breaking news
england vs zimbabwe
-
22 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు.. ఓటమి దిశగా జింబాబ్వే
ఇంగ్లండ్‌తో 22 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న జింబాబ్వే జట్టుకు ఓటమి తప్పేలా లేదు. నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న నాలుగు రోజుల ఈ ఏకైక టెస్టులో రెండో రోజు కూడా ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 498/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 96.3 ఓవర్లలో 6 వికెట్లకు 565 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించి ఓలీ పోప్ (166 బంతుల్లో 171; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు) అవుటయ్యాడు. హ్యారీ బ్రూక్ (50 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 3 వికెట్లు తీయగా... చివాంగ, సికందర్ రజా, మధెవెరెలకు ఒక్కో వికెట్ లభించింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే జట్టు 63.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ (143 బంతుల్లో 139; 26 ఫోర్లు) వీరోచిత సెంచరీ చేశాడు. కెపె్టన్ క్రెయిగ్ ఇరి్వన్ (64 బంతుల్లో 42; 6 ఫోర్లు), సీన్ విలియమ్స్ (41 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ షోయబ్ బషీర్ 3 వికెట్లు తీయగా... అట్కిన్సన్, బెన్ స్టోక్స్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. స్యామ్ కుక్, జోష్ టంగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 300 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా జింబాబ్వేకు ఫాలోఆన్ ఇచ్చింది. ఫలితంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 270 పరుగులు చేయాలి. -
ఇంగ్లండ్ బ్యాటర్ల సెంచరీల మోత.. ఏకంగా 565 పరుగులు
సొంత గడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు దంచి కొట్టారు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. 498/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. తమ మొదటి ఇన్నింగ్స్‌ను 565/6 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలీ (171 బంతుల్లో 124; 14 ఫోర్లు), బెన్ డకెట్ (134 బంతుల్లో 140; 20 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒలీ పోప్ (163 బంతుల్లో 171, 24 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శతకాలతో కదం తొక్కగా... హ్యారీ బ్రూక్(58), రూట్(34) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ మూడు వికెట్లు పడగొట్టగా.. చవింగా, మాధవీరే, రజా తలా వికెట్ సాధించారు.కాగా ఇంగ్లండ్ జట్టు తొలి రోజే రికార్డు స్థాయిలో 88 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్లో తొలి రోజు నమోదైన రెండో అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. అంతకుముందు 2022లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ తొలి రోజు 506/4 పరుగులు చేసింది. మరో 9 పరుగులు చేసుంటే ఇంగ్లీష్ జట్టు తమ రికార్డును తామే బ్రేక్ చేసేది.తుది జట్లుఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, ఓల్లీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, సామ్యూల్ జేమ్స్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్జింబాబ్వే: బెన్ కర్రాన్, బ్రియాన్ బెన్నెట్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, వెస్లీ మాధేవెరే, తఫాద్జ్వా త్సిగా (వికెట్ కీపర్), రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ, తనకా చివంగ, విక్టర్ న్యౌచి -
టీమిండియా బౌలర్లకు వార్నింగ్.. సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా అండ్ కోకు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ హెచ్చరికలు జారీ చేశాడు. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో డకెట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో వన్డేను తలపిస్తూ తన ఐదో టెస్టు సెంచరీ మార్క్‌ను డకెట్ అందుకున్నాడు. 134 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 20 ఫోర్లు, 2 సిక్స్‌లతో 140 పరుగులు చేసి ఔటయ్యాడు. జాక్ క్రాలీతో కలిసి తొలి వికెట్‌కు 235 పరుగుల భాగస్వామ్యాన్ని డకెట్ నెలకొల్పాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లలో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. స్టోక్స్ సేన తమ మొదటి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లకు వికెట్ నష్టానికి 359 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(121), ఓలీ పోప్(79) ఉన్నారు. కాగా ఈ ఏకైక మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం ఇంకా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించలేదు. భారత జట్టును మే 24న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.జింబాబ్వేతో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, ఓల్లీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, సామ్యూల్ జేమ్స్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: IPL 2025: 'ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. లేదంటే విజయం మాదే' -
Eng Vs Zim Test: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. అతడికి తొలిసారి పిలుపు
జింబాబ్వే (England Vs Zimbabwe)తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఇందుకు సంబంధించి పదమూడు మంది సభ్యులతో కూడిన వివరాలను శుక్రవారం వెల్లడించింది. కాగా.. 27 ఏళ్ల పేసర్ సామ్ కుక్ (Sam Cook)కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కడం విశేషం.ఇప్పటికే 318 వికెట్లుకుక్తో పాటు జోర్డాన్ కాక్స్‌ను కూడా ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన ఇంగ్లిష్ జట్టు సెలక్టర్లు.. జోష్ టంగ్ (Josh Tongue)కు కూడా తిరిగి పిలుపునిచ్చారు. కాగా కౌంటీ క్రికెట్లో సామ్ కుక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. నిలకడైన ఆటకు మారుపేరైన ఈ ఎస్సె.క్స్పేస్ బౌలర్ కౌంటీల్లో ఇప్పటికే 318 వికెట్లు తీశాడు.మరోసారి పిలుపుఅదే విధంగా ఇంగ్లండ్ లయన్స్ తరఫున ఆస్ట్రేలియా-ఎ జట్టుతో మూడు మ్యాచ్‌లలో కలిపి సామ్ కుక్ 13 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. జోర్డాన్ కాక్స్ 2024లోనే అరంగేట్రం చేయాల్సింది. న్యూజిలాండ్‌తో నవంబర్ నాటి మ్యాచ్‌లో అతడు ఆడాల్సి ఉండగా.. ప్రాక్టీస్ సెషన్లో కుడిచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో అప్పుడు అవకాశం కోల్పోయిన అతడికి మళ్లీ సెలక్టర్లు పిలుపునిచ్చారు.ఇక జోష్ టంగ్ విషయానికొస్తే.. 2023లో ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ టెస్టు తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. కాగా స్వదేశంలో జింబాబ్వేతో టెస్టుతో కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి ఆటలో అడుగుపెట్టనున్నాడు.33 ఏళ్ల స్టోక్స్ గత కొంతకాలంగా పిక్కల్లో గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబరులో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన అతడు.. సర్జరీ తర్వాత కోలుకున్నాడు.కాగా మే 22-25 వరకు సొంతగడ్డపై ఇంగ్లండ్ జింబాబ్వేతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. గాయాల కారణంగా మార్క్ వుడ్, బ్రైడన్ కార్స్,క్రిస్ వోక్స్, ఓలీ స్టోన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఇక జోఫ్రా ఆర్చర్ ఇప్పట్లో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు.జింబాబ్వేతో టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్ జట్టు:జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోర్డాన్ కాక్స్ (వికెట్ కీపర్), సామ్ కుక్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్.చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి.. అదరగొడతాడు: టీమిండియా మాజీ కోచ్