317 పరుగులకు న్యూజిలాండ్-ఏ ఆలౌట్
తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు 204 పరుగుల ఆధిక్యం
భారత్-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో న్యూజిలాండ్-ఏ జట్టు పట్టు బిగించింది. 204 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌లు మరోసారి విఫలమయ్యారు.
5 పరుగులు మాత్రమే చేసిన జైస్వాల్.. సిమోన్ నీ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. ఫ్రేసర్ హీట్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత్ 194 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది.
కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ రైస్ మరియు (76), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (51) అర్థసెంచరీలతో రాణించగా, కర్టిస్ హీఫే (44), క్రిస్టియన్ క్లార్క్ (42) రాణించారు. భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్, అకిబ్ నబీ చెరో 3 వికెట్లు పడగొట్టగా, ఆకాశ్ దీప్ 2, ముకేశ్ చౌదరీ, సుందర్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగుల ఆధిక్యం లభించింది.


