
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 350 సిక్సర్ల బాదిన జాబితాలోకి ధోని చేరాడు. ఐపీఎల్-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ ఫీట్‌ను అందుకున్నాడు.. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన తలా.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ధోని ఇప్పటివరకు 403 టీ20 మ్యాచ్‌లు ఆడి సరిగ్గా 350 సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా ఈ సాధించిన 34వ బ్యాటర్‌గా ధోని నిలిచాడు. ఈ జాబితాలో చేరిన నాలుగో భారత ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డు సాధించారు.
ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్( 1,056 ) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో పోలార్డ్ (908), రసెల్ (747), పూరన్ (634), అలెక్స్ హేల్స్ (560), మున్రో (557), రోహిత్ (542), జోస్ బట్లర్ (537), మ్యాక్స్‌వెల్ (530) ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా ధోని తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 16 పరుగులు చేసి ఔటయ్యాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్‌పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు.