
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా అండ్ కోకు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ హెచ్చరికలు జారీ చేశాడు. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో డకెట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో వన్డేను తలపిస్తూ తన ఐదో టెస్టు సెంచరీ మార్క్‌ను డకెట్ అందుకున్నాడు.
134 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 20 ఫోర్లు, 2 సిక్స్‌లతో 140 పరుగులు చేసి ఔటయ్యాడు. జాక్ క్రాలీతో కలిసి తొలి వికెట్‌కు 235 పరుగుల భాగస్వామ్యాన్ని డకెట్ నెలకొల్పాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లలో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.
స్టోక్స్ సేన తమ మొదటి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లకు వికెట్ నష్టానికి 359 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(121), ఓలీ పోప్(79) ఉన్నారు. కాగా ఈ ఏకైక మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం ఇంకా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించలేదు. భారత జట్టును మే 24న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.
జింబాబ్వేతో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు
జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, ఓల్లీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, సామ్యూల్ జేమ్స్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్
చదవండి: IPL 2025: 'ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. లేదంటే విజయం మాదే'