కాళేశ్వరం నోటీసులు.. కేసీఆర్‌ కీలక నిర్ణయం | Kaleshwaram Commission: KCR Likely Extend His Present | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం నోటీసులు.. కేసీఆర్‌ కీలక నిర్ణయం

Jun 2 2025 2:14 PM | Updated on Jun 2 2025 3:13 PM

Kaleshwaram Commission: KCR Likely Extend His Present

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్‌ ఎదుట హాజరయ్యే విషయంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావుతో పలు దఫాలుగా ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే ఆయన విచారణకు హాజరవుతారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో.. 

ఇప్పుడు విచారణకు మరింత గడువు కోరే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. జూన్ 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్​కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీన విచారణకు రాలేనని.. బదులుగా మరో తేదీని కేటాయించాలని ఆయన ఇప్పుడు కమిషన్‌కు బదులు ఇవ్వబోతున్నారట!. ఇతర కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని, కావాలంటే ఈ నెల 11వ తేదీన హాజరవుతానని ఆయన లేఖలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది.

కాళేశ్వరం కమిషన్ విచారణకు రాలేనని లేఖ రాయనున్న కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్‌ ఇప్పటికే ప్రాజెక్టు కోసం పని చేసిన ముఖ్య అధికారులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసింది కూడా.

ఇదీ చదవండి: అదే స్పూర్తిని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించాలి

Advertisement
 
Advertisement
Advertisement