
IPL 2025 RR vs CSK Live Updates: విజయంతో ముగింపు..
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది.
రాజస్తాన్ బ్యాటర్లలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(41), ధ్రువ్ జురెల్(31 నాటౌట్), జైశ్వాల్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
రాజస్తాన్ రాయల్స్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ వేసిన 14 ఓవర్‌లో రెండో బంతికి సంజూ శాంసన్(41) ఔట్ కాగా.. ఆరో బంతికి సూర్యవంశీ(57) ఔటయ్యాడు. రాజస్తాన్ విజయానికి 33 బంతులు 57 పరుగులు కావాలి.
సూర్యవంశీ ఫిప్టీ..
రాజస్తాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 27 బంతుల్లోనే సూర్యవంశీ 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
11 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 110/1
11 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజులో సూర్యవంశీ(44), సంజూ శాంసన్(30) ఉన్నారు.
రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..
యశస్వీ జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన జైశ్వాల్.. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది.
రాణించిన మాత్రే, బ్రెవిస్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్‌పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు.
బ్రెవిస్ ఔట్..
డెవల్డ్ బ్రెవిస్ రూపంలో సీఎస్‌కే ఆరో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన బ్రెవిస్.. మధ్వాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి ధోని వచ్చాడు. 15 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది
12 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 126/5
12 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో దూబే(12), బ్రెవిస్(36) ఉన్నారు.
రవీంద్ర జడేజా ఔట్..
చెన్నై సూపర్ కింగ్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్‌లో హసరంగా బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్(12) ఔట్ కాగా.. ఆ తర్వాత యుద్ద్‌వీర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా(1) ఔటయ్యారు.
సీఎస్‌కే రెండో వికెట్ డౌన్..
ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 19 బంతుల్లోనే 43 పరుగులు చేసిన మాత్రే.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 68/3
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. సెకెండ్ ఓవర్ వేసిన యుద్ద్‌వీర్ సింగ్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే(10), ఉర్విల్ పటేల్(0) పెవిలియన్‌కు చేరారు. 3 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది.
ఐపీఎల్-2025లో ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్‌కే తుది జట్టులోకి డెవాన్ కాన్వే తిరిగొచ్చాడు. కాగా ఇరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని(కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, యుధ్వీర్ సింగ్ చరక్, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వాల్