IPL 2025 Qualifier 1: చరిత్రకు అడుగు దూరంలో విరాట్‌ కోహ్లి | Virat Kohli Eyes Massive Landmarks In RCB vs PBKS IPL Qualifier | Sakshi
Sakshi News home page

IPL 2025 Qualifier 1: చరిత్రకు అడుగు దూరంలో విరాట్‌ కోహ్లి

May 29 2025 1:46 PM | Updated on May 29 2025 3:16 PM

Virat Kohli Eyes Massive Landmarks In RCB vs PBKS IPL Qualifier

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025 సీజన్ తొలి క్వాలిఫ‌య‌ర్‌లో గురువారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. స‌మ ఉజ్జీల‌గా ఉన్న‌ ఈ రెండు జట్ల మధ్య పోరు మ‌రోసారి ర‌స‌వ‌త్త‌రంగా సాగే అవకాశం ఉంది. 

ఇప్ప‌టికే లీగ్ స్టేజిలో ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన రెండు మ్యాచ్‌లు కూడా అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు ఆర్హ‌త సాధిస్తోంది. ఇక హైవోల్టేజ్ మ్యాచ్‌కు 
ముందు ఆర్సీబీ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లిని ప‌లు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.

చ‌రిత్ర‌కు అడుగు దూరంలో..
ఈ మ్యాచ్‌లో కోహ్లి మ‌రో 30 ప‌రుగులు చేస్తే పంజాబ్ కింగ్స్‌పై అత్య‌ధిక ర‌న్స్‌ చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కెక్కుతాడు. ఇప్ప‌టివ‌ర‌కు పంజాబ్‌పై కోహ్లి 1104 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ పేరిట ఉంది. వార్న‌ర్ పంజాబ్ కింగ్స్‌పై 1034 ప‌రుగులు చేశాడు.

ఒకే ఒక ఫిప్టీ..
ఒక ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక ఆర్ధ‌శ‌త‌కాలు న‌మోదు చేసిన డేవిడ్ వార్న‌ర్ రికార్డును సమం చేసేందుకు కోహ్లి అడుగుదూరంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ సాధిస్తే  వార్న‌ర్ స‌ర‌స‌న చేరుతాడు. కోహ్లి ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది ఆర్ధ శ‌త‌కాలు న‌మోదు చేశాడు. 

2016 ఐపీఎల్ సీజ‌న్‌లో వార్న‌ర్ 9 ఫిప్టీలు సాధించాడు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో విరాట్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. త‌న అద్బుత ఇన్నింగ్స్‌ల‌తో ఆర్సీబీ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. కింగ్‌ కోహ్లి ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 602 ప‌రుగులు చేశాడు.
పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)
ఫిల్ సాల్ట్‌, విరాట్ కోహ్లి, మ‌యాంక్ అగ‌ర్వాల్‌, ర‌జిత్ పాటిదార్‌(కెప్టెన్‌), లివింగ్‌స్టోన్‌, జితేష్ శ‌ర్మ‌(వికెట్ కీప‌ర్‌),  కృనాల్ పాండ్యా, యశ్ దయాల్‌, జోష్ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్ కుమార్‌, నువాన్ తుషారా
చదవండి: ENG vs IND: 'శ్రేయ‌స్ ఏమి త‌ప్పు చేశాడు.. కావాల‌నే ఎంపిక చేయ‌లేదు'

Advertisement
 
Advertisement
Advertisement