
PC: BCCI/IPL.com
IPL 2025 SRH vs KKR Live Updates: కేకేఆర్‌ను చిత్తు చేసిన ఎస్‌ఆర్‌హెచ్..
ఐపీఎల్-2025లో ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. 279 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షిత్ రాణా(34), సునీల్ నరైన్(31) పర్వాలేదన్పించారు.
మిగితా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్, మలింగ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్‌దూబే తలా రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
దూకుడుగా ఆడుతున్న హర్షిత్
కేకేఆర్ ఎనిమిదో నెంబర్ బ్యాటర్ హర్షిత్ రానా మెరుపులు మెరిపిస్తున్నాడు. 14 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 29 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. 17 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 161/7
కేకేఆర్ ఆరో వికెట్ డౌన్
95 పరుగుల వద్ద కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రఘువంశీ.. మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది.
పీకల్లోతు కష్టాల్లో కేకేఆర్..
70 పరుగులకే కేకేఆర్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 8వ ఓవర్ వేసిన హర్ష్ దూబే బౌలింగ్‌లో రింకూ సింగ్(9), రస్సెల్(0) వరుస బంతుల్లో ఔటయ్యారు.
కేకేఆర్ మూడో వికెట్ డౌన్..
డికాక్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన డికాక్.. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 62/3
కేకేఆర్ రెండో వికెట్ డౌన్..
అజింక్య రహానే రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రహానే.. ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 59/2
కేకేఆర్ తొలి వికెట్ డౌన్..
సునీల్ నరైన్ రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన నరైన్.. ఉనద్కట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 39/1
3 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 33/0
3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(27), క్వింటన్ డికాక్(4) ఉన్నారు.
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ల వీరవిహారం.. ఏకంగా 278 రన్స్
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
క్లాసెన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు.
హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ..
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ సెంచరీతో మెరిశాడు. కేవలం 37 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను క్లాసెన్ అందుకున్నాడు. 19 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 261/3
200 దాటేసిన ఎస్‌ఆర్‌హెచ్
ఎస్ఆర్‌హెచ్ స్కోర్ బోర్డు రెండు వందలు దాటేసింది. 17 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(87), ఇషాన్ కిషన్(20) పరుగులతో ఉన్నారు.
ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ డౌన్
ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన హెడ్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్‌హెచ్ రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(55), ఇషాన్ కిషన్(6) ఉన్నారు.
హెన్రిచ్ క్లాసెన్ ఫిప్టీ..
హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు ఐదు ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 13 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్
భారీ స్కోర్ దిశగా ఎస్‌ఆర్‌హెచ్..
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ వికెట్ నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(65), క్లాసెన్(28) ఉన్నారు.
ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ డౌన్..
అభిషేక్ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన అభిషేక్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
6 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 79/0
6 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(47), అభిషేక్ శర్మ(20) మెరుపులు మెరిపిస్తున్నారు.
దూకుడుగా ఆడుతున్న ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(9), ట్రావిస్ హెడ్(15) ఉన్నారు
ఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తమ ఆఖరి మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ఈ ఏడాది సీజన్‌ను విజయంతో ముగించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), మనీష్ పాండే, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, అన్రిచ్ నార్ట్జే, వరుణ్ చకరవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ