
భారత జట్టు(ఫైల్ ఫోటో)
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ త్వరలోనే టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు 26 ఏళ్ల అర్ష్‌దీప్ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణంయిచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్దంగా ఉండాలని ఈ పంజాబ్ పేసర్‌కు సెలక్టర్లు సూచించినట్లు సమాచారం.
అర్ష్‌దీప్ రాకతో భారత టెస్టు జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేని లోటు తీరనుంది. కాగా వన్డే, టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రెగ్యూలర్‌గా ఆడుతున్నప్పటికి టీమిండియా తరపున టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం సింగ్‌కు రాలేదు.
ఇంగ్లండ్ టూర్‌తో అతడు మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడం ఖాయమన్పిస్తోంది. అర్ష్‌దీప్‌కు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. అక్కడి పరిస్థితులు అర్ష్‌దీప్‌కు బాగా తెలుసు. ఈ క్రమంలోనే అతడిని ఇంగ్లండ్‌కు పంపాలని అగర్కాకర్ అండ్ కో భావిస్తున్నట్లు వినికిడి.
తన కెరీర్‌లో ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్‌లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది.
కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు విడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్‌తో మెన్ ఇన్ బ్లూ ఇంగ్లండ్‌కు పయనం కానుంది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపిక దాదాపు ఖారరైనట్లు సమాచారం. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి స్ధానాన్ని ఎవరి భర్తీ చేస్తారో వేచి చూడాలి. జూన్ 20 నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు(అంచనా)
కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్,, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు