరే సాధించామని అనుకుంటున్నా. అంతేకాదు పదహారు పరుగుల తేడాతో కేకేఆర్‌పై గెలిచాం కూడా.తప్పులు చేసే ఆస్కారం కల్పించాంయుజీ బంతితో రంగంలోకి దిగినప్పుడు మా అంచనాలు, ఆశలు మిన్నంటాయి. అతడు వాటిని నిజం చేశాడు. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనే తలంపుతో వాళ్ల కళ్లెదుటే ఫీల్డింగ్‌లో వడివడిగా మార్పులు చేస్తూ.. వాళ్లు తప్పులు చేసే ఆస్కారం కల్పించాం.ఈ విజయం ప్రత్యేకమైనదే అయినా గర్వాన్ని తలకెక్కించుకోకుండా ఉండాలి. ఈ మ్యాచ్‌లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. వాటిని స్వీకరిస్తూ.. తప్పులు సరిచేసుకుంటూ మరింత గొప్పగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాం’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్,. కానీ అతడిని రిటైన్ చేసుకోవడంలో కోల్‌కతా విఫలమైంది.కేకేఆర్‌పై ప్రతీకారం తీరింది!మెగా వేలంలోనూ పంజాబ్ శ్రేయస్ అయ్యర్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేసిన సమయంలోనూ.. తమకు అవసరం లేదని విడిచిపెట్టింది. ఇక పంజాబ్ సారథిగా, బ్యాటర్ ఈ సీజన్లో శ్రేయస్ దుమ్ములేపుతున్నాడు. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లలో పంజాబ్‌ను నాలుగింట గెలిపించాడు. బ్యాటర్‌గా ఇప్పటికి 250 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అందుకే ఈ విజయం అతడికి మరింత ప్రత్యేకమైందని ప్రత్యేకంగా చెప్పాలా?!ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ కోల్‌కతాటాస్: పంజాబ్.. మొదట బ్యాటింగ్పంజాబ్ స్కోరు: 111 (15.3)కోల్‌కతా స్కోరు: 95 (15.1)ఫలితం: కోల్‌కతాపై 16 పరుగుల తేడాతో పంజాబ్ విజయం.చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. ఎట్టకేలకు పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటాMoments they will never forget 🤩🎥 All the 𝙍𝙖𝙬 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 from a thrilling ending and memorable victory as #PBKS created history in front of a buzzing home crowd ❤🥳#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/mndhJxEt5X— IndianPremierLeague (@IPL) April 16, 2025 -
KKR Vs PBKS: తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్ విధించిన 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. పటిష్ట పంజాబ్ బ్యాటర్లను తమ బౌలర్లు అద్బుత రీతిలో కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని.. తన తప్పు వల్లే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయామని అంగీకరించాడు. బౌలర్లు ఎంతో కష్టపడినా.. చెత్త బ్యాటింగ్ వల్ల పంజాబ్ ముందు తలవంచాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.తప్పంతా నాదే.. ‘‘మైదానంలో ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఓటమి అన్నింటికంటే ఎక్కువగా బాధిస్తోంది. ఇందుకు పూర్తిగా నేనే బాధ్యుడిని. షాట్ ఎంపికలో పొరపాటు చేశాను. అయితే, అదృష్టవశాత్తూ బాల్ స్టంప్స్‌ను మిస్ అయింది. కానీ లెగ్ బిఫోర్ వికెట్ విషయంలో నాకు స్పష్టత లేదు.అతడు కూడా నాతో అదే అన్నాడుఅంపైర్ ఎల్బీడబ్ల్యూ (LBW) ఇచ్చిన తర్వాత మరో ఎండ్‌లో ఉన్న అంగ్‌క్రిష్‌తో చర్చించాను. అతడు కూడా అంపైర్స్ కాల్ నిజమవుతుందేమోనని చెప్పాడు. అందుకే ఆ సమయంలో నేను చాన్స్ తీసుకోవాలని అనుకోలేదు. నాకు కూడా పూర్తి స్పష్టత లేదు కాబట్టి రివ్యూకు వెళ్లలేదు.నిర్లక్ష్య ఆట తీరు వల్లే ఓటమిమా బ్యాటింగ్ విభాగం ఈ రోజు అత్యంత చెత్తగా ఆడింది. సమిష్టిగా విఫలమయ్యాం. బౌలర్లు ఎంతో కష్టపడి పటిష్ట బ్యాటింగ్ లైనప్‌ను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కానీ మేము మాత్రం వారి కష్టానికి ప్రతిఫలం లేకుండా చేశాం. మా నిర్లక్ష్య ఆట తీరే మా ఓటమికి కారణం.ఇప్పుడు నా మనసులో ఎన్నో భావాలు చెలరేగుతున్నాయి. సులువుగా ఛేదించగల లక్ష్యాన్ని కూడా మేము దాటలేకపోయాం. మా వాళ్లతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకా సగం టోర్నీ మిగిలే ఉంది. ఏదేమైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి’’ అని అజింక్య రహానే పేర్కొన్నాడు.రివ్యూకు వెళ్లకుండా తప్పు చేశాడుకాగా కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదవ ఓవర్‌ను పంజాబ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ వేశాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రహానే విఫలం కాగా.. బంతి ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. దీంతో పంజాబ్ అప్పీలు చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు.అయితే, రీప్లేలో మాత్రం ఇంపాక్ట్ అవుట్‌సైడ్ ఆఫ్‌గా తేలింది. ఒకవేళ రహానే గనుక రివ్యూకు వెళ్లి ఉంటే నాటౌట్‌గా ఉండేవాడు. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. నిజానికి అప్పటికి కేకేఆర్‌కు ఇంకా రెండు రివ్యూలు మిగిలే ఉండటం గమనార్హం. ఇలా స్వీయ తప్పిదం కారణంగా జట్టు ఓడిపోవడాన్ని తట్టుకోలేక రహానే పైవిధంగా స్పందించాడు.ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ కేకేఆర్వేదిక: మహరాజ యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ముల్లన్పూర్, చండీగడ్టాస్: పంజాబ్.. బ్యాటింగ్పంజాబ్ స్కోరు: 111 (15.3)కేకేఆర్ స్కోరు: 95 (15.1)ఫలితం: 16 పరుగుల తేడాతో కేకేఆర్‌పై పంజాబ్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యజువేంద్ర చహల్ (4/28).చదవండి: IPL 2025:చరిత్ర సృష్టించిన పంజాబ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా𝘈𝘴 𝘥𝘦𝘭𝘪𝘨𝘩𝘵𝘧𝘶𝘭 𝘢𝘴 𝘪𝘵 𝘤𝘢𝘯 𝘨𝘦𝘵 🤌Ajinkya Rahane & Angkrish Raghuvanshi ignite the #KKR chase with some beautiful sixes 💜Updates ▶️ https://t.co/sZtJIQoElZ#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/YQxJJep9z3— IndianPremierLeague (@IPL) April 15, 2025The moment where Yuzvendra Chahal turned the game 🪄#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/D2O5ImOSf4— IndianPremierLeague (@IPL) April 15, 2025 -
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
ఐపీఎల్-2025 (IPL 2025 )లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS vs KKR) అనూహ్య విజయంతో ఆకట్టుకుంది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో సంచలన రీతిలో గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా ఘనత సాధించింది. ఇందుకు ప్రధాన కారణం పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal).రూ. 18 కోట్లకు కొనుగోలుఐపీఎల్-2025 మెగా వేలంలో చహల్‌ను పంజాబ్ ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, సీజన్ ఆరంభం నుంచి ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. తొలి ఐదు మ్యాచ్‌లలో కలిపి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.అయితే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్... 112 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించి తన విలువను చాటుకున్నాడు చహల్. ఈ మణికట్టు స్పిన్నర్ దెబ్బకు కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.మణికట్టు స్పిన్నర్ మాయాజాలంచహల్ ధాటికి కెప్టెన్ అజింక్య రహానే (17) సహా అంగ్క్రిష్ రఘువన్షీ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0).. ఇలా కేకేఆర్‌కు చెందిన నలుగురు కీలక బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్ 11 బంతుల్లో 17 పరుగులతో కేకేఆర్ శిబిరంలో ఆశలు రేపినా మార్కో యాన్సెన్ అతడి ఆట కట్టించడంతో.. పంజాబ్ గెలుపు ఖరారైంది. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటాఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. జట్టు సహ యజమాని ప్రీతి జింటా అయితే సంతోషం పట్టలేకపోయారు. స్టాండ్స్‌లో పరిగెడుతూ సహచరులతో ఆనందం పంచుకున్నారు. Along with Kohli, Want to see Preity Zinta winning IPL trophy soon❤️Such a passionate supporter for 18 years without fail👌pic.twitter.com/viyPn107oV— Gss🇮🇳 (@Gss_Views) April 15, 2025అంతేకాదు.. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన చహల్‌ను ఆలింగనం చేసుకుని అభినందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.కేకేఆర్ చేజేతులాకాగా ముల్లన్‌పూర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (30) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఫలితంగా 15.3 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి పంజాబ్ ఆలౌట్ అయింది.కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా మూడు, సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే ఒక్కో వికెట్ తీశారు. ఇక స్వల్ప లక్ష్యాన్ని సులువుగానే ఛేదిస్తుందనుకున్న పంజాబ్ 15.1 ఓవర్లలో 95 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఫలితంగా 16 పరుగులు తేడాతో పంజాబ్ సొంత మైదానంలో జయభేరి మోగించింది. మార్కో యాన్సెన్ (3/17), చహల్ (4/28) కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేయగా.. జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. చదవండి: IPL 2025: కేకేఆర్ కొంపముంచిన రహానే.. ఆ ఒక్క తప్పు చేయకపోయింటే?𝙏𝙃𝙄𝙎. 𝙄𝙎. 𝘾𝙄𝙉𝙀𝙈𝘼 🎬#PBKS have pulled off one of the greatest thrillers in #TATAIPL history 😮Scorecard ▶️ https://t.co/sZtJIQpcbx#PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/vYY6rX8TdG— IndianPremierLeague (@IPL) April 15, 2025Preity Zinta was really happy with performance of Punjab Kings Today.congrats @PunjabKingsIPL for a thriller victory. pic.twitter.com/iNvuXm6TJB— 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧🧛 (@hiit_man45) April 15, 2025 -
RR Vs DC: సొంతగడ్డపై తొలి విజయం కోసం..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో సొంతగడ్డపై తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. సీజన్ ఆరంభంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. దాన్ని పక్కన పెట్టి తిరిగి గెలుపు బాట పట్టాలని అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి అదరగొట్టిన కరుణ్ నాయర్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోగా... డుప్లెసిస్ అందుబాటులోకి వస్తే బ్యాటింగ్ మరింత పటిష్టం కానుంది. ముంబైతో పోరులో భారీ లక్ష్యఛేదనలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించిన ఢిల్లీ కరుణ్ నాయర్ అవుటైన అనంతరం తడబడింది. ఆ లోపాలను సరిదిద్దుకొని తిరిగి సత్తాచాటాలని చూస్తోంది. మరోవైపు సంజూ సామ్సన్ సారథ్యంలోని రాయల్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో బలంగానే ఉన్నా ఆటగాళ్లు సమష్టిగా సత్తా చాటడంలో విఫలమవుతుండటంతో నిలకడ కనబర్చలేకపోతోంది. గత మ్యాచ్‌ల తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని మూడో విజయం ఖాతాలో వేసుకోవాలని రాయల్స్ చూస్తోంది. డుప్లెసిస్ అనుమానమే... దేశవాళీల్లో పరుగుల వరద పారించి అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్... తుది జట్టులో అవకాశం దక్కించుకున్న తొలి పోరులో చెలరేగిపోయాడు. మేటి ఆటగాళ్లు సైతం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడుతున్న తరుణంలో... నాయర్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. బౌల్ట్, బుమ్రా, దీపక్, సాంట్నర్, హార్దిక్ ఇలా బౌలర్ ఎవరనేది చూడకుండా భారీ షాట్లతో అలరించాడు. దీంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా మరోసారి అతడు ఆడటం ఖాయమే కాగా... అదే జోరు కొనసాగిస్తాడా చూడాలి. డుప్లెసిస్ ఫిట్‌నెస్‌పై సందేహాలు తొలిగిపోలేదు. మంగళవారం సాయంత్రం జట్టు ప్రాక్టీస్‌లోనూ అతడు పాల్గొనలేదు. దీంతో బుధవారం మ్యాచ్ ఆడటంపై స్పష్టత కొరవడింది.డుప్లెసిస్ అందుబాటులో లేకపోతే అభిషేక్ పొరెల్తో కలిసి మెక్‌గుర్క్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మలతో మిడిలార్డర్ బలంగా ఉంది. స్టార్క్, ముకేశ్ కుమార్, మోహిత్ పేస్ బాధ్యతలు తీసుకోనుండగా... కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్ స్పిన్ భారం మోయనున్నారు. సామ్సన్ సత్తా చాటితేనే! మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టు ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. అనంతరం మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. గత మ్యాచ్‌లో కష్టతరమైన పిచ్‌పై యశస్వి జైస్వాల్ సంయమనంతో అర్ధశతకం సాధించడం రాయల్స్‌కు శుభసూచకం. కెపె్టన్ సంజూ సామ్సన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఫర్వాలేదనిపిస్తున్నా... ఐపీఎల్ వంటి అత్యంత పోటీ ఉండే లీగ్‌లో మెరుపులు లేకపోతే విజయాలు సాధ్యం కావు. వెస్టిండీస్ హిట్టర్ హెట్‌మైర్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ మరింత దూకుడు ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిన రాయల్స్... అదే మైదానంలో ఢిల్లీతో జరగనున్న పోరులో విజయం సాధించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బౌలింగ్‌లో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై ఎక్కువ భారం ఉండగా... లంకేయులు తీక్షణ, హసరంగ రాణించాల్సిన అవసరముంది. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), డు ప్లెసిస్/మెక్‌గుర్క్, అభిషేక్ పొరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్. రాజస్తాన్ రాయల్స్: సంజూ సామ్సన్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, కుమార్ కార్తికేయ.29 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖిగా 29 సార్లు తలపడ్డాయి. 15 సార్లు రాజస్తాన్ నెగ్గగా... 14 సార్లు ఢిల్లీ గెలిచింది. రాజస్తాన్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 221 కాగా... ఢిల్లీపై రాజస్తాన్ అత్యధిక స్కోరు 222. -
PBKS vs KKR: 111 తోనే పంజాబ్ పండుగ
సొంత మైదానంలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై పంజాబ్ కింగ్స్ పడుతూ లేస్తూ 111 పరుగులు చేసింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) విజయంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో నంబర్‌వన్ స్థానానికి కూడా దూసుకుపోతుంది. ఎంత వేగంగా ఛేదిస్తారనే దానిపైనే చర్చ. 62/2 స్కోరుతో జట్టు గెలుపు దిశగా సాగింది. కానీ ఒక్కసారిగా అనూహ్యం జరిగింది. యుజువేంద్ర చహల్ పదునైన స్పిన్‌తో కేకేఆర్ పతనానికి శ్రీకారం చుట్టాడు. 17 పరుగుల వ్యవధిలో కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయింది. అయితే రసెల్ ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో మళ్లీ కేకేఆర్ విజయంపై అంచనాలు... కానీ యాన్సెన్ బంతితో రసెల్ ఆట ముగిసింది... మరో 29 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా ఆలౌట్... పంజాబ్ అభిమానులతో మైదానం ఒక్కసారిగా హోరెత్తింది. శనివారం 245 పరుగులు చేసి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన పంజాబ్ కింగ్స్...ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది. ముల్లాన్‌పూర్: ఐపీఎల్లో అరుదుగా కనిపించే తక్కువ స్కోర్ల మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. మంగళవారం జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 15.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. రఘువంశీ (28 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యుజువేంద్ర చహల్ (4/28) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఓపెనింగ్ మినహా... తొలి 19 బంతుల్లో 39/0... తర్వాతి 17 బంతుల్లో 15/4... పవర్‌ప్లేలో పంజాబ్ ఆటతీరు ఇది. ఓపెనర్ల ఆటతీరు చూస్తే ఈ మైదానంలో జరిగిన గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే భారీ స్కోరు ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. నోర్జే ఓవర్లో ప్రియాన్ష్ఆర్య (12 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) రెండు ఫోర్లు కొట్టగా... అరోరా వేసిన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ వరుసగా 4, 6, 4 బాదాడు. అదే ఓవర్లో ప్రియాన్ష్ కూడా ఫోర్ కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. రాణా తొలి బంతిని ప్రియాకూ సిక్స్ కొట్టే వరకు అంతా బాగుంది. కానీ ఆ తర్వాతి బంతి నుంచే కోల్‌కతా బౌలర్ల జోరు మొదలైంది. అదే ఓవర్లో ప్రియాన్ష్ , శ్రేయస్ అయ్యర్ (0)లను అవుట్ చేసిన రాణా తన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ను కూడా వెనక్కి పంపాడు. అంతకు ముందే సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఇన్‌గ్లిస్ (2) కూడా వరుణ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 54/4కు చేరింది. ఇక ఆ తర్వాత పంజాబ్ కోలుకోలేకపోయింది. నైట్‌రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పవర్‌ప్లే తర్వాత ఆడిన 57 బంతుల్లో 57 పరుగులు మాత్రమే చేసిన జట్టు 6 వికెట్లు కోల్పోయింది. వధేరా (10), మ్యాక్స్‌వెల్ (7), ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన సూర్యాంశ్ (4) ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, శశాంక్ సింగ్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా విఫలమయ్యాడు. టపటపా... ఛేదనలో కోల్‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. మూడు బంతుల వ్యవధిలో ఒకే స్కోరు వద్ద ఓపెనర్లు నరైన్ (5), డికాక్ (2) వెనుదిరిగారు. అయితే అజింక్య రహానే (17), రఘువంశీ కలిసి కొన్ని చక్కటి షాట్లతో మూడో వికెట్‌కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే రహానే వెనుదిరిగిన తర్వాత కేకేఆర్ పతనం వేగంగా సాగిపోయింది. ఒక్కరు కూడా పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించే ప్రయత్నం చేయలేకపోయారు. చివర్లో రసెల్ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. రహానే దురదృష్టవశాత్తూ ఎల్బీపై రివ్యూ కోరకపోవడం కూడా కేకేఆర్‌కు నష్టం కలిగించింది. అతని అవుట్ తర్వాతే పరిస్థితి మారింది. బాల్ ట్రాకింగ్‌లో ప్రభావం ఆఫ్ స్టంప్ బయట కనిపించింది. రివ్యూ కోరితే అతను నాటౌట్‌గా తేలేవాడు. చహల్ మ్యాజిక్ టోర్నీ తొలి 5 మ్యాచ్‌లలో ఏకంగా 83.50 సగటు, 11.13 చెత్త ఎకానమీతో కేవలం 2 వికెట్లు... 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓవర్ల కోటా పూర్తి... వేలంలో రూ.18 కోట్లతో అమ్ముడుపోయిన చహల్ పేలవ ఫామ్ ఇది. కచ్చితంగా రాణించాల్సిన తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన అతను మ్యాజిక్ చూపించాడు. వరుస ఓవర్లలో రహానే, రఘువంశీలను అవుట్ చేసి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపిన అతను కీలక సమయంలో వరుస బంతుల్లో రింకూ, రమణ్‌దీప్‌లను వెనక్కి పంపి విజయానికి బాటలు వేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తనకున్న గుర్తింపును నిలబెట్టుకుంటూ మళ్లీ రేసులోకి వచ్చాడు. ఐపీఎల్లో నేడుఢిల్లీ X రాజస్తాన్ వేదిక: న్యూఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్(సి) రమణ్‌దీప్ (బి) రాణా 22; ప్రభ్‌సిమ్రన్ (సి) రమణ్‌దీప్ (బి) రాణా 30; శ్రేయస్ (సి) రమణ్‌దీప్ (బి) రాణా 0; ఇన్‌గ్లిస్ (బి) వరుణ్ 2; వధేరా (సి) వెంకటేశ్ (బి) నోర్జే 10; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 7; సూర్యాంశ్ (సి) డికాక్ (బి) నరైన్ 4; శశాంక్ (ఎల్బీ) (బి) అరోరా 18; యాన్సెన్ (బి) నరైన్ 1; బార్ట్లెట్ (రనౌట్) 11; అర్ష్ దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.3 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–42, 4–54, 5–74, 6–76, 7–80, 8–86, 9–109, 10–111. బౌలింగ్: వైభవ్ అరోరా 2.3–0–26–1, నోర్జే 3–0–23–1, హర్షిత్ రాణా 3–0–25–3, వరుణ్ చక్రవర్తి 4–0–21–2, నరైన్ 3–0–14–2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) సూర్యాంశ్ (బి) బార్ట్లెట్ 2; నరైన్ (బి) యాన్సెన్ 5; రహానే (ఎల్బీ) (బి) చహల్ 17; రఘువంశీ (సి) బార్ట్లెట్ (బి) చహల్ 37; వెంకటేశ్ (ఎల్బీ) (బి) మ్యాక్స్‌వెల్ 7; రింకూ సింగ్ (స్టంప్డ్) ఇన్‌గ్లిస్ (బి) చహల్ 2; రసెల్ (బి) యాన్సెన్ 17; రమణ్‌దీప్ (సి) శ్రేయస్ (బి) చహల్ 0; రాణా (బి) యాన్సెన్ 3; అరోరా (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో ఆలౌట్) 95. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–62, 4–72, 5–74, 6–76, 7–76, 8–79, 9–95, 10–95. బౌలింగ్: యాన్సెన్ 3.1–0–17–3, బార్ట్లెట్ 3–0–30–1, అర్ష్ దీప్ 3–1–11–1, చహల్ 4–0–28–4, మ్యాక్స్‌వెల్ 2–0–5–1. -
కేకేఆర్ ఓడినా.. సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అనుహ్యా ఓటమి చవిచూసింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక కేకేఆర్ చతకలపడింది. కేకేఆర్ లక్ష్య చేధనలో కేవలం 95 పరుగులకే ఆలౌటై ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్ధి జట్టు డిఫెండ్ చేసుకున్న అత్యల్ప టార్గెట్ ఇదే. పంజాబ్ బౌలర్లలో స్పిన్నర్ చాహల్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మార్కో జానెసన్ మూడు.. మాక్స్వెల్, బ్రాట్‌లెట్, అర్ష్‌దీప్ తలా వికెట్ సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో కేకేఆర్ బ్యాటర్లలో రఘువన్షి(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు.నరైన్ అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ మాత్రం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒకే జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నరైన్ చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌పై నరైన్ ఇప్పటివరకు 36 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ ఆటగాడు మార్కో జాన్సెన్ను చేసి ఈ రికార్డును తన ఖాతాలో సునీల్ వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ పేరిట ఉండేది. ఉమేష్ కూడా పంజాబ్ కింగ్స్‌పై 35 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో యాదవ్ అల్‌టైమ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు.ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు36 - సునీల్ నరైన్ vs పంజాబ్ కింగ్స్35 - ఉమేష్ యాదవ్ vs పంజాబ్ కింగ్స్33 - డ్వేన్ బ్రావో vs ముంబై ఇండియన్స్33 - మోహిత్ శర్మ vs ముంబై ఇండియన్స్33 - యుజ్వేంద్ర చాహల్ vs కేకేఆర్32 - యుజ్వేంద్ర చాహల్ vs పంజాబ్32 - భువనేశ్వర్ కుమార్ vs కేకేఆర్ -
KKR Vs PBKS: కేకేఆర్ కొంపముంచిన రహానే.. ఆ ఒక్క తప్పు చేయకపోయింటే?
ఐపీఎల్-2025లో సంచలనం నమోదైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ రికార్డు విజయాన్ని అందుకుంది. 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని పంజాబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యల్ప టార్గెట్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా శ్రేయస్ సేన నిలిచింది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రియాన్ష్ ఆర్య (12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), ప్రభ్సిమ్రాన్ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు.తిప్పేసిన చాహల్..112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు పంజాబ్ పేసర్ మార్కో జానెసన్ తొలి ఓవర్లోనే భారీ షాకిచ్చాడు. ఇన్ఫామ్ బ్యాటర్ సునీల్ నరైన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే మరో పేసర్ బార్ట్లెట్.. క్వింటన్ డికాక్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత రఘువన్షి, కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఎటాక్‌లోకి వచ్చిన స్పిన్నర్ చాహల్ (Chahal) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రహానే, రింకూ సింగ్, రమణ్‌దీప్, రఘువన్షి వంటి కీలక వికెట్లను పడగొట్టి కేకేఆర్‌ను దెబ్బతీశాడు.ఆ తర్వాత జానెసన్ ఆఖరిలో చెలరేగి ఆడుతున్న విధ్వంసకర బ్యాటర్ రస్సెల్‌ను ఔట్ చేసి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. 3.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జానెసన్.. కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడుకేకేఆర్ కొంపముంచిన రహానే..కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమికి కెప్టెన్ అజింక్య రహానే పరోక్షంగా కారణమయ్యాడు. కేకేఆర్ లక్ష్య చేధనలో ఓపెనర్ల వికెట్లను ఆరంభంలోనే కోల్పోయినప్పటికి రఘువన్షి, రహానే అద్బుతంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. 7 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతే కేకేఆర్ విజయం అంతా లాంఛనమే అనుకున్నారు. కానీ ఇక్కడే రహానే చేసిన తప్పిదం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్‌లో నాలుగో బంతిని రహానే స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. వెంటనే పంజాబ్ ఆటగాళ్లు ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. అప్పటికే కేకేఆర్‌కు రెండు రివ్యూలు మిగిలిన్నప్పటికి రహానే మాత్రం రివ్యూ తీసుకోకుండా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రిప్లేలో క్లియర్‌గా ఇంపాక్ట్ ఔట్ సైడ్‌గా కన్పించింది. రహానే వికెట్‌తో కేకేఆర్ పతనం మొదలైంది. వరుస క్రమంలో బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రహానే అక్కడ రివ్యూ తీసుకుని ఉండింటే కేకేఆర్ సునాయసంగా గెలిచుండేది. -
KKR Vs PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ఉత్కంఠగా సాగిన లో-స్కోరింగ్ గేమ్‌లో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది.పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్‌ను దెబ్బతీశాడు. రహానే, రింకూ సింగ్, రమణ్‌దీప్, రఘువన్షి వంటి కీలక వికెట్లను చాహల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు మార్కో జానెసన్ కూడా సంచలన ప్రదర్శన చేశాడు. జానెసన్ క్రీజులో ఉన్న విధ్వంసకర బ్యాటర్ రస్సెల్‌ను ఔట్ చేసి తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. 3.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జానెసన్.. కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. వీరిద్దిరితో పాటు పంజాబ్ విజయంలో అర్ష్‌దీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 19వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ పరుగులేమి ఇవ్వకుండా ఓ వికెట్ పడగొట్టాడు. కేకేఆర్ బ్యాటర్లలో కేకేఆర్ బ్యాటర్లలో రఘువన్షి(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు.పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర..112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకున్న పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప టార్గెట్‌ను కాపాడుకున్న తొలి జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. 2009 సీజన్లో సీఎస్కే 116 పరుగుల స్కోర్‌ను డిఫెండ్ చేసుకుంది. తాజా మ్యాచ్‌తో సీఎస్కే ఆల్‌టైమ్ రికార్డును పంజాబ్ బ్రేక్ చేసింది.ఐపీఎల్లో డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్లు..111 - పంజాబ్ కింగ్స్ vs కేకేఆర్, ముల్లన్పూర్, 2025116/9 - సీఎస్కే vs పంజాబ్ కింగ్స్, డర్బన్, 2009118 - ఎస్ఆర్హెచ్ vs ముంబై ఇండియన్స్, ముంబై , 2018119/8 - పంజాబ్ vs ముంబై ఇండియన్స్, డర్బన్, 2009119/8 - ఎస్ఆర్హెచ్ vs పుణే వారియర్స్, పూణే, 2013చదవండి: IPL 2025: కోల్‌కతాకు షాకిచ్చిన పంజాబ్.. ఉత్కంఠ పోరులో రికార్డు విజయం -
కోల్‌కతాకు షాకిచ్చిన పంజాబ్.. ఉత్కంఠ పోరులో రికార్డు విజయం
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ డిఫెండ్ చేసుకుంది. పంజాబ్ బౌలర్ల దాటికి కేకేఆర్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది.ఓ దశలో సునాయసంగా గెలిచేలా కన్పించిన కేకేఆర్‌ను స్పిన్నర్ యుజేంద్ర చాహల్ దెబ్బతీశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు అర్ష్‌దీప్, మార్కో జానెసన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. జానెసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, మాక్స్వెల్, బ్రాట్‌లెట్ తలా వికెట్ సాధించారు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప టార్గెట్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ రికార్డులకెక్కింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువన్షి(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కూడా 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(22), శశాంక్ సింగ్(18) కాస్త ఫర్వాలేదన్పించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0), గ్లెన్ మాక్స్వెల్(7) తీవ్ర నిరాశపరిచారు. -
KKR Vs PBKS: వరుణ్ స్పిన్ మ్యాజిక్.. మాక్స్వెల్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన బౌలింగ్‌తో పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.ముఖ్యంగా పంజాబ్ డేంజరస్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను చక్రవర్తి ఔట్ చేసిన తీరు గురుంచి ఎంత చెప్పకున్న తక్కువే. మాక్సీని అద్బుతమైన బంతితో వరుణ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన వరుణ్.. తొలి బంతిని మాక్సీకి బ్యూటిఫూల్ గూగ్లీని సంధించాడు.ఆ బంతిని మాక్స్వెల్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్భుతంగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన మాక్స్వెల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన వరుణ్ 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేకేఆర్ బౌలర్ల దాటికి 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(22), శశాంక్ సింగ్(18) కాస్త ఫర్వాలేదన్పించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0), గ్లెన్ మాక్స్వెల్(7) తీవ్ర నిరాశపరిచారు. Varun Chakaravarthy, with a touch of magic, completely deceives Maxwell!Watch the LIVE action ➡ https://t.co/nrMztYaJQ8#IPLonJioStar 👉 #PBKSvKKR | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/26ve87K7oX— Star Sports (@StarSportsIndia) April 15, 2025 -
KKR Vs PBKS: కేకేఆర్ ఫీల్డర్ సూపర్ క్యాచ్.. శ్రేయస్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. సంచలన క్యాచ్‌తో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను పెవిలియన్‌కు పంపాడు. పంజాబ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన హర్షిత్ రాణా బౌలింగ్‌లో రెండో బంతికి ప్రియాన్ష్ ఆర్య ఔటయ్యాడు.ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. మూడో బంతిని డిఫెన్స్ ఆడిన అయ్యర్.. నాలుగో బంతిని డీప్పాయింట్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ అంత పవర్లో లేకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్ పాయింట్లో ఉన్న రమణ్‌దీప్ వేగంగా వచ్చి ముందుకు డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.అతడి క్యాచ్ అంతా షాక్ అయిపోయారు. దీంతో శ్రేయస్ అయ్యర్ నిరాశతో తన ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేకేఆర్ బౌలర్ల దాటికి 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(22), శశాంక్ సింగ్(18) కాస్త ఫర్వాలేదన్పించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0), గ్లెన్ మాక్స్వెల్(7) తీవ్ర నిరాశపరిచారు. That's a STUNNER 😮🎥 Ramandeep Singh pulls off a splendid grab to help Harshit Rana get 2⃣ in the over!#PBKS are 42/3 after 5 overs.#TATAIPL | #PBKSvKKR | @KKRiders pic.twitter.com/yBRPjJzdle— IndianPremierLeague (@IPL) April 15, 2025 -
పంజాబ్ కింగ్స్ సంచలన విజయం..
Punjab kings vs Kolkata Knight Riders Live Updates:పంజాబ్ కింగ్స్ సంచలన విజయం..ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో కేకేఆర్ చతకలపడింది. పంజాబ్ బౌలర్ల దాటికి 15. 1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు అర్ష్‌దీప్, మార్కో జానెసన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. జానెసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, మాక్స్వెల్, బ్రాట్‌లెట్ తలా వికెట్ సాధించారు.చాహల్ మ్యాజిక్.. కష్టాల్లో కేకేఆర్స్వల్ప లక్ష్య చేధనలో కేకేఆర్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. 76 పరుగులకే కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో రస్సెల్(1), హర్షిత్ రాణా(1) ఉన్నారు. కేకేఆర్ విజయానికి 48 బంతుల్లో 35 పరుగులు కావాలి.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన రహానే.. చహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వెంకటేశ్ అయ్యర్ వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న రఘువన్షి, రహానే..6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రఘువన్షి(31), రహానే(13) ఉన్నారు.రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్..112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో జాన్సెన్ బౌలింగ్‌లో సునీల్ నరైన్(5) క్లీన్ బౌల్డ్ కాగా.. రెండో ఓవర్లో బ్రాట్‌లెట్ బౌలింగ్‌లో డికాక్(2) ఔటయ్యాడు.చెలరేగిన కేకేఆర్ బౌలర్లు.. 111 పరుగులకే పంజాబ్ ఆలౌట్‌ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లు చేలరేగారు. కేకేఆర్ బౌలర్ల దాటికి పంజాబ్ 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(22), శశాంక్ సింగ్(18) కాస్త ఫర్వాలేదన్పించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0), గ్లెన్ మాక్స్వెల్(7) తీవ్ర నిరాశపరిచారు.పీకల్లోతు కష్టాల్లో పంజాబ్ కింగ్స్..86 పరుగులకే పంజాబ్ కింగ్స్ 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 11 ఓవర్ వేసిన సునీల్ నరైన్.. తొలి బంతికి గ్లెన్ మాక్స్వెల్ క్లీన్ బౌల్డ్ కాగా, ఆఖరి బంతికి మార్కో జానెసన్ క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 8 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు..పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలోనే నాలుగో వికెట్ కోల్పోయింది. జోష్ ఇంగ్లిష్(2) వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. ఫ్రబ్‌సిమ్రాన్ సింగ్(30) హర్షిత్ రాణా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.పంజాబ్‌కు షాక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ఆర్య.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్లో నాలుగో బంతికి శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి పంజాబ్ 39 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(16), ప్రభుసిమ్రాన్ సింగ్(17) ఉన్నారు.ఐపీఎల్-2025లో బ్లాక్ బాస్టర్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. మార్కస్ స్టోయినిష్, లాకీ ఫెర్గూసన్ స్ధానాల్లో జోష్ ఇంగ్లిష్, బెర్ట్లట్ వచ్చాడు. వీరిద్దిరికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. కేకేఆర్ కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. కేకేఆర్ కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. మోయిన్ అలీ స్ధానంలో అన్రిచ్ నోర్జే వచ్చాడు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్టే, వరుణ్ చక్రవర్తి -
'అదేమి పెద్ద నేరం కాదు.. రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చండి'
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లలో 18 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రోహిత్ శర్మపై భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కారణంగానే ముంబై ఇండియన్స్ టాప్‌లో నిలవలేకపోయిందని ఆమె అభిఫ్రాయపడింది. ముంబై ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి.. నాలుగు ఓటములు, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. "ఏ ప్లేయరైనా ఫామ్ లేకపోవడం పెద్ద నేరమేమి కాదు. ప్రతీ ఒక్కరి కెరీర్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. అయితే రోహిత్ ఫామ్‌లో లేకపోవడంతోనే ముంబై ఇండియన్స్ ఈ సారి కూడా టాప్-4లో కొనసాగలేకపోతుంది. రోహిత్ ఓపెనర్‌గా రాణించడంలో విఫలమవుతున్నాడు.కాబట్టి అతడిని దిగువన బ్యాటింగ్‌కు పంపితే జట్టుకు ప్రయోజనం చేకూరే అవకాశముంది. ముంబై చాలా అప్షన్స్ ఉన్నాయి. రోహిత్ స్ధానంలో విల్ జాక్స్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లను ప్రయత్నించవచ్చు. రోహిత్ శర్మ ఎంతటి గొప్ప ఆటగాడు మనందరికి తెలుసు. ఈ ఏడాది సీజన్లో అతడికి మంచి ఆరంభం దక్కలేదు. సహజంగా ఐపీఎల్‌లోనైనా, వరల్డ్‌కప్‌లోనైనా మన స్టార్ బ్యాటర్లు ఫామ్‌లో ఉండాలని కోరుకుంటాము. కొంతమంది వెంటనే తమ ఫామ్‌ను అందుకుని తిరిగి గాడిలో పడతారు. మరి కొంత మంది కాస్త ఆలస్యంగా తమ రిథమ్‌ను అందుకుంటారు. అంతమాత్రన వారు అత్యుత్తమ బ్యాటర్లు కాదని ఆర్ధం కాదని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్కే ప్లేయర్‌గా -
చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్కే ప్లేయర్‌గా
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల తర్వాత తిరిగి పుంజుకుంది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపొందింది. ఈ విజయంలో కెప్టెన్ ధోని(26), దూబే(43), రచిన్ రవీంద్ర(37)లది కీలక పాత్ర.సీఎస్కే గెలుపులో వీరు ముగ్గురుతో పాటు మరో యువ ఆటగాడు కూడా తన వంతు పాత్ర పోషించాడు. అతడే భారత అండర్-19 టీమ్ మాజీ వైస్ కెప్టెన్, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్. షేక్ రషీద్ సీఎస్కే తరపున తన ఐపీఎల్ అరంగేట్రంలోనే అందరిని ఆకట్టుకున్నాడు.167 పరుగుల లక్ష్య చేధనలో దూకుడుగా ఆడుతూ చెన్నైకి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న రషీద్.. 6 ఫోర్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ రచిన్ రవీంద్రతో కలిసి తొలి వికెట్‌కు 52 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.సామ్ కుర్రాన్ రికార్డు బద్దలు..ఈ మ్యాచ్‌లో షేక్ రషీద్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో సీఎస్కే తరపున ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అతి పిన్న వయస్కుడిగా రషీద్ నిలిచాడు. ఈ ఆంధ్రా ఆటగాడు కేవలం 20 ఏళ్ల 202 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ పేరిట ఉండేది.కుర్రాన్ ఐపీఎల్-2020లో సీఎస్కే తరపున 22 ఏళ్ల 132 రోజుల వయస్సులో ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశాడు. తాజా మ్యాచ్‌తో కుర్రాన్ ఆల్‌టైమ్ రికార్డును రషీద్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రషీద్‌ను రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు సీఎస్కే కొనుగోలు చేసింది. రషీద్ తన కెరీర్లో ఇప్పటివరకు 19 ఫస్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడి 37. 62 సగటుతో 1204 పరుగులు చేశాడు. అంతేకాకుండా 12 లిస్ట్-ఎ, 17 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని -
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
ఐపీఎల్-2025 (IPL 2025) రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) ఊహించని రీతిలో ముందుకు సాగుతుంటే.. ఐదేసి సార్లు ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మాత్రం రాజస్తాన్ రాయల్స్ (RR)తో కలిసి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నాయి.ఇక డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా సవాళ్లకు ఎదురీతుండగా.. గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేకేఆర్ ఇప్పటికి ఆరింట మూడు గెలిస్తే.. రైజర్స్ ఆరింట రెండే గెలిచి చివరన ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ కొనసాగుతోంది.గతేడాది బెంగళూరు జట్టుపై 287/3 స్కోరు నమోదు చేసింది. ఈ ఏడాది తమ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ సన్‌రైజర్స్.. ఈ రికార్డు స్కోరు కంటే ఒక్క పరుగు తక్కువ చేసి.. తమ రికార్డును తామే బద్దలుకొడుతుందా అనిపించింది. అయితే, ఇప్పటికి ఆ రికార్డు మాత్రం పదిలంగానే ఉండిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి చెక్కు చెదరని రికార్డులు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఓసారి గమనిద్దామా?!రికార్డుల రారాజుకే సాధ్యమైందిరన్మెషీన్ పేరొందిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న ఈ రికార్డుల రారాజు 2016 సీజన్లో నాలుగు శతకాల సాయంతో ఏకంగా 973 పరుగులు సాధించాడు. గత ఎనిమిదేళ్లుగా ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు2013లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పుణె వారియర్స్‌పై 66 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఫాస్టెస్ట్ సెంచరీతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు.అత్యధిక వరుస విజయాలుఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికి మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. 2014, 2015 సీజన్లలో అరుదైన ఘనత సాధించింది.గౌతం గంభీర్ సారథ్యంలో 2014లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది కేకేఆర్. ఆ మరుసటి ఏడాది వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. ఇంత వరకు ఏ జట్టుకు ఇలాంటి వరుస విజయాల ఘనత సాధ్యం కాలేదు.పార్ట్నర్స్ఐపీఎల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా విరాట్ కోహ్లి- ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నారు. 2016లో ఆర్సీబీ తరఫున ఈ దిగ్గజ బ్యాటర్లు గుజరాత్ లయన్స్‌పై 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. గతంలో ముంబై ఇండియన్స్‌పై తాము సాధించిన 215 (నాటౌట్) పరుగుల భాగస్వామ్య రికార్డును వారే బ్రేక్ చేశారు.హ్యాట్రిక్ వీరుడుఐపీఎల్లో అత్యధిక హ్యాట్రిక్‌లు నమోదు చేసిన బౌలర్‌గా రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కొనసాగుతున్నాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున దక్కన్ చార్జర్స్‌పై, 2011లో దక్కన్ చార్జర్స్ తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2011లో పుణె వారియర్స్‌పై అమిత్ మిశ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు.అరంగేట్రంలోనే అదరగొట్టివెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ఏప్రిల్ 6, 2019లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా 6/12 గణాంకాలు నమోదు చేశాడు. తద్వారా డెబ్యూలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.డివిలియర్స్ పేరిటే..ఒక సీజన్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నాడు. 2016 సీజన్లో అతడు మొత్తంగా 19 క్యాచ్‌లు అందుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (17), రియాన్ పరాగ్ (17) అతడికి చేరువగా వచ్చినా ఈ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయారు.చదవండి: మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు.. -
IPL 2025: పంజాబ్, కేకేఆర్ చివరి సారి తలపడినప్పుడు ఏం జరిగిందో తెలుసా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 15) బిగ్ ఫైట్ జరుగనుంది. చండీఘడ్ వేదికగా పంజాబ్, కేకేఆర్ కత్తులు దూసుకోనున్నాయి. ఈ రెండు జట్లు చివరి సారి తలపడినప్పుడు పరుగుల వరద పారింది. 2024 సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ నిర్దేశించిన 262 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ఛేదన.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (10 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్సర్లు), రసెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది.అనంతరం దాదాపుగా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. జానీ బెయిర్‌స్టో విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పంజాబ్ ఆటగాళ్లలో బెయిర్‌స్టోతో పాటు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రిలీ రొస్సో (16 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), శశాంక్ సింగ్ (28 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించారు.నేటి మ్యాచ్‌లో అదే తరహాలో పరుగుల వరద పారాలని అభిమానులు ఆశిస్తున్నారు. పంజాబ్‌కు గత మ్యాచ్ తరహాలోనే బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నా, కేకేఆర్ కాస్త మెత్తబడినట్లనిపిస్తుంది. ఈ సీజన్లోనూ కేకేఆర్‌లో అదే ఆటగాళ్లు (శ్రేయస్ మినహా) కనిపిస్తున్నా, ఎందుకో పంజాబ్ కంటే కాస్త బలహీనంగా కనిపిస్తుంది. పంజాబ్, కేకేఆర్ ఐపీఎల్లో ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఇటీవలకాలంలో ఈ ఇరు జట్లు తలపడినప్పుడు చెరో సారి విజయం పలకరించింది. చివరిసారి పంజాబ్ గెలవగా, అంతకుముందు కేకేఆర్, దానికి ముందు పంజాబ్ గెలిచాయి. నేటి మ్యాచ్‌లో పంజాబ్ తమ స్టార్ బౌలర్ ఫెర్గూసన్ సేవలు కోల్పోయింది. గత మ్యాచ్‌లో గాయం కారణంగా ఫెర్గూసన్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఫెర్గూసన్ లేని కారణంగా పంజాబ్ గత మ్యాచ్‌లో (సన్‌రైజర్స్) 246 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోయింది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. విధ్వంసకర బ్యాటర్లు సునీల్ నరైన్, రసెల్, రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్ పెద్దగా ఫామ్‌లో లేరు. ఈ సీజన్లో కేకేఆర్ బౌలర్ల ప్రదర్శనతో నెట్టుకొస్తుంది. పంజాబ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో అతి భయానకంగా కనిపిస్తుంది. ఇప్పటికే అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర సెంచరీ బాదగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వైషాక్ విజయ్కుమార్కేకేఆర్: సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్), అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్/మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా -
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో ముంబై గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం రోహిత్ అని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ ముంబై స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతోంది.ఇప్పటి వరకు ఈ సీజన్లో హార్దిక్ సేన ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. చివరగా ఢిల్లీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ముంబై గట్టెక్కింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది.205 పరుగులు ఓపెనర్ రియాన్ రికెల్టన్ (25 బంతుల్లో 41), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 40) రాణించగా.. తిలక్ వర్మ ( Tilak Varma- 33 బంతుల్లో 59), నమన్ ధీర్ (Naman Dhir- 17 బంతుల్లో 38 నాటౌట్) దంచికొట్టారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ముంబై 205 పరుగులు సాధించింది.కరుణ్ నాయర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడినా కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి వరకు పోటీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రమాదకర బ్యాటర్ కరుణ్ నాయర్‌తో పాటు కేఎల్ రాహుల్, స్టబ్స్ ఆట కట్టించేందుకు రోహిత్ శర్మ ఇచ్చిన సలహాలు పనిచేశాయి.కొత్త బంతితో మ్యాజిక్బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఐపీఎల్-2025లో మంచు ప్రభావం మరీ ఎక్కువగా ఉంటే.. పదవ ఓవర్ ముగిసిన తర్వాత కొత్త బంతిని తీసుకోవచ్చు. ఈ రూల్‌ను ఢిల్లీతో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో రోహిత్ అమలు చేయించాడు. జోరు మీదున్న ఢిల్లీకి అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్ కర్ణ్ శర్మకు కొత్త బంతిని ఇవ్వాలని డగౌట్ నుంచి సూచించాడు. రోహిత్ ఇచ్చిన ఈ సలహా బాగా వర్కౌట్ అయింది. 14, 16 ఓవర్లలో కర్ణ్ ట్రిస్టస్ స్టబ్స్, కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్లు తీశాడు. ఇక కరుణ్ నాయర్‌ను మిచెల్ శాంట్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ నేపథ్యంలో 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయి.. ఢిల్లీ ముంబై చేతిలో ఓటమిని చవిచూసింది.కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలిఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ అద్భుతం చేశాడు. స్పిన్నర్లు.. ముఖ్యంగా కర్ణ్ శర్మను రంగంలోకి దించాలని హెడ్‌కోచ్ మహేళ జయవర్దనేకు చెప్పాడు. కర్ణ్ ఏకంగా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.నిజంగా ఇదొక అద్భుతమైన వ్యూహం. కానీ జయవర్ధనే తొలుత రోహిత్ మాటకు అంగీకరించలేదనిపించింది. కొన్నిసార్లు కోచ్‌లు తమ అహాన్ని పక్కన పెట్టి.. జట్టు ఎలా బాగుపడుతుందనే విషయం మీదే దృష్టి పెట్టాలి.రోహిత్ శర్మ డగౌట్ నుంచి ఇన్పుట్స్ ఇచ్చాడు. కానీ జయవర్ధనేకు అవి నచ్చినట్లు లేదు. ఒకవేళ జయవర్ధనే చెప్పినట్లు విని ఉంటే ఢిల్లీ చేతిలో ముంబై ఓడిపోయేది. రోహిత్ కెప్టెన్. దిగ్గజ సారథి.. కెప్టెన్ ఎప్పుడూ కెప్టెన్‌లాగే ఆలోచిస్తాడు. రోహిత్ వ్యూహం వల్లే ముంబై గెలిచింది’’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..కెప్టెన్‌గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయిAgar miss kiye toh ab dekho - 𝐊𝐚𝐫𝐧 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝐤𝐚 𝐁𝐡𝐨𝐨𝐥 𝐁𝐡𝐮𝐥𝐚𝐢𝐲𝐚𝐚 🌀#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #DCvMIpic.twitter.com/T8KabriAbK— Mumbai Indians (@mipaltan) April 13, 2025 -
PBKS vs KKR: బౌలర్‌గా తీసుకోలేదు కదా.. అతడిపై వేటు వేయండి!
ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (PBKS vs KKR)తో మ్యాచ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ తమ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌పై వేటు వేయాలని సూచించాడు. అతడి స్థానంలో మరో బ్యాటర్‌ను ఎంపిక చేసుకుంటే శ్రేయస్ సేనకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.మూడు గెలిచిన పంజాబ్కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell)ను రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు ఈ సీజన్లో నాలుగు ఇన్నింగ్స్ ఆడి కేవలం 34 పరుగులు చేశాడు. చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతడు చేసిన స్కోరు 3.ఇక స్పిన్ బౌలింగ్ చేయగల మాక్సీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2025లో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచిన పంజాబ్ కింగ్స్.. మంగళవారం కేకేఆర్‌తో ముల్లన్పూర్ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాక్స్‌వెల్‌ను జట్టు నుంచి తొలగించాలని పంజాబ్ నాయకత్వ బృందానికి సూచన ఇచ్చాడు.‘‘గత మ్యాచ్‌లో (సన్‌రైజర్స్) పంజాబ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్.. మార్కస్ స్టొయినిస్.. అంతా అద్భుతంగా ఆడారు. కానీ మాక్సీ సంగతేంటి?..బౌలర్‌గా తీసుకోలేదు కదా.. అతడిపై వేటు వేయండి!దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించండి. గ్లెన్ మాక్స్‌వెల్‌ను బ్యాటర్‌గా మీరు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటున్నారు. బౌలర్‌గా అతడికి చోటు ఇవ్వాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. కానీ అతడు ఏం చేస్తున్నాడు. అందుకే అతడిని తుదిజట్టు నుంచి తప్పిస్తే మరొక బ్యాటర్‌కు అవకాశం దక్కుతుంది.అతడు బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. నేను కూడా ఒప్పుకొంటాను. మాక్సీ రూపంలో మీకు ఆఫ్ స్పిన్నర్ దొరికాడు. ఇక కేకేఆర్‌లో మీకు నలుగురు లెఫ్టాండర్లు కనిపిస్తున్నారు. సునిల్ నరైన్, క్వింటన్ డికాక్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్.. వీళ్ల కోసం మీరు మాక్సీని ఆడించాలని చూస్తారు.దయచేసి పరుగులు సాధించవయ్యాకానీ అతడు బ్యాట్‌తో రాణించకపోతే ఫలితం ఉండదు. కేకేఆర్ స్పిన్నర్లను మాక్సీ ఎదుర్కోలేడు. ఏదేమైనా మాక్స్వెల్ సాబ్.. నువ్వు గనుక తుదిజట్టులో ఉంటే.. దయచేసి పరుగులు సాధించవయ్యా.. చేతులు జోడించి అర్థిస్తున్నా’’ అంటూ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ చానెల్లో తనదైన శైలిలో మాక్సీ గురించి కామెంట్స్ చేశాడు.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త ఉత్సాహంతోకాగా గత సీజన్లో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచిన పంజాబ్.. తొమ్మిదో స్థానంతో ముగించింది. అయితే, ఈసారి మెగా వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్‌ను సొంతం చేసుకుని.. కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఇక పంజాబ్ సారథిగా తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్న శ్రేయస్.. బ్యాటర్‌గానూ దుమ్ములేపుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్ ఆడి 250 పరుగులు సాధించాడు.చదవండి: కెప్టెన్‌గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయిమాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు.. -
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మరో చారిత్రక మైలురాయిని అందుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 200 డిస్మిసల్స్‌ను (క్యాచ్‌లు లేదా స్టంపింగ్స్) పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా (ఫీల్డర్ లేదా వికెట్ కీపర్) చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 14) లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆయుశ్ బదోనిని స్టంపౌట్ (రవీంద్ర జడేజా బౌలింగ్‌లో) చేయడంతో ఈ ఘనత సాధించాడు. 𝙀𝙖𝙨𝙞𝙡𝙮 𝘿𝙤𝙣𝙚 😎Dismissal No.2⃣0⃣0⃣ for MS Dhoni Wicket No.2⃣ for Ravindra Jadeja tonight 🎥 @ChennaiIPL fans have plenty to celebrate here 💛Updates ▶ https://t.co/jHrifBkT14 #TATAIPL | #LSGvCSK | @msdhoni | @imjadeja pic.twitter.com/UHwLwpJ4XK— IndianPremierLeague (@IPL) April 14, 2025ఈ మ్యాచ్‌లో ధోని మరో ఇద్దరిని ఔట్ చేయడంలో కూడా భాగమయ్యాడు. పతిరణ బౌలింగ్‌లో వైడ్‌బాల్‌ను కలెక్ట్ చేసుకుని అద్భుతమైన డైరెక్ట్ త్రోతో (నాన్ స్ట్రయికర్ ఎండ్) అబ్దుల్ సమద్‌ను రనౌట్ చేసి.. ఆ మరుసటి బంతికే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. పంత్ క్యాచ్‌తో ఐపీఎల్లో ధోని డిస్మిసల్స్ సంఖ్య 201కి చేరింది. ధోని తన 270వ ఇన్నింగ్స్‌లో డిస్మిసల్స్ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.Thala doing it all tonight, in his own style😎What a precise underhand throw that was by Dhoni 🔥#LSGvsCSK #LSGvCSK #CSKvLSG pic.twitter.com/kIuPayt8t4— Aditya Singh Rawat (@Catslayer_999) April 14, 2025ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన ఆటగాళ్లు (ఫీల్డర్ లేదా వికెట్ కీపర్)201* - ఎంఎస్ ధోని (155 క్యాచ్‌లు, 46 స్టంపింగ్‌లు)182 - దినేష్ కార్తీక్126 - ఏబీ డివిలియర్స్124 - రాబిన్ ఉతప్ప118 - వృద్ధిమాన్ సాహా116 - విరాట్ కోహ్లీలక్నో మ్యాచ్‌లో తొలుత అద్భుతమైన వికెట్‌కీపింగ్‌తో అదరగొట్టిన ధోని ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. 11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేసి సీఎస్కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్ అహ్మద్ (4-0-13-0), ఖలీల్ అహ్మద్ (4-0-38-1), అన్షుల్ కంబోజ్ (3-0-20-1) రాణించడంతో నామమాత్రపు స్కోర్‌కే (166/7) పరిమితమైంది.లక్నో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్ (8), మార్క్రమ్ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.అనంతరం 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే.. తొలి 15 ఓవర్ల వరకు (115/5) పరాజయం దిశగా సాగింది. ధోని రాకతో సీఎస్కేలో గెలుపు జోష్ వచ్చింది. ధోని వచ్చీ రాగానే ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అప్పటివరకు నిదానంగా ఆడిన శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధోని అండతో గేర్ మార్చాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 3 బంతులు మిగిలుండగానే సీఎస్కేను విజయతీరాలకు చేర్చారు.సీఎస్కే ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు షేక్ రషీద్ (27), రచిన్ రవీంద్ర (37) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రాహుల్ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7), విజయ్ శంకర్ (9) నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ సింగ్ రాఠీ (4-0-23-1), రవి బిష్ణోయ్ (3-0-18-2), మార్క్రమ్ (4-0-25-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. శార్దూల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. -
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
ఐపీఎల్-2025 (IPL 2025)లో వరుస విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే, డెత్ ఓవర్లలో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీసుకున్న నిర్ణయాలే లక్నో ఓటమికి ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి.49 బంతుల్లో 63 రన్స్లక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై (LSG vs CSK)తో తలపడ్డ పంత్ సేన.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఐడెన్ మార్క్రమ్ (6) విఫలం కాగా.. మిచెల్ మార్ష్ (30) ఫర్వాలేదనిపించాడు. అయితే, ఇన్ఫామ్ బ్యాటర్ నికోలస్ పూరన్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో నాలుగో స్థానంలో ఆడిన పంత్ 49 బంతుల్లో 63 రన్స్ చేయగా.. ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) అతడికి సహకారం అందించారు. ఫలితంగా లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ (నాలుగు ఓవర్లలో 13 రన్స్) పొదుపుగా బౌలింగ్ చేశాడు. పేసర్లలో మతీశ పతిరణ రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు చెన్నై తడబడింది.శివం దూబేతో కలిసి ధోనిఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఓ మోస్తరుగా ఆడగా.. రాహుల్ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7) పూర్తిగా విఫలమయ్యారు. వీరిద్దరు లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఇలాంటి తరుణంలో శివం దూబేతో కలిసి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.రవి బిష్ణోయిని కాదని.. ఈ క్రమంలో ఆఖరి నాలుగు ఓవర్లలో చెన్నై విజయానికి 44 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఒత్తిడిలో కూరుకుపోయిన లక్నో సారథి పంత్ బౌలింగ్ చాయిస్ విషయంలో తప్పటడుగు వేశాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసిన రవి బిష్ణోయిని కాదని.. పేస్ ద్వయం ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్‌ను నమ్ముకున్నాడు.ఇక దూబే (37 బంతుల్లో 43), ధోని (11 బంతుల్లో 26) వారి బౌలింగ్‌లో పరుగులు పిండుకుని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే చెన్నైని విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయి పంత్ నిర్ణయంపై స్పందించాడు.నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..‘‘నేను పంత్‌తో ఏమీ మాట్లాడలేదు. అయితే, వికెట్ స్వభావాన్ని బట్టి నన్ను పిలుస్తాడేమోనని రెండు, మూడు సార్లు అతడికి దగ్గరగా వెళ్లాను. కానీ తన ప్రణాళికలు వేరేగా ఉన్నాయి. కాబట్టి నన్ను పట్టించుకోలేదేమో!ఇలాంటి కీలక సమయంలో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా తనకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి. మా కంటే అతడే గొప్పగా పరిస్థితులను అంచనా వేయగలడు. అందుకే తన నిర్ణయం సరైందనే భావనతో ముందుకు వెళ్లి ఉంటాడు.ఏదైమైనా మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను, రాఠి, మార్క్రమ్ ఉన్నాం. కాబట్టి అదనపు స్పిన్నర్ అవసరం లేదు. ఇక మహీ భాయ్ గురించి చెప్పేదేముంది?!.. బంతి తన ఆధీనంలో ఉందంటే దానిని బౌండరీకి తరలించడమే తరువాయి’’ అని రవి బిష్ణోయి పరోక్షంగా పంత్ నిర్ణయాన్ని విమర్శించాడు.కాగా లక్నో బౌలర్లలో స్పిన్నర్లు రవి బిష్ణోయి మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దిగ్వేశ్ సింగ్ రాఠీ, మార్క్రమ్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్లలో ఆవేశ్ ఖాన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.చదవండి: MS Dhoni On POM Award: ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది The IMPACT player does it with MAX IMPACT 🤩Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025 -
LSG VS CSK: చరిత్ర సృష్టించిన ధోని
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై గెలిచిన తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో ధోని ముగ్గురిని ఔట్ చేయడంలో భాగం కావడంతో పాటు ఛేదనలో అతి మూల్యమైన ఇన్నింగ్స్ (11 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) ఆడాడు. ఫలితంగా సీఎస్కే లక్నోను వారి సొంత ఇలాకాలో (అటల్ బిహారీ వాజ్‌పేయ్ స్టేడియం) చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనకు గానూ ధోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకునే సమయానికి ధోని వయసు 43 ఏళ్ల 282 రోజులు. ధోనికి ముందు ఈ రికార్డు మాజీ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ప్రవీణ్ తాంబే పేరిట ఉండేది. ప్రవీణ్ 42 ఏళ్ల 200 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2014 సీజన్లో అబుదాబీలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ప్రవీణ్ ఈ ఘనత సాధించాడు.ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న అతి పెద్ద వయస్కులుఎంఎస్ ధోని- 43 ఏళ్ల 282 రోజులుప్రవీణ్ తాంబే- 42 ఏళ్ల 200 రోజులుషేన్ వార్న్- 41 ఏళ్ల 211 రోజులుఆడమ్ గిల్‌క్రిస్ట్- 41 ఏళ్ల 181 రోజులుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్ అహ్మద్ (4-0-13-0), ఖలీల్ అహ్మద్ (4-0-38-1), అన్షుల్ కంబోజ్ (3-0-20-1) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్ (8), మార్క్రమ్ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే.. ఓ దశలో కష్టాలు ఎదుర్కొన్నటికీ శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని సత్తా చాటడంతో మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. సీఎస్కే ఇన్నింగ్స్‌కు తెలుగు కుర్రాడు షేక్ రషీద్ (27), రచిన్ రవీంద్ర (37) గట్టి పునాది వేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. రాహుల్ త్రిపాఠి (9) వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. రవీంద్ర జడేజా (7), విజయ్ శంకర్ (9) కూడా నిరాశపరిచారు. ధోని, దూబే ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి సీఎస్కేను గెలిపించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ సింగ్ రాఠీ (4-0-23-1), రవి బిష్ణోయ్ (3-0-18-2), మర్క్రమ్ (4-0-25-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. శార్దూల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. సీఎస్కే విజయానికి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరమైనప్పుడు.. దూబే, ధోని జోడీ శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. మూడో బంతికి దూబే బౌండరీ బాది సీఎస్కేను విజయతీరాలు దాటించాడు. -
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2025 (IPL 2025)లో గెలుపు బాట పట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs CSK)పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. తమ పరాజయ పరంపరకు బ్రేక్ వేసింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సీజన్లో రెండో గెలుపు నమోదు చేసింది.రిషభ్ పంత్ తొలిసారిలక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు రాణించడంతో లక్నోను 166 పరుగులకు కట్టడి చేయగలిగింది. లక్నో ఆటగాళ్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సీజన్లో తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. 49 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. ఇక సీఎస్కే బౌలర్లలో మతీశ పతిరణ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.పొదుపుగా బౌలింగ్ చేసిన నూర్మిగతా వాళ్లలో నూర్ అహ్మద్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. ఇక లక్నో విధించిన లక్ష్యాన్ని ధోని సేన 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించగా.. శివం దూబే (37 బంతుల్లో 43 నాటౌట్) నిలకడగా ఆడాడు. ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి దూబేతో కలిసి జట్టు గెలుపును ఖరారు చేశాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తూ వివిధ కారణాల వల్ల మేము ఆరంభ మ్యాచ్‌లలో విఫలమయ్యాం. సొంత మైదానం చెపాక్‌లో ఓటములు చవిచూశాం.ఘనమైన భవిష్యత్తుఇలాంటి సమయంలో ఇతర వేదికపై గెలవడం కాస్త ఊరట కలిగించే అంశం. జట్టులో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపిన విజయం ఇది. పవర్ ప్లేలో మేము ఈసారి కూడా ఇబ్బందిపడ్డాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం.అయినప్పటికీ తిరిగి పుంజుకున్నాం. ఈరోజు మా బౌలర్లు, బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. షేక్ రషీద్ మాతో చాన్నాళ్లుగా ప్రయాణం చేస్తున్నాడు. నెట్స్‌లో స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు అతడు మ్యాచ్ ఆడాడు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో గొప్పగా రాణించగల సత్తా అతడికి ఉంది.ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సిందిఇక ఈరోజైతే నాకు.. ‘నాకు ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు?’ అని అనిపించింది. నిజానికి నూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు కదా!’’ అని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను నూర్ అహ్మద్‌కు ఇచ్చి ఉంటే బాగుండేదని ధోని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడింది. తాజాగా లక్నోపై గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివర్లోనే కొనసాగుతోంది.ఐపీఎల్ 2025: లక్నో వర్సెస్ చెన్నై👉లక్నో స్కోరు: 166/7 (20)👉చెన్నై స్కోరు: 168/5 (19.3)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో లక్నోపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహేంద్ర సింగ్ ధోని.చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు.. The IMPACT player does it with MAX IMPACT 🤩Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025 -
CSK Vs LSG: చెన్నై గెలిచిందోచ్...
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు కాస్త ఊరట... వరుసగా ఐదు పరాజయాల తర్వాత పూర్తిగా ఆట మరచినట్లు కనిపించిన జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి లక్నోను ఆ జట్టు వేదికపైనే స్పిన్‌తో కట్టడి చేసిన సీఎస్కే ఆ తర్వాత మరో మూడు బంతులు మిగిలి ఉండగా లక్ష్యం చేరింది. బౌలింగ్‌లో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించగా, బ్యాటింగ్‌లో శివమ్ దూబే రాణించాడు. అన్నింటికి మించి మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగా క్రీజ్‌లోకి వచ్చిన ధోని తడబాటు లేకుండా, దూకుడుగా ఆడి జట్టుకు అవసరమైన ‘విలువైన’ పరుగులు సాధించడం మరో సానుకూలాశం. మరోవైపు ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీద కనిపించిన లక్నో సమష్టి వైఫల్యంతో ఓటమిని ఆహా్వనించింది. లక్నో: ఐపీఎల్లో ఎట్టకేలకు మూడు వారాల విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) గెలుపు రుచి చూసింది. సోమవారం జరిగిన పోరులో సీఎస్కే 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెపె్టన్ రిషభ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, మిచెల్ మార్‡్ష (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలుపు దిశగా నడిపించగా, ఎమ్మెస్ ధోని (11 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 28 బంతుల్లో అభేద్యంగా 57 పరుగులు జోడించారు. పంత్ హాఫ్ సెంచరీ... తొలి ఓవర్లోనే మార్క్రమ్ (6) అవుట్ కాగా, టోర్నీ ప్రస్తుత టాప్ స్కోరర్ నికోలస్ పూరన్ (8) కూడా విఫలం కావడంతో లక్నోకు సరైన ఆరంభం లభించలేదు. ఖలీల్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి మార్‡్ష జోరు ప్రదర్శించగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 80 స్ట్రయిక్‌రేట్‌తో 40 పరుగులే చేసిన పంత్ ఈ మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో మార్‡్షను జడేజా వెనక్కి పంపగా... ఒవర్టన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన ఆయుశ్ బదోని (17 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా జడేజా బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అప్పటి వరకు మెరుగ్గానే ఆడిన పంత్‌ను చెన్నై స్పిన్నర్లు పూర్తిగా కట్టిపడేశారు. ముఖ్యంగా నూర్ బౌలింగ్‌లో 15 బంతులు ఆడిన పంత్ 10 బంతుల్లో సింగిల్ కూడా తీయలేకపోయాడు! అయితే ఆ తర్వాత పతిరణ ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో 42 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. చివరి 3 ఓవర్లలో లక్నో 45 పరుగులు సాధించింది. కీలక భాగస్వామ్యం... 2023 సీజన్ నుంచి చెన్నై జట్టుతో ఉన్న ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ (19 బంతుల్లో 27; 6 ఫోర్లు)కు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. కొన్ని చక్కటి షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను, శార్దుల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టడం విశేషం. అయితే అవేశ్ ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్‌లో రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37; 5 ఫోర్లు) కూడా వేగంగా ఆడటంతో పవర్‌ప్లేలో చెన్నై 59 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో జట్టు రచిన్, త్రిపాఠి (9), జడేజా (7), విజయ్‌శంకర్ (9) వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. విజయానికి 30 బంతుల్లో 56 పరుగులు కావాల్సిన స్థితిలో దూబే, ధోని జత కలిశారు. తాను ఆడిన తొలి బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్ బాది ధోని దూకుడు ప్రదర్శించడంలో ఒత్తిడి కాస్త తగ్గింది. చివరి 2 ఓవర్లలో 24 పరుగులు అవసరమయ్యాయి. శార్దుల్ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ సహా 19 పరుగులు రాబట్టి విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న చెన్నై... మరో మూడు బంతుల్లో లాంఛనం పూర్తి చేసింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) త్రిపాఠి (బి) అహ్మద్ 6; మార్‡్ష (బి) జడేజా 30; పూరన్ (ఎల్బీ) (బి) కంబోజ్ 8; పంత్ (సి) ధోని (బి) పతిరణ 63; బదోని (స్టంప్డ్) ధోని (బి) జడేజా 22; సమద్ (రనౌట్) 20; మిల్లర్ (నాటౌట్) 0; శార్దుల్ (సి) రషీద్ (బి) పతిరణ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–6, 2–23, 3–73, 4–105, 5–158, 6–158, 7–166. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–38–1, అన్షుల్ కంబోజ్ 3–0–20–1, ఒవర్టన్ 2–0–24–0, జడేజా 3–0–24–2, నూర్ అహ్మద్ 4–0–13–0, పతిరణ 4–0–45–2. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) పూరన్ (బి) అవేశ్ 27; రచిన్ (ఎల్బీ) (బి) మార్క్రమ్ 37; రాహుల్ త్రిపాఠి (సి అండ్ బి) రవి బిష్ణోయ్ 9; జడేజా (సి) మార్క్రమ్ (బి) రవి బిష్ణోయ్ 7; శివమ్ దూబే (నాటౌట్) 43; విజయ్‌శంకర్ (సి) అవేశ్ (బి) దిగ్వేశ్ రాఠీ 9; ధోని (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–52, 2–74, 3–76, 4–96, 5–111. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–56–0, ఆకాశ్‌దీప్ 1–0–13–0, దిగ్వేశ్ రాఠీ 4–0–23–1, అవేశ్ ఖాన్ 3.3–0–32–1, రవి బిష్ణోయ్ 3–0–18–2, మార్క్రమ్ 4–0–25–1. ఐపీఎల్లో నేడుపంజాబ్ X కోల్‌కతా వేదిక: ముల్లాన్‌పూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రఫ్పాడించిన ధోని.. చెన్నై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించాడు.ధోని కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా 167 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది. రచిన్ రవీంద్ర(37), షేక్ రషీద్(27) పరుగులతో రాణించారు.లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. దిగ్వేష్, మార్క్రమ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.49 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్ష్(30), బదోని(22) రాణించారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా,పతిరానా తలా రెండు వికెట్లు సాధించగా.. ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ ఒక్క వికెట్ పడగొట్టారు.చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు.. -
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురు తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌ల మొత్తానికి దూరమయ్యాడు. ఆడమ్ జంపా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.గాయం నుంచి కోలుకునేందుకు జంపా తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో జంపా స్దానాన్ని కర్ణాటక ప్లేయర్ స్మరన్ రవిచంద్రన్‌తో ఎస్ఆర్హెచ్ భర్తీ చేసింది. రూ. 30ల లక్షల కనీస ధరకు రవిచంద్రన్‌ని సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. అతడి రిప్లేస్మెంట్ను ఐపీఎల్ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించింది. 21 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ గతేడాది కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మొత్తం మూడు ఫార్మాట్లలోనూ అద్బుతంగా రాణిస్తున్నాడు. కర్ణాటక తరఫున స్మరన్ 7 ఫస్ట్-క్లాస్, 10 లిస్ట్ A, 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) సీజన్లో స్మరన్ అసాధారణ ప్రదర్శన చేశాడు. ఈ కర్ణాటక ఆటగాడు 6 మ్యాచ్‌ల్లో 34 సగటుతో 170 పరుగులు చేశాడు. స్మరన్‌కు అద్బుతమైన పవర్ హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అయితే ఈ ఏడాది మార్చిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మరన్‌ను ట్రయల్స్‌కు పిలిచింది. ఎవరైనా గాయపడితే అతడిని జట్టులోకి తీసుకోవాలని ఆర్సీబీ భావించింది. కానీ అంతలోనే రవిచంద్రన్‌ను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.చదవండి: IPL 2025: అక్షర్ పటేల్‌కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా -
పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ మోకాలికి గాయమైంది.అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీజన్ మొత్తానికి ఫెర్గూసన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ కూడా ధృవీకరించాడు. లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.అతడు ప్రస్తుతం జట్టుతో ఉన్నప్పటకి, మిగిలిన టోర్నమెంట్లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని హోప్స్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ఫెర్గూసన్ మంచి టచ్‌లో కన్పించాడు. ఫెర్గూసన్ పంజాబ్ తరపున నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.అయితే అతడి స్ధానంలో జేవియర్ బార్ట్లెట్ లేదా అజ్మతుల్లా ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ ఏడాది సీజన్లో పంజాబ్ కింగ్స్ పర్వాలేదన్పిస్తోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు పంజాబ్ మూడింట గెలుపొందింది.ఐపీఎల్-2025కు పంజాబ్ కింగ్స్ జట్టు..శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, నెహాల్ వధేరా, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, విజయ్‌కుమార్ వైషాక్, యశ్ ఠాకూర్, మార్కో జాన్సెన్, జోష్ ఇంగ్లిస్, హర్నూర్ పన్ను, కుల్దీప్ సేన్, ప్రియాంష్ ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్లెట్, పైలా అవినాష్, ప్రవీణ్ దూబే.చదవండి: IPL 2025: అక్షర్ పటేల్‌కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా -
IPL 2025: ధోని మెరుపులు.. లక్నోపై సీఎస్కే విజయం
LSG vs CSK Live Updates: సీఎస్కే ఘన విజయంఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించాడు. ధోని కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా 167 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది. 18 ఓవర్లకు స్కోర్: 143/518 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(26), ధోని(20) ఉన్నారు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 127/516 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(19), ధోని(9) ఉన్నారు. సీఎస్కే విజయానికి 24 బంతుల్లో 44 పరుగులు కావాలి.సీఎస్కే నాలుగో వికెట్ డౌన్..జడేజా రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జడేజా.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.రవీంద్ర ఔట్..రచిన్ రవీంద్ర రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. మార్క్రమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.సీఎస్కే తొలి వికెట్ డౌన్..షేక్ రషీద్ రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన షేక్ రషీద్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర(25), రాహుల్ త్రిపాఠి(5) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న సీఎస్కే167 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో షేక్ రషీద్(22), రచిన్ రవీంద్ర (15) ఉన్నారు.రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే?ఎక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్ష్(30), బదోని(22) రాణించారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా,పతిరానా తలా రెండు వికెట్లు సాధించగా.. ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ ఒక్క వికెట్ పడగొట్టారు.రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..రిషబ్ పంత్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. లక్నో వేదికగా సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. 55 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 18 ఓవర్లు ముగిసే సరికి లక్నో నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.లక్నో మూడో వికెట్ డౌన్..మిచెల్ మార్ష్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన మార్ష్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(29), బదోని(20) ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్..నికోలస్ పూరన్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన పూరన్.. కాంబోజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు 42 పరుగులు చేసింది. క్రీజులో పంత్(6), మార్ష్(22) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నో..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన మార్క్రమ్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు డెవాన్ కాన్వే, అశ్విన్ దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో షేక్ రషీద్, ఓవర్టన్ వచ్చారు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, MS ధోని(కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ -
IPL 2025: పంత్ టీమ్‌కు గుడ్ న్యూస్.. స్పీడ్ గన్ వచ్చేస్తున్నాడు
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్, యువ సంచలనం మయాంక్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. గాయం నుంచి కోలుకున్న మయాంక్.. మంగళవారం(ఏప్రిల్ 15) లక్నో జట్టులోకి చేరనున్నట్లు తెలుస్తోంది.బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (CoE) వైద్య బృందం మయాంక్‌కు ఆదివారం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించింది. అందులో యాదవ్ ఉత్తీరణత సాధించాడు. దీంతో అతడికి ఐపీఎల్లో ఆడేందుకు క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ మంజారు చేసింది. ఈ ఏడాది సీజన్లో లక్నో విజయాలు సాధిస్తున్నప్పటికి బౌలింగ్ మాత్రం అంతంత మాత్రమేగా ఉంది. ఇప్పుడు మయాంక్ తిరిగి రావడంతో లక్నో బౌలింగ్ విభాగం పటిష్టంగా మారనుంది. ఇక గతేడాది సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. తన అద్భుతమైన ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అయితే తరుచుగా గాయాల బారిన పడడంతో మయాంక్ ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన యాదవ్.. 7 వికెట్లు పడగొట్టాడు. గాయాలతో సతమతవుతున్నప్పటికి లక్నో మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రూ.11 కోట్లకు అతడిని లక్నో రిటైన్ చేసుకుంది. లక్నో తమ తదుపరి మ్యాచ్‌లో సోమవారం ఎక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా మయాంక్ దూరం కానున్నాడు. ఏప్రిల్ 19న రాజస్తాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. -
IPL 2025: అక్షర్ పటేల్‌కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా
ఐపీఎల్-2025లో ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ షాక్ తగిలింది. అక్షర్‌కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది.ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీ సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయడంలో విఫలమైంది. ఈ సీజన్లో తొలిసారి ఢిల్లీ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో... ఐపీఎల్ నియమావళి ప్రకారం ఆ జట్టు కెప్టెన్ అయిన అక్షర్ పటేల్‌పై రూ. 12 లక్షలు జరిమానా విధించారు."ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్‌కు జరిమనా విధించాం. అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అక్షర్ కు రూ. 12 లక్షలు జరిమానా విధించాం’’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 2025 సీజన్లో ‘స్లో ఓవర్ రేట్’ కారణంగా జరిమానా ఎదుర్కొన్న ఆరో కెప్టెన్ అక్షర్ పటేల్ కావడం గమనార్హం. ఈ జాబితాలో సంజూ శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రజత్ పాటిదార్ ఉన్నారు.కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(59) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(41), సూర్యకుమార్(40), నమాన్ ధీర్(38) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ సాధించారు. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ 19 ఓవర్లో వరుసగా మూడు రనౌట్లు అయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. చదవండి: IPL 2025: రోహిత్ శర్మ మాస్టర్ మైండ్.. డగౌట్ నుంచే మ్యాచ్ తిప్పేసిన హిట్‌మ్యాన్ -
రోహిత్ శర్మ మాస్టర్ మైండ్.. డగౌట్ నుంచే మ్యాచ్ తిప్పేసిన హిట్‌మ్యాన్
ఐపీఎల్-2025 (IPL 2025) ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఈ మెగా ఈవెంట్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. ఓ దశలో సునయాసంగా మ్యాచ్ గెలిచేలా కన్పించిన ఢిల్లీ.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో తొలి ఓటమి చవిచూడాల్సింది. అయితే ఢిల్లీ వికెట్లను కుప్పకూల్చడంలో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కీలక పాత్ర పోషించాడు. డగౌట్ నుంచే తన మాస్టర్ మైండ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు హిట్‌మ్యాన్.అసలేమి జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి 7 ఓవర్లలో 61 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో అప్పటికే రాహుల్, స్టబ్స్ ఉన్నారు. ఇదే సమయంలో బంతి మార్చాలని అంపైర్లకు ముంబై జట్టు అభ్యర్థించింది. వారి అభ్యర్ధను అంగీకరించిన అంపైర్లు బంతిని మార్చారు. వెంటనే డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు. రోహిత్.. హెడ్ కోచ్ జయవర్దనే, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో మాట్లాడి ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ కర్ణ్ శర్మతో బౌలింగ్ చేయించాలని హార్దిక్‌కు సైగలు చేశాడు. రోహిత్ మాట విన్న పాండ్యా.. కర్ణ్ను 14వ ఓవర్ వేసేందుకు ఎటాక్‌లో తీసుకొచ్చాడు.అయితే రోహిత్ ఊహించినట్టే ఆ ఓవర్లో ముంబై ఇండియన్స్‌కు ఫలితం దక్కింది. అద్భుతమైన ఫామ్‌లో స్టబ్స్ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. బంతి పొడిగా ఉన్నందున, రోహిత్ ప్రణాళిక సరిగ్గా పనిచేసింది. ఆ తర్వాత 16 ఓవర్ వేసిన కర్ణ్..కేఎల్ రాహుల్‌ను సైతం బోల్తా కొట్టించాడు. రాహుల్ వికెట్‌తో మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగింది. కాగా డగౌట్లో కూర్చుని మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిన రోహిత్ శర్మపై అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ నంబర్ వన్ కెప్టెన్ ఎలా అయ్యాడో మరోసారి నిరూపించుకున్నాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ(18).. ఫీల్డింగ్‌లో బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలోనే కర్ణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. #MI's spinners 𝙩𝙪𝙧𝙣𝙚𝙙 the game on its head! 🙌Here’s how the experts broke down their coaching staff's spot-on call to bring them in at just the right moment 🗣#IPLonJioStar 👉 #LSGvCSK | MON, 14th APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/POK9x6m9Qc— Star Sports (@StarSportsIndia) April 13, 2025 -
పార్క్ హయత్ హోటల్లో అగ్నిప్రమాదం.. సన్‌రైజర్స్ టీమ్‌కు తప్పిన ముప్పు
హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుకుంది. హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇదే హోటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేస్తోంది. ఈ ప్రమాద సమయంలో ఎస్ఆర్హెచ్ టీమ్ సభ్యులు హోటల్లోనే ఉన్నారు. ప్రమాద విషయం తెలిసి ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లిపోయారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోటల్ కు చేరుకుని పొగలను అదుపు చేశారు. మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 17న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ టీమ్ సోమవారం సాయంత్రం ముంబైకి బయలు దేరాల్సి ఉంది. కానీ అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కాస్త ముందుగానే ఎస్ఆర్హెచ్ టీమ్ చెక్ అవుట్ చేసింది.ఈ ఏడాది సీజన్లో సన్‌రైజర్స్ టీమ్ కాస్త తడబడుతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించింది. అయితే ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై మాత్రం రికార్డు విజయాన్ని ఎస్ఆర్హెచ్ అందుకుంది. 245 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(141) భారీ సెంచరీతో చెలరేగాడు. -
Karun Nair: ఎక్కడ ఆడినా పరుగుల వరదే.. బ్యాట్ పట్టుకుంటే విధ్వంసమే..!
భారత క్రికెట్లో కరుణ్ నాయర్ పరిచయం అక్కరలేని పేరు. సెహ్వాగ్ తర్వాత టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ (టీమిండియా తరఫున) చేసి, ఆతర్వాత కొద్ది రోజుల్లోనే కనుమరుగైన ఆటగాడు. సుదీర్ఘకాలం అవకాశాల కోసం వేచి చూసి ఇప్పుడిప్పుడే తన ప్రతిభకు తగ్గ అవకాశాలను పొందుతున్న కరుణ్.. తాజాగా ఐపీఎల్లో జరిగిన ఓ మ్యాచ్‌లో పేట్రేగిపోయి వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. అయినా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమిపాలైంది.ముంబై ఇండియన్స్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాత కరుణ్ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. కరుణ్ గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కరుణ్ ఇటీవలికాల ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.2017 భారత్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడి కనుమరుగైన కరుణ్, మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు చాలా కష్టపడ్డాడు. ఓ దశలో అతను ఎంత బాగా ఆడినా దేశవాలీ క్రికెట్లోనూ అవకాశాలు రాలేదు. దీంతో అతను జట్టును మార్చుకుని (కర్ణాటక) విదర్భ జట్టుకు వలస వచ్చాడు. విదర్భకు రాగానే కరుణ్ దశ మారింది. దేశవాలీ క్రికెట్లో అంతకుముందు కంటే ఎక్కువ పరుగులు సాధించి తగినంత గుర్తింపు దక్కించుకున్నాడు. టీమిండియాలో చోటే లక్ష్యంగా కరుణ్ గతేడాది కాలంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఈ క్రమంలో కరుణ్ గతేడాదంతా పరుగుల వరద పారించాడు. ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. ఈ ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి నమ్మశక్యంకాని సగటుతో (389.50) 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి.ఈ ఏడాది రంజీ ట్రోఫీలోనూ కరుణ్ అదే జోష్‌ను కొనసాగించాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఇవే కాక కరుణ్ గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాడు. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్ దేశవాలీ సీజన్లో కరుణ్ 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఏడాదికి పైగా ఘనమైన ట్రాక్ రికార్డు మెయిన్టైన్ చేస్తూ వచ్చిన కరుణ్‌ను ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లోనూ కరుణ్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు నాలుగు మ్యాచ్‌లు వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తన అవకాశం రాగానే కరుణ్ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇరగదీశాడు. బుమ్రా, బౌల్ట్ లాంటి ప్రపంచ శ్రేణి బౌలర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రాను కరుణ్ బాదినట్లు ఏ బ్యాటర్ బాది ఉండడు. ఐపీఎల్లో రెండేళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని కరుణ్ సద్వినియోగపరచుకున్నాడు. రీఎంట్రీలో తన ఐపీఎల్ అత్యధిక స్కోర్‌ను నమోదు చేశాడు. తాజా ప్రదర్శనల నేపథ్యంలో కరుణ్ టీమిండియా బెర్త్ సాధించడం కన్ఫర్మ్ అని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి భారత సెలెక్టర్లు కరుణ్ లాంటి హార్డ్ వర్కింగ్ టాలెంట్‌కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. -
DC VS MI: కరుణ్ నాయర్‌తో బుమ్రా వాగ్వాదం.. సారి చెప్పినా పట్టించుకోని వైనం
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ ఎవరితో గొడవ పడని ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహనాన్ని కోల్పోయాడు. ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్‌తో వాగ్వాదానికి దిగాడు. కరుణ్ సారీ చెప్పినా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.The average Delhi vs Mumbai debate in comments section 🫣Don't miss @ImRo45 's reaction at the end 😁Watch the LIVE action ➡ https://t.co/QAuja88phU#IPLonJioStar 👉 #DCvMI | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FPt0XeYaqS— Star Sports (@StarSportsIndia) April 13, 2025ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తుండగా (ఇన్నింగ్స్ 6వ ఓవర్ చివరి బంతికి) కరుణ్ పరుగు తీసే క్రమంలో బౌలింగ్ చేస్తున్న బుమ్రాను పొరపాటున ఢీకొట్టాడు. దీనికి కరుణ్ వెంటనే క్షమాపణ చెప్పినా బుమ్రా పట్టించుకోలేదు. కరుణ్‌పై నోరు పారేసుకున్నాడు. హార్దిక్ కల్పించుకుని కరుణ్‌కు సర్ది చెప్పాడు. బుమ్రా-కరుణ్ మధ్య వాగ్వాదాన్ని నిశితంగా గమనిస్తున్న రోహిత్ శర్మ తనదైన శైలిలో కామెడీ చేస్తూ కనిపించాడు.పొరపాటున జరిగిన దానికి కరుణ్ సారీ చెప్పినా బుమ్రా పట్టించుకోకపోవడానికి కారణం వేరే ఉంది. ఆ ఓవర్లో, అంతకుముందు ఓవర్లో కరుణ్ బుమ్రాను చెడుగుడు ఆడుకున్నాడు. బుమ్రాను ఎదుర్కొన్న 9 బంతుల్లో కరుణ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. కెరీర్లో ఏ బ్యాటర్ బుమ్రాను ఇంతలా చితక్కొట్టలేదు. Nair fire against Bumrah 🔥pic.twitter.com/3D6kjyR5lx— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2025బుమ్రా అత్యంత వేగంతో సంధిస్తున్న బంతులను కరుణ్ సునాయాసంగా బౌండరీలు, సిక్సర్లుగా తరలించాడు. ఇదే కోపంతో బుమ్రా కరుణ్‌పై నోరు పారేసుకున్నాడు. బుమ్రాతో వాగ్వాదం జరిగే సమయానికి కరుణ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కరుణ్ ట్రెంట్ బౌల్ట్పై కూడా ఇదే తరహా విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్లో కరుణ్ మూడు బౌండరీలు బాదాడు. కరుణ్ దెబ్బకు హార్దిక్ బౌల్ట్‌ను బౌలింగ్ నుంచి తప్పించి మళ్లీ చివర్లో బరిలోకి దించాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ కర్ణ్ శర్మ, హార్దిక్ పాండ్యాను కూడా వదిలి పెట్టలేదు. హార్దిక్ బౌలింగ్‌లో 2 సిక్సర్లు, ఓ ఫోర్.. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో ఓ సిక్సర్, 2 ఫోర్లు బాదాడు.ఈ మ్యాచ్‌లో కరుణ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడినా ఢిల్లీ ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ ఒత్తిడికి లోనై చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే చివరి మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సింగిల్స్ తీసుకుని స్ట్రయిక్ రొటేట్ చేసుకున్నా ఢిల్లీకి విజయాకాశాలు ఉండేవి. అయితే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు లేని రెండో పరుగులకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. కరుణ్ ఔటయ్యాక (13వ ఓవర్లో) కొత్త బంతి తీసుకోవడం కూడా ముంబైకి కలిసొచ్చింది. కొత్త బంతితో కర్ణ్ శర్మ, సాంట్నర్, బౌల్ట్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన స్టబ్స్, కేఎల్ రాహుల్, విప్రాజ్ నిగమ్ వికెట్లు తీశారు. ఫలితంగా చివరి రెండు ఓవర్లకు ముందు ఢిల్లీ బ్యాటర్లు ఒత్తిడికి లోనై రనౌట్ల రూపంలో వికెట్లు సమర్పించుకున్నారు. 3 వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గత మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోచేతి ఫ్రాక్చర్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గైక్వాడ్ గైర్హాజరీలో ఎంఎస్ ధోని కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్ మొత్తంలో ధోనినే సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.సీఎస్కే యాజమాన్యం తాజాగా రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసుకుంది. ముంబై చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రేను జట్టులోకి తీసుకుంది. రుతురాజ్ ప్రత్యామ్నాం కోసం సీఎస్కే మేనేజ్మెంట్ మాత్రేతో పాటు పృథ్వీ షా (ముంబై), ఉర్విల్ పటేల్ (గుజరాత్), సల్మాన్ నిజర్ (కేరళ) పేర్లను పరిశీలించినప్పటికీ, చివరికి మాత్రేకే ఓటు వేసింది. మాత్రేను సీఎస్కే 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. మాత్రే ఈ సీజన్ మెగా వేలంలో పోటీపడినప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయలేదు. మాత్రేపై సీఎస్కే మొదటి నుంచి సానుకూలంగా ఉన్నా ఎందుకో మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. గతేడాది సీఎస్కే మాత్రేను ట్రయల్స్‌కు కూడా పిలిపించుకుంది.మాత్రేను వీలైనంత త్వరగా జట్టులో చేరాలని సీఎస్కే మేనేజ్మెంట్ కబురు పెట్టినట్లు తెలుస్తుంది. ఎల్ఎస్జీతో మ్యాచ్ కోసం సీఎస్కే ప్రస్తుతం లక్నోలో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు మాత్రే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్ 20న సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు మాత్రే అందుబాటులోకి రావచ్చు.కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన మాత్రేకు ముంబై క్రికెటింగ్ సర్కిల్స్‌లో మంచి గుర్తింపు ఉంది. మాత్రే ముంబై తరఫున అతి తక్కువ మ్యాచ్‌లు ఆడినా టాలెంటెడ్ ఆటగాడిగా పేరు గడించాడు. మాత్రే 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 504 పరుగులు చేశాడు. 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 458 పరుగులు చేశాడు. గతేడాది అక్టోబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మాత్రే అతి తక్కువ కాలంలోనే టీమిండియా మెటీరియల్‌గా ముద్ర వేసుకున్నాడు. -
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటన నిన్న చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో అత్యంత అరుదైన హ్యాట్రిక్ రనౌట్స్ నమోదయ్యాయి. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. ఢిల్లీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు రనౌట్లు కావడం ఇదే మొదటిసారి.లీగ్ ఆరంభ సీజన్లో (2008) ఓ సారి ఒకే ఓవర్లో మూడు రనౌట్లు నమోదైనా, అవి వరుస బంతుల్లో జరగలేదు. నాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్లో (2, 4, 6 బంతులకు) మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒకే ఓవర్లో, అందులోనూ వరుసగా మూడు బంతుల్లో రనౌట్లు నమోదయ్యాయి.నిన్నటి మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఢిల్లీ 19వ ఓవర్ చివరి మూడు బంతులకు వరుసగా అశుతోష్ శర్మ (17), కుల్దీప్ యాదవ్ (1), మొహిత్ శర్మ (0) వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి గెలుపుకు పటిష్ట పునాది వేసినా, చివర్లో హ్యాట్రిక్ వికెట్లు కోల్పోయి ఢిల్లీ పరాజయాన్ని కొని తెచ్చుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఢిల్లీపై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. లేని, అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నించి ఢిల్లీ గెలుపు గుర్రాన్ని దిగింది. పరుగుల వేటలో ఒత్తిడికిలోనై రనౌటైంది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.నేటికి అది రికార్డే2008 సీజన్లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ముంబై బ్యాటర్లు రనౌట్లయ్యారు (చివరి ఓవర్లో మూడు రనౌట్లతో కలుపుకుని). ఐపీఎల్ చరిత్రలో నేటికీ ఇది ఓ రికార్డుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్ మ్యాచ్‌లోనూ ఐదుగురు బ్యాటర్లు రనౌట్లు కాలేదు. -
కరుణ్ అద్భుతంగా ఆడాడు.. అలా చేయాలంటే చాలా సాహసం కావాలి: హార్దిక్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి జట్టు గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. 19వ ఓవర్ చివరి మూడు బంతులకు ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లు రనౌట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది. కీలకమైన మూడు వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఇలాంటి విజయాలు. కరుణ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో మ్యాచ్ చేయి దాటిపోతున్నట్లు అనిపించింది. అయినా మేము గెలుపుపై ఆశలు వదులు కోలేదు. పోటీలో ఉండేందుకు ఒకరినొకరం ఉత్తేజపరచుకున్నాము. ఒకర్రెండు వికెట్లు ఆటను మాకు అనుకూలంగా మారుస్తాయని తెలుసు. గతంలో నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి.కర్ణ్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌండరీల పరిధి 60 మీటర్లలోపు ఉన్నప్పుడు బంతిని టాస్ వేయాలంటే చాలా సాహసం కావాలి. కర్ణ్ శర్మ అలా చేసి సక్సెస్ సాధించాడు. అందరం తలో చేయి వేసి మా అవకాశాలను నిలుపుకోగలిగాము. బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పందిస్తూ.. ఆటగాళ్లు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. వీలైనన్ని బంతులు ఎదుర్కొంటేనే అది జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మంచు తీవ్ర ప్రభావం చూపింది. కొత్త బంతితో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి విజయాలు జట్టు గతిని మారుస్తాయి. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. -
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ.. కరుణ్ పోరాటం వృధా.. సీజన్లో తొలి ఓటమి
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ నాలుగు వరుస విజయాల తర్వాత తొలి ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ గెలవాల్సి ఉండింది. అయితే 19వ ఓవర్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకుంది. సింగిల్స్ తీసినా గెలిచే మ్యాచ్‌లో ఢిల్లీ చివరి వరుస బ్యాటర్లు డబుల్స్ కోసం ప్రయత్నించి రనౌటయ్యారు. 19వ ఓవర్లో హై డ్రామా నడిచింది. నాలుగో బంతికి రనౌట్ కాకముందు అశుతోష్ శర్మ వరుసగా రెండు బౌండరీలు బాది మంచి టచ్‌లో కనిపించాడు. అయితే అతను లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆతర్వాతి బంతికి కుల్దీప్ కూడా అనవసరమైన రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. చివరి బంతికి మోహిత్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. సాంట్నర్ డైరెక్ట్ హిట్‌తో అతన్ని కూడా రనౌట్ చేశాడు. దీంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే పరాజయంపాలైంది. ముంబై నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయానికి పటిష్ట పునాది వేశాడు. ఓ దశలో (11.3 ఓవర్లలో 135/2) ఢిల్లీ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.అయితే కరుణ్ ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ రెండో వికెట్‌కు 10.1 ఓవర్లలో 119 పరుగులు జోడించారు. 119 పరుగుల వద్ద పోరెల్, 135 పరుగుల వద్ద (11.4వ ఓవర్) కరుణ్ నాయర్ వికెట్ వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పతనం మొదలైంది. కేఎల్ రాహుల్‌ను (15) కర్ణ్ శర్మ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు (క్యాచ్ అండ్ బౌల్డ్). ఆ తర్వాత అక్షర్ పటేల్‌ను (9) బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్‌ను (1) కర్ణ్ శర్మ ఔట్ చేశారు. తొలి మ్యాచ్‌లో (ఈ సీజన్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (17), కుల్దీప్ (1), మోహిత్ శర్మ (0) రనౌట్ కాగా.. మరో హిట్టర్ విప్రాజ్ నిగమ్‌ను (14) సాంట్నర్ స్టంపౌట్ చేశాడు. అంతకుముందు ముంబై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్‌యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓటమి పట్ల విచారం వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామని బాధ పడ్డాడు. మిడిలార్డర్లో కొన్ని చెత్త షాట్లు కొంపముంచాయని అన్నాడు. మంచు కూడా కీలకపాత్ర పోషించిందని తెలిపాడు. కుల్దీప్, కరుణ్ నాయర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. -
IPL 2025, MI VS DC: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ పటిష్ట స్థితిలో ఉండినప్పటికీ.. ఆతర్వాత ఒత్తిడికి లోనై ఓటమిని కొని తెచ్చుకుంది. 19వ ఓవర్లో చివరి మూడు బంతులకు ఢిల్లీ వరుసగా మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి పరాజయంపాలైంది. ఓ దశలో ఢిల్లీ 11.3 ఓవర్లలో 135 పరుగులు (రెండు వికెట్ల నష్టానికి) చేసి సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔట్ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. తద్వారా కరుణ్ నాయర్ అద్భుత ఇన్నింగ్స్ వృధా అయ్యింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. బుమ్రా లాంటి బౌలర్‌ను కూడా ఉతికి ఆరేశాడు. ముంబై విజయంలో వెటరన్ కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) కీలకపాత్ర పోషించారు. సాంట్నర్ అద్భుతమైన టచ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా.. కర్ణ్ శర్మ.. అభిషేక్ పోరెల్ (33), కేఎల్ రాహుల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (1) వికెట్లు తీశాడు. ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. జేక్ ఫ్రేజర్ డకౌటై మరోసారి నిరాశపరిచాడు. తమ తొలి మ్యాచ్‌లో (ఈ సీజన్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (17) ఈ మ్యాచ్‌లో రనౌటయ్యాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, బుమ్రా కూడా తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్‌యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఢిల్లీ ఈ సీజన్లో తొలి ఓటమిని చవిచూసి, రెండో స్థానానికి పడిపోయింది.చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్ఢిల్లీపై గెలుపుతో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసిన ప్రతిసారి గెలిచిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ముంబై 15 మ్యాచ్‌ల్లో ఇలా గెలిచింది. ముంబై తర్వాత ఢిల్లీ అత్యధిక మ్యాచ్‌ల్లో ఇలా గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 13 సార్లు తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసి గెలిచింది. ముంబై, ఢిల్లీ కంటే సీఎస్కే అత్యధిక సార్లు (21) 200 ప్లస్ స్కోర్లకు డిఫెండ్ చేసుకున్నప్పటికీ.. ఐదు సార్లు ఓడిపోయింది. ఆర్సీబీ కూడా 19 సార్లు తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసి డిఫెండ్ చేసుకోగా.. 5 సార్లు ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ 15 సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసి డిఫెండ్ చేసుకోగా.. 2 సార్లు ఓటమిపాలైంది. -
CSK Vs LSG: చెన్నై కోలుకునేనా!
లక్నో: వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు... ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌తో పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి పోరులో గెలుపొందగా... ఆ తర్వాత వరుసగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకొని లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై... తిరిగి గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టోర్నీకి దూరం కాగా... గత మ్యాచ్‌లోనే ‘మాస్టర్ మైండ్’ మహేంద్రసింగ్ ధోని జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే పరాజయాలతో డీలా పడ్డ జట్టును అతడి సారథ్యం కూడా గట్టెక్కించలేకపోయింది. కోల్‌కతాతో జరిగిన పోరులో బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో చెన్నై ఘోర పరాజయం మూటగట్టుకుంది. వాటన్నింటిని పక్కన పెట్టి తిరిగి సత్తా చాటాలని ధోనీ సేన భావిస్తోంది. మరోవైపు రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సీజన్లో 6 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 2 పరాజయాలు నమోదు చేసుకుంది. గత మూడు మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్‌లపై గెలిచి లక్నో ఫుల్ జోష్‌లో ఉంది. మరి లక్నో జోరును అడ్డుకొని చెన్నై విజయాల బాట పడుతుందా చూడాలి! హిట్టర్లతో దట్టంగా... గత మూడు మ్యాచ్‌ల్లోనూ పవర్‌ప్లే వికెట్లు కోల్పోని లక్నో జట్టు... హిట్టర్లతో దట్టంగా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల గుజరాత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేని మిచెల్ మార్ష్... చెన్నైతో పోరులో బరిలోకి దిగడం ఖాయమే. మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌తో లక్నో టాపార్డర్ శత్రుదుర్బేధ్యంగా ఉంది. గత కొన్నాళ్లుగా కేవలం సిక్స్‌లు కొట్టడమే తన లక్ష్యం అన్నట్లు చెలరేగిపోతున్న పూరన్‌ను అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు కత్తి మీద సామే!ఈ సీజన్లో సీఎస్కే ప్లేయర్లంతా కలిసి 32 సిక్స్‌లు బాదితే... పూరన్ ఒక్కడే 31 సిక్స్‌లు కొట్టాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగుతున్న ఈ విండీస్ వీరుడు మరోసారి చెలరేగితే లక్నో జైత్రయాత్ర కొనసాగినట్లే. రిషబ్ పంత్, ఆయుశ్ బదోనీ, అబ్దుల్ సమద్‌లతో మిడిలార్డర్ బలంగా ఉండగా... డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పేస్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకుంటుండగా... యువ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ... ‘సంతకం’ సంబరాలు కొనసాగించాలని చూస్తున్నాడు. అవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్, రవి బిష్ణోయ్‌తో లక్నో బౌలింగ్‌లో మంచి వైవిధ్యం ఉంది. లోపాలు దిద్దుకుంటేనే! చెన్నైకు ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు. నిలకడ కనబర్చలేకపోతున్న ఆ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర రూపంలో మంచి ఓపెనర్లు ఉన్నా... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించే వారు కరువయ్యారు. రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో అశ్విన్ తర్వాత క్రీజులోకి వస్తున్న ధోని... గతంలో మాదిరిగా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం కనబర్చ లేకపోతున్నాడు. ఇతర జట్లలో దేశీయ ఆటగాళ్లు చెలరేగుతుంటే... చెన్నైలో ఆ బాధ్యత తీసుకునే ప్లేయర్లు కనపించడం లేదు. కోల్‌కతాతో జరిగిన చివరి మ్యాచ్‌లో అయితే చెన్నై మరీ పేలవ ఆటతీరు కనబర్చింది. ప్లే ఆఫ్స్ రేసులో ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఆటగాళ్లంతా సమష్టిగా సత్తాచాటాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడని సీఎస్కే... మరో పరాజయం మూటగట్టుకుంటే ఇక కోలుకోవడం కష్టమే. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న చెన్నై బ్యాటర్లు... దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయ్‌లను ఎలా ఎదుర్కంటారనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్ ), మార్క్రమ్, మిచెల్ మార్ష్, పూరన్, పంత్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దుల్, ఆకాశ్‌దీప్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్ ), కాన్వే, రచిన్, త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అశ్విన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరణ. -
DC Vs MI: పరుగుల వేటలో ఢిల్లీ ‘రనౌట్’
వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్రేక్ పడింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట తిలక్ వర్మ, సూర్యకుమార్ రాణించడంతో మంచి స్కోరు చేసిన ముంబై... అనంతరం చివరి వరకు పట్టు వదలకుండా ప్రయత్నించి సీజన్లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. చాలా రోజుల తర్వాత ఐపీఎల్లో బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ఒంటిచేత్తో ఢిల్లీని గెలిపించేలా కనిపించినా... చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ ఫీల్డర్ల గురికి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఐపీఎల్ 18వ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఈ పోరులో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికెల్టన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆఖర్లో నమన్ ధీర్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్, విప్రాజ్ నిగమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... అభిషేక్ పొరెల్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఢిల్లీ జట్టు వరుసగా మూడు బంతుల్లో అశుతోష్ శర్మ, కుల్దీప్, మోహిత్ శర్మ వికెట్లను కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఈ ముగ్గురూ రనౌట్ కావడం గమనార్హం. ముంబై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కరణ్ శర్మ 3 వికెట్లు, సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు. తిలక్ తడాఖా... గత కొన్ని మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ... ఢిల్లీపై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా పాండ్యా బృందం మంచి స్కోరు చేయగలిగింది. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రికెల్టన్ రెండో ఓవర్లో సిక్సర్‌తో జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మూడో ఓవర్లో రికెల్టన్ 2 ఫోర్లు, రోహిత్ శర్మ 6, 4 బాదడంతో 19 పరుగులు వచ్చాయి. మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ (12 బంతుల్లో 18)ను లెగ్‌స్పిన్నర్ విప్రాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ముంబై తొలి వికెట్ కోల్పోగా... సూర్యకుమార్ బాధ్యతాయుతంగా ఆడాడు. మరికొన్ని మెరుపుల అనంతరం రికెల్టన్ కూడా ఔట్ కాగా... తిలక్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఫలితంగా ముంబై 10 ఓవర్లలో 104/2తో నిలిచింది. సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2) వరుస ఓవర్లలో ఔట్ కాగా... తిలక్‌కు నమన్ జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో తిలక్ 26 బంతుల్లో ఈ సీజన్లో రెండో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కదంతొక్కిన కరుణ్.. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతున్న కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం చూపాడు. ఏడేళ్లుగా ఐపీఎల్లో హాఫ్‌సెంచరీ చేయని నాయర్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే మెక్‌గుర్క్ (0) ఔట్ కావడంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అడుగుపెట్టిన నాయర్... క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. రెండో ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతడు... ఐదో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. స్టార్ పేసర్ బుమ్రా వేసిన ఆరో ఓవర్లో 6, 4, 6తో కరుణ్ 22 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా ఓవర్లో 6, 4 కొట్టిన నాయర్... కరణ్ శర్మ ఓవర్లో రెండు ఫోర్లతో సెంచరీకి సమీపించాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 61 బంతుల్లో 119 పరుగులు జోడించిన అనంతరం పొరెల్ ఔట్ కాగా... మరో ఫోర్ కొట్టిన అనంతరం కరుణ్ వెనుదిరిగాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (9), స్టబ్స్ (1) విఫలం కాగా... కేఎల్ రాహుల్ (15), అశుతోష్ శర్మ (17), విప్రాజ్ (14) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. నాయర్ మెరుపులతో 11 ఓవర్లు ముగిసేసరికి 128/2తో అలవోకగా విజయం సాధించేలా కనిపించిన ఢిల్లీ... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) విప్రాజ్ 18; రికెల్టన్ (బి) కుల్దీప్ 41; సూర్యకుమార్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 40; తిలక్ (సి) పొరెల్ (బి) ముకేశ్ 59; హార్దిక్ (సి) స్టబ్స్ (బి) విప్రాజ్ 2; నమన్ (నాటౌట్) 38; జాక్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–47, 2–75, 3–135, 4–138, 5–200; బౌలింగ్: స్టార్క్ 3–0–43–0; ముకేశ్ 4–0–38–1; విప్రాజ్ నిగమ్ 4–0–41–2; కుల్దీప్ 4–0–23–2; అక్షర్ 2–0–19–0; మోహిత్ 3–0–40–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెక్‌గుర్క్ (సి) జాక్స్ (బి) దీపక్ చహర్ 0; పొరెల్ (సి) నమన్ (బి) కరణ్ శర్మ 33; కరుణ్ నాయర్ (బి) సాంట్నర్ 89; రాహుల్ (సి అండ్ బి) కరణ్ శర్మ 15; అక్షర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 9; స్టబ్స్ (సి) నమన్ (బి) కరణ్ శర్మ 1; అశుతోష్ (రనౌట్) 17; విప్రాజ్ నిగమ్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 14; స్టార్క్ (నాటౌట్) 1; కుల్దీప్ (రనౌట్) 1; మోహిత్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 193. వికెట్ల పతనం: 1–0, 2–119, 3–135, 4–144, 5–145, 6–160, 7–180, 8–192, 9–193, 10–193. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–24–1; బౌల్ట్ 2–0–21–0; బుమ్రా 4–0–44–1; సాంట్నర్ 4–0–43–2; హార్దిక్ పాండ్యా 2–0–21–0; కరణ్ శర్మ 4–0–36–3. ఐపీఎల్లో నేడులక్నో X చెన్నై వేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కరుణ్ నాయర్ మెరుపులు వృథా.. ముంబై చేతిలో ఢిల్లీ ఓటమి
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓటమి చవిచూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో పై 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ 19 ఓవర్లో వరుసగా మూడు రనౌట్లు అయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కరుణ్ నాయర్(40 బంతుల్లో 12 ఫోర్లు,5 సిక్స్‌లతో 89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అభిషేక్ పోరెల్(33) పర్వాలేదన్పించాడు. రాహుల్‌తో పాటు మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో కరుణ్ నాయర్ ఇన్నింగ్స్‌గా వృథా అయిపోయింది. ముంబై బౌలర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ రెండు , బుమ్రా, చాహర్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ ఏడాది సీజన్లో ముంబైకి ఇది రెండో విజయం కావడం గమనార్హం.తిలక్ హాఫ్ సెంచరీ..బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(59) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(41), సూర్యకుమార్(40), నమాన్ ధీర్(38) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ సాధించారు. -
వారెవ్వా కరుణ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇరగదీశాడు
టీమిండియా వెటరన్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్ తన ఐపీఎల్ పునరగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఓవర్లో క్రీజులోకి వచ్చిన కరుణ్.. నాయర్ ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. క్రీజులో ఉన్నంత సేపు నాయర్ బౌండరీల వర్షం కురిపించాడు. మైదానం నలుమూలల బౌండరీలు కొడుతూ అభిమానులను అలరించాడు. వరల్డ్ క్లాస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సైతం అతడు ఊతికారేశాడు. ఓ దశలో సెంచరీ చేసేలా కన్పించిన కరుణ్ నాయర్.. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఓవరాల్‌గా 40 బంతులు ఎదుర్కొన్న కరుణ్ నాయర్.. 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా నాయర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా కరుణ్ నాయర్‌కు ఇది ఏడేళ్ల తర్వాత వచ్చిన హాఫ్ సెంచరీ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. -
వారి వల్లే ఈ విజయం.. చాలా సంతోషంగా ఉంది: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరిగి మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్( 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(62), పడిక్కల్(40) ఆజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(75) టాప్ స్కోరర్‌గా నిలిచాడు."ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ స్పందించాడు. జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన పట్ల పాటిదార్ సంతోషం వ్యక్తం చేశాడు. తిరిగి మళ్లీ గెలుపు బాట పట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతంగా తమ ప్రణాళికలను అమలు చేశారు. పవర్‌ప్లేలో అత్యుత్తమంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ది బ్యాటర్లను కట్టడి చేశారు. అదేవిధంగా ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ముందుగానే మేము 150-170 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. నా నమ్మకం తగ్గట్టుగానే మా బౌలర్లు బౌలింగ్ చేశారు. మా బౌలర్లు ఎటువంటి వికెటపైనైనా బౌలింగ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. వారు నాకు పూర్తి నమ్మకాన్ని కలిగిస్తున్నారు. సాల్ట్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డగౌట్లో కూర్చుని అతడి బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశాను. అతడితో పాటు విరాట్ ఇన్నింగ్స్ కూడా మాకు ఎంతో ప్రత్యేకమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో పాటిదార్ పేర్కొన్నాడు. -
IPL 2025: రోహిత్ శర్మ మళ్లీ ఫెయిల్.. వెళ్లి రెస్ట్ తీసుకో భయ్యా?
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఆట తీరు ఏ మాత్రం మారడం లేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు.12 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. స్పిన్నర్ విప్రజ్ నిగమ్ బౌలింగ్ రివర్స్ స్వీప్ ఆడి వికెట్ల ముందు హిట్‌మ్యాన్ దొరికిపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు. 0,8,13,17,18 ఇవి వరుసగా రోహిత్ శర్మ చేసిన స్కోర్లు ఇవి. దీంతో మరోసారి విఫలమైన రోహిత్‌ను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఆడింది చాలు వెళ్లి రెస్టు తీసుకో రోహిత్ అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. మరికొంత మంది విరాట్ కోహ్లి అద్బుతంగా ఆడుతుంటే నీకు ఏమైంది రోహిత్ అంటూ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్లో కూడా రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. Rohit Sharma has become a joke . Failed again and again.. But no former indian player will talk about it because all these former players lick Rohit Sharma's feet.Pure liability in cricket. pic.twitter.com/wvIVk8GwRM— Suprvirat (@ishantraj51) April 13, 2025 -
RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో సెంచరీ
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విరాట్.. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి భారత్ మరియు ఆసియా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా చూసినా డేవిడ్ వార్నర్ మాత్రమే విరాట్ కంటే ముందు టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. వార్నర్ 400 టీ20 మ్యాచ్‌ల్లో 108 హాఫ్ సెంచరీలు చేయగా.. విరాట్ తన 388వ టీ20 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో విరాట్ 388 ఇన్నింగ్స్‌లు ఆడి 9 సెంచరీలు, 100 హాఫ్ సెంచరీల సాయంతో 13100 పైచిలుకు పరుగులు చేశాడు.THE HISTORIC MOMENT - 100 FIFTIES FOR KING KOHLI IN T20 HISTORY 🎯 pic.twitter.com/e4uvnxh0Vd— Johns. (@CricCrazyJohns) April 13, 2025టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన టాప్-5 ప్లేయర్లువార్నర్- 108విరాట్- 100బాబర్ ఆజమ్- 90గేల్- 88బట్లర్- 86కాగా, రాయల్స్‌తో మ్యాచ్‌లో విరాట్ రికార్డు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. విరాట్ హాఫ్ సెంచరీల సెంచరీని విరాట్ సిక్సర్‌తో అందుకోవడం విశేషం. ప్రస్తుత సీజన్లో విరాట్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ సీజన్లో విరాట్ 6 మ్యాచ్‌ల్లో 62 సగటున, 143.35 స్ట్రయిక్ రేట్‌తో 248 పరుగులు చేశాడు. 6 మ్యాచ్‌ల్లో 349 పరుగులు చేసిన పూరన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. -
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ విజయం
IPL 2025 MI vs DC Live Updates: ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి.ముంబై ఇండియన్స్ విజయంఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కరుణ్ నాయర్(40 బంతుల్లో 12 ఫోర్లు,5 సిక్స్‌లతో 89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అభిషేక్ పోరెల్(33) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో కరణ్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ రెండు , బుమ్రా, చాహర్ తలా వికెట్ సాధించారు. ఢిల్లీ రెండో వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన పోరెల్.. కరుణ్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.కరుణ్ నాయర్ ఫిప్టీ..ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను నాయర్ అందుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.క్రీజులో కరుణ్ నాయర్(50), అభిషేక్ పోరెల్(16) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న కరుణ్ నాయర్..5 ఓవర్లు మగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో కరుణ్ నాయర్(32), అభిషేక్ పోరెల్(16) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.చెలరేగిన ముంబై బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(59) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(41), సూర్యకుమార్(40), నమాన్ ధీర్(38) పరుగులతో రాణించారు.ఔటైన సూర్య, హార్దిక్ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 40 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(2) విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న తిలక్, సూర్య13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(40), తిలక్ వర్మ(30) ఉన్నారు.ముంబై రెండో వికెట్ డౌన్. ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన రికెల్టన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(4), సూర్యకుమార్ యాదవ్(14) ఉన్నారు.ముంబై తొలి వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న ముంబై..3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(16), ర్యాన్ రికెల్టన్(22) ఉన్నారు.ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ స్టార్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
RCB Vs RR: రికార్డు అర్ద శతకంతో సత్తా చాటిన విరాట్.. రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టీ20 కెరీర్లో 100 హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. రాయల్స్ అదే ఏడో స్థానంలో కొనసాగుతుంది. -
భువనేశ్వర్ కుమార్ 'ట్రిపుల్' సెంచరీ
టీమిండియా వెటరన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. 300 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత్ పేసర్‌గా భువనేశ్వర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2025లో ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్బంగా భువీ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.భువనేశ్వర్ 2009 ఛాంపియన్స్ లీగ్‌లో ఆర్సీబీ తరపునే టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2011లో పూణే వారియర్స్ తరపున ఐపీఎల్ డెబ్యూ చేశాడు. ఆ తర్వాత ఈ యూపీ ఫాస్ట్ బౌలర్ 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చేరాడు. పదేళ్లపాటు ఎస్ఆర్హెచ్కు అతడు ప్రాతినిథ్యం వహించాడు.ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ భువనేశ్వర్‌ను విడిచిపెట్టడంతో ఆర్సీబీలో చేరాడు. రూ. 10.75 కోట్ల భారీ ధరకు అతడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో భువనేశ్వర్ ఫర్వాలేదన్పిస్తున్నాడు. ఇప్పటివరకు 300 టీ20లు ఆడిన భువనేశ్వర్.. తన ఖాతాలో 316 వికెట్లు ఉన్నాయి. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భువనేశ్వర్ తర్వాత హార్దిక్ పాండ్యా(291) ఉన్నాడు.అత్యధిక టీ20లు ఆడిన భారత పేసర్లు వీరే..భువనేశ్వర్ కుమార్- 300హార్దిక్ పాండ్యా- 291జస్ప్రీత్ బుమ్రా- 234హర్షల్ పటేల్- 204సందీప్ శర్మ- 201 -
జ్వరంతో బాధపడుతున్నా.. వారు సపోర్ట్‌గా నిలిచారు: అభిషేక్ శర్మ
ఐపీఎల్-2025లో శనివారం(ఏప్రిల్ 12) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. తొలి ఐదు మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్.. పంజాబ్ కింగ్స్‌పై మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.ఉప్పల్ మైదానంలో అభిషేక్ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141 పరుగులు చేశాడు.అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఎస్ఆర్హెచ్ 246 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఛేదించింది. అయితే అభిషేక్ శర్మ జ్వరంతో బాధపడుతూనే ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడంట. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం శర్మనే స్వయంగా వెల్లడించాడు. అదేవిధంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, భారత టీ20 కెప్టెన్ సుర్యకుమార్ యాదవ్ తనకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారని అభిషేక్ తెలిపాడు."నేను నాలుగైదు రోజుల నుంచి జ్వరంతో బాధపడతున్నాను. ఈ సమయంలో యువరాజ్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నా ఆరోగ్యం గురుంచి తెలుసుకున్నారు. ఇటువంటి వ్యక్తులు నాతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఏడాది సీజన్లో అంత మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయాను. నాపై నాకే కాస్త చిరాకు అన్పించింది. అప్పుడు కూడా నాకు వారు మద్దతుగా నిలిచారు. ఒక్క మంచి ఇన్నింగ్స్ వస్తే చాలు తిరిగి ఫామ్‌ను అందుకోవచ్చని ధైర్యం చెప్పారు. నేను కూడా అందుకోసం ఎదురు చూశాను. ఈ రోజు అది నేరవేరింది. ఎట్టకేలకు ఓ భారీ ఇన్నింగ్స్ ఆడగాలను" అని అభిషేక్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు. -
ముంబైతో మ్యాచ్.. అరుదైన రికార్డులకు చేరువలో రాహుల్
ఐపీఎల్-2025లో వరుస విజయాలతో దూసుకు పోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి తమ జైత్ర యాత్రను కొనసాగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను పలు అరుదైన రికార్డులను ఊరిస్తోంది. ముంబైతో మ్యాచ్‌లో రాహుల్ మరో మూడు సిక్స్‌లు కొడితే ఐపీఎల్లో 200 సిక్స్‌ల మైలు రాయిని అందుకుంటాడు. రాహుల్ ఇప్పటివరకు 135 మ్యాచ్‌లు ఆడి 197 సిక్స్‌లు బాదాడు. కేఎల్ మరో మూడు సిక్స్‌లు బాదితే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సురేష్ రైనా వంటి దిగ్గజాల సరసన చేరుతాడు.ఒకే ఒక హాఫ్ సెంచరీ..అదే విధంగా ఈ మ్యాచ్‌లో రాహుల్ మరో 50 రన్స్ చేస్తే ముంబై ఇండియన్స్‌పై వెయ్యి ఐపీఎల్ పరుగులను పూర్తి చేసుకుంటాడు. రాహుల్ ఇప్పటివరకే ముంబై ఇండియన్స్‌పై 950 పరుగులు చేశాడు. రాహుల్ ప్రస్తుతం ఉన్న ఫామ్‌కు ఈ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమన్పిస్తోంది.గత మ్యాచ్‌లో ఆర్సీబీపై రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 93 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు సీఎస్కేపై హాఫ్ సెంచరీతో మెరిశాడు.ముంబైతో మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్చదవండి: అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుంది: శార్దూల్ ఫైర్ -
IPL 2025, RR VS RCB: సంజూ శాంసన్‌ను టార్గెట్ చేస్తున్న అభిమానులు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చెత్త ప్రదర్శన కొనసాగుతుంది. ఈ సీజన్లో శాంసన్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా సీజన్ తొలి మ్యాచ్‌లో. తాజాగా శాంసన్ ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో అతడు 19 బంతుల్లో బౌండరీ సాయంతో 15 పరుగులు మాత్రమే చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుత సీజన్లో శాంసన్ పేలవ ప్రదర్శన కొనసాగుతుండటంతో రాయల్స్ అభిమానులు విసిగిపోయారు. శాంసన్‌ను తిట్టిపోస్తున్నారు. మెగా వేలానికి ముందు కీలక ఆటగాళ్లను వదులుకున్న విషయంలోనూ శాంసన్‌నే టార్గెట్ చేస్తున్నారు. ఈ సీజన్లో రాయల్స్ దుస్థితికి శాంసనే కారకుడని విమర్శిస్తున్నారు.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో శాంసన్ స్కోర్లు..15(19)41(28)38(26)20(16)13(11)66(37)ఈ మ్యాచ్‌లో స్టంపౌటైన శాంసన్ మరో అనవసరపు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో స్టంపౌట్‌తో కలుపుకుని శాంసన్ ఐపీఎల్లో ఇప్పటివరకు 6 సార్లు డకౌటయ్యాడు. యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో (ఐపీఎల్లో) అత్యధిక సార్లు స్టంపౌటైన రికార్డు ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉంది. డుప్లెసిస్ ఐపీఎల్లో ఇప్పటివరకు ఏడు సార్లు స్టంపౌటయ్యాడు.ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్లు (ప్రస్తుతమున్న వారిలో)..7 - ఫాఫ్ డుప్లెసిస్6 - సంజు శాంసన్5 - మోయిన్ అలీ5 - దీపక్ హుడా5 - విరాట్ కోహ్లీ5 - మన్దీప్ సింగ్5 - అజింక్య రహానే5 - డేవిడ్ వార్నర్మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ 15 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. శాంసన్ (15), రియాన్ పరాగ్ (30) ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (64), ధృవ్ జురెల్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, యశ్ దయాల్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ప్రస్తుతం రాయల్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ ఐదో స్థానంలో ఉంది. రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, మూడింట ఓడగా.. ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి రెండిటిలో ఓటమిపాలైంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉండగా.. గుజరాత్, లక్నో, కేకేఆర్ వరుసగా స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ ఆరు, సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ వరుసగా 8 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. -
‘అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుంది’
లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)కు కోపమొచ్చింది. విమర్శలు చేసే వాళ్లు.. ముందుగా తమ పరిస్థితి ఏమిటో గమనించుకోవాలని.. ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడాలంటూ మండిపడ్డాడు. స్టూడియోలో కూర్చుని మైదానంలోని పరిస్థితులను ఎవరూ అర్థం చేసుకోలేరని.. కామెంట్రీ పేరుతో శ్రుతిమించిన విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.అమ్ముడుపోకుండా మిగిలిపోయాడుఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే. ముంబై తరఫున దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటినా ఫ్రాంఛైజీలు ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను పట్టించుకోలేదు. అయితే, లక్నో యువ పేసర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) గాయం కారణంగా.. శార్దూల్‌కు ఊహించని విధంగా అదృష్టం కలిసి వచ్చింది.జట్టులోకి వచ్చి అదరగొడుతున్నాడుసీజన్ మొత్తానికి దూరమైన మొహ్సిన్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంది. అంతేకాదు తుదిజట్టులోనూ చోటిచ్చింది. అయితే, శార్దూల్ కూడా యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లలో కలిపి 11 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.200 స్కోరు అనేది కామన్ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌పై శనివారం నాటి మ్యాచ్‌లో లక్నో విజయానంతరం శార్దూల్ ఠాకూర్ విమర్శకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ‘‘ఈ సీజన్ ఆరంభం నుంచి మేము బాగానే బౌలింగ్ చేస్తున్నాం. అయితే, చాలాసార్లు కామెంట్రీలో మా గురించి విమర్శుల చేస్తూనే ఉన్నారు.బౌలర్ల పట్ల కఠినంగా మాట్లాడుతున్నారు. ఈరోజుల్లో 200 స్కోరు అనేది కామన్ అయిపోయిన విషయాన్ని గుర్తించాలి. క్రికెట్ ఆడే తీరు రోజురోజుకూ మారిపోతోంది. స్టూడియోలో కూర్చుని ఒకరి బౌలింగ్ గురించి వ్యాఖ్యానాలు చేయడం సులువే.అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుందికానీ మైదానంలో ఉన్న వాళ్లకే వాస్తవ పరిస్థితుల గురించి తెలుస్తుంది. వేరే వాళ్లను విమర్శించే వాళ్లు.. వారి గణాంకాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి సమీక్షించుకోవాలి’’ అని శార్దూల్ ఠాకూర్ కామెంటేటర్లకు చురకలు అంటించాడు.కాగా ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో ఓటమి పాలైన లక్నో త్వరగానే కోలుకుంది. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఘన విజయంబాధ్యతాయుతమైన బౌలింగ్‌కు తోడు.. దూకుడైన బ్యాటింగ్‌తో సొంత మైదానంలో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయంతో మెరిసి సత్తా చాటింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంత్ సేన.. గుజరాత్‌ను 180 పరుగులకు కట్టడి చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (31 బంతుల్లో 58) మరోసారి విజృంభించగా.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (18 బంతుల్లో 21) మరోసారి విఫలమయ్యాడు. అయితే, నికోలస్ పూరన్ (34 బంతుల్లో 61) ధనాధన్ దంచికొట్టగా.. ఆయుశ్ బదోని (20 బంతుల్లో 28 నాటౌట్) అతడికి సహకరించాడు. ఫలితంగా 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.చదవండి: నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్ అయ్యర్ -
RR VS RCB: రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టీ20 కెరీర్లో 100 హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. రాయల్స్ అదే ఏడో స్థానంలో కొనసాగుతుంది. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ8.4వ ఓవర్- 92 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఫిలిప్ సాల్ట్ (65) ఔటయ్యాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాల్ట్ 174 పరుగుల ఛేదనలో సాల్ట్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సాల్ట్‌కు (59) జతగా మరో ఎండ్‌లో కోహ్లి 22 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 8 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 82/0గా ఉంది. టార్గెట్ 174.. ధాటిగా ఆడుతున్న కోహ్లి, సాల్ట్174 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టపోకుండా 50 పరుగులుగా ఉంది. విరాట్ 16, సాల్ట్ 34 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రాణించిన జైస్వాల్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన రాయల్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు. మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్.. జైస్వాల్ ఔట్15.6వ ఓవర్- 126 పరుగుల వద్ద రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ (75) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. జురెల్‌కు జతగా హెట్‌మైర్ క్రీజ్‌లోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్13.2వ ఓవర్- 105 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (30) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 57, ధృవ్ జురెల్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాయల్స్6.5వ ఓవర్- 49 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సంజూ శాంసన్ (15) స్టంపౌటయ్యాడు. శాంసన్ అప్పటికే పరుగులు చేసేందుక ఇబ్బంది పడుతున్నాడు. 7 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 50/1గా ఉంది. జైస్వాల్ 32, రియాన్ పరాగ్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. 5 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 36/0రాయల్స్ ఇన్నింగ్స్ నిదానంగా సాగుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 36/0గా ఉంది. యశస్వి జైస్వాల్ 29, సంజూ శాంసన్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 19/0టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ నిదానంగా ఆడుతుంది. 3 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 19/0గా ఉంది. జైస్వాల్ 13, సంజూ శాంసన్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. జైపూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలోకి దించుతుండగా.. రాయల్స్ ఓ మార్పు చేసింది. ఫజల్ హక్ ఫారూకీ స్థానంలో వనిందు హసరంగ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీతో బరిలోకి దిగింది. చెట్లు నాటే విషయంలో అవగాహన నిమిత్తం ఆర్సీబీ గత కొన్ని సీజన్లుగా ఓ మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగుతుంది.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్‌కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్ చరక్, ఫజల్హాక్ ఫరూకీ, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్ -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న అభిషేక్ తల్లి వ్యాఖ్యలు.. ఆరెంజ్ ఆర్మీ మస్త్ ఖుష్
క్రికెట్ ప్రేమికుల్లో.. ముఖ్యంగా ఆరెంజ్ ఆర్మీలో ఎక్కడ చూసినా అభిషేక్ శర్మ నామస్మరణే.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ పంజాబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనలోని మాస్టర్ క్లాస్‌ను వెలికి తీసి విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న తన వైఫల్యాలకు తెర దించుతూ బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయి.. భారీ సెంచరీ సాధించాడు. కేవలం నలభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న అభిషేక్.. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా, ఓవరాల్‌గా మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.మొత్తంగా ఈ మ్యాచ్‌లో యాభై ఐదు బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ .. పద్నాలుగు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు. తద్వారా ఐపీఎల్ మ్యాచ్ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగానూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆల్‌టైమ్ రికార్డు సాధించాడు.ఇలా తన సుడిగాలి ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గెలిపించి.. తిరిగి విజయాల బాట పట్టించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సహచర ఆటగాళ్లు, సన్‌రైజర్స్ ఫ్యామిలీతో పాటు అతడి కుటుంబం కూడా సంతోషంలో తేలియాడుతోంది.𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w— IndianPremierLeague (@IPL) April 12, 2025కావ్యా మారన్‌తో కలిసి సంబరాలు ఇక అభి తల్లిదండ్రులు మంజు శర్మ, రాజ్‌కుమార్ శర్మ.. తమ కుమారుడి సెంచరీ పూర్తి కాగానే రైజర్స్ యజమాని కావ్యా మారన్‌తో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రైజర్స్ విజయానంతరం అభిషేక్ శర్మ తల్లి మంజు శర్మ పుత్రోత్సాహంతో పొంగిపోయారు.జైత్రయాత్ర కొనసాగుతుంది‘‘ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు.. నేను కూడా ఎంతో ఆనందంగా ఉన్నాను.. మొత్తం హైదరాబాద్ అంతా సంతోషంతో నిండిపోయింది.. మనం మ్యాచ్ గెలిచాం.. ఇన్నాళ్లు కాస్త మనకు బ్రేక్ పడింది... ఇకపై అలాంటిదేమీ ఉండబోదు.. జైత్రయాత్ర కొనసాగుతుంది’’ అని మంజు శర్మ ఆరెంజ్ ఆర్మీకి మాటిచ్చారు.ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. అమ్మ ఆశిర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమే అంటూ ఆరెంజ్ ఆర్మీ ఫుల్ ఖుషీ అయిపోతూ.. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లో గెలిచిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది.అయితే, సొంత మైదానం ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటింది. తమదైన దూకుడు శైలితో పంజాబ్ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని.. 18.3 ఓవర్లలోనే ఊదేసింది. తద్వారా శ్రేయస్ అయ్యర్ సేనపై కమిన్స్ బృందం ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకోగలిగింది.ఐపీఎల్-2025: సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్👉టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మొదట బ్యాటింగ్👉పంజాబ్ కింగ్స్ స్కోరు: 245/6 (20)👉హైదరాబాద్ స్కోరు: 247/2 (18.3)👉ఫలితం: పంజాబ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ గెలుపుచదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్Mother's blessings ✨Hyderabad's joy 😇Abhishek Sharma's whirlwind night to remember 🧡Describe his knock in one word ✍️#TATAIPL | #SRHvPBKS | @SunRisers | @IamAbhiSharma4 pic.twitter.com/yJwBK5bAiD— IndianPremierLeague (@IPL) April 12, 2025 -
ఒకే సమయంలో విధ్వంసకర శతకాలు.. ఐపీఎల్లో అభిషేక్.. పీఎస్ఎల్లో రిజ్వాన్, విన్స్
క్రికెట్ అభిమానులు శనివారం (ఏప్రిల్ 12) సాయంత్రాన్ని తనివి తీరా ఎంజాయ్ చేశారు. నిన్న ఒకే సమయంలో రెండు వేర్వేరు లీగ్‌ల్లో మూడు విధ్వంసకర శతకాలు, రెండు అతి భారీ ఛేజింగ్‌లు నమోదయ్యాయి. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని (246) ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. అభిషేక్ రఫ్ఫాడించడంతో సన్‌రైజర్స్ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యత్తుమ ఛేజింగ్.నిన్న సాయంత్రం సన్‌రైజర్స్, పంజాబ్ మ్యాచ్ జరుగుతుండగానే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మరో సూపర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకరు, ఛేజింగ్‌లో మరొకరు విధ్వంకర శతకాలతో విరుచుకుపడ్డారు. పంజాబ్‌పై సన్‌రైజర్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించిన తరహానే పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. మొహమ్మద్ రిజ్వాన్ (63 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హెప్ 8, ఉస్మాన్ ఖాన్ 19, కమ్రాన్ ఘులామ్ 36, మైఖేల్ బ్రేస్‌వెల్ 44 పరుగులు (నాటౌట్) చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. జేమ్స్ విన్స్ (43 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. ఖుష్దిల్ షా (37 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కరాచీ గెలుపు ఖరారు చేశాడు. కరాచీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (12) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (32) పర్వాలేదనిపించాడు. సుల్తాన్స్ బౌలర్లలో అకీఫ్ జావిద్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్, ఉసామా మిర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు చేదు అనుభవమే మిగిలింది. ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టినా.. ఆతిథ్య జట్టు ఓపెనింగ్ జోడీ ‘ట్రావిషేక్’ (Travis Head- Abhishek Sharma) చెలరేగడంతో శ్రేయస్ అయ్యర్ సేనకు పరాజయం తప్పలేదు. ఈ విధ్వంసకర బ్యాటర్లను కట్టడి చేసేందుకు పంజాబ్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.భావోద్వేగాల డోలికల్లోఫలితంగా రైజర్స్ చేతిలో పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు భావోద్వేగాల డోలికల్లో తేలిపోయారు. ముఖ్యంగా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer- 36 బంతుల్లో 82) ముఖం సంతోషంతో వెలిగిపోయింది.ఇక లోయర్ ఆర్డర్లో మార్కస్ స్టొయినిస్ (11 బంతుల్లో 34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. స్కోరును 230 దాటించిన వేళ పంజాబ్ శిబిరంలో నవ్వులు పూశాయి. అయితే, ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.Timber Strike and Outfoxed ⚡️Harshal Patel with a 4⃣-fer to provide calm amidst chaos 🧡Updates ▶ https://t.co/RTe7RlXDRq #TATAIPL | #SRHvPBKS | @HarshalPatel23 pic.twitter.com/pnLsDo8sJL— IndianPremierLeague (@IPL) April 12, 2025 ఆకాశమే హద్దుగాపంజాబ్ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పంజాబ్ ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్ చేసుకుని మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలుపుతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.ట్రవిస్ హెడ్ 37 బంతుల్లో 66 పరుగులతో దుమ్ములేపగా.. అభిషేక్ శర్మ 55 బంతుల్లో ఏకంగా 14 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 141 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (14 బంతుల్లో 21*), ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 9*) కలిసి రైజర్స్ గెలుపును ఖరారు చేశారు. దీంతో పంజాబ్ ఆటగాళ్ల ముఖాలు వెలిసిపోయాయి.ముందు నన్ను అడగాలి కదా!ఇక ఈ మ్యాచ్ సందర్భంగా బౌలర్ల వైఫల్యం, ఫీల్డర్ల తప్పిదాల కారణంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కోపం నషాళానికి అంటింది. ముఖ్యంగా గ్లెన్ మాక్స్వెల్, అంపైర్ చేసిన పనితో అతడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మాక్సీ వేశాడు.అయితే, ఆ ఓవర్లో లెగ్ సైడ్ దిశగా సంధించిన ఫ్లాటర్ డెలివరీ (రెండో బంతి) అంపైర్ వైడ్‌గా ప్రకటించడం మాక్సీకి రుచించలేదు. దీంతో అతడు రివ్యూ (డీఆర్ఎస్) తీసుకోవాలనే ఉద్దేశంతో ‘T’ సంజ్ఞ చూపించాడు. అంపైర్ అందుకు అంగీకరించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కోపం వచ్చింది.సాధారణంగా ఫీల్డింగ్ టీమ్ రివ్యూ విషయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ కెప్టెన్ నిర్ణయం తర్వాతే స్పందిస్తాడు. కానీ ఇక్కడ అలా జరుగలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రేయస్ అయ్యర్.. ‘‘అంపైర్.. ముందు నన్ను అడగాలి కదా.. నన్ను.. నన్ను అడగాలి కదా!’’ అంటూ తనవైపు వేలు చూపిస్తూ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఐపీఎల్-2025: హైదరాబాద్ వర్సెస్ పంజాబ్👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్👉టాస్: పంజాబ్.. తొలుత బ్యాటింగ్👉పంజాబ్ స్కోరు: 245/6 (20)👉హైదరాబాద్ స్కోరు: 247/2 (18.3)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో హైదరాబాద్ చేతిలో పంజాబ్ చిత్తు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ.చదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్ Shreyash iyer i am the captain momentIn SRH vs PBKS high scoring matchGlenn Maxwell asked for review and umpire took itThen shreyash iyer came and said i am the captain ask me i will take review #SRHvsPBKSpic.twitter.com/bADvhNrLQw— Viraj Rk17 (@VirajRk17) April 12, 2025 -
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్
ఐపీఎల్-2025 (IPL 2025)లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అడ్డుకట్ట వేసింది. భారీ స్కోరు సాధించినా.. పంజాబ్‌కు ఆ సంతోషాన్ని మిగలనివ్వలేదు. ఆడుతూ పాడుతూ.. లక్ష్యాన్ని ఛేదించి శ్రేయస్ అయ్యర్ సేనకు ఊహించని షాకిచ్చింది. విధ్వంసకర బ్యాటింగ్‌లో తమకు తిరుగులేదని మరోసారి చాటుకుని.. పంజాబ్‌ను ఏకంగా ఎనిమిది వికెట్లతో రైజర్స్ చిత్తు చేసింది.ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నిజం చెప్పాలంటే మేము అద్బుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాము. కానీ వాళ్లు.. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే దానిని ఛేదించేశారు.నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ..ఇదెలా సాధ్యమైందో!.. నాకైతో నవ్వు వస్తోంది. మేము కొన్ని క్యాచ్‌లు మిస్ చేశాం. అభిషేక్ అదృష్టవంతుడు. అసాధారణ ఆటగాడు. మేము అంచనాలకు తగ్గట్లుగా బౌలింగ్ చేయలేకపోయాం. పొరపాట్లను సమీక్షించుకోవాలి.ఏదేమైనా అభిషేక్- ట్రవిస్ హెడ్ మధ్య ఓపెనింగ్ భాగస్వామ్యం అద్భుతం అనే చెప్పాలి. మాకు పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. ఫెర్గూసన్ వరుస విరామాల్లో వికెట్లు తీసేవాడు. కానీ.. అతడు గాయపడ్డాడు.అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. నేను, వధేరా 230.. మంచి స్కోరు అనుకున్నాం. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపింది. ఇక సన్‌రైజర్స్ ఓపెనర్లు బ్యాటింగ్ చేసిన తీరును మాటల్లో వర్ణించలేము. ముఖ్యంగా అభిషేక్ శర్మ.. నేను ఇంత వరకు చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటి ఇది’’ అని శ్రేయస్ అయ్యర్ ప్రత్యర్థి జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.కాగా ఉప్పల్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ సన్‌రైజర్స్‌తో తలపడింది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్.. ఆతిథ్య జట్టును తొలుత బౌలింగ్‌కు ఆహ్వానించాడు. ఇక బ్యాటింగ్ అనుకూలించిన పిచ్‌పై పంజాబ్ బ్యాటర్లు దంచికొట్టారు.శ్రేయస్ అయ్యర్ ధనాధన్ఓపెనర్లలో ప్రియాన్ష్ ఆర్య (13 బంతుల్లో 36) మెరుపు వేగంతో ఆడగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42) రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారీ అర్ధ శతకం (36 బంతుల్లో 82) దుమ్ములేపగా.. ఆఖర్లో మార్కస్ స్టొయినిస్ (11 బంతుల్లో 34 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.‘ట్రావిషేక్’ జోడీ బీస్ట్ మోడ్ఇక లక్ష్య ఛేదనను సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. చాన్నాళ్ల తర్వాత రైజర్స్ ఓపెనింగ్ ‘ట్రావిషేక్’ జోడీ బీస్ట్ మోడ్‌లో బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141) భారీ సెంచరీతో మెరిసి.. రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరుడికి అదృష్టం కూడా కలిసి వచ్చిందిఅయితే, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత.. రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ చహల్ వేశాడు. అతడి బౌలింగ్‌లో అభి ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను చహల్ మిస్ చేశాడు. అంతకంటే ముందు అంటే మూడో ఓవర్లో అభి రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తర్వాత(3.4 ఓవర్) నోబాల్ ద్వారా లైఫ్ పొందాడు. ఆ తర్వాత.. అంటే 12.4 వద్ద అభి శతకం పూర్తి చేసుకుని ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (40 బంతుల్లో) నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. మరోవైపు.. పంజాబ్ బౌలర్ ఫెర్గూసన్ రెండు బంతులు వేసిన తర్వాత గాయంతో మైదానం వీడాడు.చదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్ FORTUNE FAVOURS THE BRAVE, INDEED! 🙌#AbhishekSharma, what an innings 💪#IPLonJioStar 👉 #SRHvPBKS | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/x4FqzXsiWI— Star Sports (@StarSportsIndia) April 12, 2025WHAT. A. MOMENT. 🙌100 reasons to celebrate #AbhishekSharma's knock tonight! PS. Don't miss his special message for #OrangeArmy 🧡Watch the LIVE action ➡ https://t.co/HQTYFKNoGR#IPLonJioStar 👉 #SRHvPBKS | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/DECkzxRYhi— Star Sports (@StarSportsIndia) April 12, 20254, 6, CAUGHT but NO-BALL, 6 on Free-hit! 🔥Stop watch you're doing because it's all happening in Hyderabad 🥶Watch the LIVE action ➡ https://t.co/HQTYFKNoGR#IPLonJioStar 👉 #SRHvPBKS | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/vAEZNA65wD— Star Sports (@StarSportsIndia) April 12, 2025