కోహ్లి, బుమ్రాకు షాకిచ్చిన రహానే | Ajinkya Rahane Builds His All Time India Test XI, Leaves Out Virat Kohli, Jasprit Bumrah | Sakshi
Sakshi News home page

కోహ్లి, బుమ్రాకు షాకిచ్చిన రహానే

Oct 25 2026 12:17 PM | Updated on Oct 25 2026 12:51 PM

Ajinkya Rahane Builds His All Time India Test XI, Leaves Out Virat Kohli, Jasprit Bumrah

source: X

భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే తన మాజీ టీమిండియా సహచరులు విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రాకు షాకిచ్చాడు. తన ఆల్‌టైమ్ ఇండియా టెస్ట్ ప్లేయింగ్‌ XIలో కోహ్లి, బుమ్రాకు చోటివ్వలేదు. తనతో కలిసి ఆడిన ఆటగాళ్లతో రహానే ఈ జట్టును రూపొందించాడు. ఈ నేపథ్యంలో తన జమానాలో స్టార్లైన కోహ్లి-బుమ్రాను రహానే ఎంపిక చేయకపోవడం​ చర్చనీయాంశంగా మారింది.

ఓపెనర్లుగా ధవన్, మురళీ విజయ్
రహానే తన జట్టులో ఓపెనర్లుగా శిఖర్ ధవన్, మురళీ విజయ్‌లను ఎంచుకున్నాడు. మూడో స్థానంలో రాహుల్ ద్రవిడ్, నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్‌కు చోటిచ్చాడు. ఐదో స్థానంలో తన పేరును చేర్చుకున్నాడు.

వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు బదులుగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు. ధోనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. టెస్టుల్లో పంత్ గణాంకాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, నాయకత్వం, వికెట్ కీపింగ్ సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని ధోనిని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.

బుమ్రాకు బదులుగా భువనేశ్వర్‌కు చోటు
బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను స్పిన్నర్లుగా ఎంపిక చేసిన రహానే.. పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీలకు చోటిచ్చాడు. భారత టెస్ట్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన బుమ్రా, కోహ్లిని రహానే పక్కన పెట్టడం గమనార్హం.

రహానే ఆల్‌టైమ్ ఇండియా టెస్ట్ జట్టు
శిఖర్ ధవన్, మురళీ విజయ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, అజింక్య రహానే, ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ.

ఇదీ చదవండి: వైభవ్‌పై అశ్విన్‌ సంచలన వ్యాఖ్యలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement