Photo Credit: BCCI Twitter
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అజేయ అర్థసెంచరీ సాధించి చేజింగ్‌లో తన విలువేంటో మరోసారి చాటిచెప్పాడు. చేజింగ్ అంటేనే పూనకం వస్తుందేమో అన్న తరహాలో తిలక్ వర్మ బ్యాటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తిలక్ వర్మ టీ20 క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు తిలక్ వర్మ చేజింగ్‌లో 26 సార్లు అజేయంగా నిలిచాడు.
ఈ 26 సార్లు తన జట్టు విజయాలను అందుకోవడం విశేషం. పురుషుల టీ20 క్రికెట్‌లో ఛేదనలో తిలక్ వర్మ ఒక్కడే 100 శాతం విజయం రికార్డుతో ఉన్నాడు. తిలక్ వర్మ తర్వాత న్యూజిలాండ్ క్రికెటర్లు బ్రెండన్ మెక్‌కల్లమ్, మార్టిన్ గుప్టిల్ చెరో 22 ఇన్నింగ్స్‌లతో ఉన్నారు. అయితే ఓవరాల్ జాబితాలో తిలక్ వర్మ రెండో స్థానంలో ఉండగా.. జేమ్స్ విన్స్ ఛేజింగ్‌లో 31 సార్లు నాటౌట్‌గా నిలిచి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
👉ఇక అంతర్జాతీయ టీ20ల్లో తిలక్ వర్మ చేజింగ్ చేస్తూ నాటౌట్‌గా నిలిచిన అన్ని మ్యాచ్‌ల్లోనూ (12 మ్యాచ్‌లు) టీమిండియా విజయం సాధించింది. అతను క్రీజులో ఉంటే భారత్‌కు విజయం ఖాయమనే నమ్మకాన్ని సంపాదించుకున్నాడు.
👉టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో చేజింగ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్థశతకం సాధించిన తొలి బ్యాటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. గతంలో వాషింగ్టన్ సుందర్ (49 నాటౌట్) హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాపై చేసిన పరుగులే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది.
👉ఇక టీమిండియా తరఫున చేజింగ్‌లో ఐదు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి 12 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలవడంతో పాటు, నాలుగు అర్థశతకాలు సాధించాడు. భారత బ్యాటింగ్‌లో టాప్-4 మినహాయిస్తే మిగిలిన అందరూ బ్యాటర్లు కలిసి నాలుగు అర్థసెంచరీలు సాధిస్తే.. తిలక్ వర్మ ఒక్కడే నాలుగు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం.
👉సక్సెస్‌ఫుల్ టీ20 చేజింగ్స్‌లో తిలక్ వర్మ సగటు (Average) 92.50 గా ఉందంటేనే ఛేదనల్లో అతడి విశ్వరూపం ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ టీ20 చేజింగ్స్‌లో వరుసగా అత్యధిక సార్లు డబుల్ డిజిట్ (10 కంటే ఎక్కువ) స్కోర్లు చేసిన భారతీయుల్లో విరాట్ కోహ్లీ తర్వాత తిలక్ వర్మ (11 ఇన్నింగ్స్‌లు) నిలిచాడు.
𝗧𝗜𝗟𝗔𝗞 𝗩𝗔𝗥𝗠𝗔: 𝗧𝗛𝗘 𝗨𝗡𝗕𝗘𝗔𝗧𝗘𝗡 𝗙𝗜𝗡𝗜𝗦𝗛𝗘𝗥! 🇮🇳🔥 12 chases, 12 unbeaten knocks, 12 victories for Team India! 👏💙 📷: bcci #TeamIndia #bharatarmy #coti🇮🇳 https://t.co/dbhKawYh8R
— The Bharat Army (@thebharatarmy) October 24, 2026
Tilak Varma stepping up when it matters most! 💙🔥 Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/95KJXn92it
— Sony Sports Network (@SonySportsNetwk) October 24, 2026
ఇదీ చదవండి:


