Photo Credit: BCCI Twitter
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20కి ఇషాన్ కిషన్ గాయంతో దూరమవ్వడంతో వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో వచ్చిన వైభవ్ 8 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఓపెనింగ్‌లో వస్తేనే కరెక్టని, మూడో స్థానం అతడికి సరైనది కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అశ్విన్ మాట్లాడుతూ.. ‘సాధారణంగా ఓపెనర్‌గా వచ్చి దూకుడుగా ఆడే వైభవ్ సూర్యవంశీ.. వన్‌డౌన్‌లో మాత్రం తడబడ్డాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ ప్రదర్శన హిట్టా? ఫట్టా? అని నన్ను అడిగితే.. ఫట్ అనే చెప్తాను. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో యువ బ్యాటర్‌ను అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. వైభవ్ వరుసగా భారీ షాట్లకు ప్రయత్నిస్తూ ఒత్తిడికి లోనైనట్లు కనిపించాడు.
అలాంటి సమయంలో క్రీజులో ఉన్న సీనియర్ బ్యాటర్ అతడి వద్దకు వెళ్లి కాస్త ప్రశాంతంగా ఆడాలని సూచించి ఉంటే బాగుండేది. బంతిని దగ్గరగా గమనిస్తూ, తన సహజమైన ఆటను ఆడేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆరో ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగడం వైభవ్‌కు అలవాటు లేని పాత్ర. అది అతడికి సెట్ అవ్వలేదు’ అని అశ్విన్ వివరించాడు
‘వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్.. ఈ ముగ్గురినీ తుది జట్టులో కొనసాగించాలనుకుంటే బ్యాటింగ్ స్థానాల విషయంలో మార్పులు చేయాలి. అభిషేక్, వైభవ్‌లను ఓపెనర్లుగా పంపి.. సంజును వన్‌డౌన్‌లో ఆడించడం మేలు. గతంలో ఆసియా క్రీడల్లోనూ సంజు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. టీమ్ మేనేజ్‌మెంట్ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని అశ్విన్ వెల్లడించాడు.
ఇదీ చదవండి:


