‘నేనొక‌ పాత‌కాల‌పు వాహ‌నం’.. ఐపీఎల్ ఆడ‌డంపై ధోని క్లారిటీ! | MS Dhoni Breaks Silence On IPL Future-Iam-Like-Old Vintage Vehicle | Sakshi
Sakshi News home page

‘నేనొక‌ పాత‌కాల‌పు వాహ‌నం’.. ఐపీఎల్ ఆడ‌డంపై ధోని క్లారిటీ!

Oct 25 2026 11:13 AM | Updated on Oct 25 2026 11:41 AM

MS Dhoni Breaks Silence On IPL Future-Iam-Like-Old Vintage Vehicle

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 2027 సీజ‌న్‌లో ఆడుతాడా లేదా అన్న చ‌ర్చ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటెన్ష‌న్ లిస్ట్ విడుద‌ల చేయ‌డంతో పాటు మినీ వేలం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ధోని వ‌చ్చే సీజ‌న్‌లో సీఎస్‌కేకు ఆడ‌తాడా లేదా అన్న‌ది ఆస‌క్తిగా మారింది. 

2023 త‌ర్వాత కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న ధోని అప్ప‌టి నుంచి ఆట‌గాడిగా కొన‌సాగుతూ వ‌స్తున్నాడు. ప్ర‌తీ ఏడాది ఐపీఎల్ ప్రారంభ‌మైన మొద‌ట్లో ఇదే చివ‌రి సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తున్న‌ప్ప‌టికీ ధోని మాత్రం గ‌త మూడు సీజ‌న్లుగా సీఎస్‌కేకు ఆడుతూ వ‌చ్చాడు. అయితే ఈసారి మాత్రం తాను ఆడతానా లేదా అన్న దానిపై డిసెంబ‌ర్‌లోగా క్లారిటీ ఇస్తాన‌ని ధోని స్వ‌యంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ధోనిని తన క్రికెట్‌ భవిష్యత్తు గురించి ప్రశ్నించగా.. తన ఫిట్‌నెస్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ‘ఫిట్‌నెస్ పరంగా నేను కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్లు దానిపై తుది నివేదిక ఇవ్వాలి. 

ఆ తర్వాత డిసెంబర్‌లోపు నేను ఎంత ఫిట్‌గా ఉన్నానో చూసుకుని, మరో సీజన్‌ ఆడగలనా లేదా అనేది నిర్ణయించుకుంటా. నేను ఆడలేని పరిస్థితిలో ఉంటే.. ఈ పాతకాలపు వాహనం రోడ్డుపై సజావుగా నడిచేలా వైద్యులే అన్నీ సరిచేయాలి. మొత్తం ఒత్తిడి మీపైనే ఉంది’ అంటూ ధోని చ‌మ‌త్క‌రించాడు.

ఇక గ‌త రెండేళ్లుగా ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తూ వ‌రుస టైటిల్స్ సాధిస్తుంటే, సీఎస్‌కే ఎందుకు త‌డ‌బ‌డుతుందో చెప్పాల‌ని ధోనికి ప్ర‌శ్న ఎదుర‌య్యింది. దీనిపై ధోని స్పందిస్తూ.. "నిజం చెప్పాలంటే, గత కొన్నేళ్లుగా ఆర్సీబీ అసాధారణంగా రాణిస్తూ, అద్భుతమైన క్రికెట్ ఆడుతోంది. అందుకే వారు విజయం సాధిస్తూ, ఛాంపియన్‌షిప్‌లు గెలుస్తున్నారు. 

ఆర్సీబీ జట్టు మొత్తం అద్భుతంగా రాణిస్తుండగా, మేము అదే స్థాయిలో రాణించలేకపోతున్నాము. పరిస్థితులు కూడా మాకు అనుకూలించడం లేదు. ఐపీఎల్ 2027లో మాకు అన్నీ కుదురుతాయని ఆశిస్తున్నాము’’ అని చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement