రాణించిన పడిక్కల్‌.. కోలుకునే క్రమంలో టీమిండియా | INDA VS NZA 1st Test: Fifty for Padikkal | Sakshi
Sakshi News home page

రాణించిన పడిక్కల్‌.. కోలుకునే క్రమంలో టీమిండియా

Oct 25 2026 11:23 AM | Updated on Oct 25 2026 11:46 AM

INDA VS NZA 1st Test: Fifty for Padikkal

source: X

న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌-ఏ జట్టు కోలుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో దేవ్‌దత్‌ పడిక్కల్‌, సాయి సుదర్శన్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయమైన 96 పరుగులు జోడించారు. 

స్టార్‌ ప్లేయర్లు, ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (5), కేఎల్‌ రాహుల్‌ (4) రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలం కాగా.. పడిక్కల్‌ 56, సాయి సుదర్శన్‌ 39 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ స్కోర్‌ 106-2గా ఉంది. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు టీమిండియా ఇంకా 98 పరుగులు వెనుకపడి ఉంది.

అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మర్లు (76), డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. కర్టిస్‌ హీఫీ (44), క్రిస్టియన్‌ క్లార్క్‌ (42) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అన్షుల్‌ కంబోజ్‌, ఆకిబ్‌ నబీ తలో 3 వికెట్లు తీయగా.. ఆకాశ్‌దీప్‌ 2, ముకేశ్‌ చౌదరి, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఐదురుగు డకౌట్‌
తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు సభ్యులు తీవ్రంగా నిరాశపరిచారు. కేఎల్‌ రాహుల్‌ సహా ఐదుగురు సభ్యులు (సాయి సుదర్శన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాశ్‌దీప్‌, ముకేశ్‌ చౌదరి) డకౌట్లయ్యారు. యశ్‌ రాథోడ్‌ (44 నాటౌట్‌), పడిక్కల్‌ (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. యశస్వి జైస్వాల్‌ 17, జురెల్‌ 1, కంబోజ్‌ 10, ఆకిబ్‌ నబీ 5 పరుగులకే పరిమితమయ్యారు. న్యూజిలాండ్‌-ఏ బౌలర్లలో సైమన్‌ కీన్‌ 5 వికెట్లతో చెలరేగగా.. జాక్‌ గిబ్సన్‌ 3, ఫ్రేసర్‌ షీట్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌ తలో వికెట్‌ తీశారు.

కాగా, భారత-ఏ జట్టు మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం​ తెలిసిందే. 

ఇదీ చదవండి: వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌కు మరిన్ని భారీ షాక్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement