
PC: BCCI/IPL.com
Punjab Kings vs Delhi Capitals- Jaipur Updates: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. శ్రేయస్ అయ్యర్ సేనను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 53 పరుగులు) రాణించాడు. మార్కస్ స్టొయినిస్ ( 16 బంతుల్లో 44 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఇక 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో పని పూర్తి చేసింది. కేఎల్ రాహుల్ (35), ఫాఫ్ డుప్లెసిస్ (23)లు మెరుగ్గా ఆడగా.. కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) దంచికొట్టాడు. సమీర్ రిజ్వీ మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 58) సాధించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (18) అతడికి సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు.
సమీర్ రిజ్వీ తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ
18.2: ఐపీఎల్‌లో తొలి అర్ధ శతకం బాదిన సమీర్ రిజ్వీ . 22 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.
రిజ్వీ ధనాధన్
18 ఓవర్లలో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విజయానికి ఇంకో రెండు ఓవర్లలో 22 పరుగులు కావాలి.
16 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 159/4
కరుణ్ నాయర్ అవుట్
ధనాధన్ ఇన్నింగ్స్‌తో దూకుడు మీదున్న కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44)ను హర్‌ప్రీత్ బ్రార్ బౌల్డ్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి రాగా.. సమీర్ రిజ్వీ 24 పరుగులతో ఉన్నాడు. ఢిల్లీ స్కోరు: 155/4 (15)
14 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 146/3
యాభై రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ. కరుణ్ 38, సమీర్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 36 బంతుల్లో 61 పరుగులు కావాలి.
ఫోర్ల వర్షం
ప్రవీణ్ దూబే బౌలింగ్‌లో కరుణ్ నాయర్ వరుసగా నాలుగు బౌండరీలు బాదాడు. 11 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 110-3. కరుణ్ 27, సమీర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ డౌన్
10:1: సెదీకుల్లా (22) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ప్రవీణ్ దూబే బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. సమీర్ రిజ్వీ క్రీజులలోకి రాగా.. కరుణ్ 15 పరుగులతో ఉన్నాడు.
పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 93/2 (10)
సెదీకుల్లా 22, కరుణ్ నాయర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
డుప్లెసిస్ అవుట్
6.4: హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో డుప్లెసిస్ (23)రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. సెదీకుల్లా అటల్ క్రీజులోకి వచ్చాడు. ఏడు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 66-2. కరుణ్ నాయర్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
5.3: కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో శశాంక్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ పెవిలియన్ చేరాడు. కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చాడు.
5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 50-0
శ్రేయస్ ఫిఫ్టీ, స్టొయినిస్ మెరుపులు
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మెరుగైన స్కోరు చేసింది.. జైపూర్ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. మిగతా వారిలో మార్కస్ స్టొయినిస్ ( 16 బంతుల్లో 44 పరుగులు) మెరుపులు మెరిపించాడు.
ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్
19.3: ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన యాన్సెన్(0). పంజాబ్ స్కోరు: 197-8
ఏడో వికెట్ డౌన్
17.6: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి ఒమర్జాయ్ (1) పెవిలియన్ చేరాడు. పంజాబ్ స్కోరు: 174-7. మార్కో యాన్సెన్ క్రీజులోకి రాగా.. స్టొయినిస్ 20 పరుగులతో ఉన్నాడు.
ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్
17.1: కుల్దీప్ బౌలింగ్‌లో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (53) అవుటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి వచ్చాడు.
శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం
17 ఓవర్లలో పంజాబ్ స్కోరు 171/5 (17). శ్రేయస్ అయ్యర్ 53, స్టొయినిస్ 18 పరుగులతో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్
15.4: శశాంక్ సింగ్ (11) రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి శశాంక్ పెవిలియన్ చేరాడు. మార్కస్ స్టొయినిస్ క్రీజులోకి వచ్చాడు. శ్రేయస్ 48 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 146-5(16)
హాఫ్ సెంచరీకి చేరువలో శ్రేయస్
15 ఓవర్లు ముగిసే సరికి శ్రేయస్ 46 పరుగులతో ఉండగా.. శశాంక్ సింగ్ 9 పరుగులతో ఆడుతున్నారు. పంజాబ్ స్కోరు: 142/4 (15)
12.3: నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన నేహాల్ వధేరా(16). శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 118-4
12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 116/3 (12)
శ్రేయస్ అయ్యర్ 33 పరుగులతో, నేహాల్ వధేరా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 97/3 (10)
శ్రేయస్ అయ్యర్ 18 పరుగులతో, నేహాల్ వధేరా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్
7.5: విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ బౌల్డ్ (28). మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్. శ్రేయస్ 8 పరుగులతో ఉండగ.. నేహాల్ వధేరా క్రీజులోకి వచ్చాడు.
ఏడు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోరు: 71/2 (7)
ప్రభ్‌సిమ్రన్ సింగ్ 23, శ్రేయస్ అయ్యర్ ఏడు పరుగులతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
5.3: విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్(32) షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు: 60-2
ఐదు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోరు: 44/1 (5)
ప్రభ్‌సిమ్రన్ సింగ్ 15, జోష్ ఇంగ్లిస్ 22 పరుగులతో ఆడుతున్నారు.
పంజాబ్‌కు భారీ షాక్.. ఆర్య ఔట్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య.. ముస్తఫిజుర్ రెహ్మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.
ఐపీఎల్-2025లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతడి స్దానంలో ఫాఫ్ డుప్లెసిస్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
పంజాబ్ జట్టులోకి జోష్ ఇంగ్లిష్, మార్కస్ స్టోయినిష్ తిరిగి రాగా.. సెడిఖుల్లా అటల్ ఢిల్లీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టాప్-2 స్ధానాన్ని సుస్థిరం చేసుకోవాలని పంజాబ్ భావిస్తుంటే.. ఢిల్లీ మాత్రం కింగ్స్‌ను ఓడించి తమ పరువు నిలబెట్టుకోవాలని యోచిస్తోంది,
తుది జట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్