
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో పూరన్ చెలరేగాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ వచ్చిన పూరన్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.
కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్..4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పూరన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు 50 పరుగులు చేసిన ప్లేయర్‌గా పూరన్ చరిత్ర సృష్టించాడు.
ఇంతకుముందు ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 సీజన్‌లో హెడ్ నాలుగు సార్లు 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో తన ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా హాఫ్ సెంచరీతో హెడ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు.
ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన పూరన్.. 46.45 సగటుతో 511 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు.
చదవండి: IND vs ENG: టీమిండియా బౌలర్లకు వార్నింగ్.. సెంచరీతో చెలరేగిన డకెట్