
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. బుధవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు ఓడి పోయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నిష్కమ్రించింది.
181 పరుగుల లక్ష్యాన్ని అక్షర్ సేన ఛేదించిలేక చతికల పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై ఢిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ స్పందించాడు. ఆఖరి రెండు ఓవర్లే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని అతడు అభిప్రాయడ్డాడు.
"ఈ మ్యాచ్‌లో మేము 18 ఓవర్ల వరకు అద్బుతంగా బౌలింగ్ చేశాము. కానీ ఆఖరి రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. చివరిలో మా ప్రణాళికలను సరిగ్గా ఆమలు చేయలేకపోయాము. 12 బంతుల్లో ఏకంగా 48 పరుగులు ఇచ్చాము. ఆఖరి రెండు ఓవర్లలో పిచ్ కండీషన్స్ తగ్గట్టు మా బౌలర్లు బౌలింగ్ చేయలేకపోయారు. వికెట్ స్లోగా ఉన్నందున కట్టర్లు కానీ వైడ్ యార్కర్లు గానీ ప్రయత్నించుంటే బాగుండేది.
కానీ మా బౌలర్లు అది చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి ఆటగాడో మనందరికి తెలుసు. అటువంటి బ్యాటర్‌కు స్లాట్‌లో బంతులు వేస్తే శిక్షించుకుండా ఎలా వదులుతాడని" పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బదానీ పేర్కొన్నాడు.
అదేవిధంగా ఈ ఏడాది సీజన్‌లో తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది సీజన్‌ను నేను ఒక మారథన్‌గా భావించాము. మొదటిలో మాకు అద్బుతమైన ఆరంభం లభించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించాము.
అయితే కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌లలో మేము ఓడిపోయాము. ఫ్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కొన్ని మ్యాచ్‌లను టార్గెట్‌గా పెట్టుకోవాలి. ఆ మ్యాచ్‌లలో గెలవకపోతే తప్పు మనదే అవుతుంది. అందుకు ఎవరిని బాధ్యులు చేయలేము. ఏదేమైనప్పటికి ఒక జట్టుగా మేము బాగా రాణించాము" అని బదానీ చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఆరు విజయాలు, మరో ఆరింట ఓటములను చవిచూసింది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే?